Sunday, April 26, 2020

శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన సందేహాలు - బాబా సమాధానాలు - 3


          Shirdi Sai Jai Ram Pooja - To Pray For Our Needs - Astrology ...
           Best HD Wallpaper Rose Images - Best Rose Images
26.04.2020  ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన

సందేహాలు -  బాబా సమాధానాలు - 3

(ఈ సందేహాలు సమాధానాలను ఎవరైనా తమ స్వంత బ్లాగులో 

ప్రచురించుకోదలచినట్లయితే ముందుగా నాకు సమాచారం ఇవ్వవలసినదిగా

 నా మనవి)

ఆత్రేయపురపు త్యాగరాజు 
నిజాంపేట, హైదరాబాద్
ఫోన్  ..  9440375411 & 8143626744
మైల్  ఐ.డి. tyagaraju.a@gmail.com

మాండూక్యోపనిషత్ మొదటి భాగమ్ సాయిభక్తుల 
స్పందనలు ః
శ్రీమతి కృష్ణవేణి ,  చెన్నై ---  "పిలిస్తే పలుకుతా" అన్న మాటలు బాబా గారు మళ్ళి మీ విషయంలో కూడా ఋజువు చేసారు.  మీలో ప్రశ్న ఉదయించేలా చేసి తద్వారా మా అందరికీ చక్కని సమాధానాలు అందిస్తున్నారు.  అసలు ఉపనిషత్తులకు అర్ధమే తెలియని మాకు ఈరోజు దాని అర్ధాన్ని కూడా తెలుసుకొనేలా చేసారు బాబా గారు.

కాని, బాబా గారు చెప్పిన ఒక్క మాటతో ఇన్ని విషయాలు శోధించి మాకు మిగతా వీడియోలు కూడా తెలియ చేసినందుకు కృతజ్ఞతలు.

శ్రీమతి కిరణ్మయి, షికాగో,  ఇల్లినాయిస్ --- మాండూక్యోపనిషత్ ను మీరు వివరించిన విధానమ్ చాలా బాగుంది.  చాలా సరళంగా ఉంది.

శ్రీ పార్ధ సారధి గారు, పాలకొల్లు - ప్రత్యక్ష అనుభవం కల్పించి తద్వారా బోధించేవారు అసలైన గురువు అనే విషయాన్ని బాబా పదే పదే సత్ చరిత్రలో గుర్తు చేసారు.  మీద్వారా తెలుసుకోవడం ఆనందంగా ఉంది.  ధన్యవాదాలు.

మాండూక్యోపనిషత్ - తరువాయిభాగమ్
శ్లోకాలు

4.85  ఎవరైతే ఆత్మస్థానము పొందుతారో, వారికి ఇంకేమి కోరికుంటుంది.  ఆదిమధ్యంతములు లేనివాడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, సర్వ సాక్షీభూతుడైన పరమాత్మకి ఇంకేమి కోరికుంటుంది కనక?


4.86   బ్రహ్మ జ్ఞానం పొందిన జీవునికి వినయము, ఇంద్రియనిగ్రహము, మనోనిగ్రహము సహజ లక్షణములుగా ఉండుటవలన నిరంతరం ప్రశాంత స్థితి కలిగి యుంటారు.
(శ్రీ సాయి సత్ చరిత్ర అ.10 బాహ్యదృష్టికి బాబా ఇంద్రియ విషయములననుభవించువానివలె  కన్పట్టినను, ఇంద్రియానుభూతులలో వారికేమాత్రమభిరుచి యుండెడిది కాదు.  అసలు ఇంద్రియానుభవముల స్పృహయే వారికి లేకుండెను.  వారు భుజించునప్పటికి దేనియందు వారికి రుచి యుండెడిది కాదు.  వారు ప్రపంచమును చూచున్నట్లు గాన్పించినను వారికి దానియందేమాత్రము ఆసక్తి లేకుండెను. కామమన్నచో వారు హనుమంతునివలె యస్ఖలిత బ్రహ్మచారులు.  వారికి దేనియందు మమకారము లేకుండెను.  వారు శుధ్ధచైతన్యస్వరూపులు.  కోరికలు, కోపము మొదలగు భావవికారములు శాంతించి స్వాస్థ్యము చెందెడి విశ్రాంతిధామము.  వేయేల వారు విరాగులు, ముక్తులు, పరిపూర్ణులు. )

