Tuesday, May 12, 2020

మేరే సాయి

       Sai Amrut Shirdi Sai Baba Wall Poster/Wall Paper/Wall Sticker ...
            Yellow Rose Flower Wallpapers - Wallpaper Cave

12.05.2020  మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

మేరే సాయి (సీరియల్ 1 వ.భాగమ్)

ఈ రోజు మేరే సాయి హిందీ సీరియల్ మొదటి భాగాన్ని బ్లాగులో ఉంచుతున్నాను.  వీక్షించండి.   బాబాకు బాయిజా మాయికి ఉన్న్ తల్లికొడుకుల అనురాగం తెలియచేయడానికి మాత్రమే ఈ వీడియో మీకోసం...




సందేహాలు - సమాధానాలు 8 (3) కు సాయిభక్తుల స్పందన
శ్రీ యఱ్ఱాప్రగడ ప్రసాద్,  రాజమహేంద్రవరమ్

అందరూ భోజనం చేసినదానికి ఒక భక్తురాలి ప్రశ్నకు నాకు తోచిన చిన్న  భావం.


అసలు నీకు ఆకలి ఎవరు ఇచ్చారు? అసలు ఆకలికి వండుకుని తినమని సరుకు ఎవరిచ్చారు? నాలుకకి రుచి ఎవరు ఇచ్చారు?  పదార్దానికి మాధుర్యాన్ని ఎవరు ఇచ్చారు..అసలు ఆయన ఇచ్చింది ఆయనకు పెట్టకుండా తింటామా? బాబా  నువ్విచ్చిందే నీకు నివేదిస్తున్న అభాగ్యుడిని..అందుకని నీవు మిగిల్చినదే నాకు పరమాన్నం, నాకు బిక్ష అనకుండా తింటామా? లేదు అలానే అనుకుంటున్నాము.... అంటారా ఆయనకు నివేదించిందే మనము తింటున్నాము. ఆయన మనకు ప్రసాదముగా ఇచ్చింది పోను... ఆయనకు పరోక్షంగా పెట్టిందే  మన ప్రసాదంగా అయినా పిమ్మట ఆయనకు  ప్రత్యక్షంగా పెడుతున్నాము..*ఇవన్నీ భావనలో తెలుస్తాయి తప్ప అక్షరాలలో తెలియవు*  *ఇవి వింటే తెలియవు.*  *పైన లా తింటే తెలుస్తుంది*

అది అంతే.     *చెబితే తెలియదు*    "అనుభవించాలి అంతే*



యర్రాప్రగడ ప్రసాద్, రాజమండ్రి




ముందు ఆయనకు సమర్పణం చేస్తున్నాం  తరువాత దానిని మనము ప్రసాదంగా స్వీకరిస్తున్నాం  ఆ తరువాత యోగులకు పెడుతున్నాము..  అంటే మొదట బాబాకి చేరిపోయింది.  అక్కడ నుండి మనకు...ఆ తరువాత మళ్ళీ యోగుల రూపంలో ఆయనకు.. లోతుగా ఆలోచిస్తే 3 రూపాల్లో నూ ఆయనే తింటున్నాడు.

ఇంకా లోతు విశ్లేషిస్తే...   *యోగులకు నువ్వు పెట్టె అవకాశం వచ్చింది* అంటే
నువ్వు బాబా దృష్టిలో *యోగ్యుడివి* అయినట్టేగా




యర్రాప్రగడ ప్రసాద్, రాజమండ్రి

                            మేరే సాయి




(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)

No comments:

Post a Comment