Saturday, June 27, 2020

గురుభక్తి 9 వ.భాగమ్

   Sri Dattatreya Sai Ashram, Dhenkanal. - Posts | Facebook

      CATTERPILLAR FARM Bubblegum Pink Rose Flower Plant Home Garden ...

27.06.2020 శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన సందేహాలు – 
బాబా సమాధానాలు – 10 (9)
గురుభక్తి 9 .భాగమ్
ఆత్రేయపురపు త్యాగరాజునిజాంపేటహైదరాబాద్
ఫోన్.  9440375411 & 8143626744
మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

సాయిభక్తులందరికి ఒక మనవి...

బాబాగారి ఆదేశానుసారం ఈ రోజునుండి చంద్రశేఖరాష్టకమును (పరమశివుడు) వినడం ప్రారంభించాను.  దీనితోపాటుగా మనస్వినీదేవి      పరమశివుని కుమార్తె (నాగదేవత) ను కూడా పూజించవలెను.
ఈ కరోనా కష్టకాలములో ప్రతివారు పఠించవలసినది శ్రీ చంద్రశేఖరాష్టకము.
దీని వలన అపమృత్యు దోషం పరిహరిస్తానని, వారిని రక్షించి తీరుతానని స్వయముగా పరమశివుడె చెప్పినాడు.  (మార్కండేయ చరిత్ర)
                                (చంద్రశేఖరాష్టకం)
(అందరూ ప్రతిరోజూ ఈ చంద్రశేఖరాష్టకాన్ని పఠించండి, లేక వినండి)

సకలమునకు కారణమైన గురుమూర్తి తనకు ఏకారణము లేనివాడై యున్నాడు.  గురువే పరమదైవము.  గురుమంత్రమునకు సమానమగు మంత్రము లేదు.  అట్టిగురుదేవునకు ప్రణామములు.
                                       గురుగీత  శ్లో.  80


ప్రపంచమంతయు గురుదేవునియందే ఉన్నది.  ప్రపంచమునందు ఉన్నది గురుమూర్తియే.  కనుక విశ్వరూపమంతయు గురుస్వరూపము కంటెను అన్యము కాదు.  అట్టి గురుదేవునకు వందనములు.
                                       గురుగీత  శ్లో.  81
          guru sishya | Harmonium
గురుదేవుని భోధననుసరించి మనస్సును శుధ్ధి చేసుకోవాలి.  ద్వైతము కొంచము తెలిసినను అనిత్యమగుదానిని ఖండించాలి.
                                       గురుగీత శ్లో.  126
(శ్రీ సాయి సత్ చరిత్ర అ.10 “ఎవరైనను మీకు కీడు చేసినచో, ప్రత్యపకారము చేయకుడు.  ఇతరుల కొరకు మీరేమైన చేయగలిగినచో నెల్లప్పుడు మేలు మాత్రమే చేయుడు”)
( శ్రీ సాయి సత్ చరిత్ర అ.18 – 19 “ఏదైన సంబంధముండనిదే యొకరు ఇంకొకరి వద్దకు పోరు.  ఎవరుగాని యెట్టి జంతువుగాని నీవద్దకు వచ్చినచో నిర్దాక్షిణ్యముగా వానిని తరిమివేయకుము.  వానిని సాదరముగా చూడుము.  దాహము గలవారికి నీరిచ్చినచో ఆకలితో నున్నవారికి అన్నము పెట్టినచో, వస్త్రములు లేనివారికి వస్త్రములు, నీ ఇంటి వసారా ఇతరులు కూర్చొనుటకు విశ్రాంతి తీసికొనుటకు వినియోగించినచో నిశ్చయముగా భగవంతుడు మిక్కిలి ప్రీతి చెందును.  ఎవరైన ధన సహాయము గోరి నీవద్దకు వచ్చినచో, నీకిచ్చుటకిష్టము లేకున్న నీవు ఇవ్వనక్కరలేదు.  కాని వానిపై కుక్కవలె మొఱగవద్దు.  ఇతరులు నిన్నెంతగా నిందించినను నీవు కఠినముగా జవాబునివ్వకుము.  అట్టివానిని నీవెల్లప్పుడు ఓర్చుకొనినచో నిశ్చయముగా నీకు సంతోషము కలుగును.  ప్రపంచము తలక్రిదులయినప్పటికి నీవు చలించకుము.  నీవున్న చోటనే స్ఠైర్యముగా నిలిచి, నెమ్మదిగా నీ ముందర జరుగుచున్న నాటకమును చూచుచుండుము.  నాకు నీకు భేదము గలదనునదియే భక్తుని గురువునకు దూరముగా నుంచుచున్నది.  దానిని నశింపచేయనిది మనకు ఐక్యత కలుగదు.”