పుట్టుక లేనివాడు, ఎటువంటి సంబంధాలులేనివాడు, సంపూర్ణజ్ఞాన స్వరూపులే జీవులు (శ్లోకం 4.91  --- 4.100)
(శ్రీ సాయి సత్ చరిత్ర 4 .ధ్యాయము ---  సాయిబాబా కష్టతరమైన సంసారమును జయించినవారు.  శాంతియే వారి భూషణము.  వారు జ్ఞానమూర్తులు.  వైష్ణవభక్తులకిల్లువంటివారు.  ఉదారస్వబావులు.  సారములోని సారాంశమువంటివారు.  నశించు వస్తువులందభిమానము లేనివారు.  ఎల్లప్పుడు ఆత్మసాక్షాత్కారమందే మునిగియుండెడివారు.  భూలోకమందుగాని, స్వర్గలోకమందుగాని గల వస్తువులయందభిమానము లేనివారు.  వారి అంతరంగము అద్దమువలె స్వచ్చమైనది.  వారి వాక్కులనుండి యమృతము స్రవించుచుండెను.  గొప్పవారు, బీదవారు, వారికి సమానమే.  వారు మానావమానాలను లెక్కించినవారు కారు.  ఎల్లప్పుడు ఆత్మధ్యానమునందే మునిగియుండెడివారు.  సిధ్ధపురుషుడైనప్పటికిని సాధకునివలె నటించువారు.)
             Shirdi Sai Baba Poster - Online Shopping
(శ్రీ సాయి సత్ చరిత్ర .10
బాబా బ్రహ్మము యొక్క సగుణావతారము)
సాయిబాబా మూడున్నర మూరల మానవదేహముతో గాన్పించినను వారు సర్వహృదయాంతరస్తులుఅంతరంగమున వారు పరమ నిరీహులు,  (నిరీహులు అనగా కోరికలు లేనివారు, భగవంతుడు) నిస్పృహులైనప్పటికి, (నిస్పృహ = కోరికలు లేని స్థితి)  బాహ్యమునకు లోకహితము కోరువానిగ గనిపించువారుఅంతరంగమున వారు మమకార రహితులైనప్పటికీ, బాహ్యదృష్టికి మాత్రము తమ భక్తుల యోగక్షేమముల కొరకు ఎంతయో తాపత్రయపడుతున్నవారివలె కన్పించెడివారులోపల పరబ్రహ్మస్థితియందున్నప్పటికిని, బయటకు దయ్యమువలె నటించుచుండెడివారుఒక్కొక్కప్పుడందరిని ప్రేమతో చూచెడివారుఇంకొకప్పుడు వారిని ప్రేమతో అక్కునజేర్చుకొని, ఎంతో నెమ్మదితోను శాంతముతోను ఓరిమితోను సంయమముతోను వ్యవహరించెడివారు. బాబా ఎల్లప్పుడు ఆత్మానుసంధానమందేమునిగియుండెడివారు.
ఆత్మజ్ఞానమునకు ఆయన గని, దివ్యానందమునకు వారు ఉనికిపట్టుసాయిబాబా యొక్క దివ్యస్వరూపము ట్టిదిఆద్యంతములు లేనట్టిదిఅక్షయమైనట్టిదిభేదరహితమైనట్టిదివిశ్వమంతయు నావరించినట్టిది యైన పరబ్రహ్మ తత్త్వమే సాయిబాబాగా యవతరించింది.

4.91  తెలుసుకోవలసిన విషయమేమిటంటే అన్ని జీవరాశులు కూడా పరమాత్మే -  ఆకాశంలాగ ఆద్యంతం లేనిది, నిత్యమైనదని తెలుసుకోవాలి.  అన్ని జీవరాశుల్లోను, ఏకాలంలోను, ఏప్రదేశములలోను కూడా లేశమాత్రమయిన ద్వంద్వములు లేవు.

(శ్రీ సాయి సత్ చరిత్ర . 3మీరెక్కడ నున్ననూ, ఏమి చేయుచున్ననూ నాకు తెలియునని బాగుగా జ్ఞాపకముంచుకొనుడు.  నేనందరి హృదయముల పాలించువాడను.  అందరి హృదయములలో నివసించువాడను.  నేను ప్రపంచమందుగల చరాచరజీవకోటినావరించి యున్నాను.) 
(శ్రీ సాయి సత్ చరిత్ర .15 నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవళ్ళు మీచెంతనేనుండెదనునా దేహము నిచ్చట నున్నప్పటికి సప్తసముద్రముల కవ్వల మీరు చేయుచున్న పనులు నాకు తెలియునుప్రపంచమున మీకిచ్చవచ్చిన చోటుకు పోవుడునేను మీచెంతనే యుండెదనునా నివాసస్థలము మీ హృదయమునందే గలదునేను మీ శరీరములోనే యున్నానుఎల్లప్పుడు మీ హృదయములలోను సర్వజన హృదయములందు గల నన్ను పూజింపుడుఎవ్వరు నన్ను విధముగా గుర్తించెదరో వారు ధన్యులు, పావనులు, అదృష్టవంతులు. )


