Monday, June 8, 2020

అన్నాసాహెబ్ అనబడే చిదంబర్ కేశవ్ గాడ్గిల్ - 1 వ.భాగమ్

     Sri Shirdi Sai Baba. (With images) | Baba image, Sai baba, Shirdi ...
   Aesthetic Purple Rose Www Topsimages Com - Aesthetic Purple ...
08.06.2020  సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు మరొక సాయిభక్తుడయిన చిదంబర్ కేశవ్ గాడ్గిల్ గారి గురించి తెలుసుకుందాము.


సేకరణ shirdisaisevatrust.org చెన్నై వారినుండి గ్రహింపబడింది.
సాయిలీల - మరాఠీ రచయిత్రి - శ్రీమతి ముగ్ధ దివాద్కర్
ఆంగ్లానువాదమ్ - శ్రీ సుధీర్
తెలుగు అనువాదమ్ -  ఆత్రేయపురపు త్యాగరాజు
          నిజాంపేటహైదరాబాద్
(నా సందేహాలు - సమాధానాలలో భాగంగా బాబా ఈరోజు ఇచ్చిన సమాధానమ్  --  దామూ అన్నా -నానాసాహెబ్ రాస్నే 5 వ.భాగంలో రాస్నే గారు, ఏదీ కూడా అంతిమంగా తన వెంట రాదని తెలిసినా,  బాబా తనకు ప్రసాదించిన రాగినయాపైస నాణాన్ని తన శరీరంతోపాటె దానిని కూడా దహనం చేయమని అంతిమకోరిక కోరారు. ఆ నాణాన్ని ఆవిధంగా దహనం చేయమని అడగడం లోని ఆంతర్యం ఏమిటి, దానిని వారి కుటుంబీకులకే ఇవ్వవచ్చును కదా అని నాకు సందేహం కలిగింది.  ఇదే సందేహాన్ని చెన్నై నుండి శ్రీమతి కృష్ణవేణిగారు కూడా వెలిబుచ్చారు.  ఈ రోజు ఆవిధంగా చేయమనడంలోని రాస్నేగారి ఆంతర్యం ఏమిటి అని ధ్యానంలో అడిగినప్పుడు బాబా ఇచ్చిన సమాధానం  "పంచభూతాలు"
అనగా రాస్నేగారు తన శరీరం పంచభూతాలలో కలిసిపోయినట్లే ఆ రాగినయాపైస కూడా పంచభూతాలలో కలిసిపోవాలని కోరుకున్నారని గ్రహించుకున్నాను...ఓమ్ సాయిరామ్...త్యాగరాజు)

అన్నాసాహెబ్ అనబడే చిదంబర్ కేశవ్ గాడ్గిల్ - 1 వ.భాగమ్

నేనొక మహమ్మదీయుడిని

నానా సాహెబ్ డెంగ్లే ద్వారా బాబా వద్దకు రప్పించబడిన అదృష్టవంతులలో అతను ప్రముఖుడు.  ఆరోజులలో అహ్మద్ నగర్ కలెక్టర్ వద్ద అన్నాసాహెబ్ కార్యదర్శిగా ఉండేవాడు.  ఆ పట్టణంలో నానాసాహెబ్ ప్రముఖ ఇమాన్ దారు.  ప్రభుత్వశాఖలలో నానా సాహెబ్ కు మంచి పలుకుబడి ఉంది.  ఇద్దరూ సహజంగానే భగవంతునిమీద భక్తివిశ్వాసాలు కలవారవడం వల్ల ఇద్దరూ మంచి ప్రాణస్నేహితులయ్యారు.


శ్రీ సాయిబాబా ప్రసాదించిన ఆధ్యాత్మిక అనుభూతులు నానాసాహెబ్ కి చాలా దిగ్భ్రమను కలిగించాయి.  బాబా ఆశీర్వాదంతో ఆతనికి పుత్రుడు కూడా      జన్మించాడు.

నానాసాహెబ్ సాయిబాబావారి మహిమలు, అనుభూతులెన్నిటినో అన్నాసాహెబ్ కు వివరించి చెప్పాడు.  నానాసాహెబ్ చెప్పిన బాబా మహిమలు లీలలు విన్న అన్నాసాహెబ్ ముగ్ధుడయ్యాడు.  బాబా దర్శనం చేసుకోవడానికి తనతో కూడా విద్యాశాఖలో పనిచేస్తున్న సీనియర్ అధికారి తన మున్సిఫ్ అయిన వామనరావుని, సీతారామ్ పట్వర్ధన్  ని టాంగాలో షిరిడీకి తీసుకుని వెళ్ళాడు.

