Monday, June 1, 2020

నందారామ్ మార్వాడీ

      Shop Online Original Paintings of Shirdi Saibaba in India at Best ...
               Love Gift Three Rose Png Collection - Single Red Rose Hd ...
01.06.2020  సోమవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు


నందారామ్ మార్వాడీ


ఈ రోజు మరొక సాయి భక్తుడయిన శ్రీ నందారామ్ మార్వాడీ సక్లేచా (నందు మార్వాడీ) గురించి తెలుసుకుందాము.
ఈ సమాచారం shirdisaitrust.org చెన్నై వారి నుండి గ్రహింపబడినది.
తెలుగు అనువాదమ్ ః  ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
    Blessed Ones | Nandaram Marwadi
నందారామ్ బాగా ధనికుడు, పెద్ద భూస్వామి.  ఆయన వడ్డీవ్యాపారం చేసేవారు.  అంత పెద్ద ధనవంతుడయినా ఆయన చాలా దయార్ద్ర హృదయుడు, మర్యాదస్తుడు.  ఆయన తాతగారు రాజస్థాన్ లోని ఖరాడే గ్రామంనుంఛి వచ్చి షిరిడీలో స్థిరపడ్డారు.  నందారామ్ 1866 సం. లో జన్మించారు.  షిరిడీలోనే పెరిగి పద్దవాడయ్యారు.  1875 వ.సంవత్సరంలో ఆయనకి బాబాతో సాన్నిహిత్యం ఏర్పడింది.  బాబా అంటే  ఆయనకు విపరీతమయిన భక్తి.  నిజం చెప్పాలంటే ఆయన ఎక్కువ సమయం బాబాతోనే గడిపేవారు.


బాబా భిక్ష అడిగిన అయిదిండ్లలో నందారామ్ ఇల్లు కూడా ఉంది.  నందారామ్ ఇల్లు ద్వారకామాయికి దగ్గరలోనే ఎదురుగా ఉన్నప్పటికి బాబా ఆయన ఇంటికి భిక్షకి ఆఖరున వెళ్ళేవారు.  బాబాకు వారి కుటుంబం మీద ఎంతగానో ప్రేమాభిమానాలున్నాయి.  బాబా ఆయన ఇంటికి భిక్షకు వెళ్ళినపుడు నందారామ్ భార్య రాధాబాయిని పిలిచేవారు. 
           Sai Wallpaper: Blessed Houses that Saibaba took Bhiksha

 ఆమె సరిగా మాట్లాడలేకపోయేది.  (బహుశ నత్తి అయిఉండవచ్చు).  బాబా ఆయన ఇంటిముందు నిలబడి, ఓ! భోపాదిబాయి భిక్ష తీసుకొని రా" అనేవారు.  ఆమె భిక్ష తీసుకురావడం ఆలశ్యమయితే బాబా ఆమె మీద తిట్ల వర్షం కురిపించి ద్వారకామాయికి తిరిగివచ్చేవారు.  ఒక్కొక్కసారి బాబా ఆమెను బొబ్బట్లు చేసి పూర్తి భోజనం పెట్టమని అడిగేవారు.  అన్ని పదార్ధాలను తయారుచేసిన తరువాత అన్నిటిని ఒక పళ్ళెంలో పెట్టి ద్వారకామాయికి తీసుకొని వచ్చేది.  బాబా చాలా కొద్దిగా రుచిచూసి మిగిలినవన్నీ పంచిపెట్టెసేవారు.

రాధాబాయికి బాబా మీద ఎంతో భక్తి.  బాబా తిట్టె తిట్లను ఆయన అంతర్గతంగా తనకు ప్రసాదించే ఆశీర్వాదాలని ఆమెకు తెలుసు.  ప్రతి దీపావళి పందుగకి ఆమె 5 గజాల నూలు వస్త్రాన్ని కొని బాబాకు కఫనీ కుట్టి ఆయనకు సమర్పించేది.  బాబా ఆమె ఇచ్చిన కఫనీని ఎంతో సంతోషంతో వెంటనే ధరించేవారు.