4.94   ఎవరైతే ఎల్లప్పుడూ ద్వైతబుధ్ధితో నువ్వు వేరు, నేను వేరు అన్న భావనతో ఉంటారో వారు పరమాత్మని తెలుసుకోలేరు.  వారి మనస్సులో భేదభావన పరిభ్రమించటం వల్ల తాను వేరు పరమాత్మ వేరుగా చూస్తుంటారు.  ఇటువంటివారే అధములని పిలువబడుతున్నారు. 
(శ్రీ సాయి సత్ చరిత్ర 18 – 19 అధ్యాయాలలో బాబా అన్న మాటలు,  నీకు నాకు మధ్య గల గోడను నిర్మూలించుము. అప్పుడు మనమిద్దరము కలియు మార్గమేర్పడును.)

జీవాత్మకి, పరబ్రహ్మమునకు మధ్య ఉన్నదే ఈ అజ్ఞానమ్ లేక అవిద్య 

అనే తెర

సాయిబాబా గారు తరచుగా గూఢార్ధమ్ గల సమాధానాలు చెప్పేవారు.  తెలుసుకోలేనివాడికి అవి అర్ధంలేని మాటలుగానే అనిపించేవి.  ఎవరో ఆయన ఫొటోగ్రాఫ్ తియ్యలని అనుకున్నారు.  అప్పుడు బాబాఫొటోగ్రాఫ్ తియ్యనక్కరలేదు.  గోడపడగొడితే చాలుఅన్నారు.  అనగా బాబా ఆంతర్యం ఏమిటంటే ఫొటోగ్రాఫ్ అనేది సాయిబాబా గారి రూపం, గోడ, నేను దేహం అనేభావం.  ఇది మనిషికీ ఆత్మతో ఏకత్వానికీ నడుమ నిలుస్తుంది.  దీన్ని పడగొడితే చాలు, బాబా గారి అసలు రూపందేహం కాదు, ఆత్మ కనిపిస్తుంది.
జీవుని కాలపరిమితి ఆధారముగా చేసుకొని 5 అవస్థలలో జీవిస్తాడు.
1.      జాగృతావస్థ                  మెలకువలో ఉన్న స్థితి
2.     స్వప్నావస్థ         _          నిద్రలో ఉన్న స్థితి
3.     సుషుప్తావస్థ        _          గాఢ నిద్రలో ఉన్న స్థితి
4.     తురియావస్థ        _          ఆలోచనలన్నీ ఆగిపోయిన (నిశ్శబ్దమ్, అంటే మనస్సు లేని)
                                    స్థితి.  జీవభావము ఇంకా ఉన్నది.  కాని ఆత్మగా ఉండాలని
                                              ప్రయత్నంలో ఉన్న స్థితి.
5.     తురియాతీతావస్థ   _           ఆలోచనలన్నీ ఆగిపోయి (నిశ్శబ్ధంఅంటే మనస్సు లేని)
                                     స్థితి.  కేవలం ఆత్మగా ఉన్న స్థితి.  జీవభావము కూడా విడిచి
                                     పెట్టి, కేవలం ఆత్మగా ఉన్న స్థితి.
(యోగనిద్ర గురించి శ్రీ గరికపాటి నరసింహారావుగారు చెప్పిన ఈ ఉపన్యాసాన్ని వినండి)

