Saturday, May 9, 2020

శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన సందేహాలు – బాబా సమాధానాలు – 8 (3)

File:Shirdi Sai Baba sitting.jpg - Wikimedia Commons
         Rose PNG | HD Rose PNG Image Free Download searchpng.com
09.05.2020 శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన సందేహాలు – 
బాబా సమాధానాలు – 8 (3)
    Telugu Blog of Shirdi Sai Baba,read sai leels,devotees experiences ...
ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్
ఫోన్.  9440375411 & 8143626744
మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com
ఈ బ్లాగులోని సమాచారాన్ని ఎవరయినా తమ బ్లాగులోనికి గాని, ఫేస్ బుక్ పేజీలోనికి గాని కాపీ చేసి పేస్ట్ చేసుకోదలచినట్లయితే ముందుగా నాకు తెలియచేయవలసినదిగా మనవి.

సందేహాలు – బాబా సమాధానాలు – 8 (2) సాయిభక్తుల స్పందన
శ్రీమతి కృష్ణవేణి, చెన్నై – ఒక యోగి ఎలా జీవించాలో అన్నిటిని బాబా వారు తను ఆచరించి చూపారు.  భక్తుల మీద ఆయనకు ఎనలేని ప్రేమ.  అలాంటి యోగిరాజు వద్ద మనమ్ వున్నందుకు ఎంతో సంతోషించాలి.  వారు చెప్పిన బాటలో నడిచేందుకు ప్రయత్నమ్ చెయ్యాలి.
శ్రీమతి కాంతి, మణికొండ, హైదరాబాద్ – నాకు ఇందులో ఒక సందేహం, యోగి ఒక ఇంట్లో భిక్ష చేసేటప్పుడు అందరూ తిన్నాకనే భిక్ష తీసుకోవాలి అని రాసారు కానీ అలా చేస్తే ఆ ఇంట్లో వారి ఎంగిలి తిన్నట్టు కదా అది ఆ గృహస్తుకు దోషం ఏమో..ఇవాళ సాయి లీలామృతంలో బాయిజా అమ్మ బాబాకి పెట్టకుండా ఏమీ తినేవారు కాదు అని రాసారు.  దానికి దీనికి సాపత్యం ఎలా అండి… 

ఇందులో గొప్పవిషయం ఒకటి..నాలాంటివాళ్ళు జీవితంలో చదవలేని నారదీయ సూత్రాలు గురించి చక్కగా అరటిపండు వలిచినట్టు చెబుతున్నారు.  ధన్యవాదాలండి.



(శ్రీమతి కాంతి గారి మొదటి సందేహానికి సమాధానమ్ -- మనం భోజనం చేసిన తరువాత భిక్ష వేసినట్లయితే అది ఎంగిలి అవుతుందేమో అనే భావం మనం సృష్టించుకున్నది.  కాని ఉపనిషత్తులలో చెప్పినట్లుగా యింటిలోనివారు భోజనము పూర్తయిన తరువాతనే సన్యాసి గాని, సాధువులు గాని, యోగులు గాని భిక్షస్వీకరించాలని బాబాగారి భిక్షాటనలో వివరించాను. యోగులు భగవంతునికి విధేయసేవకులు.  బాబాగారు కూడా భగవంతునికి విధేయసేవకుడు.  బాబాగారు స్వయంగా అన్నమాటలు  "నేను నాభక్తులకు బానిసను."  బానిస అనేవాడు యజమాని భోజనం చేసినతరవాతనే భోజనం చేయాలి.  బాబాగారు యోగి కనకనె భక్తులు ప్రేమతో ఇచ్చినదానినే తినేవారు.  ఇక్కడ ఉదాహరణగా శ్రీకృష్ణపరమాత్ముడు విదురుడు ఇచ్చినటువంటి అరటిపండు తొక్కలను తిన్నాడు.  పరమశివుడు భక్తకన్నప్ప ఎంగిలి నీటితో అభిషేకము చేసినా స్వీకరించెను.  ఈ విషయములన్నీ కూలంకషముగా చర్చించిన తరువాత నాభావన ఏమిటంటే, భగవంతుడు, యోగి, భక్తుడు ఒక్కరే.
( ఇదే బ్లాగులో రెండు సంవత్సరాల క్రితం   శ్రీమతి కృష్ణవేణి గారికి జరిగిన బాబా లీలను ప్రచురించాను.  ఎంగిలి అన్నదానికి ఉధాహరణగా అధ్బుతమయిన బాబా లీల.  సాయిభక్తులు కోరినట్లయితే తిరిగి ప్రచురిస్తాను.)

