Friday, May 22, 2020

శ్రీ చంద్రభాన్ సేఠ్ వారసులతో ముఖాముఖి – 1 వ.భాగం

   A Couple of Sai Baba Experiences - Part 977 | Sai baba, Sai baba ...
               Rose PNG HD Transparent Rose HD.PNG Images. | PlusPNG
22.05.2020 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫోన్ : 9440375411 & 8143626744

బాబా రహతా లోని శ్రీ చంద్రబాన్ సేఠ్ గారి ఇంటికి తరచుగా వెడుతూ ఉండేవారన్న విషయం శ్రీ సాయి సత్ చరిత్ర పారాయణ చేసిన మనకందరికి తెలుసు.  కొన్ని సంవత్సరాల క్రితం సాయిపధం మాసపత్రిక వారు రహతా వెళ్ళి శ్రీ చంద్రబాను సేఠ్ గారి వారసులతో ముఖాముఖీ గా మాట్లాడి, బాబా గురించి కొన్ని ఆసక్తికరమయిన విషయాలను సేకరించారు.  ఇవి మనకు శ్రీ సాయి సత్ చరిత్రలో కనపడవు.  సంభాషణలను shirdisaitrust.org – Chennai వారి నుండి గ్రహింపబడినది.
శ్రీ చంద్రబాను సేఠ్ గారి మనుమడు శ్రీ జయచంద్ర సేఠ్, ఆయన మునిమనుమడు శ్రీ సురేంద్ర సేఠ్ లతో సాయిపధమ్ వారు ప్రత్యక్షంగా మాట్లాడి బాబా గురించి వెల్లడించిన విషయాలను రోజు మీకు అందిస్తున్నాను.  వారి సంభాషంతా మరాఠీలోను, ఆంగ్లంలోను జరిగింది.

శ్రీ చంద్రభాన్ సేఠ్ వారసులతో ముఖాముఖి – 1 .భాగం

సాయి పధం వారి ప్రశ్నమేము సాయిపధం పత్రికనుండి మీతో మాట్లాడాలని వచ్చాము.  శ్రీ సాయిబాబా వారి దివ్య చరణాల స్పర్శతో పునీతమయిన మీగృహానికి రావడం మాకు చాలా సంతోషాన్ని కలిస్తోంది.  మీనుంచి బాబాకు సంబంధించిన వివరాలను సేకరించడానికి వచ్చాము.  బాబాతో మీకు కలిగిన అనుభవాలను, వాటి వివరాలను చెప్పగలరా?
     

 AN INTERVIEW WITH THE HEIRS OF CHANDRABHAN SETH – SAI GURU TRUST ...

జయచంద్ర సేఠ్ -  మీరు వచ్చినందుకు చాలా సంతోషమండి.  నాకు గుర్తున్నంతవరకు రోజుల్లో జరిగిన విషయాలన్ని మీకు వివరంగా చెబుతాను.  శ్రీసాయి సత్ చరిత్రలో లేని మరికొన్ని విషయాలను మీకు వివరిస్తున్నందుకు, ఇవన్నీ కూడా మీపత్రిక ద్వారా వెలుగు చూస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది.
     Kushal Chand
         (కుశాల్ చంద్)
సా.. ప్రశ్న  -  బాబాగారు షిరిడీ గ్రామంనుండి నీమ్ గావ్ కి, రహతాకి తప్ప మరెక్కడికీ వెళ్లలేదన్న విషయం శ్రీసాయి సత్ చరిత్రలో చెప్పబడింది కదాఆయన నీమ్ గావ్ లో శ్రీ డెంగ్లే గారి ఇంటికి, రహతాలోని కుశాల్ చంద్ గారి ఇంటికి మాత్రమే వెళ్ళారనే విషయం కూడా ప్రస్తావించబడింది.  రహతాలో ఇంటికే బాబా వచ్చారనే విషయం నిజమేనా?

.చంద్ర సేఠ్అది నిజమే.  బాబా మాయింటికి వచ్చిన రోజులనుండి మేము ఇంటికి ఎటువంటి మార్పులు చేయలేదు.  ఎలక్ట్రికల్ వైరింగ్, ఇంటికి రంగులు వేయించడం తప్పించి ఇక ఎటువంటి మార్పులు చేయలేదు.

సా..ప్రశ్నబాబా గారు ఇంటికి సుమారుగా ఎన్నిసార్లు వచ్చారో చెప్పగలరా?