జాగృతావస్థనుండి స్వప్నావస్థలోనికి అక్కడినుండి సుషుప్తావస్థలోకి జారుకుంటాము.  మూడు అవస్థలను దాటుకుని తురియావస్థ ఆతరువాత తురియాతీవస్థలోకి ప్రవేశించడం జరుగుతుంది.  స్వప్నావస్థ, మరియు సుషుప్తావస్థలలో మనకి చైతన్యం అనగా ఎఱుక ఉండదు.  సామాన్య మానవుడు రెండు అవస్థలలో ఒకేసారి ఉండలేడు.  కాని యోగుల విషయంలో అలా కాదు.  వారు ఏకకాలంలో రెండు స్థితులలో కూడా ఉండగలరు.  అంతే కాదు ఎఱుకతో ఉండగలరు.  వారి నిద్ర యోగ నిద్ర.  నిద్రలో ఉన్నా తమ చుట్టూ ఏమి జరుగుతూ ఉందో అంతా గమనించగలరు.  జాగ్రదావస్థలో ఉన్నదానికంటే యోగనిద్రలో వారు చాలా చురుకుగా ఉంటారు.
జాగ్రదావస్థలో ఉంటే కోరికలు, స్వప్నావస్థలో ఉంటే కలలు.  కోరికలు, కలలు ఏదీ లేని గాఢ నిద్రాస్థితి ఆత్మయొక్క మూడవ భాగమౌతున్నది.  ఈ స్థితి అనుభవించేవాడు ప్రాజ్ఞుడు.  ఈ స్థితిలో ప్రాపంచిక సంబంధమయిన అనుభవాలు ఏవీ ఉండవు.  విషయగ్రహణ శక్తి నిర్వీర్యమై ఒక రాశిగా పడి ఉండటం వల్ల జాగృత్ మరియు స్వప్న స్థితి చైతన్యాలకు దూరంగా ఉంటుంది.  అందువలన ప్రాజ్ఞుడు ఆనందస్వరూపుడైన ఆత్మానందాన్ని అనుభవిస్తాడు.
ప్రాజ్ఞ – అంటే ప్రా -  ఆశ్రయించిన,  ఆజ్ఞ - అజ్ఞానమును. అజ్ఞానమును ఆశ్రయించినది లేక అన్ని తెలిసియున్నది.  లేక భూత,భవిష్యత్ గురించి తెలిసియున్నది లేక అన్ని విషయజ్ఞానం కలిగి యున్నది లేక సర్వప్రపంచ జ్ఞానం కలిగియున్నది లేక సృష్టి స్థితి లయ జ్ఞానం కలిగియున్నది అని అర్ధం.
(శ్రీ సాయి సత్ చరిత్ర అ.3 ఈ జగత్తును నడిపించువాడను, సూత్రధారిని నేనే.  నేనే జగన్మాతను, త్రిగుణముల సామరస్యమును నేనే, ఇంద్రియచాలకుడను నేనే, సృష్టిస్థితిలయకారకుడను నేనే)

ఇపుడు మనకు ప్రాజ్ఞుడు అన్నదానికి పూర్తి అవగాహన కలిగింది.

సుషుప్తావస్థనుంచే స్వప్నావస్థ మరియు జాగృతావస్థ, స్వప్నావస్థలు రెండూ కూడా సుషుప్తిలో కలిసిపోతాయి.  ఈ ప్రాజ్ఞుడే అన్నీ తెలిసినవాడు.  అతడే అన్ని జీవరాశులలో అన్ని సమయములలో ఉన్నవాడు.  అన్నింటినీ తెలుసుకుంటున్నవాడు కూడా ఇతడే.  ఇతడే అంతర్యామి.  అంటే అన్ని జీవులలో ఉన్నవాడు అన్ని జీవులపై అధికారం కలిగినవాడు.  అన్ని జీవులలో ఉన్నవాడు.
(బాబా తాను అన్ని జీవరాశులలోను ఉన్నానని చెప్పారన్న విషయం మనం ఇంతకుముందే గ్రహించుకున్నాము)

తురియావస్థ – ఇది పరమాత్మస్థితిలో ఉన్న అవస్థ.
యోగులు నిద్రకు, ధ్యానానికి ఈ రెండింటికి యోగనిద్రను అవలంబిస్తారు.
(శ్రీ సాయి సత్ చరిత్ర అ.12 భగవంతుడు యోగుల హృదయమున నివసించును.  వాస్తవముగ వారు భగవంతునికంటె వేరు కారు)
(శ్రీ సాయి సత్ చరిత్ర అ.4 ప్రపంచమంతా మేలుకొనునప్పుడు వారు యోగనిద్రయందుండెడివారు.  లోకము నిద్రించినప్పుడు వారు మెలకువతో నుండెడివారు.  ఒకచోటనే కూర్చుండియున్నప్పటికిని ప్రపంచమందు జరుగు సంగతులన్నియు వారికి తెలియును.)

(మాండూక్యోపనిషత్ తరువాయి భాగమ్ రేపు)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)


1 comment:

  1. బాబా వారి సచ్చరిత్ర మరలా మరలా పారాయణ చేయాలనిపించేలా మీ విశ్లేషణ ఉంటుంది.ధన్యవాదాలు. Ome Srisairam !
    Pardhasaradhi

    ReplyDelete