Wednesday, June 3, 2020

దామూ అన్నా – నానాసాహెబ్ రాస్నే - 2 వ.భాగమ్


      Sai Baba Of Shirdi - A Blog: Radhakrishna Mai coming to Sai Baba ...
    flowers decoration roses yellow rose 1280x1024 wallpaper High ...

03.06.2020  బుధవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు మనం సాయి భక్తులలో ఒకరయిన దామూ అన్నా కాసార్ గారి గురించి రెండవభాగం లో మరికొంత సమాచారాన్ని తెలుసుకుందాము.
ఈ సమాచార సేకరణ shirdisaitrust.org చెన్నై వారినుండి గ్రహింపబడినది.

సాయిలీల - మరాఠీ రచయిత్రి - శ్రీమతి ముగ్ధా దివాద్కర్
ఆంగ్లానువాదమ్ - శ్రీ సుధీర్
తెలుగు అనువాదమ్ ః ఆత్రేయపురపు త్యాగరాజు
                                 నిజాంపేట, హైదరాబాద్


దామూ అన్నానానాసాహెబ్ రాస్నే - 2 .భాగమ్

మామిడిపండ్ల బుట్ట ద్వారకామాయికి చేరుకొన్న సమయంలో మసీదులో ఎప్పటిలాగానే పిల్లలు ఆడుకొంటూ ఉన్నారు.  మామిడపండ్లను ఆపిల్లలకు పంచిపెట్టారు.  కొళంబాలో పెట్టిన పండ్లను చూసి పిల్లలు వాటిని ఇమ్మని అడగసాగారు.  ఇంక పళ్ళేమీ మిగలలేదుఅన్నారు బాబా.  పిల్లలు కొళంబాలో ఉన్న మామిడిపండ్లను చూపిస్తూఅవిగో అందులో ఉన్నాయిగా పళ్ళుఅన్నారు.

ఇవి నా దామ్యా కోసం ఉంచానుఅన్నారు బాబా.

అయితే దామూ సేఠ్ ఎక్కడ? ఇక్కడ లేరుగా?” అన్నారు పిల్లలు.

అవును నిజమే .  కాని అతను షిరిడీకి వస్తున్నాడు.  దారిలో ఉన్నాడుఅన్నారు బాబా.

ఈలోపు బాబా లెండీ బాగ్ కు వెళ్ళడం చూసి, పిల్లలలో కొంతమంది కొళంబాలోనుంచి నాలుగు మామిడిపండ్లను ఎవరూ చూడకుండా తీసేసుకున్నారు.

బాబా, లెండీబాగ్ నుండి తిరిగివచ్చారు.  అప్పటికే దామూ వచ్చి బాబాను దర్శించుకుని ఆయనను పూజించడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు.

బాబా కొళంబాలోకి చూసేటప్పటికి ఎనిమిది మామిడిపండ్లలో నాలుగు మాత్రమే మిగిలి ఉన్నాయి.  అది చూసి బాబాఈ మామిడిపళ్ళమీద అందరి కళ్ళు పడ్డాయి.  కాని ఈ పళ్ళు వారివి కాదు.  అవి దామ్యావి.  అతను ఈ మామిడిపళ్ళను తిని చావాలిఅన్నారు.

చావాలిఅన్న బాబా మాటలు విని దామూ చాలా విస్మయం చెందాడు.  బాబా నిగూఢార్ధంతో మాట్లాడుతూ ఉంటారని దామూకి బాగా తెలిసున్నప్పటికి, బాబా మాటలు అతనికి చాలా బాధ కలిగించాయి.  బాబా అన్న అమంగళకరమయిన మాటలకి అతని కళ్ళల్లో నీరు నిండింది.

అపుడు మహల్సాపతి అతనిని ఓదారుస్తు  బాబా అన్నమాటలు నీకు ఆశీర్వాదాలుగా భావించు. ఆయనచావాలి అన్న మాటలు  శరీరానికి సంబంధించినది కావు.  బాబా ఉద్దేశ్యం ప్రకారం అవిద్య, మాయ, అహంకారం అనే చెడ్డ గుణాలు చావాలని మాత్రమే.  ఆయన చెప్పినట్లు చేస్తే నీకు అంతా శుభమే జరుగుతుందిఅన్నాడు.

బాబా ఆదేశం ప్రకారం దామూ అన్నా ఒక మామిడిపండు తిన్నాడు. 
మిగిలిన పండ్లను నీ భార్యకు ఇవ్వు.  భగవంతుని దయతో నీకు ఎనిమిది మంది సంతానం కలుగుతారుఅన్నారు బాబా ప్రశాంతమయిన స్వరంతో.

బాబాను పూజించిన తరువాత దాముసేఠ్ బయలుదేరుతూ, ఏదో గుర్తుకు వచ్చి, వెనక్కి తిరిగి బాబాను ఇలా ప్రశ్నించాడు. “ఈ పండ్లను నా పెద్ద భార్యకు ఇమ్మంటారా లేక చిన్న భార్యకు ఇమ్మంటారా?”

చిన్న భార్యకివ్వుఅన్నారు బాబా
        Shirdi Sai sitting in Dwarakamai, original photo – Thus Spake Mohanji

తన జాతకంలో పుత్రసంతానం లేదన్న బాధతో కృంగిపోతున్న  దామూసేఠ్ మనసులో  బాబా మాటలు కొత్త ఆశలురేపాయి.

దామూఅన్నా భార్య, బాబా పంపించిన ప్రసాదమయిన మామిడిపండ్లను తిన్న తరువాత ఆమెకు ఎనిమిది మంది సంతానం కలిగారు.  నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు.  కాని, పరిణామక్రమంలో నలుగురు పిల్లలు మరణించారు.  బాబా అతనికి సంతానం ఏక్రమంలో కలుగుతుందో ముందుగానే చెప్పారు.  బాబా చెప్పిన మాటలు నిజమయ్యాయి.  ఇంతేకాదు, బాబా ఇంకానీకు మొట్టమొదట ఇద్దరు కుమారులు జన్మిస్తారుఅని కూడా చెప్పారు.

బాబా చెప్పినట్లుగానే 1900 సంవత్సరం డిసెంబరు 6.తారీకు దత్తజయంతి రోజున మొదటి కుమారుడు జన్మించాడు.  బాబా ఆశిర్వాదంతో నలుగురు కుమారులూ మంచి ఆరోగ్యవంతులుగా, తెలివితేటలు కలవారిగాను, మంచి వ్యాపారవేత్తలుగాను, మంచి కుటుంబీకులుగాను పేరుగాంచారు.  ఆకుమారులు మంచి ధనికుల కుటుంబంలో జన్మింఅడం వల్ల తరువాతి సంవత్సరాలలో వారి సంపద కూడా ఎన్నోరెట్లు పెరిగింది.  ఆవిధంగా బాబా మాటలు యదార్ధమయ్యాయి.

బాబా దీవెనలవల్లే తనకు ఇద్దరు కుమారులు జన్మించి తన కుటుంబ కీర్తిపతాక రెరెపలాడిందని (తనకు నలుగురు కుమారులు జన్మించడం ద్వారా) దామూ అన్నా ప్రగాఢ నమ్మకం.  అందువలననే గోపాలరావు గుండు ఇచ్చిన సలహాప్రకారం మసీదుపైన జండా ప్రతిష్టించే కార్యక్రమాన్ని ప్రారంభించాడు.  మసీదులో రాళ్ళుపరచడానికి తగిన ధనసహాయం కూడా చేసాడు.

మసీదుపైన జండా ప్రతిష్టించిన తరువాత అదామూఅన్నా బీదవారికి, అన్నార్తులకు, అన్నదానం చేసాడు.  ఈకార్యక్రమం రెండవసంవత్సరం ఉరుసు ఉత్సవంనాడు జరిగింది.

దామూఅన్నా నైవేద్యం తయారుచేసి బాబాని భోజనానికి ఆహ్వానించాడు.  బాబాకి మసీదు దాటి ఎక్కడికీ భోజనానికి వెళ్ళే అలవాటులేదని అతనికి తెలుసు.  అందువలన అతను బాబాతో బాబా, బాలాజీపాటిల్ నెవాస్కర్ ని భోజనానికి  పంపించండి అని వేడుకొన్నాడు.  బాలాజీ నిమ్నకులానికి చెందినవాడవటం వల్ల బాబా అతనితో, “నువ్వు అతనిని చాలా దూరంగా ఎక్కడో కూర్చోబెట్టి తరిమేస్తావుఅన్నారు.   పదేపదే అడిగిన మీదట ఆఖరికి బాబా ఒప్పుకొన్నారు.

దామూసేఠ్ వివిధరకాల భోజన పదార్ధాలను ఒక పళ్ళెంనిండా అమర్చి బాబా ఫోటోముందు ఉంచి ముందుగా నైవేద్యం పెట్టాడు.  ఆ తరువాత తను వడ్డించుకున్న పళ్ళెం పక్కనే బాలాజీ పాటిల్ కి కూడా పళ్ళెంలో వడ్డించి, “బాబా రాఅని గట్టిగా  పిలిచాడు.  ఆ వెంటనే అకస్మాత్తుగా ఒక నల్లని పెద్ద కుక్క వంటినిండా బురద, మట్టి అంటించుకుని అక్కడికి వచ్చింది.  దామూసేఠ్ దానిని తరిమివేద్దామనుకునేంతలో, బాబా అన్నమాటలుతరిమివేస్తావుగుర్తుకు వచ్చాయి.  అపుడతనికి అనిపించింది  బాబా ఆ కుక్కను తనను పరీక్షించడానికే పంపించారని.  దామూఅన్నా మొదట ఆకుక్కకి ఆహారం పెట్టిన తరువాతనే మిగిలినవారు భోజనానికి ఉపక్రమించారు.

(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)



No comments:

Post a Comment