Friday, May 8, 2020

శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన సందేహాలు - బాబా సమాధానాలు – 8 (2)

ORIGINAL PHOTOS OF SAI-N BABA FROM SHIRDI - Vasant Londhe - Medium
       Transparent Yellow Rose Clipart - Painted Images Of Yellow Roses ...

08.05.2020  శుక్రవారమ్
శ్రీ సాయి సత్ చరిత్ర సందేహాలుబాబా సమాధానలు – 8 (1) సాయిభక్తుల స్పందన.
శ్రీమతి సుమలలిత, అట్లాంటా, (అమెరికా)..  చాలా బాగుంది.
శ్రీమతి కృష్ణవేణి, చెన్నై, ..బాబాగారు 5 ఇండ్లలో భిక్ష తీసుకునే విధానం చూస్తుంటే బ్రహ్మగారు నారదమునీంద్రులవారికి చెప్పినట్టుగా ఒక యోగి ఎలా ప్రవర్తించాలో బాబా వాటిని పాటించారని అర్ధమవుతుంది.  బాబాగారు మీకు పెట్టిన పరీక్షలో నెగ్గి మంచి విషయాన్ని సేకరించారు.  బాబా గారు చిన్న విషయం ద్వారా ఎన్నో విషయాలు తెలియచేస్తున్నారు.  ప్రతి చిన్నవిషయాన్ని కూడా అందరికీ తెలియ చేయ్యాలన్న తాపత్రయం బాబాగారి పరీక్షలో నెగ్గేలా చేసింది.  మనం నెగ్గితే సంతోషపడేది వారే కదండి.  అంతా వారి దయ.  మీద్వారా ఎన్నో విషయాలు తెలియ చేస్తున్నారు మాకందరికీ.
( సమాధానం.  బాబా గారు బోధచేసే విధానం చాలా చమత్కారంగాను, నిగూఢంగాను ఉంటాయి.  తను చెప్పినవాటిని భక్తులు తమంతతామే శోధించి, అర్ధం చేసుకొని వాస్తవాన్ని గ్రహించుకునేలా తయారుచేస్తారు బాబా... త్యాగరాజు)

శ్రీమతి కాంతి, మణికొండ, హైదరాబాద్ఈ రోజు బాబా పారాయణ చేసాను.  నా స్నేహితురాలు లలితా సహస్రం చదవమంది, కానీ లాక్ డౌన్ వల్ల పనులు అయ్యేసరికి ఆలశ్యమయింది.  శ్రధ్ధగా చెయ్యలేను,  ఒకటే నమస్కారం అన్నాను నా స్నేహితురాలితో.  ఇవాళ కరెక్ట్ గా మీ బ్లాగ్ లో మూడో అధ్యాయంలో మాటలు.."నేనే జగన్మాతను, త్రిగుణముల సామరస్యం నేనే".  అమ్మవారికి ఆయనకి భేదం లేదని బాబా చెప్పినట్టు అనిపించింది.  సర్వదేవ నమస్కారం కేశవ ప్రతి గచ్చతి అన్నట్టు మళ్ళి శ్రధ్ధగా బాబా పారాయణ చెయ్యాలి అనిపిస్తోంది ఈ సందేహాలు చదివి.

శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన సందేహాలు -  
బాబా సమాధానాలు – 8 (2)

బ్రహ్మ నారదునితో

ఎవరిఇంటినుంచయితే భిక్షను స్వీకరించడానికి తగిన అర్హత ఉన్నదో ఆయింటిలో వంట అంతా పూర్తయి  అందరి భోజనములు పూర్తయిన తరువాత మాత్రమే భిక్షను స్వీకరించాలి. తలుపులు మూసి ఉన్న ఇంటినుండి భిక్షను స్వీకరించరాదు.  తలుపు కాస్త ఓరగా వేసిఉన్న ఇంటినుండి మాత్రమే భిక్షను స్వీకరించాలి.  యోగి ఎటువంటి వాదవివాదముల జోలికి పోరాదు.  యోగికి శిష్యులు ఎవరూ ఉండరు. 


(శ్రీసాయి సత్ చరిత్ర అ.7 సన్యాసులు, సాధకులు, ముముక్షువులు తదిరతులనేకమంది సాయిబాబా వద్దకు వచ్చెడివారు.  బాబా వారితో కలసి నవ్వుచూ, సంభాషించుచూ సంచరించుచున్నప్పటికీ వారి నాలుకపైఅల్లా మాలిక్యను మాట ఎప్పుడూ నాట్యమాడుచుండెడిది.  వారికి వాదవివాదములు గాని, చర్చలు గాని ఇష్టము లేదు. అప్పుడప్పుడు కోపము వహించినప్పటికీ వారెల్లప్పుడు శాంతముగాను, సంయమముతోను యుండెడివారు.  ఎల్లప్పుడు పరిపూర్ణ వేదాంతతత్త్వమును బోధించుచుండెడివారు.)
       Devidas recognised Sai Baba of Shirdi as a Divine Soul
(శ్రీ సాయి సత్ చరిత్ర అ.16 -17 లౌకికవిషయములందు మగ్నులైన జనులకు, ఈ ప్రపంచములో నెట్లు ప్రవర్తించవలయునో బోధించెడువారు.  ఆత్మ సాక్షాత్కారము పొందిన పిమ్మట కూడ ప్రజల క్షేమమునకై పాటుపడు సాధువులు, యోగులు మిక్కిలి యరుదు.  అట్టివారిలో శ్రీసాయిబాబా ప్రధమగణ్యులు)

