Saturday, May 23, 2020

శ్రీ చంద్రభాన్ సేఠ్ వారసులతో ముఖాముఖి – 2 వ.భాగం


    Untitled
       Red Rose Flower Bouquet Isolated On White Background Cutout Stock ...
23.05.2020 శనివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు

బాబా రహతా లోని శ్రీ చంద్రబాన్ సేఠ్ గారి ఇంటికి తరచుగా వెడుతూ ఉండేవారన్న విషయం శ్రీ సాయి సత్ చరిత్ర పారాయణ చేసిన మనకందరికి తెలుసు.  కొన్ని సంవత్సరాల క్రితం సాయిపధం మాసపత్రిక వారు రహతా వెళ్ళి శ్రీ చంద్రబాను సేఠ్ గారి వారసులతో ముఖాముఖీ గా మాట్లాడి, బాబా గురించి కొన్ని ఆసక్తికరమయిన విషయాలను సేకరించారు.  ఇవి మనకు శ్రీ సాయి సత్ చరిత్రలో కనపడవు.  సంభాషణలను shirdisaitrust.org – Chennai వారి నుండి గ్రహింపబడినది.
శ్రీ చంద్రబాను సేఠ్ గారి మనుమడు శ్రీ జయచంద్ర సేఠ్, ఆయన మునిమనుమడు శ్రీ సురేంద్ర సేఠ్ లతో సాయిపధమ్ వారు ప్రత్యక్షంగా మాట్లాడి బాబా గురించి వెల్లడించిన విషయాలను రెండవ భాగం   రోజు మీకు అందిస్తున్నాను.  వారి సంభాషంతా మరాఠీలోను, ఆంగ్లంలోను జరిగింది.

శ్రీ చంద్రభాన్ సేఠ్ వారసులతో ముఖాముఖి – 2 .భాగం

సా..ప్రశ్నబాబా మీ ఇంటికి వచ్చినపుడు మీ ఇంటి లోపలికి  ప్రవేశించేవారా? లేక బయట వరండాలోనే కూర్చొనేవారా?

..సేఠ్ఆయన ఇంటిలోపలికే వచ్చేవారు.  అదిగో ఆ కనపడే ద్వారంలోనుండే వచ్చేవారు. (శ్రీ జయచంద్ర సేట్ గారు సాయిపధం పత్రికవారికి ఇంటి ప్రధాన ద్వారంవైపు చూపించారు)


సా..ప్రశ్నబాబాతో మీకుంటుంబానికి కలిగిన అనుభవాలను వివరిస్తారా?

..సేఠ్చెప్పాలంటే లెక్కలేనన్ని అనుభవాలున్నాయి.  బాబాతో మాకు కలిగిన అనువాలు ఎన్నని చెప్పను?  మాతాతగారు చంద్రభాన్ సేఠ్ గారు మూడు వివాహాలు చేసుకున్నారు.  ఆయనకు ఎంతోమంది సంతానం.  కాని అందరూ చనిపోయారు.  మానాన్నగారు 21.సంతానం.  చంద్రభాన్ సేట్ గారికి మగపిల్లవాడు జన్మించాడని తెలియగానే బాబా వెంటనే మా ఇంటికి వచ్చారు.  ఆయన మానాన్నగారిని తన చేతుల్లోకి తీసుకుని బిడ్దని నాప్రసాదంగా నీకు ప్రసాదిస్తున్నాను.” అన్నారు.  బిడ్డ ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా మంచి పరిపూర్ణ ఆరోగ్యంతో మంచి శరీర సౌష్టవంతో పెరిగాడు.  మా కుటుంబమంతా ఈ విధంగా జీవించి ఉండటానికి కారణం బాబా మాయందు చూపుతున్న అనుగ్రహమే.  ఈ నాటికీ ఆయన మామీతన దీవెనలని అందిస్తూనే ఉన్నారు.  ఒకసారి బాబా కుశాల్ చంద్ తోచూడు కుశాల్ , నేను ఈ శరీరాన్ని వదిలివేసిన తరువాత ప్రజలు నా ఎముకలను పూజిస్తారు”.  అయన దూరదృష్టితో చెప్పిన మాట నిజమయింది.

సురేందర్ చాంద్ఆరోజులలో బాబా మాయింటికి వస్తూ ఉండెవారు.  మాపండ్లతోటలు గ్రామసరిహద్దుల వరకు విస్తరించి ఉండేవి.  కొన్ని సంవత్సరాల తరువాత బావులన్నీ ఎండిపోయాయి.  నీళ్ళు లేవు.  1990 నాటికి పండ్ల చెట్లన్నీ ఎండిపోయి తోటంతా నాశనమయిపోయింది. నీటికోసం బోరుబావిని తవ్విద్దామని ఉదయం పని మొదలు పెట్టాము.  కాని సాయంత్రమయినా చుక్క నీరు పడలేదు.  సాయంత్రం బాబా సమాధి మందిరానికి వెళ్ళి ఆయనను దర్శించుకున్నాను.  బాబాని ప్రార్ధించాను.  బాబా బోరుబావిలో నీరు పడేటట్లుగా అనుగ్రహించు.  ఫలవృక్షాలన్నీ మునిపటిలాగానే మీరున్న కాలంలో ఏవిధంగా ఉండేవో ఆవిధంగా మరలా పచ్చగా కళకళలాడేలాగ అనుగ్రహించు  యిదు నిమిషాలోనే బోరుబావిలో నీరు పడింది.  బాబా ఆశీర్వాదం వలన తోటలన్నీ మళ్ళీ పచ్చగా కళకళలాడాయి.