ప్రక్కనించి లేవగనే నీ కేమయిన మంచి యాలోచన కలిగిన, దానిని తరువాత పగలంతయు వృధ్ధి చేసినచో నీ మేధాశక్తి వృధ్ధి పొందును.  నీ మనస్సు శాంతి పొందును.
పరులను నిందించుట గురించి ఇదే అధ్యాయంలో  బాబా ఏమని చెప్పారో మరొక్క సారి మరలా గుర్తుకు తెచ్చుకుందాము.  మలినమును పోగొట్టుటకనేక మార్గములు గలవు.  సబ్బుతో మాలిన్యమును కడుగవచ్చును.  పరులను నిందించువాని మార్గము వేరు.  ఇతరుల మలినములను వాడు తన నాలుకతో శుభ్రపరచును.  ఒక విధముగా వాడు నిందించువానికి సేవ చేయుచున్నాడు.  ఎట్లన, వాని మలినమును వీడు తన నాలుకతో శుభ్రపరచుచున్నాడు.  కావున తిట్టబడినవాడు, తిట్టినవానికి కృతజ్ఞతలు తెలుపవలెను.  ఆ విధంగా బోధిస్తూ బాబా ఒక వరాహాన్ని చూపించిఆ పంది అమేధ్యమును యెంత రుచిగా తినుచున్నదో, నీ స్వభావము కూడా అట్టిదే.  ఎంత ఆనందముగా నీ సాటిసోదరుని తిట్టుచున్నావు.  ఎంతయో పుణ్యము చేయగ నీకీ మానవ జన్మ లభించినది.  ట్లు చేసినచో షిరిడీ దర్శనము నీకు తోడ్పడునా?’ అని మరొకరిని నిందిస్తున్న వ్యక్తికి బాబా బోధించారు.}

బాబా ఉపదేశములకు పరిమితి లేదు. అడ్డు లేదు.

ఇతరుల మనస్సు బాధించునట్లు మాట్లాడరాదు.  మేలొనరించు పనులనే చేయుచుండవలెను.  ఎవరయితే భగవంతుని పూర్తిగా నమ్మెదరో, వారి లీలలను విని ఇతరులకు చెప్పెదరో ఇతర విషయములేమియు నాలోచించరో వారు తప్పక ఆత్మసాక్షాత్కారము పొందుదురు.
బాబా కొందరికి భగవన్నామమును జ్ఞప్తియందుంచుకొనుమనువారు.  కొందరికి తమ లీలలు వినుట, కొందరికి తమ పాదపూజ, కొందరికి ఆధ్యాత్మరామాయణము, జ్ఞానేశ్వరి మొదలగు గ్రంధములు చదువుట, కొందరికి తమ పాదముల వద్ద కూర్చొనుమనుట, కొందరిని ఖండోబా మందిరమునకు బంపుట, కొందరికి విష్ణుసహస్రనామములు, కొందరికి ఛాందోగ్యోపనిషత్తు, భగవద్గీత పారాయణ చేయుమని విధించుచుండెను.  

  కొందరికి స్వయముగా ఉపదేశమునిచ్చువారు, కొందరికి స్వప్నములో నిచ్చేవారు.  కొందరికిగురుబ్రహ్మాది మంత్రార్ధములను బోధించిరి. ఒకడు హఠయోగము చేయుచుండగా దానిని మానుమనిరి.  వారి మార్గములను జెప్పుటకలవి గాదు.  ప్రపంచ విషయములలో తమ ఆచరణలే ఉదాహరణముగా బోధించువారు.)
శ్రీ సాయి సత్ చరిత్రలో బాబా ఉపదేశించిన బోధనలను ఆచరణలో పెట్టినట్లయితే మన మనస్సు శుధ్ది అవుతుంది.
శ్రీ సాయి సత్చరిత్రను బాగా అవగాహన చేసుకున్నట్లయితే ఇతరులను వారి ఎదుట గాని,  పరోక్షంగా గాని నిందించవలసిన ఆలోచన కలిగినవెంటనే అనగా వరాహం గురించి చెప్పిన మాటలు గుర్తుకు రావాలి.  వచ్చిన వెంటనే నోరు మూత పడిపోతుంది.  ఇక ఎదుటివారిని నిందించడానికి మనస్సు ఒప్పదు.  ఆవిధంగా మనస్సు కొంత వరకు శుధ్ధి అయినట్లే.  లేనట్లయితే శ్రీ సాయి సత్ చరిత్ర పారాయణ చేసిన ఫలితం ఏమీ ఉండదు.
ఏప్రకారముగానయినా గ్రుడ్డివానికి ఇది, అది అనెడి రూపభేదము తెలియదో, అట్లు గురూపదేశము లేక తత్త్వజ్ఞానము కలుగదు.  కాబట్టి తత్త్వజ్ఞానము కలుగుట కొఱకు గురువును ఆశ్రయించి వారివలన వేదాంతోపదేశమును పొందవలయును.
సద్గురువు బోధనలను శ్రధ్ధగా విని మననమొనర్చుకుని, వాటిని అమలులో పెట్టినపుడే ఆ సద్గురువు బోధలకు సార్ధకత ఉండును.
గురుబోధ ద్వారానే ఆత్మజ్ఞానమందుతుంది.  అనగా స్వయం కృషితో ఆత్మజ్ఞానం లభించేది కాదు.
ఆధ్యాత్మిక విద్యలో శిష్యునిలో తెలుసుకోవాలనే ఆసక్తే గురువుకు సమర్పించుకునే గురుదక్షిణ.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

No comments:

Post a Comment