బ్రహ్మ నారదునితో….
యోగి ఎటువంటి గ్రంధములను అధ్యయనం చేయడు.  యోగి ఎటువంటి ఉపన్యాసములను ఇవ్వడు. ఎల్లప్పుడు ఏకాగ్ర చిత్తంతో బ్రహ్మజ్ఞానంలో మునిగి ఉంటాడు. యోగి అయినవాడు, తన మనస్సుని, మాటలని, శరీరాన్ని తన స్వాధీనంలో ఉంచుకుంటాడు. అహంకార రహితుడై ఉంటాడు. ఎటువంటి ఆకర్షణలకు లోనుకాకుండా బ్రహ్మానందములోనే మునిగిఉంటాడు. ఏభగవంతుడిని పూజించడు. తనలోనే భగవంతుడు ఉన్నాడనే భావంతో ఆత్మానుసంధానంలోనే ఆనందిస్తూ ఉంటాడు.   ఏజీవికి ప్రాణ హాని కలిగించడు. వృక్షములకు కూడా హాని కలిగించడు.   మంత్ర తంత్రాలనేమీ అభ్యసించడు.
       rare photos of shirdi sai baba - साईं बाबा की ऐसी 12 ...

(శ్రీ సాయి సత్ చరిత్ర అ.18 – 19 బాబా అన్నమాటలుఓ తల్లీ, నా గురువు నాకు మంత్రమేమియు నుపదేశించలేదు.  అటువంటపుడు నేను నీ చెవిలో మంత్రమెట్లు ఊదగలను? మంత్రముగాని, యుపదేశము గాని ఎవ్వరివద్దనుండి గాని పొందుటకు ప్రయత్నించకుము.)

బ్రహ్మ నారదునితో.
ప్రాపంచిక విషయాలందు ఆసక్తి లేకుండా అన్నిటికీ అతీతంగా ఉంటాడు.  అంతర్ముఖ ధ్యానంలో రమిస్తూ ఉంటాడు.  యోగి ఎదుటివారు తనను  స్తుతించినా, లేక బాధించినా వాటిని ఏవిధంగాను లక్ష్యపెట్టడు.

(శ్రీ సాయి సత్ చరిత్ర అ.35 అన్నీ బాబాయే చేయుచున్ననూ దేనియందభిమానముంచలేదు.  ఎవరయినను నమస్కరించినను నమస్కరించకపోయినను, దక్షిణ యిచ్చినను, ఈయకున్నను తనకందరు సమానమే.  బాబా ఎవరిని అవమానించలేదు.  తనను పూజించినందుకు బాబా గర్వించెడివారు కాదు.  తనను పూజించలేదని విచారించేవారు కాదు.  వారు ద్వంద్వాతీతులు.)

(శ్రీసాయి సత్ చరిత్ర అ.37  చావడి ఉత్సవ సమయమందు భక్తులు  బాబా తలపై కిరీటము పెట్టి అప్పుడప్పుడు దీయుచుండెడివారు.  లేనిచో బాబా దానిని విసరివైచునని వారి భయము. ఉత్సవము   పూర్తయిన పిమ్మట భక్తులు పూలదండలను బాబా మెడలో వేసెడివారు.  వాసన చూచుటకు పువ్వులగుత్తులను చేతికిచ్చేవారు.  బాబా నిర్వ్యామోహము అభిమానరాహిత్యములకవతారమగుటచేత ఆ యలంకరణములను గాని, మరియాదలను గాని లెక్కపెట్టువారు కారు.  భక్తులందుగల యనురాగముచే, వారి సంతుష్టికొరకు వారి ఇష్టానుసారము చేయుటకు ఒప్పుకొనుచుండిరి. శ్రీ సాయి సత్ చరిత్ర అ. 7 సన్మానములన్నచో వారికేమాత్రము ఇష్టము లేదు.  సాయిబాబా నైజమట్టిది

 శ్రీ సాయి సత్ చరిత్ర అ. 11 బాబా తమ ఆసనము కొరకు ఒక గోనెసంచి నుపయోగించెడివారు.  భక్తులు దానిపై చిన్న పరుపువేసి, ఆనుకొనుటకు చిన్న బాలేసును సమకూర్చిరి.  బాబా తన భక్తుల కోరికను మన్నించి, వారి వారి భావాన్ననుసరించి తనను పూజించుటకెట్టి యభ్యంతరము జూపకుండెను.)

(శ్రీ సాయి సత్ చరిత్ర అ.6 రాధాకృష్ణమాయి కృషిచే షిరిడీ యొక సంస్థానముగా రూపొందెను.  వివిధములైన హంగులు, అలంకారములు పెరిగినవి.  అలంకరింపబడిన గుఱ్ఱము, పల్లకి, రధము, పాత్రలు, వెండిసామానులు, బాల్టీలు, వంటపాత్రలు, పటములు, నిలువుటద్దములు మొదలగునవి బహూకరింపబడెను.   ఉత్సవమునకు ఏనుగులు కూడా వచ్చెను.  ఇవన్నియు ఎంత హెచ్చినప్పటికి సాయిబాబా వీనినేమాత్రము లక్ష్యపెట్టక యధాపూర్వము నిరాడంబరులై యుండెడివారు.)
బాబా జీవన విధానం సాధువులకు, మహాత్ములకు తాము ఏవిధంగా జీవితాన్ని గడపాలో దిశానిర్దేశాన్ని బోధిస్తుంది.  బాబా చినిగిన కఫనీ ధరించి  గ్రామంలో కాలినడకనే సంచరించేవారు. 

(శ్రీ సాయి సత్ చరిత్ర అ.5 బాబా ధునిలో అహంకారమును, కోరికలను ఆలోచనలను ఆహుతి చేసిఅల్లాయే యజమానిఅని పలికేవారు.  మసీదులో రెండుగదుల స్థలము మాత్రముండెను.)

(మిగిలిన భాగం రేపటి సంచికలో)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)






No comments:

Post a Comment