06.06.2020 శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు దామూ అన్నా - నానాసాహెబ్ రాస్నే గురించి మరికొంత
సమాచారమ్ తెలుసుకుందాము. ఈ సమాచార సేకరణ shirdisaisevatrust.org చెన్నై వారినుండి గ్రహింపబడింది.
సాయిలీల - మరాఠీ రచయిత్రి - శ్రీమతి ముగ్ధ దివాద్కర్
ఆంగ్లానువాదమ్ - శ్రీ సుధీర్
తెలుగు అనువాదమ్ - ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఆంగ్లానువాదమ్ - శ్రీ సుధీర్
తెలుగు అనువాదమ్ - ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
దామూ అన్నా – నానాసాహెబ్ రాస్నే - 5 వ.భాగమ్
దత్తాత్రేయ దామోదర్ అనబడే నానాసాహెబ్ రాస్నే
దామూ అన్నా మరణించిన తరువాత నానాసాహెబ్
షిరిడీ వెళ్లాడు. తండ్రి
మరణం అతనిని బాగా కలిచివేసింది. బాబా సమాధిముందు రోదించడం మొదలుపెట్టాడు. ఓదార్చడానికి కూడా వీలులేనంతగా దుఃఖిస్తున్నాడు.
ఆసమయంలో సమాధినుండి బాబా మాటలు వినిపించాయి “అరే, నానా,
కర్మలు అన్ని పూర్తయి పదునాలుగ రోజు కర్మ కూడా పూర్తయింది. దుఃఖించవలసిన కాలమంతా గడిచిపోయింది. అవునా కాదా? నువ్వు ఇపుడు
మధురపదార్ధాలను కూడా భుజించావు. ఇక నువ్వు కన్నీరు కార్చరాదు”.
నానాసాహెబ్ చాలా పుణ్యాత్ముడు. అతను మంచి వక్త, సాంఘికసేవకుడు. తన జీవితాన్నంతా బాబాపాదాలకే అంకితం చేసాడు. సంసార జీవితం మీద అతనికి ఆకర్షణ లేదు. అతను చేసే ప్రతిపని, ప్రవర్తన అన్నీ బాబాకు సంబంధించినవిగానే ఉండేవి. అతను బాబా కృపాసాగరంలో మునిగిపోయాడు.
బాల్యంనుండె అతని మనసంతా బాబామీద భక్తితో నిండిపోయేటంతగా తయారవుతూ వచ్చింది. క్రమక్రమంగా అతనిలో ప్రాపంచిక విషయాలమీద వైరాగ్యం జనించింది.
ఆవిధంగా విరక్తి పెరుగుతూ ఉన్న సమయంలోనే ప్రాపంచిక విషయాలమీద, సుఖాలమీద కోరికలు అన్ని కూడా యాంత్రికంగానే నాశనమవుతూ వచ్చాయి. “మన జీవితాలని నడిపించేది, దానికి కర్త సద్గురువే” అని అతని మనసులో ఒక బలీయమైన నమ్మకం ఏర్పడింది. నానా సాహెబ్ ఎంతో పుణ్యం చేసుకొన్నాడు. అతని వాక్సుద్ధి అమోఘం.
అతని స్వబావం చాలా కఠినంగా ఉంటుందని అనుకుంటారు. కాని అతను చాలా దయార్ద్రహృదయుడు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అనవసరంగా పనికిరాని కబుర్లతో కాలక్షేపం చేసే భక్తులను అతను ద్వేషించేవాడు. మోసగాళ్లని, దగాకోరువాళ్లని తృణీకరించేవాడు.
అతను ఎప్పుడు బాబాని ‘నా బాబా’ అనే సంబోధించేవాడు.
“ప్రజలందరు నా బాబాని పీడిస్తూ ఉంటారు, విసిగిస్తూ ఉంటారు. ప్రతివాడూ నా బాబాని మోసంచేసి కొల్లగొడదామనే చూస్తున్నారు. నా బాబాని అమాయకుడిని చేసి చికాకు పెట్టడానికి ప్రయత్నించవద్దు. ఆయన అగ్నికి మరొక అవతారం – దహించివేస్తారు నా బాబా.
నా బాబాకి ఒక దేవహరలో (ఇంటిలో ఉండే చిన్న మందిరం) ఉండే స్వభావం ఎప్పుడూ లేదు. నా బాబా ఎప్పుడూ ఒక సాధారణ మానవునిలాగే సంచరించారు. ఆయన తన సంభాషణల్లో ఎన్నో ఉర్దూ పదాలను ఉపయోగిస్తూ ఉండేవారు.
బాబాను అంత సన్నిహితంగా తన స్వంత మనిషిలా నానాసాహెబ్ సంబోధిస్తూ ఉండటానికి కారణం ఉంది. అదేమిటంటే బాబా దాము అన్నాతో అతని మొదటికుమారుడిని తనకి ఇమ్మని అడిగారు.
ఒకసారి గురుపూర్ణిమ రోజున బాబా పూలదండలోనుండి ఒక నయాపైస నాణెం నానాసాహెబ్ చేతుల్లో పడింది. అతడు దానిని తన జీవితాంతం ఎంతో భద్రంగా దాచుకొన్నాడు. అతను ఎల్లప్పుడు ఆనాణాన్ని తన చొక్క బొత్తం ఉండే పట్టీలోనే ధరిస్తూ ఉండేవాడు.
“నాసంవత్సరాదాయం రూ.5,000/- కాని ప్రపంచంలోని ఏనాణెం గాని ఈ నయాపైసాకి సాటిరాదు” అన్నాడు. దానికి
విలువగలది ఏదీ లేదు ఆనయాపైసా వెల కట్టలేనిది”
తన మరణానంతరం ఆ నయాపైసాని కూడా తన శరీరంతోపాటే
దహనం చేయమని అంతిమ కోరిక కోరాడు. ఆతన
కోరుకున్నట్లె చేసారు. అతనికి మనఃపూర్వకమయిన కోరిక మరొకటుంది జ్యేష్టులు, శ్రేష్టులయిన ఎంతోమంది భక్తులు యాదృచ్చికంగా ఏకాదశి పుణ్యతిధులలో మరణించడం జరిగింది. నానాసాహెబ్ కూడా అటువంటి పుణ్యతిధినాడే
తన మరణాన్ని కోరుకొన్నారు.
చివరిరోజులలో అతను తన నివాసాన్ని షిరిడీకి మార్చాడు. ఆషాఢ ఏకాదశినాడు ఆయనకు గాయమయి బాధపడటానికి చిన్న కారణం ఉంది. అతను క్రిందపడినప్పుడు భుజానికి దెబ్బ తగిలి కాలర్ బోను కి గాయమయింది. ఆయనను సాయి ఆస్పత్రిలో చేర్చారు. ఆరోజుననే ఆయన మరణించారు.
(దామూ అన్నా - నానాసాహెబ్ రాస్నే సమాప్తం)
(తరువాత అన్నాసాహెబ్ అనే చిదంబర్ కేశవ్ గాడ్గిల్ గురించి ప్రచురణ)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
Mr. Nisha Sinha please do not post your advertisement matters in this blog.
ReplyDelete