29.05.2020 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన
సందేహాలు –
బాబా సమాధానాలు – 9 (2)
బాబా సమాధానాలు – 9 (2)
ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్
ఫోన్. 9440375411 & 8143626744
మైల్ ఐ.డి.
tyagaraju.a@gmail.com
నాకు కలిగిన సందేహాలు
– బాబా సమాధానాలు – 9 కి సాయిభక్తుల స్పందన
శ్రీమతి సుమలలిత
, ఆట్లాంటా (యు.ఎస్. ఎ) చాలా బాగుంది
శ్రీమతి కృష్ణవేణి
, చెన్నై – మనప్రయత్నం ఎంతున్నా గురువు గారి సహాయంతోనే ఆత్మజ్ఞానం పొందగలమని దీని ద్వారా
అర్ధమవుతుంది. దీనిలో బాబాగారు ఆనందంలో మునిగి
వున్నారు అంటే వారి గురువు గారి మీద ఆయన ఎంతో నమ్మకంతో ఉన్నారని అర్ధమవుతుంది. కాని దానిలో ఇంత విషయం దాగున్నదని ఇప్పుడే అర్ధమవుతుంది. చాలా మంచి విషయం తెలుసుకున్నాను.
శ్రీ ఎఱ్ఱాప్రగడ
ప్రసాద్, రాజమహేంద్రవరం – గురుకృపా కటాక్షము ఉన్నవారికే కుండలిని అర్ధం సాధ్యం అవుతుంది. తలక్రిందులుగా వేలాడుతూ బ్రహ్మానందం అనుభవించాలి
అనుకుంటే సాధన అత్యవసరం.
శ్రీ పార్ధసారధి,
పాలకొల్లు – చక్కటి వివరణ…సాయిరామ్
శ్రీమతి కిరణ్మయి
– అమెరికా - మీప్రశ్నలు సమాధానాలు బాగున్నాయి
ఎవరయినా తమ స్వంత బ్లాగులో కాని, ఫేస్ బుక్ లో కాని, కాపీ, పేస్ట్ చేసుకోదలచినట్లయితే ముందుగా నాకు తెలియచేయవలెను.
ఇపుడు కుండలినిశక్తి గురించి అవసరమయినంత వరకు తెలుసుకుందాము. కుండలిని అనేది ఒక అనిర్వచనీయమయిన శక్తి. ఇది మానవ శరీరంలో వెన్నుపాములో దాగి ఉంటుంది. మూలాధారంలో దాగి ఉన్న కుండలినీ శక్తిని సుషుమ్నానాడి ద్వారా పైకి సహస్రారం వరకు తీసుకొనివెళ్ళే పధ్ధతిని వివరించేది కుండలినీ యోగ.
ఇపుడు కుండలినిశక్తి గురించి అవసరమయినంత వరకు తెలుసుకుందాము. కుండలిని అనేది ఒక అనిర్వచనీయమయిన శక్తి. ఇది మానవ శరీరంలో వెన్నుపాములో దాగి ఉంటుంది. మూలాధారంలో దాగి ఉన్న కుండలినీ శక్తిని సుషుమ్నానాడి ద్వారా పైకి సహస్రారం వరకు తీసుకొనివెళ్ళే పధ్ధతిని వివరించేది కుండలినీ యోగ.
కుండలినీ యోగలో కుండలినిని జాగృతం చేయడానికి ప్రాణాయామ సాధన ఒక ముఖ్యమయిన మార్గం.
కుండలినీ
శక్తి సహస్రారం చేరినపుడు యోగసాధకుడు ఒక అనిర్వచనీయమయిన ఆనందాన్ని అనుభవిస్తాడు.
శక్తి రెండు రకాలుగా ఉంటుంది.
ఒకటి స్థితి శక్తి (Potential Energy)
రెండవది గతి శక్తి (Dynamic or Kinetic Energy)
శరీరములోని ప్రాణశక్తి గతిశక్తి రూపంలో ఉంటుంది.
మానవ
దేహంలోని స్థితి పామువలె చుట్ట చుట్టుకొని మూలాధారం వద్ద నిద్రాణంగా ఉంటుంది.
యోగసాధన ద్వారా నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తిని జాగృతం చేయవచ్చు.
కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను జయించినప్పుడే ఇది సాధ్యమవుతుంది.
కుండలినీ శక్తిని జాగృతం చేయడానికి ముందు దేహశుధ్ధి, నాడీశుధ్ధి, మనోశుధ్ధి, బుధ్ధిశుధ్ధి, జరగాలి.
(మనస్సును
పావనము చేయనిదే ఆత్మసాక్షాత్కారము పొందలేము. ఇంద్రియములుగాని, మనస్సుగాని, బుధ్ధిగాని ఆత్మను చేరలేవు. ప్రత్యక్షము, అనుమానము మొదలైన ప్రమాణములు మనకు ఈ విషయములో సహాయపడవు. గురువుగారి కటాక్షమే మనకు తోడ్పడును. ధర్మము, అర్ధము,
కామము మన కృషివల్ల లభించును. కాని నాలుగవదియగు మోక్షము గురువు
సహాయము వలననే పొందనగును. శ్రీ సాయి సత్ చరిత్ర అ. 32)
నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తిని యోగక్రియల ద్వారా జాగృతం చేసినప్పుడు అది ఊర్ధ్వముఖంగా పయనించి, షట్చక్రాలలోని ఒక్కొక్క చక్రాన్ని దాటుతూ తలమాడు భాగాన ఉండె సహస్రార చక్రాన్ని చేరుతుంది. ఈ స్థితినే అష్టాంగయోగలోని అత్యున్నత దశ అయిన ‘సమాధి స్థితి’ గా కూడా పేర్కొంటారు.