1911 వ.సంవత్సరంలో షిరిడీలో ప్లేగువ్యాధి ప్రబలి గ్రామస్థులందరికీ సోకింది. నందారామ్ కొంతమంది గ్రామస్థులను కలుసుకున్నపుడు ఆయన ఎఱ్ఱపడిన కళ్ళు చూసి, ఆయనకు కాస్త జ్వరం తగిలినట్లుగాను గమనించి అది ప్లేగువ్యాధి యొక్క మొదటి లక్షాణాలు అని చెప్పారు.  ఆమాటలు వినగానే ఆయన బాగా భయపడిపోయి గుఱ్ఱంమీద స్వారి చేసుకుంటూ వెంటనే బాబా దగ్గరకి చేరుకొన్నాడు.  తన స్వగ్రామమయిన ఎక్రుకాకు వెళ్ళడానికి బాబా అనుమతి కోరాడు.  బాబా ఆయనను వెళ్ళవద్దని వారించారు.  నీకేమీ భయంలేదు.  నువ్వు చావవు అని అభయమిచ్చారు.  "నేను మరణించేవరకు నేను నిన్ను చావనివ్వను" అని ఆయనకు ధైర్యం చెప్పి ఊదీనిచ్చారు.  బాబా ఇచ్చిన ఊదీ ప్రభావంతో నందారామ్ మార్వాడీ కోలుకొన్నారు.

మరొక సందర్భంలో గ్రామంలో భయంకరమయిన వ్యాధి ప్రబలింది.  గ్రామస్థులందరూ ఆవ్యాధితో బాధపడసాగారు.  ఆవ్యాధి సోకినవారు పంచదార తీసుకోకూడదంటారు.  పంచదార తిన్నవారికి జబ్బు ముదిరిపోయి కొంతమంది చనిపోవడం కూడా జరిగింది.  అందువల్లనే ఆవ్యాధి వచ్చినవారు పంచదార తినకూడదని నమ్మేవారు.  నందారామ్ గారికి కూడా ఆవ్యాధి సోకింది.  ఆవ్యాధి మొదటి లక్షణాలు కనిపించగానే ఆయన వెంటనే ద్వారకామాయికి వెళ్ళి బాబా పాదాలమీద పడి శరణువేడారు.  బాబా తన కఫనీ జేబులోనుండి పంచదార పొట్లం తీసి ఆయనకిచ్చారు.  నందారామ్ కి బాబా మీద అమితమయిన భక్తి నమ్మకం ఉన్నాయి.  బాబా ఇచ్చిన వెంటనే సందేహించకుండా నందారామ్ ఆపంచదారను నోటిలో వేసుకున్నారు.  ఆయనకి వచ్చిన వ్యాధి తగ్గిపోయింది.

నందారామ్ నాయనమ్మ గారి కుటుంబంలో మగపిల్లలందరూ పసితనంలోనే మరణించారు.  అప్పుడు ఆమె బాబా దగ్గరకు వచ్చి తన కుటుంబం యొక్క యోగక్షేమాలను చూస్తూ తమందరినీ కాపాడమని వేడుకొంది.  బాబా ఆమెకు మూడు మామిడిపండ్లను ఇచ్చారు.  ఆమెకు ముగ్గురు మగపిల్లలు జన్మించారు.  ఈ ఆమ్రలీల తరువాత ఆమెకు పుట్టిన మగపిల్లలందరూ బ్రతికారు.

నందారామ్ చేసిన మంచిపని ఒకటుంది.  బూటీవాడాకు, ద్వారకామాయికి మధ్య ఉన్న తన స్థలాన్ని బాబా కోసం దానం చేసారు.  ఈవ్యవహారం దామూ అన్నా ద్వారా నిర్వహించబడింది.  దానివల్ల సమాధి మందిరం మరికాస్త విశాలంగా తయారయింది.  మనం ఏదయినా ఇతరులనుంచి తీసుకునేదానికన్నా, ఇతరులకు మన దానం చేయడమే ఉత్తమోత్తమమని నందారాం గారి ప్రగాఢ నమ్మకం.  ఆయన మారుతి, గణేష దేవాలయాలను బాగుచేయించి, రాళ్ళు పరిపించారు.

ఆయన 1946 అక్టోబరు, 13 న మరణించారు.  ఆయన చేసిన ఉపకారాలు, సంక్షేమ కార్యక్రామాలను ఆయన వారసులు కొనసాగిస్తున్నారు..
(నందారామ్ గారి మనుమడు శ్రీ దిలీప్ సక్లేచా రచయితగారికి చెప్పిన విషయాలు)
(Source, Ambrosia in Shiridi & Baba"s Gurukul by Sai bhakta Vinny Chitluri)  

(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)

No comments:

Post a Comment