05.06.2020 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు దామూ అన్నా - నానాసాహెబ్ రాస్నే
గురించి మరికొంత సమాచారమ్ తెలుసుకుందాము.
ఈ సమాచార సేకరణ shirdisaisevatrust.org చెన్నై వారినుండి
గ్రహింపబడింది.
సాయిలీల - మరాఠీ రచయిత్రి - శ్రీమతి ముగ్ధ దివాద్కర్
ఆంగ్లానువాదమ్ - శ్రీ సుధీర్
తెలుగు అనువాదమ్ - ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఆంగ్లానువాదమ్ - శ్రీ సుధీర్
తెలుగు అనువాదమ్ - ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
దామూ అన్నా – నానాసాహెబ్ రాస్నే - 4 వ.భాగమ్
సద్గురువు శ్రీ సాయిబాబా
1926వ.సంవత్సరంలో దామూసేఠ్ పెద్దకుమారుడు దత్తాత్రేయ అనే
నానాసాహెబ్, శ్రీనారాయణ్ మహరాజ్ గారిని దర్శించుకోవడానికి కేడ్
గావ్ వెళ్ళాడు. అతనిని
మహరాజ్ చూసిన మరుక్షణమే “నీగురువు పరమ గురువు. ఆయన నాకన్న ఎన్నోరెట్లు ఉత్తమమయిన
స్థాయిలో ఉన్నారు. ఇక్కడికెందుకు వచ్చావు నువ్వు?
నీ అదృష్టమంతా బాబా చేతులలోనే సురక్షితంగా ఉంటుంది. నువ్వు సరైన గురువునే ఎంచుకొన్నావు. నువ్వు ఆయన వద్దకే వెళ్ళు. నీ కోరికలన్నీ
ఈడేరతాయి అన్నారు.
(నారాయణ్ మహరాజ్)
“నేను
నాభక్తుల కోరికలను నెరవేరుస్తాను” బాబా అన్న మాటలు.
నానాసాహెబ్ కు చాలా
కాలం వరకు సంతానం కలగలేదు. అంతకు
ముందే ఆయన ముగ్గురుపిల్లలు మూర్చవ్యాధితో మరణించారు. అతని భార్య మరలా రెండవ వివాహం చేసుకోమని
భర్తను పదే పదే పోరుపెట్టసాగింది. కాని అతను మనోవ్యధతో చాలా నిరాశకు
గురయ్యాడు. అతనికి ఇక
సంసార జీవితంమీద ఆసక్తి నశించింది.
మనశ్శాంతి కరువయిన
స్థితిలో ఉన్న నానాసాహెబ్ ఒకసారి షిరిడీలో బాబా సమాధిముందు కూర్చుని “బాబా నాకు సంతాన్నయినా అనుగ్రహించు లేకుంటే ఆత్మకళ్యాణానికి గల దారినన్నా చూపించు” అని బాబాను వేడుకొన్నాడు. ఆవిధంగా కన్నీటితో వేడుకొంటున్న సమయంలో
సమాధినుండి మెల్లని స్వరం వినిపించింది.
“నీకు సంతానం కలుగుతుంది”. సమాధినుంచి వచ్చిన
ఆమాటలను విన్న నానాసాహెబ్ ఆనందానికి అవధులు లేవు. బాబా సమాధి ముందు సాష్టాంగ ప్రణామం చేసాడు. అతనికి విస్మయం, ఆనందం కలిగించిన విషయం ఏమిటంటే తనకు
సంతానం కలుగుతుందన్న శుభవార్త తన ప్రార్ధనలకు తన సద్గురువు సమాధానమివ్వడం. 1928 వ.సంవత్సరంలో
అతనికి కుమారుడు జన్మించాడు.
నానా సాహెబ్ కు ఒక్కడే
కుమారుడు జన్మించటంవల్ల అతని తండ్రి దామూసేఠ్ బాబా సమాధివద్ద బాబాను ప్రార్ధించాడు. ఆయన ప్రార్ధన ఫలితంగా నానా సాహెబ్
కు 1931 వ.సంవత్సరంలో రెండవ కుమారుడు జన్మించాడు.
