10.06.2020 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు బాలాజీ పాటి నెవాస్కర్
గారి గురించి సమాచారమ్ తెలుసుకుందాము.
సాయి లీల – మరాఠీ రచయిత్రి శ్రీమతి ముగ్ధా దివాద్కర్
ఆంగ్లానువాదమ్ : శ్రీ సుధీర్
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపెట, హైదరాబాద్
బాలాజీ పాటిల్ నెవాస్కర్
రెండు చరణాలు కలిగిన పద్యం ఒకటుంది. అదేమిటంటే నీయొక్క తన్, మన్, ధన్,(శరీరము, మనస్సు, ధనము) నీ సద్గురువు పాదాలకర్పించు,
ఇక నీజీవితమంతా గురువు సేవలోనే గడుపు(గురువు మీద
భక్తి).
నెవాస్ నివాసి అయిన బాలాజీ పాటిల్ పైన చెప్పిన
విధంగానె తన శరీరము, మనస్సు, దనము తన గురువుకే
అర్పించి జీవితాన్ని సార్ధకం చేసుకున్న వ్యక్తి. అతను నిమ్న కులంలో జన్మించాడు.
ఆయినాగాని అతను తన గురువుమీద చూపించిన భక్తి ద్వారానే భవసాగరాన్ని దాటాడు.
చాలాకాలం క్రితమే బాలాజీ మొట్టమొదటిసారిగా
బాబా దర్శనం కోసం షిరిడీ వచ్చాడు. బాబాను
దర్శించుకున్న మరుక్షణమే అతను షిరిడీలోనే శాశ్వతంగా ఉండిపోవాలనే నిర్ణయానికి వచ్చాడు. కొన్నాళ్ళు
బాబా అతనిని ఇంటికి వెళ్ళిపోయి కుటుంబంతో ఉండమని ఎంతో నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. కాని చివరివరకు అతను సంసార జీవితంలో
ఉపశమనం పొందలేకపోయాడు.
1892 వ.సం.లో మొట్టమొదటిసారి దామూ అన్నా కాసార్ షిరిడీకి వచ్చాడు. అతను తన అనుభవాన్ని ఇలా వివరిస్తున్నారు.”నేను మొట్టమొదటిసారి షిరిడీ వచ్చినపుడు బాలాజీ పాటిల్ అన్ని రకాల పనులు చేస్తూ
బాబాకు సేవ చేసుకుంటూ ఉండటం గమనించాను.
అతను మసీదును శుభ్రం చేస్తూ, దీపాలను కూడా
శుభ్రంగా తుడిచి పెడుతూ ఉండేవాడు. చావడిని శుభ్రం చేస్తూ బాబా లెండీబాగ్ కు నడిచివెళ్ళే దారిని కూడా శుభ్రంగా
తుడిచేవాడు.
గ్రామస్థులు లెండీ బాగ్ కు వెళ్ళే దారిప్రక్కన
అశుభ్రం చేస్తూ (మలమూత్రాలతో) చెత్తకూడా
పారబోస్తూ ఉండేవారు. బాలాజీ తెల్లవారుజాముననే లేచి అవన్నీ ఎత్తిపారబోసి శుభ్రం చేసేవాడు. ఈపనిని మొదట ప్రారంభించినవాడు బాలాజీ. ఆతరువాత ఆపనిని రాధాకృష్ణమాయి, ఆతరువాత అబ్దుల్ బాబా నిర్వహించేవారు. బాబా గారు
దగ్గుతూ ఉమ్మివేసిన ప్రదేశం మీద బాలాజీ మట్టివేసి కప్పేవాడు.
శ్రీ సాయి శరణానందగారు తన అనుభవాన్ని
ఇలా వర్ణిస్తున్నారు.
“నెవాస్కర్ గారి జివితం చూసి నేర్చుకోదగ్గది అతనికి
బాబా మీద తిరుగులేని నమ్మకం.”
బాలాజీ తన పొలంలో పండిన పంటనంతటినీ ఎడ్లబళ్లమీద వేసుకుని దాని అసలయిన యజమాని బాబాయే అనే ఉద్దేశ్యంతో ఆయన పాదాలముందు సమర్పించుకునేవాడు. బాబా తనకు ఇచ్చిన
ధాన్యాన్నే సంతోషంగా ఇంటికి పట్టుకెళ్ళేవాడు. ఆయన ఇచ్చినదానితోనే కుటుంబాన్ని పోషించుకునేవాడు. బాబా త్రాగగా
మిగిలిన నీటినే త్రాగుతూ ఉండేవాడు.
