Sunday, March 8, 2020

శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు - 3 వ.భాగమ్


  Image result for images of shirdisai
         Image result for images of rose hd
08.03.2020  ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు  - 3 వ.భాగమ్


23.01.2020  --  మానసిక బాధనివారణ
జీవిత ప్రయాణములో నిన్ను ఎవరయినా మానసికముగాను, లేదా శారీరకముగాను హింసించినా వారికి మంచి మాటలు తెలియజేయి.  ఒకవేళ వారు నీమాటలను వినకపోతే వారినుండి దూరముగా వెడలిపోయి భగవంతుని న్యాయము చేయమని వేడుకో.  భగవంతుడు ప్రకృతిరూపములో వానిని శిక్షించును.  నీ మనసుకు శాంతిని కలుగచేస్తాడు.



విశ్లేషణ  ---   బాబాకు 70సంవత్సరములు వచ్చేవరకు షిరిడీ ప్రజలు వారిని మానసికముగాను, శారీరకముగాను హింసించారు.  బాబా షిరిడీ ప్రజలు పెట్టిన బాధలను భరించి ద్వారకామాయిలో భగవన్నామ స్మరణ చేసుకుంటూ తన శేష జీవితాన్ని గడిపారు.  భగవంతుడు షిరిడీ ప్రజల మనసును మార్చి, వారిలో పరివర్తన తీసుకునివచ్చారు.  బాబా తన జీవితము ఆఖరి పది సంవత్సరాలు షిరిడీ ద్వారకామాయిలో ప్రశాంతముగా జీవించారు.

షిరిడీలో కపట గురువు జవహర్ ఆలీ, మల్లయోధుడు మౌలిద్దీన్ తంబోలీ, షిరిడీ గ్రామముసబు కులకర్ణి, బాబాను మానసికముగాను, శారీరకముగాను హింసించారు.  బాబా ఓరిమితో దైవప్రార్ధనలు చేసి వారి ముగ్గురిలోను మానసిక పరివర్తన తీసుకువచ్చిన సంగతి మనందరికి తెలిసినదే.
                                              --- త్యాగరాజు

24.01.2020  ---  భగవంతుడు అందరిలోను ఉన్నాడు

భగవంతుడిని అందమయినవారిలోను, అందవిహీనులలోను చూడుము.  అందవిహీనులలోను, మాసిక వికలాంగులలోను, భగవంతుడు ఉన్నాడు.  అటువంటివారిని సమాజములో చిన్నచూపు చూడకుండా వారికి కూడా సుఖసంతోషాలతో జీవించే హక్కు ఉంటుంది, అని సమాజానికి తెలియజేయి.

విశ్లేషణ ---  మానసిక వికలాంగ పిల్లలు ఎక్కువగా సమాజములో మధ్యతరగతి మరియు బీదరికముతో బాధపడుతున్న కుటుంబాలలో జన్మించుట చూసాము.  దానికి కారణం డాక్టర్ లు చెప్పేమాట, ఆకుటుంబాలలోని స్త్రీలు గర్భవతులుగా ఉన్నపుడు సరైన పోషకాహారాలను తీసుకోకపోవటం వలననే అని నేను అంగీకరిస్తున్నాను.

ఇక ధనవంతుల ఇండ్లలో మానసిక వికలాంగులు ఎందుకు జన్మించుతున్నారని సాయిబానిసగారిని అడిగాను.  దానికి వారిచ్చిన సమాధానం నన్ను ఆశ్చర్యపరిచింది.

ధనికుల ఇండ్లలో యువకులు ధనమదముతో యవ్వనములో అనేకమంది స్త్రీలతో తిరుగుతూ పెళ్ళి చేసుకుంటానని చెప్పి వారిని పెళ్లి చేసుకోకుండా వేరొక ధనవంతురాలయిన స్త్రీని వివాహము చేసుకుని సంసారము చేస్తారు.  ఈ యువకుల మోసానికి గురయి ఆత్మహత్యలు చేసుకున్న స్త్రీలు తిరిగి తమ పాతప్రియుల ఇంట వారికి మానసిక వికలాంగ పిల్లలుగా జన్మించుతున్నారు.  అందుచేత సాయిభక్తులు ఏస్త్రీనయినా ప్రేమించినా వారిని మోసము చేయకుండా వివాహము చేసుకోవాలి అని చెప్పారు.

ఒకనాడు ద్వారకమాయిలో బాబా దర్శనానికి ఒక భక్తురాలు (శ్రీమతి మేనేజర్) వచ్చి బాబా ఆశీర్వచనాలను పొందింది.  ఆసమయంలో బాబా తన ప్రక్కనే కూర్చున్న భాగోజీ షిండేని (కుష్టురోగి) చూసి ఆమె అసహ్యించుకున్నది.  బాబా ఈవిషయాన్ని గ్రహించి, భాగోజీ షిండేని పిలిచి తన జోలిలో ఉన్న పాలకోవా బిళ్ళను తీసి శ్రీమతి మేనేజరుకు ఇప్పించి, ఆమెకు కనువిప్పు కలిగించారు.             ----  త్యాగరాజు

25.01.2020  --  ద్వారకామాయిలో భోజనాలు

ఆనాడు ద్వారకామాయిలో నా భక్తులు కులాలకు, మతాలకు అతీతంగా సహపంక్తి భోజనాలు చేసేవారు.  కాని, ఈనాడు నా భక్తులు తమ గ్రామాలలోను, పట్టణాలలోను కులాలవారీగా కార్తిక మాసములో భోజనాలు చేయడం నాకు చాలా బాధ కలిగించుచున్నది.  నా భక్తులు కులాలకు అతీతముగా కలసిమెలసి జీవించిన నేను సంతోషిస్తాను.  ---  బాబా

విశ్లేషణ ---  సందేశమును మనము శ్రీసాయి సత్ చరిత్ర 38 .ధ్యాయములో గమనించగలము.

బాబా ద్వారకామాయిలో తానే స్వయంగా వంట చేసి తమ స్వహస్తాలతో పేదలకు, దీనులకు, దుర్బలులకు తృప్తిగా భోజనాలు పెట్టేవారు.

32.అధ్యాయములో షిరిడీ సాయి దర్బారుకు జ్యోతిష్యులు ధనధాన్య వైభవాలనుభవించే భోగులు, రాజులు, ప్రజలు, జోగులు, విరాగులు, తాపసులు, సన్యాసులు ఎంతో ఉత్సాహంతో వచ్చేవారు.  జపతపవ్రతాలనాచరించేవారు, యాత్రికులు, స్థానికులు, గాయకులు, నర్తకులే కాకుండా హరిజనులు కూడా వచ్చి శ్రీసాయిని దర్శించుకునేవారు.

(మరికొన్ని రహస్యాలు వచ్చే గురువారమ్)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)





1 comment:

  1. तेरे दर पे मेरे साई चले आये | साई भजन #शेयर एंड #सब्सक्राइब जरूर करें
    https://www.youtube.com/watch?v=TnurtMRx58w
    ॐ साई राम ! ॐ साई राम ! ॐ साई राम ! ॐ साई राम !

    ReplyDelete