ఈ స్థితిలో సాధకునికి ఒక అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది.
అన్నిరకాల
క్లేశాలు తొలగిపోతాయి.
శరీరం,
మనస్సునుండి
పూర్తిగా విడిపోతాడు.
మూలాధార చక్రము – ఇది గుదస్థానమునకు పైన లింగస్థానమునకు క్రిందుగా ఉంటుంది.
నాలుగు
దళములతో ఆరు వర్ణములు కలిగిన కమలమిది.
ఇందులోనే
కుండలినీ శక్తి నిక్షిప్తమై ఉంటుంది.
దీని
బీజమంత్రం ‘లం’.
మూలాధార
చక్రమున గల కమలకర్ణికయందు దివ్య సుందరమయిన త్రికోణము, దానిమధ్య తతిత్కోటి సమప్రభమగు (కోటి ప్రభలతో సమానమయిన) స్వయంభూలింగము కలదనియు, ఆలింగము చుట్టును తామరతూడులోని దారమువంటి ఆకారము గల కుండలినీ శక్తి మూడున్నరచుట్లు చుట్టుకొని యున్నదనియు, వివిధ తంత్రములు వర్ణించుచున్నవి.
సహస్రార చక్రం _ ఈ కమలం వేయి దళాలతో వికసించి ఉంటుంది.
ఈ
చక్రం మస్తిష్కంపైన బ్రహ్మరంధ్రం క్రింది భాగమున విలసిల్లే ఈ చక్రం విశ్వాత్మ నివాసస్థానం, పరమాత్మ స్థానం.
ఇది మానసికంగా సంపూర్ణ ఆధ్యాత్మిక చక్రం.
ఆత్మ
సాక్షాత్కారానికి
దోహదం చేసే చక్రం.
ఈచక్రం శక్తివంతంగా లేకపోతే షట్చక్రాలు బలహీన పడతాయి.
ఈ చక్రం జాగృతమయితే సాధకుడు అమరుడవుతాడు.
పరమాత్మగా
వ్యక్తమౌతాడు. తనకు
తాను తెలుసుకుంటాడు.
ఇది
ఈశ్వరీయస్థితి. ఈశ్వరత్వం
పొందుతారు.
ఈ చక్రమును శుధ్ధి చేసుకోవాలంటే తలపు, మాట, చేత యోగ్యంగా ఉండాలి.
క్రమశిక్షణ, ఆచరణ, విశ్వాసం కలిగియుండాలి.
ధ్యానం,
బ్రహ్మతత్త్వజ్ఞానం,
స్థితప్రజ్ఞ, ప్రశాంత వాతావరణం ఏర్పరచుకోవడం చేయాలి.
ప్రకృతి
సహజంగానే ప్రతిమనిషికి కొంతశక్తి వస్తుంది.
కొన్ని
అవకాశాలు కల్పిస్తుంది.
వచ్చిన
అవకాశాలను అందుకుని ఉన్న శక్తిని ఉపయోగించుకుంటూ ఆత్మశక్తిని పెంపొందించుకోగలగాలి.
ఈవిధమయిన
సాధనే ఆధ్యాత్మిక ఉన్నతికి మార్గం సుగమం చేస్తుంది.
ఈ సాధన వలన ఆలోచనల్లో స్పష్టత, నడవడికలో సరళత, దృక్పధంలో విశాలత, అందరినీ ప్రేమించగల సౌశీల్యత, ఆదరించగల సేవాతత్పరత, స్థితప్రజ్ఞత అలవడతాయి.
నేను
అనే అహం నశిస్తుంది.
‘నేను’
అనేది సంకుచిత స్వాభిమానం అదృశ్యమైనచో అనంతమనే ‘అహంబ్రహ్మస్మి’ అనేది ఉత్తమ స్థితి తనంటదియే సాక్షాత్కారమగును.
కుండలినీ శక్తిని మనకు మనం పుస్తకాలను చదివి, అంతర్జాలంలో వీడియోలను చూసి సాధన చేయడం అసాధ్యం.
మూలాధార చక్రంలోనున్న
కుండలినినే కనక కదిపినట్లయితే సాధకుడు గోడలోనుంచి కూడా వెళ్ళగలడు. అటువంటి శక్తి లభిస్తుంది. దీనికి మనం ఉదాహరణగా శ్రీ సాయి సత్ చరిత్ర అ.28
ఒకసారి గమనించవచ్చు.
మేఘశ్యాముడు తలుపులు వేసుకొని తన గదిలో నిద్రిస్తున్న సమయంలో బాబా అతని గదిలోకి ప్రవేశించి త్రిశూలము గీయమని ఆదేశించారు.
ఆ సమయంలో
మేఘశ్యాముడు
బాబాతో తలుపులన్ని వేసి ఉండుటచే ఇది ఒక దృశ్యమనుకొన్నాను అన్నాడు.
అపుడు
బాబా ప్రవేశించుటకు నాకు వాకిలి యవసరము లేదు.
నాకు
రూపము లేదు. నేనన్ని చోట్ల నివసించుచున్నాను అన్నారు.
శ్రీ
సాయి సత్ చరిత్ర అ.28.
కాని బాబా తనకు ఎన్ని శక్తులు ఉన్నా వాటిని ఎప్పుడూ ఇతరుల ముందు ప్రదర్శించలేదు.
వాటిని
ప్రదర్శించి
ప్రజలను తనవైపుకు ఆకర్షించుకోలేదు.
బాగా
అత్యవసర సమయాలలో మాత్రమే ఆయన తన శక్తిని భక్తుల మేలు కొరకే ఉపయోగించేవారు.
(ఇది ఇంతవరకే)
(మరలా బాబా సమాధానాలు ఇచ్చినపుడు ప్రచురణ)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
No comments:
Post a Comment