Tuesday, April 23, 2024

సాయి అనుగ్రహం అపారమ్ – 6 వ.భాగమ్

 




23.04.2024 మంగళవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బందువులకు బాబావారి శుభాశీస్సులు

 శ్రీ సాయిలీల ద్వైమాస పత్రిక నవంబరు, డిసెంబరు 2023 సంచికనుండి గ్రహింపబడినది.

ఆంగ్ల మూలం :  డా.క్షితిజ రాణే

తెలుగు అనువాదం ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్

ఫోన్. 9440375411,  8143626744


సాయి అనుగ్రహం అపారమ్ – 6 వ.భాగమ్

1974 నుండి 30.10.1977  మధ్య కాలంలో భావు మహరాజ్ వణిలోని సప్తశృంగి పర్వతం వద్ద ఒక భక్తుని (శ్రీ బాలా సాహెబ్ దేశ్ పాండే) గృహంలో తీవ్రమయిన సాధన చేశారు.  ఆ తర్వాత భక్తుల ఆధ్యాత్మిక ఉధ్ధరణే లక్ష్యంగా తిరిగి ప్రజలలోకి వచ్చారు.  ఆత్మ సాక్షాత్కారమనె పరమ సత్యాన్ని గురించిన అజ్ణానపు సంకెళ్లనుంచి భక్తులను విముక్తులను చేసారు.


84 లక్షల జీవరాశులలో వివిధ జన్మలు ఎత్తిన తరువాత ఎంతో పుణ్యం చేసుకున్న కారణంగా అత్యుత్తమమయిన మానవజన్మ లభిస్తుంది.  మానవ జన్మయొక్క ముఖ్యమయిన విశేషం ఏమిటంటే జ్ణానాన్ని సంపాదించగలిగే శక్తి లభించడం.  ఆ జ్ణానం వల్లనే మానవుడు అస్థిరమయిన, శాశ్వతమయినవాటి మధ్య గల భేదాన్ని తెలుసుకోగలుగుతాడు.  ఉన్నతమయిన లక్ష్యం ఆధ్యాత్మిక గురువుయొక్క మార్గదర్శకత్వం మరియు అనుగ్రహంతో మాత్రమే సాధించబడుతుంది.


1977  నుండి 1980 వరకు బొంబాయి లోని కళ్యాణ్ ప్రాంతమే కాకుండా ఖాందేష్ లో కూడా త్వరలోనే భావు మహరాజ్ కు శిష్యులు అధిక సంఖ్యలో పెరగసాగారు.  ఖాందేష్ ప్రాంతంలో ఉన్న శిష్యులను కలుసుకోవాలని మనసుకు బాగా తోచినపుడు భావుమహరాజ్ అప్పటికప్పుడే ఏ వాహనం దొరికితే దాని మీద ప్రయాణం చేస్తూ వెళ్ళేవారు.  ఆయన శిష్యులు తమ ప్రియతమ సద్గురుని కలుసుకోవాలని ఎంతగానో అభిలషిస్తూ ఉండేవారు.  భావూ మహరాజ్ కూడా సాధ్యా సాధ్యాలను, సుఖం లేదా అసౌకర్యాలను కూడా ఆలోచించకుండా తనను ఆర్తితో కలవాలనుకునే తన ప్రియ భక్తుల వద్దకు చేరుకునేవారు.

ఆయన ప్రాభవం ఖాందేష్ చుట్టు ప్రక్కల ఉన్న ప్రాంతాలయిన తారాబాద్, సతానా, పింపల్నేర్, సక్రీ, ధూలే, షాహద్, ప్రకాష్, నందుర్ బార్, అమల్నేర్, ఇండోర్ లలో రోజురోజుకీ పెరగసాగింది.

1981 వ.సం.లో భావూ మహరాజ్ కసారీ గ్రామానికి వెళ్లారు.  ఆ గ్రామంలో ఆర్ధిక సమస్యలతో బాగా చితికి పోయి నిరాశతో ఉన్న శ్రీ కేడూ బాపూవని అనే వ్యక్తి భావు మహరాజ్ ని కలుసుకోవాలని వచ్చాడు.  ఆ సమయంలో భావు మహరాజ్ చూట్టూ 60, 70 మంది గ్రామ పెద్దలు గుమిగూడి ఉన్నారు.  ఆయన వారందరి ప్రాపంచిక సమస్యలు, ఆధ్యాత్మిక సమస్యలు గురించి చర్చిస్తూ వాటిని పరిష్కరించే పనిలో నిమగ్నమయి ఉన్నారు.  కేడూ బాపూ ఎక్కడో దూరంగా ఒక మూలన నుంచుని ఉన్నాడు అతను తన మనసులో ఈ మహాత్ముని వదనం తేజోవంతంగా వెలుగుతూ గొప్ప జ్ణానిలా కనిపిస్తున్నాడు. నాకు ఉన్న తొమ్మిది లక్షల రూపాయల అప్పు వల్ల ఏర్పడిన ఆర్ధిక సమస్య తీరడానికి ఈయన తప్పకుండా మార్గం చూపించగలడు. అని ఆలోచనలతో నుంచుని ఉన్నాడు.

(తొమ్మిది లక్షల రూపాయల అప్పు తీరే  మార్గం వివరాలు తరువాతి సంచికలో)

(ఇంకా ఉంది)

(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)


 


No comments:

Post a Comment