20.06.2020 శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన
సందేహాలు –
బాబా
సమాధానాలు – 10 (4)
గురుభక్తి 4 వ.భాగమ్
ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్
ఫోన్. 9440375411 & 8143626744
మైల్ ఐ.డి.
tyagaraju.a@gmail.com
నిత్యము గురుదేవుని రూపమునే స్మరింపవలెను. గురుదేవుని నామమునే సదా స్మరింపవలెను. గురుదేవుని యొక్క ఆజ్ఞను పాటింపవలెను. గురువు కన్నను అన్యమైనదానిని భావించకూడదు.
--- గురుగీత శ్లో. 39
(శ్రీ సాయి సత్ చరిత్ర అ. 32 లో బాబా అన్న మాటలు. “గురువుగారి మెడను కౌగిలించుకొని
వారిని తదేక దృష్టితో నెల్లప్పుడు చూచుచుండవలెననిపించినది. వారి ప్రతిబింబము నా కనుపాపలందు నిలువనప్పుడు
నాకు కనులు లేకుండుటే మేలనిపించెడిది.
నా గురువే నాకు సమస్తముగా తోచుచుండెను.
నా ఇల్లు, నా యాస్తి నా తల్లిదండ్రులు అంతయు వారే. నా ఇంద్రియములన్నియు తమతమ స్థానములు విడచి, నా కండ్లయందు కేంద్రీకృతమయ్యెను. నా దృష్టి గురువునందు కేంద్రీకృతమయ్యెను. నా ధ్యానమంతయు నా గురువుపైననే నిల్పితిని. నాకింకొకదానియందు స్పృహ లేకుండెను. వారిని ధ్యానము చేయునప్పుడు నా మనసు, నా బుధ్ధి స్తబ్దమగుచుండెను. నిశ్శబ్దముగా వారికి నమస్కరించుచుంటిని.)
నా ఇల్లు, నా యాస్తి నా తల్లిదండ్రులు అంతయు వారే. నా ఇంద్రియములన్నియు తమతమ స్థానములు విడచి, నా కండ్లయందు కేంద్రీకృతమయ్యెను. నా దృష్టి గురువునందు కేంద్రీకృతమయ్యెను. నా ధ్యానమంతయు నా గురువుపైననే నిల్పితిని. నాకింకొకదానియందు స్పృహ లేకుండెను. వారిని ధ్యానము చేయునప్పుడు నా మనసు, నా బుధ్ధి స్తబ్దమగుచుండెను. నిశ్శబ్దముగా వారికి నమస్కరించుచుంటిని.)
( శ్రీసాయి సత్ చరిత్ర అ. 3. బాబా చెప్పిన మాటలు. “ ప్రేమతో నా నామమునుచ్చరించిన వారి
కోరికలన్నియు నెరవేర్చెదను. వారి భక్తిని హెచ్చించెదను.
వారినన్ని దిశలందు కాపాడెదను. ఎవరైతే మనఃపూర్వకముగా నాపై పూర్తిగా
నాధారపడియున్నారో వారీ కధలు వినునప్పుడు అమితానందమును పొందెదరు. నా లీలలను గానము చేయువారికంతులేని
యానందమును శాశ్వతమైన తృప్తిని ఇచ్చెదనని నమ్ముము.)
భక్తునియొక్క ప్రధమ కర్తవ్యం తాను గురువుయొక్క
అనుగ్రహాన్ని పొందడానికి తగినట్లుగా ప్రవర్తించడం.
భక్తుని అంతఃకరణ నిర్మలంగా, నిరాడంబరంగా,
నిజాయితీగా ఉండాలి. తన గురువు మీద సంపూర్ణమయిన విశ్వాసంతో మెలగాలి. అటువంటి భక్తుడిని గురువు ఉధ్ధరిస్తాడు. అతనికి ఉత్తమ శక్తులను ప్రసాదిస్తాడు. భక్తునియొక్క గమ్యం గురువు చేతుల్లో
సురక్షితంగా ఉంటుంది.
చూడగనే భ్రమలు కల్పించు గురువులు వందనీయులు
కారు. అట్టివారిని త్యజించి
ధీరులైన గురువులను ఆశ్రయించాలి. గురుగీత
--- శ్లో.200
నేటి ప్రపంచంలో ఎంతోమంది గురువులు ఉన్నారు. వీరిలో ఏగురువును మనం అనుసరించాలనే
విషయంలో సరిగా ఏదీ నిర్ణయించుకోలేని స్థితి కలుగుతుంది. ఒక్కొక్క
గురువు పధ్ధతి వేరు వేరుగా ఉంటుంది.
అందరి విధానాలు ఒక్కటిగా ఉండకపోవచ్చు. అందువల్ల మన సద్గురువు అయిన బాబాని
మించిన సద్గురువు మరొకరెవరూ లేరు. మనం మన బాబాయందే మన నమ్మకాన్ని పదిలపరచుకుని ఆయన చెప్పిన ఉపదేశాలను పాటించినట్లయెతే
మన గమ్యాన్ని చేరుకోగలం.
కొంతమందికి కాస్త అహంకారం ఉంటుంది. మాకు ఎటువంటి గురువు అవసరం లేదు. ఏది తప్పో, ఏది ఒప్పో మాకు తెలుసు. నామనస్సాక్షికి తెలుసు అని గర్వంతో విఱ్ఱవీగుతూ ఉంటారు. వారి మనస్సే కలుషితమయి ఉన్నట్లయితే
ఇక సరైన నిర్ణయాలు కూడా తీసుకోలేరు.
ఇటువంటి వ్యక్తుల మనసులను ప్రక్షాళనం చేయాలంటే ఒక్క సద్గురువుకే
సాధ్యం. గురువుకే అహంకారం
ఉన్నట్లయితే ఇక తన శిష్యులను మోక్షమార్గంవైపు ఏవిధంగా తీసుకెళ్లగలడు. బాబా చెప్పినట్లు ఉత్త పుస్తక జ్ఞానం
సరిపోదు.
(శ్రీ సాయి సత్ చరిత్ర అ. 32 … బాబా అన్న మాటలు “ పుస్తకజ్ఞానమెందుకు పనికిరానిది. మనకు విధింపబడిన కర్మను మనము పూర్తిచేసి,
తనువును, మనమును, పంచప్రాణములను
గురువు పాదములపై బెట్టి శరణు వేడవలెను.
గురువే దైవము.
సర్వమున వ్యాపించినవాడు. ఇట్టి ప్రత్యయమేర్పడుటకు,
ధృఢమైన యంతులేని నమ్మకమవసరము”)
(శ్రీ సాయి సత్ చరిత్ర అ.45 గురుని పాదములు భక్తితో ధ్యానించిన చాలును అని బాబా నొక్కి చెప్పి యున్నారు.)
ఆత్మజ్ఞానము లేనివాడు, కపటవచనములు పలుకువాడు, బాహ్యవేషమును ధరించువాడునగు గురువును త్యజించాలి. అతడు ఆత్మయందు విశ్రమించుట ఎరుగడు. ఇతరులకు శాంతిని ఎలా ప్రసాదించగలడు?
--- గురుగీత – శ్లో. 198
(శ్రీ సాయి సత్ చరిత్ర అ. 10. గురువులమని చెప్పుకొని తిరుగువారు అనేకులు గలరు. వారు ఇంటింటికి తిరుగుచు వీణ,
చిరతలు చేతబట్టుకొని ఆధ్యాత్మికాడంబరము చాటెదరు. శిష్యుల చెవులలో మంత్రముల నూది వారినుండి
ధనము లాగెదరు. పవిత్రమార్గమును
మతమును బోధించెదమని చెప్పెదరు. కాని మతమనగానేమో వారికే తెలియదు.
స్వయముగా వారపవిత్రులు. సర్వవిధముల ప్రపంచజ్ఞానమును బోధించు
గురువులనేకులు గలరు. కాని మనలనెవరయితే సహజస్థితి యందు నిలుచునట్లు చేసి మనలను ప్రపంచపుటునికికి
అతీతముగా తీసికొని పోయెదరో వారే సద్గురువులు.)
(శ్రీ సాయి సత్ చరిత్ర అ.32 బాబా చెప్పిన మాటలు… “ఇతర పాఠశాలలలో పూర్తిగా మరొక విధమైన దృశ్యములు కానవచ్చును. భక్తులు జ్ఞానము సంపాదించుటకు పోయి
ద్రవ్యమును, కాలమును కష్టమును వ్యయము చేసెదరు. తుట్టతుదకు పశ్చాత్తాప పడెదరు. అక్కడున్న గురువు తనకు గల రహస్యశక్తిని
గురించి తన ఋజువర్తనము గూర్చి పొగడుకొనుచు, తన పావిత్ర్యమును
ప్రదర్శించునే గాని, హృదయము మృదువుగా నుండదు. అతడనేకవిషయముల గూర్చి మాట్లాడును. తన మహిమను
తానే పొగడుకొనును. కాని
యతని మాటలు భక్తుల హృదయమందు నాటవు.
వారిని ఒప్పింపజేయవు. ఆత్మసాక్షాత్కారమతనికి తెలియనే తెలియదు. అటువంటివారు శిష్యులకేమి మేలు చేయుదురు.)
( శ్రీ సాయి సత్ చరిత్ర అ.45 “ఈ లోకములో ననేకమంది యోగులు గలరు.
గాని మన గురువసలైన తండ్రి. ఇతరులు అనేక సుబోధలు చేయవచ్చును. కాని, మనము
మన గురువుయొక్క పలుకులను మరువరాదు. వేయేల, హృదయపూర్వకముగా నీగురువును ప్రేమించుము. వారిని సర్వస్య శరణాగతి వేడుము. భక్తితో వారి పాదములకు మ్రొక్కుము. అట్లుచేసినచో సూర్యుని ముందు చీకటి లేనట్లు, నీవు దాటలేని భవసాగరము లేదు.”
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
No comments:
Post a Comment