Monday, May 18, 2020

ఉధ్దవేష్ బువా – 2 వభాగమ్


      Shri Shirdi Saibaba Satcharitra Parayanam - Telugu
          ✅[105+] Roses Beautiful HD Photos (1080p) (496x661) (2020)
18.05.2020  సోమవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
రోజు సాయిభక్తులలో ఒకరయిన శ్రీ ఉద్ధవేష్ బువా అనబడే శ్యామ్ దాస్ బాబా గురించి రెండవ భాగం మీకు అందిస్తున్నాను.  ఆయనయొక్క సమాచారం shridisaitrust.org – Chennai వారి నుండి గ్రహింపబడింది.
తెలుగు అనువాదమ్  : ఆత్రేయపురపు త్యాగరాజు
                            నిజాంపేట, హైదరాబాద్
ఫోన్ నం.  9440375411 & 8143626744
ఉధ్దవేష్ బువా – 2 వభాగమ్
తరువాత 1906 – 1911 . సంవత్సరం మధ్యలో ఉద్ధవేష్ కి సాయిభక్తులయిన నానా సాహెబ్ చందోర్కర్, జనార్ధన్ గోవిందదేవ్ కందికర్, బాలా సాహెబ్ దేవులని కలుసుకునే భాగ్యం కలిగింది.  వారు ఆయనకి సాయిబాబావారి లీలలెన్నిటినో వివరించి చెప్పారు.


1906.సంవత్సరంలో ఆయన షిరిడీ వచ్చినపుడు బాబా రావోయి శ్యామ్ దాస్.  రోజు నువ్వు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం.  గుఱ్ఱాలు, ఎద్దులు కరుస్తాయి.  కాని అవి నాదగ్గరకి రాగానే సాధుజంతువుల్లా మారిపోతాయి.”  బాబా అన్నమాటలు కొంతకాలం క్రితం బాబా సమక్షంలో తన పనికిమాలిన గుఱ్ఱం కూడా సాధుజంతువులా మారడం గుర్తుకు వచ్చింది.  తనకు మోక్షమిచ్చే గురువుని షిరిడీలో కలుసుకుంటావు అనే విషయాన్ని హరిహర్ బాబా తనకు ముందె సూచించారు.  అప్పటినుండి ఉధ్ధవేష్ షిరిడీ వచ్చిన ప్రతిసారి ఎక్కువరోజులు అక్కడే ఉండిపోయేవారు.
                     What is the need of me grinding the... - Sri Shiridi Sai Baba ...
ఒకరోజు ఆయన ద్వారకామాయికి వెళ్ళినపుడు ఆసమయంలో బాబా తిరగలి విసురుతూ కనిపించారు.  అప్పటికే బాబా కొన్ని గోధుమలను తిరగలిలో పోసి, విసిరారు.  ఇంకా మరికొన్ని గోధుమలను విసరబోతున్నారు.  ఉధ్ధవేష్ మసీదులోపలికి ప్రవేశించి క్రింద కూర్చున్నారు.  బాబానే గమనిస్తున్నారు.  బాబా తిరగలి విసురుతూ కొంతసేపు పాటలు పాడటం, కొంతసేపు వేదాంతం మాట్లాడటం, ఆతరువాత తిట్లుకూడా తిట్టడంవంటివి చేస్తున్నారు.  బాబా తిరగలిలో గోధుమలను పోసి విసరడం ఉధ్ధవేష్ గారికి ఎంతో అధ్బుతం అనిపించింది.  బాబా మీరు తిరగలి ఎందుకని విసురుతున్నారు?” అని అడిగారు.  అపుడు బాబానావద్దకు ఎవరయితే వస్తారో వారిని నేను విసరాలిఅన్నారు.  అనగా బాబా తన భక్తులయొక్క కర్మలను, బాధలను ఆవిధంగా నిర్మూలిస్తున్నారని ఉధ్ధవేష్ గ్రహించుకున్నారు.  బాబా అన్నమాటలు ఆయన హృదయానికి బలంగా తాకాయి.  బాబా తన భక్తుల బాధలను, కర్మలను నిర్మూలించడానికి ఎంత కష్టపడుతున్నారో, ఎంతగా శ్రమిస్తున్నారో బాగా అర్ధం చేసుకున్నారు.

ఉధ్ధవేష్ ఇక తిరిగి వెళ్ళడానికి బాబా అనుమతికోసం ఆయన దగ్గరికి వెళ్ళి బాబాతోబాబా మీరు నన్ను తరచుగా షిరిడీకి రమ్మని ఎందుకని పిలవటల్లేదు?” అని అడిగారు.  అపుడు బాబా క్కడే ఉన్న బాలాగణపతి షింపీ వైపు తిరిగినేను తనని తరచుగా షిరిడీకి పిలవటల్లేదని అంటున్నాడు.  అయినా మేమిద్దరం ప్రతి 15 రోజులకు కలుసుకుంటూనే ఉన్నామే? కాదా?” అన్నారు.  ఉధ్ధవేష్ ప్రతి 15 రోజులకి ఏకాదశి రోజున బాబాకు ఉత్తరం రాయడం అలవాటు.  బాబా కూడా ఆయన వ్రాసిన ఉత్తరాలకు సమాధానాలు ఇస్తూ ఉండేవారు. తామిద్దరము కలుసుకుంటూనే ఉన్నామన్నది ఆ ఉత్తరాలగురించే అని బాబా వివరించారు.  ఆతరువాత బాబా చేతినిండా ఊదీని ఇచ్చి ఆయనను ఆశీర్వదించారు.  బాబా ఎంతో ప్రేమగా ఆయనతోఅయితే నువ్వు తిరిగి వెళ్ళిపోతున్నావు, అవునా? అరే శ్యామ్ దాస్ నేనెప్పుడూ నీతోనే ఉంటాను.  అల్లారామ్ మాలిక్ నిన్ను ఎప్పుడూ ఆశీర్వదిస్తాడు.  శుభాన్ని కలుగచేస్తాడు. సరేనా?” అన్నారు బాబా.