ఆరోజులలో మాధవరావు దేశ్ పాండే షిరిడీలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.  షిరిడీ చేరుకున్న అన్నాసాహెబ్ మాధవరావుని కలుసుకునిఇక్కడ నివసించే ఒక సాధువు గురించి నేను ఎన్నో విషయాలు విన్నాను.  ఆయన ఎక్కడుంటారు?” అని అడిగాడు.  మాధవరావు కూడా ప్రజలందరూ భావిస్తున్నట్లుగానే బాబాను ఒక పిచ్చిఫకీరని భావించేవాడు.  బాబాలో ఉన్న దైవత్వం ఏమిటన్నది అప్పటికింకా మాధవరావు గ్రహించుకోలేదు.  అతను ముక్కు సూటిగా మాట్లాడె వ్యక్తి.  మాధవరావు మసీదువైపు చూపిస్తూఅక్కడ మసీదులో మహాసాధువు అన్నవాడు ఎవడూ లేడు.  కాని ఒక పిచ్చి ఫకీరు మాత్రం ఉన్నాడుఅని చెప్పాడు.

తనని చూడటానికి వచ్చిన గాడ్గిల్ ని చూసిన మరుక్షణమే బాబా అతనిపై తిట్ల వర్షం కురిపించారు.  ఆయినా గాని బాబా తిడుతున్న తిట్లు పెరుగుతున్న కొద్ది అన్నాసాహెబ్ కి ఇంకా ఇంకా ఆనందం కలగసాగింది.  దీనికి కారణం గతంలొ జరిగిన ఒక సంఘటన.
         Bhimashankar Temple - Wikipedia షిరిడీకి వచ్చేముందు అన్నాసాహెబ్ పూనా దగ్గర ఉన్న భీమశంకర్ ఆలయంలో ఒక సాధువుని దర్శించుకోవడానికి వెళ్ళాడు.  ఆసాధువు అతనిని బాబాను దర్శించుకోమని ఆజ్ఞాపించాడు.  బాబా అతనిపై తిట్లవర్షం కురిపిస్తూ ఆసాధువు గురించి ప్రస్తావించారు.  బాబా ఆసాధువు గురించి చెప్పగానే అన్నాసాహెబ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అతనిలో బాబా మీద విశ్వాసం కలిగింది.  పట్వర్ధన్, వామనరావు, టాంగావాలాలతో (తనను షిరిడీకి తీసుకువచ్చిన టాంగావాలా) కలిసి అన్నాసాహెబ్ మసీదు మెట్లు ఎక్కడానికి తను కూర్చున్న చోటునుండి లేచాడు.  బాబా ఒక్కసారిగా గర్జిస్తూ, “పైకి ఎక్కద్దు.  నేనొక మహమ్మదీయుడిని.  వెళ్ళి ఆ భీమశంకర్ కాళ్ళమీద సాష్టాంగపడుఅన్నారు. ఆమాటలు వినగానే గాడ్గిల్ బాబాకు శిరసు వంచి నమస్కరించుకున్నాడు.

వివిధ రకాల వ్యక్తులు బాబా గురించి వర్ణించిన ప్రకారం అన్నాసాహెబ్ బాబాని ఒక మహమ్మదీయునిగానే భావించాడు.  అయితే మొట్టమొదటి దర్శనంతోనే బాబా అతని మనసులో ఉన్నటువంటి అపార్ధాన్ని తొలగించారు.

గణపతి రూపంలో దర్శనం
తను నమ్మిన భక్తి మార్గాన్నే అనుసరించే ప్రతి భక్తునియొక్క నమ్మకాన్ని బాబా నిశ్చయపరిచేవారు.  బాబా తన భక్తులు తనని ఏరూపంలో పూజించదలచుకుంటే ఆవిధంగానే వారి పూజలను అంగీకరించేవారు.  న్నాసాహెబ్ గణపతి భక్తుడు.  ఇపుడు అతను బాబాలో గణపతిని దర్శించాడు.  అతను గణపతిని ఏవిధంగానయితే పూజించేవాడో బాబాని కూడా అదేవిధంగా పూజించడం ప్రారంభించాడు.
          Jai Shri Ganesh Jai Shri Sai | Sai baba pictures, Ganesh photo ... ఒకసారి అతను బాబాని ఆవిధంగా పూజిస్తున్న సమయంలో బాబా అక్కడ ఉన్న ఒక భక్తునితోఈముసలివాడు. చాలా టక్కరి.  నేను ఒక ఎలుకమీద కూర్చున్నాను” (గణపతి వాహనం ఎలుక  అనే ఉద్దేశ్యంతో అన్నారు బాబా).  తన మనసులోని భావాన్ని బాబా ఆవిధంగా తెలియచేసినందుకు గాడ్గిల్ చాలా సంతోషించాడు.