“నేనెల్లప్పుడూ
బాబా గురించే నిరంతరం చింతన చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఆయన నాకు దర్శనమిస్తూ
ఉంటారు. ఒక్కొక్కసారి
ఆయన నన్ను తిట్లుతిట్టడమే కాదు, దెబ్బలు కూడా కొట్టేవారు. అక్కల్ కోటస్వామి కూడా తమ శిష్యులను
ఆవిధంగానే ఒక్కోసారి తిట్లుతిట్టడం కొట్టడం చేసేవారు. దానివల్ల
వారికి మంచే జరిగేది. ఆవిధంగానే బాబా విషయంలో కూడా జరిగింది. అందువల్లనే నన్ను బాబా తిట్టినా,
కొట్టినా నేనెప్పుడూ బాధపడలేదు. దానివల్ల ఆయన మీద నాకున్న ప్రేమ,
భక్తి తరిగిపోలేదు” అని దామూ అన్నా చెప్పారు.
ఒకసారి అహ్మద్ నగర్ లో దామూ అన్నా ఇంటిలో దొంగతనం జరిగింది. నిజానికి
ఆదొంగతనం చేసింది వారింటిలో పనిచేసేవాడే.
అతను వారింటిలో 33 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. తాళాలను దొంగిలించి బీరువా తెరిచి
బంగారు ఆభరణాలున్న నగలపెట్టెను ఎత్తుకెళ్ళిపోయాడు. అందులో దాముఅన్న కుటుంబసభ్యుల నగలన్నీ
ఉన్నాయి. వాటిలో వెలకట్టలేని
ముక్కుపుడక కూడా ఉంది. అది వివాహమయిన ఒక స్త్రీ ముక్కుపుడక. నగలు పోయాయన్న బాధకన్నా ఆముక్కుపుడక
పోయిందనే బాధ మరింతగా అందరిని కలచివేసింది.
దొంగతనం చేసిన పనివాడు
ఎవరో తెలుసుకున్న తరువాత దామూ అన్నా చాలా వ్యాకులత చెందాడు. పనివాడిని ఆవిధంగా దొంగతనానికి పాల్పడేలా చేసిన కారణాలు
ఏమయిఉంటాయో దామూ అర్ధంచేసుకోలేకపోయాడు.
33 సంవత్సరాలుగా పనిచేస్తున్న పనివాడు ఆవిధంగా దొంగతనం చేసాడంటే
నమ్మలేకపోయాడు. వాడిని పిలిచి బాగా భయపెట్టారు దొంగిలించిన నగలు ఇమ్మని. ఇంకా ఎన్నో ఆశలు పెట్టారు. కాని వాడు దేనికి లొంగలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడు దొంగతనాన్ని
ఒప్పుకోలేదు. పనివాడు
ఏవిషయం చెప్పలేదు. పోలీసు
దర్యాప్తు జరిగింది. కాని ఈవిషయం కోర్టుదాకా తీసుకుని వెళ్ళకూడదని దామూ అన్న పదే పదే ఆలోచించాడు.
ఆఖరి ప్రయత్నంగా
దామూఅన్నా బాబా ఫోటోముందు కూర్చుని ప్రార్ధించాడు.
ఈవిషయాన్నంతా బాబాముందు ఉంచాడు. చివరికి బాబా కోర్టుకి తీసుకెళ్లాడు
దొంగతనం జరిగిన విషయం. తీర్చుచెప్పవలసినది బాబాయే. ఆమరుసటి రోజే పనివాడు తను ఎత్తుకుపోయిన
నగలపెట్టెని చెక్కు చెదరకుండా ఉన్నవి ఉన్నట్లుగా తెచ్చి దామూ
అన్నా ముందర పెట్టి క్షమించమని కోరాడు.
సందేహ నివృత్తి
ఈ సంఘటన 1910 -1911 సంవత్సర ప్రాంతంలో జరిగింది.