మీ రెండవ సందేహానికి సమాధానమ్... బాయిజా బాయిని బాబా మొదటినుండే అమ్మగా భావించాడు.  బాయిజాబాయి బాబాను ఒక భగవంతునిగా భావించింది.  తల్లిగా భావిస్తే మొట్టమొదటగా కొడుకు ఆకలి తీర్చడం తల్లి బాధ్యత.  అలాగే భగవంతునిగా భావించినా కూడా మొట్టమొదటగా భగవంతునికి అర్పించినతర్వాతనే తను భుజించేదనే విషయం మనం గ్రహించుకోవచ్చు.  శ్రీసాయి సత్ చరిత్ర అ.8 ఒకసారి గమనించండి.."ఆమె భక్తి విశ్వాసములు అధ్బుతమైనవి.  ఆ తల్లికొడుకులకు (బాయిజాబాయి, తాత్యా) బాబా సాక్షాత్ భగవంతుడనే విశ్వాసముండెను.)

ఈ రోజుతో బాబాగారి భిక్షాటన పూర్తవుతోంది కాబట్టి రేపు "మేరే సాయి" సీరియల్ మొదటి భాగమ్ మాత్రమే బ్లాగులో పెడుతున్నాను.  అందులో బాబా బాయిజాబాయి ఇద్దరి మధ్యగల అనుబంధం ఎటువంటిదో వీక్షించండి. 42 నిమిషాల వీడియో)

శ్రీ లీలాధర్ - The grace of the Guru is like an ocean. If one comes with a cup he will only get a cupful. It is no use complaining of the niggardliness of the ocean. The bigger the vessel the more one will be able to carry. It is entirely up to him.

Bhagavan


బ్రహ్మ నారదునితో
బ్రహ్మజ్ఞానాన్ని పొందిన యోగి తనలోనున్న ప్రత్యేకమయిన లక్షణాలనేవీ ఇతరులముందు ప్రదర్శింపచేయడు, అలాగే తనలో ఉన్న భావాలనేవీ ఇతరులకు తెలిసేలా ప్రవర్తించడు. 

(శ్రీ సాయి సత్ చరిత్ర అ.37 శ్రీ సాయి జీవితము మిగుల పావనమయినది.  వారి నిత్యకృత్యములు ధన్యములు.  వారి పధ్ధతులు, చర్యలు వర్ణింపనలవికానివి.  కొన్ని సమయములందు వారు బ్రహ్మానందముతో మైమరచెడివారు.  మరికొన్ని సమయములందాత్మజ్ఞానముతో తృప్తి పొందెడివారు.  ఒక్కొక్కప్పుడన్ని పనులను నెరవేర్చుచు ఎట్టి సంబంధము లేనట్లుండెడివారు.  ఒక్కొక్కపుడేమియు చేయనట్లు గన్పించినప్పటికిని వారు సోమరిగా గాని, నిద్రితులుగా గాని, కనిపించెడువారు కారు.  వారు ఎల్లప్పుడు ఆత్మానుసంధానము చేసెడివారు.) 