నేనెప్పుడూ నీతోడుగానే ఉంటాను
ఆతర్వాత అన్నాసాహెబ్ కు సిన్నార్ పట్టణానికి మామలతాదారుగా పదోన్నతి లభించింది.  సిన్నార్ షిరిడీకి చాలా దగ్గరగానే ఉండటంవల్ల అతను తరచూ షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకుంటూ ఉండేవాడు.  కొంతకాలం తరువాత అతనికి చాలా దూరంగా ఉన్న ఊరికి బదిలీ అయింది.  అతను వెంటనే అక్కడికి వెళ్ళి ఉద్యోగంలో చేరాలి.

ఇక బయలుదేరేముందు షిరిడీ వెళ్ళి బాబాని దర్శించుకునే సమయం కూడా లేదు. అతను చాలా సంక్షోభ స్థితిలో పడ్డాడు. బాబాను దర్శించుకోలేకపోతున్నాననే బాధతో అతని కళ్లల్లో కన్నీరుకారసాగింది.  బరువెక్కిన హృదయంతో రైలులోకి ఎక్కి కూర్చున్నాడు.  మనసంతా బాబా గురించిన ఆలోచనలతోనే నిండిపోయి ఉంది.  అకస్మాత్తుగా బోగీ కిటికీలోనుండి ఒక పొట్లం అతని ఒడిలో పడింది.  ఆతృతగా ఆపొట్లంలో ఏమి ఉందోనని తెరచి చూశాడు.  అందులో ఊదీ ఉంది.  అతను ఆ ఊదీని ఒక లాకెట్ లో ఉంచి, తన జీవితాంతం తనతోనే భద్రంగా దాచుకొన్నాడు.

ఆతరువాత అన్నాసాహెబ్ కు బాబాను దర్శించుకునే అవకాశం కలిగింది.  షిరిడీ చేరుకున్న వెంటనే మసీదుకు వెళ్ళి బాబాపాదాల మీద పడ్డాడు.  అతను బాబాను క్షమించమని కోరేలోపుగానే బాబా అతనితోఅరే! నువ్వు నాదగ్గరకు రాలేకపోయావనే నీకు ఊదీని పంపించాను.  అది నీకు చేరిందా?” అన్నారు.  ఈమాటలు వినగానే గాడ్గిల్ కళ్లల్లో ఆనందభాష్పాలు జలజలా రాలాయి.

శ్రీ లక్ష్మన్ గోవింద్ ముంగే బాబాకు ఎప్పటినుంచో భక్తుడు.  ఈ సంఘటనకు సంబంధించి రమ్యమయిన కధను వివరించారు.

“శ్రీ చిదంబర్ కేశవ్ గాడ్గిల్ గారు నాకు సీనియర్ మామలతదారు.  నేను ఆయన వద్ద గుమాస్తాగా ఉండేవాడిని.  మామలతదారు గారు, నానా సాహెబ్ నిమోన్కర్ గారు కలిసి బాబాను దర్శించుకోవడానికి వెడుతున్నపుడు నేను కూడా వారితోపాటే వెళ్ళాను.  మేము బాబాముందు సాష్టాంగపడి నమస్కారాలు చేసుకున్నాము.  అపుడు నామనసులో ఒక ఆలోచన ప్రవేశించింది.  “ఈ హిందువులందరూ ఎందుకని మహమ్మదీయునివలె కనిపించే ఈ బాబాను పూజిస్తారు?”  సరిగా అదేక్షణంలో బాబా గాడ్గిల్ తో “నా ఖార్కా (ఎండు ఖర్జూరాలు), అగరువత్తులు, దక్షిణ రూ.1/- ఇవ్వు” అన్నారు.  ఆమాటలు వినగానే నేను చాలా ఆశ్చర్యపోయాను.  ఎందుకనంటే క్రితం రోజు రాత్రే గాడ్గిల్ గారు ఈ మూడు వస్తువులను ఒక ప్రక్కన పెడుతూ ”ఇవి నా సద్గురు బాబాకు సమర్పించడానికి” అని అన్నారు.  ఇపుడు సరిగ్గా బాబా ఆ మూడు వస్తువులనే తనకు ఇమ్మని కోరుతున్నారు.  ఈ సంఘటన ద్వారా బాబాకు ఇతరుల మనసులలోని ఆలోచనలను గ్రహించే శక్తి ఉందని  నాకు ధృఢమయిన నమ్మకం కలిగింది.  బాబా వాటిని ఎంతో ఆనందంగా స్వీకరించారు.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

No comments:

Post a Comment