.చంద్ర సేఠ్బాబా మహాసమాధి చెందే వరకు తరచు ఇక్కడికి వస్తూ ఉండేవారు.  ఒకవేళ వారంపాటు కుశాల్ చంద్ గారు షిరిడీ వెళ్ళకపోతేకుశాల్ చంద్ ఎందుకని రాలేదు? తాత్యా ! గుఱ్ఱం బండి సిధ్ధం చెయ్యి.  నేను కుశాల్ చంద్ ఇంటికి వెళ్ళి ఆయనను చూడాలిఅనేవారు.  తాత్యా గుఱ్ఱం బండి సిధ్ధం చేయగానే బాబా ఆబండిలో వచ్చేవారు.  ఒక్కోసారి బండి సిధ్ధమయ్యేవరకు ఆగలేక, కాలినడకనే రహతాకు వస్తూ ఉండేవారు.  రోజుల్లో మాతోటలు గ్రామసరిహద్దుల వరకు విస్తరించి ఉండేవి.  మా తోటమాలి బాబా త్వరలోనే రాబోతున్నారనే విషయం పెరిగెత్తుకుంటు వచ్చి మాకు చెప్పేవాడు.  మాతాతగారు ఇంకా మరికొందరు తొందర తొందరగా గ్రామ సరిహద్దులవరకు వెళ్ళి బాబాను మేళతాళాలతో ఆహ్వానిస్తూ వైభవంగా గౌరవ మర్యాదలతో మా ఇంటికి తీసుకొని వచ్చేవారు.

సా..ప్రశ్నబాబా మీ ఇంటికి తప్ప మరెవరి ఇంటికీ వెళ్లలేదంటే దానికి కారణం బాబాకు మీకు ఉన్న ఋణానుబంధందీనికి మీరేమంటారు? ( బంధం ఎన్నో జన్మలవరకు కొనసాగింది)

.చంద్ర సేఠ్మీరు చెప్పినది నిజమే.  బాబాకు మాకు మధ్య గొప్ప ఋణానుబంధం ఉండి ఉండవచ్చు.  ఆబంధం ఇంకా కొనసాగుతూ ఉందనే విషయాన్ని నేను పూర్తి నమ్మకంతో చెప్పగలను.  కాని బంధం అనేది ఎలా ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది అన్న విషయం మాత్రం ఎప్పటికి చెప్పలేము.  జవహర్ అలీ అనే ఒక ఔలియా అహ్మద్ నగర్ లో ఉన్న మా ఎస్టేట్ లోని వాడియా పార్కులో ఉండేవాడని మానాన్నగారు అమలోక్ చంద్ సేఠ్ చెబుతూ ఉండేవారు.  బాబా ఆయనతో కలిసి అహ్మద్ నగర్ కు వచ్చారు.  అక్కడినుండి రహతాకు వెళ్ళారు.  ఆతరువాత బాబా షిరిడీకి వెళ్ళి అక్కడే నివాసమున్నారు.
          Kushal Chand
సాయ్..ప్రశ్న -  బాబా మొట్టమొదట అహ్మద్ నగర్ కి వచ్చి అక్కడినుండి రహతాకు, చివరికి షిరిడీకి వెళ్ళారని మీరు భావిస్తున్నారా?

.చంద్ర సేఠ్మా నాన్నగారు మాకు చెబుతూ ఉండే విషయమే మీకు చెబుతున్నాను అంతే.  అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు.  బాబా అహ్మద్ నగర్ లో జవహర్ ఆలీతో కలిసి ఉండటం మా కజిన్ దౌలత్ రామ్ చూసాడనే విషయం మానాన్నగారు చాలా సార్లు చెప్పారు.
             Kushal Chand
సా..ప్రశ్నఅహ్మద్ నగర్ రహతేకర్ వాడాలో ఉన్న మీ ఇంటిలో జవహర్ ఆలీ ఫొటో ఉందని విన్నాము?

.చంద్ర.సేఠ్అవును నిజమే.  అక్కడ మాకు ఒక స్పిన్నింగ్ మిల్లు ఉండేది.  ఇపుడది మా ఆధీనంలో లేదు.  చాలా సంవత్సరాల క్రితమే మేము దానిని అమ్మేశాము.  కాని జవహర్ ఆలీ ఫోటో మాత్రం మాదగ్గరే ఉండేది.  ఆతరువాత సాయిబాబా  భక్తుడు మా ఇంటికి వచ్చి, ఫొటో కాపీ తీసుకుని తిరిగి ఇస్తానని ఎంతో నమ్మకంగా చెప్పి పట్టుకుని వెళ్ళాడు.  కాని తిరిగి ఇవ్వలేదు.  మేము ఆఫోటో ఎక్కడుందో దాని జాడ తెలుసుకొని సంపాదించే ప్రయత్నం చేస్తున్నాము.