బ్రహ్మ నారదునితో

యోగి అయినవాడు ప్రజలముందు తానొక పిచ్చివాడిననే ఊహను కల్పిస్తాడు.  ఏపనీ చేయకుండా ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు.
(శ్రీ సాయి సత్ చరిత్ర అ.14 బాబా కాల్చిన అగ్గిపుల్లలను జాగ్రత్త పెట్టుకొని జేబులో వేసుకొనెడివారు. .10 వారి అంతరంగము శాంతికి ఉనికిపట్టయినను, బయటకు చంచల మనస్కునివలె గనిపించుచుండెను. లోపల పరబ్రహ్మస్థితి యందున్నప్పటికిని, బయటకు దయ్యమువలె నటించుచుండెడివారు.  లోపల యద్వైతియైనను బయటకు ప్రపంచమునందు తగుల్కొనినవానివలె కాన్పించుచుండెను.  ఒక్కొక్కపుడందరిని ప్రేమతో చూచెడువారు.  ఇంకొకప్పుడు వారిపై రాళ్ళు విసరుచుండిరి.  ఒక్కొకప్పుడు వారిని తిట్టుచుండిరి.  ఇంకొక్కప్పుడు వారిని ప్రేమతో అక్కునజేర్చుకొని, ఎంతో నెమ్మదితోను శాంతముతోను ఓరిమితోను సంయమముతోను వ్యవహరించెడివారు.
(శ్రీ సాయి సత్ చరిత్ర అ.22 ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘమౌనము పాటించువారు. అది వారియొక్క బ్రహ్మబోధము.  ఇంకొకప్పుడు చైతన్యఘనులుగా నుండువారు)

  శ్రీసాయి సత్ చరిత్రలో నాకు కలిగిన సందేహాలుబాబా సమాధానాలు  1 .భాగం మరొక్కసారి చదవండి)
(శ్రీ సాయి సత్ చరిత్ర అ.4 బాబా మొట్టమొదటలో  పదునారేళ్ళబాలుడుగా షిరిడీలోని వేపచెట్టుక్రింద నవతరించెను.  బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా గాన్పించెను.  ఆ బాలుడు పగలు ఎవరితో కలిసెడివాడు కాదు.  రాత్రియందెవరికి భయపడువాడు కాడు.)
బ్రహ్మ నారదునితో
యోగి అయినవాడు ప్రతిరోజూ స్నానం చేయవలసిన అవసరం లేదు.   సుదీర్ఘమయిన ఉపన్యాసములను ఇవ్వనవసరములేదు.  తాబేలు ఏవిధంగానయితే తన అంగాలను లోపలకు ముడుచుకొంటుందో అదే విధంగా యోగి పంచేంద్రియాలను తన ఆధీనంలో ఉంచుకుంటాడు. 

(శ్రీ సాయి సత్ చరిత్ర అ.10 కామమన్నచో వారు హనుమంతునివలె యస్ఖలిత బ్రహ్మచారులు.  వారికి దేనియందు మమకారము లేకుండెను.  వారు శుధ్ధచైతన్యస్వరూపులు.  వారు విరాగులు, ముక్తులు, పరిపూర్ణులు.)
(శ్రీ సాయి సత్ చరిత్ర అ.7 బాబా ఒక్కొక్కప్పుడు స్నానము చేసేవారు.  మరొక్కప్పుడు స్నానము లేకుండానే ఉండేవారు)
బ్రహ్మ నారదునితో
యోగి ఉపవాసము ఉండనవసరము లేదు.

(శ్రీ సాయి సత్ చరిత్ర అ.32 గోఖలే భార్య, కానిట్ కర్ భార్య శ్రీమతి కాశీబాయి వద్దనుండి దాదా కేల్కరుకు జాబు తీసికొని షిరిడీకి వచ్చెను.  ఆమె బాబా పాదముల వద్ద మూడురోజులు ఉపవసించి కూర్చొను నిశ్చయముతో వచ్చెను.  బాబా అంతకు ముందురోజు కేల్కరుతో తన భక్తులను హోళీపండుగనాడు ఉపవాసము చేయనీయనని చెప్పియుండెను.  వారుపవసించినచో బాబా (తన) యొక్క ఉపయోగమేమనెను.  ఆ మరుసటిదినము ఆమె దాదాకేల్కరుతో పోయి బాబావద్ద కూర్చుండగా బాబా వెంటనే యామెతోఉపవాసము చేయవలసిన యవసరమేమి? దాదా భట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతనికి పిల్లలకు బెట్టి నీవు కూడా తినుముఅనెను.
బ్రహ్మ నారదునితో
అసలయిన యోగి తన పుట్టుక గురించి గాని,  పుట్టిన స్థలం, తల్లిదండ్రులు పేర్లు,  తన కులము, పేరు, గోత్రం, ఇటువంటి విషయాలేమీ లోకానికి వెల్లడించరాదు.