బాబా స్నానం చేసిన నీటిని కూడా త్రాగేవాడు. బాలాజీ తరువాత అతని కుమారుడు కూడా
తన తండ్రిలాగానే, పంటవిషయంలోను, నీరు త్రాగే
విషయంలోను అదే పధ్ధతిని పాటించాడు.
బాబా ప్రతిరోజు నాలుగు సార్లు బాలాజీ ఇంటిలో తయారయిన రొట్టెలను (భక్రి) తినేవారు.
బాబా అనుమతి లేకుండా బాలాజీ ఏపనీ చేసేవాడు
కాదు. తన కుటుంబానికి బట్టలు
కుట్టించదలచుకున్న సరే బాబాని అనుమతి అడిగేవాడు. అతనికి ఇద్దరు భార్యలు. అయినా గాని అతనికి కొద్దిమందే సంతానం. అప్పుడప్పుడు అతని కుటుంబం బాబా దర్శనం
కోసం నెవాసా నుండి షిరిడీకి వస్తూ ఉండేవారు. అటువంటి సందర్భాలలో బాబా అతని ఇద్దరు భార్యలకి బట్టలు పెట్టి ఆశీర్వదించేవారు.
బాలాజీ ప్రతిచోట సాయిని దర్శించేవాడు. అతని ఉద్దేశ్యంలో సాయి అన్నీ చోట్లా ఉన్నారనే. బాబా కూడా ఈపుణ్యాత్ముడి మీద తన కృపను
చూపించి దీవించారు.
బాలాజీ సంవత్సరికాలు జరుగుతున్న రోజులు. అప్పటికి అతని తల్లి ఇంకా జీవించే ఉంది. ఆరోజున అందరిని భోజనాలకి పిలిచారు. కాని
వారు అనుకున్నదానికన్న మూడురెట్లు భోజనానికి వచ్చారు. అంతమంది వచ్చేసరికి బాలాజీ భార్య ఒక్కసారిగా భయపడిపోయింది. ఆమె తన అత్తగారికి ఈ విషయం చెప్పింది. “మనకు బాబా ఉండగా ఎందుకు భయపడతావు. ఊదీ తీసుకురా” అంది అత్తగారు. బాలాజీ భార్య ఊదీ తీసుకు వచ్చింది. బాలాజీ తల్లి గుప్పిటనిండా ఊదీ తీసుకుని ఆహారపదార్ధాలున్న అన్ని పాత్రలమీద
ఊదీని చల్లి ఒక వస్త్రంతో అన్నిటినీ కప్పివేసింది. ఆతరువాత కోడలితో “ఇపుడు ఈ పాత్రలన్నిటినుండి కావలసినంత తీసి అందరికీ వడ్డించు. కాని పాత్రల మీద ఉన్న వస్త్రాన్ని
మాత్రం అలాగే కప్పి ఉంచు. సాయిబాబా మన గౌరవాన్ని కాపాడతారు. నువ్వేమీ
భయపడకు” అని చెప్పింది. బాలాజీ భార్య తన అత్తగారు చెప్పినట్లే
చేసింది. బాబాకూడా వారి
కుటుంబానికి ఎటువంటి మాట రాకుండా వారి గౌరవాన్ని కాపాడారు.
ఈ పైన చెప్పిన సంఘటన బాలాజీ తల్లి కాకాసాహెబ్ దీక్షిత్ గారికి వివరంగా చెప్పింది. శ్రధ్ధ సబూరీతో తనయందే భక్తిని నిలుపుకున్న
తన భక్తుల యోగక్షేమాలను ఏవిధంగా కనిపెట్టుకుని ఉంటారో ఈ సంఘటనే ఒక మంచి ఉదాహరణ.
శ్రీ శరణానందగారు బాలాజీ ఆఖరి రోజుల
గురించి ఈ విధంగా వివరిస్తున్నారు.
“సర్వం త్యజించి బాలాజీ మరొకసారి షిరిడీ వచ్చాడు. అయినప్పటికీ బాబా అతనిని ఇంటికి తిరిగి
వెళ్ళిపొమ్మని ఎంతగానో చెప్పిచూశారు.
ఆఖరి రోజులలో అతను ఆహరం, నీళ్ళు ఏమీ తీసుకోలేదు. బాబా పంపించిన రొట్టె ప్రసాదాన్నే తినేవాడు. బాబా పాదాల స్పర్శతో పునీతమయిన నీటినే
త్రాగేవాడు.
ఈ విధంగా అసమానమయిన సేవచేసుకున్న బాలాజీ
ఎంతో ధన్యుడు.
(సమాప్తం)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
No comments:
Post a Comment