ఒకసారి చిదంబర్ కేశవ్ గాడ్గిల్ ఉధ్ధవేష్ వ్రాసిన ఉత్తరాన్ని బాబాకు చదివి వినిపించాడు.  ఉత్తరంలోని విషయాలు విన్నతరువాతఅతనిని ఇక్కడకు వెంటనే రమ్మనుఅన్నారు బాబా.

బాబానుంచి నాలుగురోజులలో వచ్చిన జవాబు అందుకున్న వెంటనే ఉధ్ధవేష్ షిరిడీకి చేరుకున్నాడు.  బాబా అతనిని పదకొండు రూపాయలు దక్షిణ ఇమ్మన్నారు.  ఉధ్ధవేష్ వెంటనే బాబాకు దక్షిణ సమర్పించుకున్నాడు.  ఆవిధంగా పది రోజులపాటు దక్షిణ ఇచ్చాడు.  ప్రతిరోజు ద్వారకామాయి మసీదుకు మధ్యాహ్నం గం.3.30 కు వెళ్ళేవాడు.  ఆసమయంలోనే బాబా అతని వద్దనుండి దక్షిణ అడిగేవారు.  విధంగా పదకొండవ రోజున కూడా ఎప్పటిలాగానే బాబా అతనిని దక్షిణ అడిగారు.  ఇక ఉధ్ధవేష్ వద్ద దక్షిణ సమర్పించుకోవడానికి డబ్బు లేకపోయింది.  బాబా మీకు దక్షిణ ఇవ్వడానికి నావద్ద డబ్బులేదు.  నేనెక్కడినుండి డబ్బు తీసుకుని రావాలో మీరే చెప్పండి.  దాని బదులుగా నేను నా పది ఇంద్రియాలను, నా మనస్సుని మీకు అర్పించుకుంటానుఅన్నాడు.  అందుకు బాబాఇప్పటికే అవి నాస్వంతమయ్యాయి.  నువ్వెవరు వాటిని నాకు అర్పించడానికి? వెళ్ళు, వెళ్ళి బాపూ సాహెబ్ బుట్టీ దగ్గరనుంచి పదకొండు రూపాయలు అడిగి పట్టుకొచ్చి నాకు సమర్పించుఅన్నారు.  బాబా మాటలు వినగానే ఉధ్ధవేష్ డబ్బు తెచ్చి ఇవ్వడానికి లెచాడు.  సభామండపం నుండి క్రిందకు దిగి గేటువద్దకు చేరుకోగానే
                       1

బాబాఅరే, శ్యామ్ వెనక్కిరా, పదకొండు రూపాయలు తరవాత ఇవ్వచ్చులే. కాని బాపూ సాహెబ్ జోగ్ నుంచి అడిగిపట్టుకురా.  ప్రస్తుతానికి ఇక్కడకు వచ్చి కూర్చోఅన్నారు.  ఆతరవాత బాబా వద్దనుంచి ఊదీ, ప్రసాదం తీసుకున్న వాత వాడాకు తిరిగి వచ్చాడు.  కాని, పదకొండు రూపాయలు గురించి పూర్తిగ మర్చిపోయాడు.  సాయంత్రం గం. 3.30 కి బాబాను దర్శించుకోవదానికి వెళ్ళాడు.  బాబా పదకొండు రూపాయలు గురించి ఏమీ అడగలేదు. బాబా సాయంత్రం ఉద్ధవ్ తోబాపూ సాహెబ్ జోగ్ దగ్గరకు వెళ్ళి పదకొండు రూపాయలు తీసుకుని రాఅన్నారు.

బాబా చెప్పినట్లుగా ఉధ్ధవేష్ వాడాకు తిరిగి వచ్చాడు.  అక్కడ బాపూ సాహెబ్ జోగ్ కొంతమంది భక్తులకి ఏకనాధ్ భాగవతం చదివి వినిపిస్తున్నాడు.  ఉధ్ధవేష్ బాబా ఏమి అన్నారో అదంతా జోగ్ తో చెప్పాడు.  తరువాత ఇద్దరూ కలిసి మసీదుకు వచ్చారు.  ఆసమయంలో బాబా బయటకు వెళ్ళడానికి సిధ్ధమవుతున్నారు.  వారిని చూడగానే బాబా ఆశీర్వదించారు, కాని దక్షిణ గురించి ఏమీ అడగలేదు.  ఆతరువాత వారు వాడాకు తిరిగి వచ్చారు.  మిగతా భక్తులు ఉధ్ధవేష్ ని పదకొండు రూపాయలు దక్షణ గురించిన వివరాలు, దాని కధామమామీషు ఏమిటి అని కుతూహలంతో అడిగారు.  ఉధ్ధవేష్ దాని గురించి ఏమీ తిరిగి ఆలోచించలేదు.  ఆతరవాతనుంచి ప్రతిరోజు ఇద్దరూ బాబా వద్దకు వెళ్ళేవారు, కాని బాబా దక్షిణ మాట ఎత్తలేదు.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)




No comments:

Post a Comment