(శ్రీ సాయి సత్ చరిత్ర అ.4.  సాయిబాబా తల్లిదండ్రులను గూర్చిగాని, జన్మము గూర్చి గాని, జన్మస్థానమును గూర్చి గాని, ఎవరికి ఏమియు తెలియదు.  ఎందరో పెక్కుసారులీ విషయములు కనుగొనుటకు ప్రయత్నించిరి.  పలుసార్లీ విషయముగా బాబాను ప్రశ్నించిరి గాని యెట్టి సమాధానము గాని, సమాచారము గాని పొందకుండిరి.)
(శ్రీ సాయి సత్ చరిత్ర అ.38 బాబా బ్రాహ్మణుడని కొందరు, మహమ్మదీయుడని మరికొందరు చెప్పుచుండిరె.  నిజముగా బాబా ఏజాతికి చెందినవారు కారు.  వారెప్పుడు పుట్టిరో, ఏజాతియందు పుట్టిరో, వారి తల్లిదండ్రులెవరో ఎవరికి తెలియదు.)

బ్రహ్మ నారదునితో

ఎవరినుంచయినా బహుమతులను స్వీకరించుట నిషిధ్ధము.  ఇతరులకు ఇమ్మని కూడా చెప్పరాదు.  ఆత్మజ్ఞానంతో ఉన్న యోగి ఎటువంటి అడంబరములను ఆశించడు. పంచేంద్రియాలను స్వాధీనములో ఉన్న యోగి మోక్షమునకు అర్హుడు.
(శ్రీ సాయి సత్ చరిత్ర అ.36 బాబా ఎన్నడు డబ్బు భిక్షమెత్తలేదు సరికదా తమ భక్తులు కూడా భిక్షమెత్తికొనుటకు ఒప్పుకొనలేదు.  వారు ధనమును ప్రమాదకారిగాను. పరమును సాధించుటకడ్డుగాను భావించువారు.  భక్తులు దాని చేతులలో జిక్కకుండ కాపాడెడివారు.  ఈ విషయమున భక్త మహల్సాపతి యొక నిదర్శనము.  ఆయన మిక్కిలి పేదవాడు.  అతనికి భోజనవసతికి కూడా జరుగుబాటు లేకుండెను.  అయినను అతడు ద్రవ్యము సంపాదించుటకు బాబా యనుమతించలేదు.  దక్షిణలోనుండి కూడ ఏమియు ఈయలేదు.  ఒకనాడు ఉదారవర్తకుడైన హంసరాజు అను బాబా భక్తుడొకడు చాలా ద్రవ్యమును బాబా సముఖమున మహల్సాపతికిచ్చెను.  కాని బాబా దానిని పుచ్చుకొనుటకనుమతించలేదు.)
బ్రహ్మ నారదునితో
యోగి లంగోటీని, చిరిగిన వస్త్రాలను ధరిస్తాడు.  చేతిలో దండము ఉంటుంది. 
 ( శ్రీసాయి సత్ చరిత్ర అ.5 బాబా లంగోటి బిగించుకొని, పొడవాటి కఫ్నీని తొడుగుకొని, నెత్తిపైని గుడ్డ కట్టుకొనేవారు.  ఒక గోనె ముక్కపై కూర్చునెడివారు.  చింకి గుడ్డలతో సంతుష్టి చెందెడివారు. . 10 చిన్న చేతికఱ్ఱ (సటకా) యే వారు సదా ధరించెడి దండము)
(ప్రస్తుతానికి సశేషం - మరలా బాబా సమాధానాలు ఇచ్చినపుడు ప్రచురణ)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)




No comments:

Post a Comment