ఒకసారి ఎప్పటిలాగానే దామూసేఠ్ బాబా పాదాల వద్ద సేవ చేస్తు కూర్చొని
ఉన్నాడు. ఆసమయంలో దామూ
సేఠ్ మనసులో రెండు సందేహాలు ఉదయించాయి.
అందులో ఒకటి “బాబా దగ్గరకు ప్రతిరోజు ఎందరో
భక్తులు వస్తూ ఉన్నారు కదా, ఇక్కడికి రావడం వల్ల వారందరికీ ఏమయినా
లబ్ధి చేకూరిందా?” అతని మనసులో ఈప్రశ్న మెదలగానే బాబా
“దామూ – ఆమామిడి చెట్టును
చూడు. చెట్టునిండా పూతపూసి
నిండుగా ఉంది.
కాని కొన్ని పువ్వులు పూతదశలోనే మాడి రాలిపోతాయి. కొన్ని పిందెల దశలోనే రాలిపోతాయి. మరొకొన్ని కాయలు పక్వానికి రాకుండానే రాలిపడతాయి. కొన్ని మాత్రమే పక్వానికొచ్చి మామిడిపండ్లు అవుతాయి” అన్నారు.
కాని కొన్ని పువ్వులు పూతదశలోనే మాడి రాలిపోతాయి. కొన్ని పిందెల దశలోనే రాలిపోతాయి. మరొకొన్ని కాయలు పక్వానికి రాకుండానే రాలిపడతాయి. కొన్ని మాత్రమే పక్వానికొచ్చి మామిడిపండ్లు అవుతాయి” అన్నారు.
ఇక రెండవ సందేహం – “బాబా ఈ ప్రపంచంనుండి వెళ్ళిపోయిన తరువాత ఇక నాస్థితి ఏమిటి, నాకెవరు దిక్కు” అని మనసులో అనుకున్నాడు దామూ. బాబా వెంటనే అతనికి సమాధానమిచ్చారు. “దామ్యా నువ్వు ఎక్కడయినా ఎప్పుడయినా నాగురించి ఆలోచించిన వెంటనే నేను నీతోనే అక్కడే ఉంటాను”.
దామూ సేఠ్ తను మరణించేముందు
తన కుమారులను దగ్గరకు పిలిచి ఎంతో ఆదరంగా “అప్పుడప్పుడు బాబా నాకు డబ్బు ఇస్తూ వచ్చారు. అది ఇప్పటికి మొత్తం రూ.31/-
అయింది. వాటిని మీరు మీప్రాణాలకన్నా మిన్నగా భద్రంగా చూసుకోవాలి. ఇవి సామాన్యమయిన రూపాయినాణాలు కావు,
సాక్షాత్తు కామధేనువు. శ్రీసాయిబాబాకు మీరు చేసే సేవలో ఎటువంటి
లోటు రానీయవద్దు” అని చెప్పారు.
దామూ సేఠ్ తన 89వ.ఏట 1941 వ.సం. జనవరి 21 వ.తారీకున ఆఖరి శ్వాస తీసుకున్నాడు.
ఆయన తరువాతి తరాలవారందరూ
బాబానే తమ పరమ ఆరాధ్యదైవంగా కొలుచుకొన్నారు. ఈనాటికీ వారి కుటుంబంలోని పిల్లలు,
పెద్దలు అందరూ బాబా చెప్పిన ఉపదేశాలనే పాటిస్తూ వస్తున్నారు. దామూ అన్నా ఆదేశాలననుసరించి ఆయన పెద్ద
కుమారుడు నానాసాహెబ్ తన కుటుంబ బాగోగులకన్నా సాయిబాబాకు సేవచేయడానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు. అతని పారమార్ధికాభివృధ్ధికి
బాబా కూడా సహాయ పడ్డారు. అతను తన జీవితంలో అధికభాగం శ్రీసాయిబాబా తత్త్వప్రచారానికే వినియోగించారు. షిరిడీసాయి సంస్థానానికి ట్రస్టిగా
కూడా పనిచేసారు.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
No comments:
Post a Comment