సా..ప్రశ్నబాబా అందరివద్ద దక్షిణ తీసుకునేవారు.  ఆయన మీతాతగారి వద్దనుంచి కూడా దక్షిణ తీసుకున్నారా?

..సేఠ్కుశాల్ చంద్ గారు బాబాని దర్శించుకోవడానికి షిరిడీ వెళ్ళినపుడు ఏమి ఇచ్చారో మాకు తెలియదు.  కాని బాబా మాయింటికి వచ్చినపుడు ఒక యోగీశ్వరుడిని ఇంటినుంచి రిక్త హస్తాలతో పంపించకూడదనే మేము ఆయనకి ఏదయినా సమర్పించుకునేవారము.  ఎవరయినా భక్తుడికి సహాయం చేయమని బాబా ఎప్పుడడిగినా కుశాల్ చంద్ గారు సహాయం చేస్తూ ఉండేవారు.  బాబా తనకోసం ఎప్పుడూ ఏదీ తీసుకోలేదని మాపెద్దలు చెప్పారు.

సా..ప్రశ్నబాబా మీఇంటికి వచ్చినపుడు మీరు ఎటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉండేవారు? బాబా వస్తున్నారనే సమాచారం మీకు ముందుగానే తెలిసేదా?  బాబా దర్శనం కోసం మొత్తం గ్రామంలోని ప్రజలంతా వచ్చేవారా?

..సేఠ్ -  నేనింతకు ముందు చెప్పినట్లుగానే మా పండ్లతోటలు గ్రామసరిహద్దుల వరకు విస్తరించి ఉండేవి.  తోటల్లో మాతోటమాలి లక్ష్మణ్ అనే లక్షా ఉండేవాడు.  బాబాని చూడగానే అతను పరిగెత్తుకుంటూ వచ్చి బాబా వస్తున్నారనే విషయం చెప్పేవాడు.  కుశాల్ చంద్ వెంటనే మేళతాళాలతో బయలుదేరి వెళ్ళి బాబాను, ఆయనతో కూడా వచ్చిన భక్తులందరిని సగౌరవంగా ఎంతో వైభవంగా తీసుకుని వచ్చేవారు.  బాబా రహతాలో మాఇంటిలో తప్ప మరెవరి ఇంటిలోను అడుగుపెట్టలేదు.  అందువల్ల ఇతర గ్రామస్థులు కూడా మేమంటే ఎంతో గౌరవంగా ఉండేవారు.  వారెవ్వరూ మాఇంటిలోకి అడుగుపెట్టే ధైర్యం చేసేవారు కాదు.  బాబా నతో కూడా వచ్చిన భక్తులతోను, మాకుటుంబ సభ్యులతోను కొద్దిసేపు గడిపి ఆతరువాత తిరిగి  షిరిడి వెళ్ళిపోయేవారు.  బాబా మాఇంటికి వచ్చినపుడు బాబాకు సేవ చేసిన మాతోటమాలి లక్షా ఆతరువాత లక్షాబాబా గా ఒక సాధువుగా వల్సాడ్ ప్రాంతంలో స్థిరపడ్డాడు.
(కుశాల్ చంద్ ఇల్లు, బాబా కూర్చున్న ప్రదేశం, బాబా వాడిన వస్తువులు బాబా కుశాల్ చంద్ కు ఇచ్చిన ఫోటో ఈ వీడియోలో చూడండి. బాబా కుశాల్ చంద్ తో ఉన్న వీడియో మెరే సాయి హిందీ సీరియల్ లో దొరుకుతుందేమోనని వెదకుతున్నపుడు ఈ వీడియో కనిపించింది. )






సా..ప్రశ్నబాబా మహాసమాధి చెందినపుడు కొంతమంది ఆయన పార్ధివశరీరాన్ని ముస్లిమ్ సాంప్రదాయం ప్రకారం సమాధి చేయాలని అన్నట్లుగాను,  వారిలో కుశాల్ చంద్ గారు కూడా ఉన్నారని, శ్రీసాయి సత్ చరిత్రలో వ్రాయబడింది.  అది నిజమేనా?

(శ్రీ సాయి సత్ చరిత్ర అ.43 బాబా శరీరానికి అంతిమ సంస్కారం ఎట్లా చేయాలని 
గ్రామస్థులంతా ముఫై ఆరుగంటల సేపు తర్జన భర్జనలతో ఆలోచించారు. ఈ శరీరానికి హిందువులచే తాకనివ్వకుండా ముసల్మానుల శ్మశానంలోనికి తీసికొనిపోవాలని ఒకరంటే, ఆరుబయట అందమైన ఒక సమాధి కట్టి అందులో ఉంచాలని మరొకరన్నారు.  ఖుశాల్ చంద్, అమీర్ శక్కర్ కూడా ఈ మాటలనే సమ్మతించారు. … త్యాగరాజు)
        Shirdi Sai baba Temple | शिर्डीचे श्री साईबाबा ...
..సేఠ్మాకా సంఘటన గురించి తెలియదు.  ఆరోజుల్లో ఉపాసనీ బాబా మాతోటలోనే నివసిస్తూ ఉండేవారు.  బాబా మహాసమాధి చెందిన తరువాత ఆయన ఏడు రోజులపాటు నామ సప్తాహం నిర్వహించారు.  నాసోదరుడు దౌలత్ రామ్ నామ సప్తాహానికి అన్ని ఏర్పాట్లు చేసాడు.
(బాబా మహాసమాధి చెందిన నెలరోజులకు సరిగా 15 నవంబరు, 1918 లో కుశాల్ చంద్ గారు మరణించారు.)
(సమాప్తం)
(సర్వం శ్రీ సాయినాధార్పనమస్తు)

1 comment: