17.06.2020 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన
సందేహాలు –
బాబా
సమాధానాలు – 10 (1)
గురుభక్తి - 1 వ.భాగమ్
ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్
ఫోన్. 9440375411 & 8143626744
మైల్ ఐ.డి.
tyagaraju.a@gmail.com
ఎవరయినా ఈ గురుభక్తిని తమ స్వంత బ్లాగులోనికి ప్రచురింపదలచుకున్నట్లయితే ముందుగా నాకు తెలియచేయవలెను.
10.06.2020
తేదీన బాబాను ధ్యానంలో తరువాత ఏమి ప్రచురించమంటారు? అని అడిగాను.
ఆయన
‘గురుభక్తి’ గురించి వ్రాయమని సూచన చేసారు. ఆయన చెప్పినట్లుగా ముందుగా ‘గురుగీత” ను చదివి అందులోని విషయాలను పొందు పరుస్తున్నాను.
4 సంవత్సరాల
క్రితం లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి. నింబాల్కర్ గారి “Sri Saibaba’s Teachings and
Philosophy” తెలుగులోకి
అనువాదం చేసి “శ్రీ సాయిబాబావారి బోధనలు మరియు
తత్త్వం” పేరుతో ఇదే బ్లాగులో ప్రచురించాను.
అందులో
గురుభక్తి గురించి నాలుగు భాగాలుగా ప్రచురించాను.
సాయిభక్తుల
కోసం వాటిని కూడా మరలా ప్రచురిస్తాను.
ఈ రోజు నుండి గురుభక్తి గురించి ప్రచురిస్తున్నాను.
ఇందులో
శిష్యుడయిన వాడు గురువుకు ఏవిధంగా సేవ చేయాలి ఎలా సేవించాలి అన్న విషయాలను మనం గ్రహించుకుని ఆవిధంగా మన సద్గురువయిన బాబాను సేవించుకోవాలి.
గురువుయొక్క ఆవశ్యకత - శ్రీ సాయి సత్ చరిత్ర అ.
16 – 17 ఆత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మము గూఢమునైనది. ఎవరైనను తమ స్వశక్తిచే దానిని పొందుటకాశించలేరు. కనుక ఆత్మసాక్షాత్కారము పొందిన ఇంకొకరి
(గురువు) సహాయము మిక్కిలి యవసరము. గొప్ప కృషిచేసి శ్రమించి ఇతరులివ్వలేనిదాని
నతి సులభముగా గురువునుండి పొందవచ్చును.
వారా మార్గమందు నడచియున్నవారు కావున శిష్యుని సులభముగా ఆధ్యాత్మికప్రగతిలో
క్రమముగా ఒక మెట్టు మీదనుంచి ఇంకొక పై మెట్టునకు తీసికొని పోగలరు.
ఎవడు ఫలాపేక్షరహితుడు
కాడో, ఎవడు ఫలాపేక్ష కాంక్షను విడువడో, ఎవనికి
వానియందు విరక్తి లేదో యట్టివాడు గొప్ప చదువరియైనప్పటికి వాని జ్ఞానమెందుకు పనికిరానిది. ఆత్మసాక్షాత్కారము పొందుటకిది వానికి
సహాయపడదు. ఎవరహంకారపూరితులో,
ఎవరింద్రియవిషయముల గూర్చి యెల్లప్పుడు చింతించెదరో, వారికి గురుబోధలు నిష్ప్రయోజనములు. మనస్సును పవిత్రమొనర్చుట తప్పనిసరి
యవసరము. అది లేనిచో మన
ఆధ్యాత్మిక ప్రయత్నములన్నియు ఆడంబరము డాంబికము కొరకు చేసినట్లగును.
గురుకృప లేనిదే మనసు
పరమాత్మయందు లయించి శాంతించుట దుర్లభము.
సద్గురువు అచింత్యము
అనుపలభ్యమునైన ఆత్మసాక్షాత్కారమును ప్రసాదించును.
గురుభక్తి లేనివాడు
ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించలేడు. తన
గురువుయొక్క తత్త్వాన్నీ, బోధలను ఆకళింపు చేసుకున్నవాడు గురువుకు
వినయవిధేయతలతో సేవ చేసుకుంటాడు.
గురుభక్తి అచంచలంగా
ఉన్న శిష్యునిలో అహంభావం పటాపంచలయిపోతుంది. సంసారంలో
ఉండే అనేక చికాకులనుండి తప్పించుకోగలడు.
గురువు మీద భక్తిని
క్రమం తప్పకుండా ఆచరించే శిష్యునికి శాశ్వతమయిన ఆనందాన్ని కలిగిస్తుంది. మనసుకు శాంతి, స్థిరత్వం లభిస్తుంది.
బ్రహ్మజ్ఞానాన్ని
పొందే అవకాశం కేవలం గురుభక్తి ద్వారానే సాధ్యపడుతుంది.
ఇందులో గురుగీత లోని
శ్లోకాలయొక్క తాత్పర్యాన్ని వివరిస్తూ, శ్రీ సాయి సత్ చరిత్రలోనుండి వాటికి సంబంధించిన విషయాలను క్రోడీకరిస్తూ గురుభక్తిని గురించి వివరించే ప్రయత్నం
చేస్తున్నాను.
పార్వతీదేవి అనేక పర్యాయములు ప్రార్ధింపగా, సంతసమందిన పరమశివుడు ఈ గురుగీతను బోధించాడు.
శ్లో.
గురుర్బ్రహ్మ
గురుర్విషుః
ర్గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః
గురుగీత
- శ్లో. 58
గురువే బ్రహ్మదేవుడు, గురువే విష్ణుదేవుడు, గురువే దేవదేవుడైన మహేశ్వరుడు.
గురువే
అవ్యక్త పరబ్రహ్మము.
అట్టి
గురుదేవునకు
నమస్కృతులు.
‘గు’
అను అక్షరము అజ్ఞాన తిమిరము కాగా, ‘రు’
అను అక్షరము జ్ఞానతేజమై భాసించుచున్నది. అందుచేత గురుదేవుడు అజ్ఞానమును హరించు
పరబ్రహ్మమే అయియున్నాడు. ఈ విషయమున ఎటువంటి సందేహము లేదు.
--- గురుగీత
– శ్లో. 44
‘గు’
అను అక్షరము అంధకారము కాగా, ‘రు’ అను అక్షరము దానిని నిరోధించునదియై ఉన్నది. అజ్ఞానాంధకారమును పోగొట్టువాడు గురువని పిలువబడుచున్నాడు. --- గురుగీత – శ్లో 45
ఎవరయితే తన గురువును భగవంతునిగా భావిస్తారో వారే ఉత్తమశిష్యులు.
గురువుయందు
భక్తిని నిలుపుకోవడమంటే
(గురుభక్తి) అంతకన్నా ఉత్తమోత్తమమయిన సద్గుణం ఇంకొకటి లేదనే చెప్పవచ్చు.
ఉత్తమమయిన
సద్గుణాలలో గురుభక్తేనని గురుగీతలో కూడా చెప్పబడింది.
ఎవని మనస్సయితే చంచలంగాను, కల్మషంగాను దుర్గుణాలతోను నిండి ఉంటుందో
వానికి గురుభక్తి, గురువు అనుగ్రహం అందనంత దూరంలో ఉంటుంది.
ప్రాపంచిక
విషయాలలోను ఆధ్యాత్మిక విషయాలలోను ఎదురయ్యే సంకటాలనుండి గురువే తన శిష్యుడిని రక్షించగలడు.
భగవంతుడు
కోపిస్తే గురువు తన శిష్యుడిని రక్షించగలడు.
అదే
కనక గురువే తన శిష్యునిపై ఆగ్రహం చూపించినట్లయితే భగవంతుడు కూడా ఆ శిష్యుడిని కాపాడలేడు.
ఇది
జగమెరిగిన సత్యం.
కాని
ఒక్కటి మాత్రం సుస్పష్టం.
తన
శిష్యుడు తప్పు చేసినా గురువు సహనాన్ని కోల్పోడు. అదే గురువు యొక్క గొప్పదనం.
శిష్యుడికి తన గురువుయందు అచంచలమయిన భక్తి ఉండాలి.
అపుడే
ఆ గురుశిష్యుల సంబంధం చాలా బలీయంగా ఉంటుంది.
అది
విడదీయరాని బంధమవుతుంది.
ఉత్తమమయిన
శిష్యుడు ఎప్పుడూ తన గురువు యందు వినయవిధేయతలతో ప్రవర్తిస్తాడు.
తన
గురువుకి సర్వశ్య శరణాగతి చేసి సేవచేసుకుంటాడు.తన గురువే తన యోగక్షేమాలను చూసుకుంటాడనే ధృఢచిత్తంతో సేవ చేసుకుంటాడు.
అటువంటి
శిష్యుని మీద గురుకృప అపారంగా ఉంటుంది.
అటువంటి
శిష్యుడు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానానికి చేరుకుని తన లక్ష్యాన్ని సాధిస్తాడు.
మోక్షమార్గాన్ని అభిలషించే తన శిష్యునికి గురువు ఎల్లప్పుడూ సహాయసహకారాలను అందిస్తూ ఉంటాడు.
తన
శిష్యుని ఆశయాన్ని గమనించి గురువు త్వరగా అతనిని మోక్షమార్గంవైపు పయనింప చేస్తాడు.
(సద్గురువును భగవంతునివలె కొలువవలెను.
కాబట్టి
మనము సద్గురువును వెదకవలెను.
వారి
కధలను వినవలెను.
వారి
పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి వారి సేవ చేయవలెను.
శ్రీ
సాయిసత్ చరిత్ర అ. 18)
తన గురువుకి సర్వశ్య శరణాగతి చేసిన శిష్యునికి ఇక కోర్కెలంటూ
ఏమీ ఉండవు.
అతనికి
తన గురువే సర్వస్వం.
(ఉదాహరణకి
బాలాజీ పాటిల్ నెవాస్కర్ గురించి మీరు ఇంతకు ముందు చదివారు… మరొక్కసారి ఆయన గురించి కొన్ని వాక్యాలు మరలా…
నెవాస్ నివాసి అయిన బాలాజీ పాటిల్ పైన చెప్పిన విధంగానె తన శరీరము,
మనస్సు, ధనము తన గురువుకే అర్పించి జీవితాన్ని సార్ధకం చేసుకున్న వ్యక్తి. అతను నిమ్న కులంలో జన్మించాడు.
ఆయినాగాని అతను తన గురువుమీద చూపించిన భక్తి ద్వారానే భవసాగరాన్ని దాటాడు.)
( శ్రీ
సాయి శరణానందగారు తన అనుభవాన్ని ఇలా వర్ణిస్తున్నారు.
“నెవాస్కర్ గారి జివితం చూసి నేర్చుకోదగ్గది అతనికి
బాబా మీద తిరుగులేని నమ్మకం”)
సేవల ద్వారా గురువుని తృప్తి పరచి ఆయన
వద్దనుంచి వేదాంత శాస్త్రమును నిరంతరం శ్రవణం చేయాలి. – ఉపనిషత్తు వాక్యం.
గురువు చెప్పే బోధలను అందరూ వింటారు. కాని దానియందు శ్రధ్ధపెట్టి ఆలకించినవారే
గురువు చెప్పినది పూర్తిగా అర్ధం చేసుకోగలరు.
గురువును అందరూ సమీపించగలరు. కాని గురువుతో కలిసి అందరూ జీవించలేరు.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
No comments:
Post a Comment