సా..ప్రశ్నశ్రీ సాయి శరణానంద గారు తాను బాబాతో, బాపూ సాహెబ్ జోగ్, శ్రీమతి జోగ్ లతో కలిసి మీఇంటికి వచ్చినట్లుగా ఆయన తన ఆత్మ కధలో రాసుకున్నారు నిజమేనా?

.చంద్ర.సేఠ్నిజమే.  ఆరోజుల్లో బాబాతో కూడా చాలామంది భక్తులు మా ఇంటికి వస్తూ ఉండేవారు.  కుశాల్ చంద్ తో బాబాయొక్క ఆత్మీయత ఎంత గొప్పదంటే, బాబా ఒకసారికుశాల్, నేనూ నీతోపాటే ఇక్కడె నీ ఇంటిలోఉంటాను.  నేనిక్కడ ఉండటానికి ొఒక గది ఏర్పాటు చెయ్యి”.  బాబా మాటలకు కుశాల్ చంద్ ఉబ్బితబ్బిబ్బయి ఎంతగానో సంతోషించారు.  అప్పటికప్పుడే బాబాగారు ఉండటానికి తగిన గది ఏర్పాటు చేసారు కాని బాబా షిరిడీలోనే ఉండిపోయారు.

సా..ప్రశ్నఒకసారి బాబా, దీక్షిత్, జోగ్ లతో కలిసి మీఇంటికి వచ్చినపుడు బాబా రాకలోని ముఖ్య ఉద్దేశ్యం, తన భక్తుడయిన నార్వేకర్ కోసం డబ్బు అప్పుగా  తీసుకుందామని. ఆ విషయం శ్రీ సాయి శరణానందగారు తన ఆత్మకధలో రాసారు.  దీనిని బట్టి బాబా మీతాతగారి వద్దనుంచి డబ్బు అప్పు తీసుకుంటూ ఉండేవారని తెలుస్తూ ఉంది.  అది నిజమేనా?  మీ తాతగారు బాబాకు డబ్బు అప్పుగా ఇస్తూ ఉండేవారా?

.చంద్ర సేఠ్నార్వేకర్ అప్పు గురించి నాకు తెలియదు.  ఒకవేళ అది నిజమే అయి ఉండవచ్చు.  ఒకసారి బాబా కుశాల్ చంద్ గారిని పిలిచి కాకాసాహెబ్ దీక్షిత్ కి రూ.500/- అప్పు ఇమ్మని చెప్పారు.  మాతాతగారు బాబా మాటని ఆజ్ఞగా భావించి అప్పు ఇచ్చారు.  ఇపుడు బొంబాయి దగ్గర జుహూలో నివాసముంటున్న కాకా సాహెబ్ దీక్షిత్ గారి మనుమరాలు మాకీవిషయం తెలియచేసింది.  కాని మాకుటుంబంలోని మాపెద్దలు చెప్పినదాని ప్రకారం బాబా తన కోసం ఎప్పుడూ ఏమీ అడగలేదని.  ఏదయినా ఆయనకి అవసరం ఏముంటుంది?  ఆయన మాఇంటికి ఎప్పుడు వచ్చినా మా ఇంటిలోని ఆడవారు ఏదయినా తినమని బాబాను బ్రతిమాలుతూ ఉండేవారు.  ఆవిధంగా పట్టువదలకుండా బ్రతిమాలుతూ పదే పదే ప్రాధేయపడుతూ ఉండేసరికి చివరికి బాబా మెత్తబడి సరే కాసిని పాలు, రొట్టె ఇవ్వమ్మా చాలు అని చెప్పేవారు.  తరువాత ఆయన వాటిని కూడా కాస్తంత రుచి చూసేవారు.  మాయింటిలో ఆరగించడనికి ఎన్నో పదార్ధాలు పుష్కలంగా  ఉండేవి.  కాని బాబా పాలు, రొట్టె తప్ప అంతకు మించి మరేమీ అడిగేవారు కాదు.  వాటిని కూడా చాలా స్వల్పంగా స్వీకరించేవారు.
(ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)




2 comments: