30.04.2024
మంగళవారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బందువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయిలీల ద్వైమాస పత్రిక నవంబరు, డిసెంబరు
2023 సంచికనుండి గ్రహింపబడినది.
ఆంగ్ల
మూలం : డా.క్షితిజ రాణే
తెలుగు
అనువాదం ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్
ఫోన్.
9440375411, 8143626744
సాయి
అనుగ్రహం అపారమ్ – 9 వ.భాగమ్
ఆ రెండు రోజులలోను జాదవ్ గారు అతని గురించి మరింత సమాచారం సేకరించడానికి ప్రయత్నించారు. అనుమానితుడి పేరు సయ్యద్ ఖాద్రి. అతను హైదరాబాద్ నివాసి. అతని మీద బొంబాయిలో చాలా కేసులు ఉన్నాయి. జాదవ్ గారు తాను సేకరించిన సమాచారం ప్రకారం అనుమానితుడే దోషి అని నిరూపించడానికి ప్రయత్నించినా గాని అతని పై అధికారులు అతను చేసిన ప్రయత్నాలను లక్ష్య పెట్టలేదు.
అనుమానితుడె నేరస్థుడు
అని నిరూపించడానికి అన్ని సాక్ష్యాలు ఉన్నాయని పలుమార్లు ఎంత ప్రయత్నం చేసినా గాని,
ఎవరూ కూడా అతని మీద కేసు పెట్టి అరెస్టు చేయడానికి సుముఖంగా లేరు. దీనిని బట్టి దోషి అయిన ఖాద్రి ప్రతివారిని తనకు
అనుకూలంగా చేసుకున్నాడని జాదవ్ గారికి అర్ధమయిపోయింది. ఇక తన విలువయిన సమయాన్ని ఇతర కేసుల మీద దృష్టి పెట్టడానికి
నిర్ణయించుకుని ఆ విషయాన్ని అంతటితో వదిలేశారు.
15
రోజుల తరువాత కోర్టువారు శ్రీ జాదవ్ గారి ఇంటికి ఆయన పేరు మీద సమన్లు పంపించారు. ఎఫ్. ఐ. ఆర్. రిజిస్టర్ చేయకుండా తన మీద అన్యాయంగా
చాప్టర్ కేసు పెట్టి తనను పోలీస్ స్టేషన్ కు తీసికెళ్లి అరెస్టు చేసారని జాదవ్ గారి
మీద కంప్లెయింట్ చేశాడు ఖాద్రి.
శ్రీ
జాదవ్ గారు తన పై అధికారులకి ఈ విషయాన్నంతా చెప్పినా గాని, వారు సహాయం చేయడానికి తమ
అశక్తతను వెల్లడించారు. అందుచేత ఆయన ఒక హైకోర్టు
అడ్వకేట్ ని సంప్రదించారు. కోర్టులో జడ్జిగారు
ఖాద్రి మీద రిజిస్టర్ చేసిన క్రిమినల్ కేసుల సాక్ష్యాలను చూపించాలనీ, లేనట్లయితే జాదవ్
గారు తప్పు చేసారని భావించవలసి ఉంటుందని అన్నారు.
సాక్ష్యాలను సేకరించడానికి వారం రోజుల వ్యవధి కావాలని, శ్రీ జాదవ్ గారి అడ్వకేట్
కోర్టునుంచి అనుమతి పొందారు.
ఈ
వారం రోజులు జాదవ్ గారు ఖాద్రీయే దోషి అని నిరూపించే సాక్ష్యాలను సేకరించడానికి విశ్వప్రయత్నం
చేసారు. కాని, ఆయనకు ఎవరూ సహకరించలేదు. జాదవ్ గారు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. కోర్టువారు ఇచ్చిన గడువు కూడా ముగిసిపోయింది. జాదవ్ గారు ఒక్క సాక్ష్యం కూడా సంపాదించలేకపోయారు.
(కోర్టుకు వెళ్ళిన రోజు సాయిబాబా చూపిన లీల, తరువాతి సంచికలో)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
No comments:
Post a Comment