Wednesday, February 4, 2026

శ్రీ సాయిమహరాజ్ ప్రసాదించిన అధ్భుత అనుభవాలు… 4 వ.భాగమ్



04.02.2026 గురువారమ్

ఓం సాయి శ్రీ సాయి జయయయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయిలీల ద్వైమాస పత్రిక నవంబరు, డిసెంబరు, 2025 సంచికలో ప్రచురింపబడిన బాబా లీలలు. 

(సెప్టెంబరు, అక్టోబరు, 2025 సంచికలో ప్రచురింపబడినవాటికి కొనసాగింపు)

శ్రీ సాయి మహరాజ్ ప్రసాదించిన అధ్బుత అనుభవాలు

శ్రీ సాయిబాబా వారి పవిత్రమయిన ఊదీ యదార్ధ సంఘటనల ఆధారంగా జరిగిన ఆధ్యాత్మిక గాధ.

 

శ్రీ సాయిమహరాజ్ ప్రసాదించిన అధ్భుత అనుభవాలు 4 వ.భాగమ్

మరాఠీ నుండి ఆంగ్లానువాదం..  షంషాద్ మీర్జా

తెలుగు అనువాదం .. ఆత్రేయపురపు త్యాగరాజు,

నిజాంపేట, హైదరాబాద్,

ఫోన్ --  9440375411 & 81436267

ఈ మెయిల్.. tyagaraju.a@gmail.com

అది 1924 వ.సంవత్సరం.  ఒక ఇంటిలో గణేష్ చతుర్ధి పండుగ జరుగుతున్న రోజున గణపతి సమక్షంలో అత్యంత క్లిష్ట క్షణాలలో శ్రీ సాయిబాబా వారి ఊదీ యొక్క దైవిక శక్తిని మేము కళ్ళారా చూశాము. 

కుమార్తె – మంగళకారుడయిన వినాయకుడు

ఇంటిలో గణేష చతుర్ధిని ఎంతో భక్తిశ్రధ్ధలతో జరుపుకుంటూ ఉంటారు.  ప్రతి సంవత్సరం విఘ్నేశ్వరుడి ప్రతిమను తీసుకుని వచ్చి రోజున్నరపాటు పూజిస్తూ ఉంటారు.  కాని ఈ సారి మాత్రం వారు చేయబోయే పండుగ వేడుకకి బాధాకరమయిన పరిస్థితి వారికి శిరోభారంగా ఉంది.

అన్నగారి కుమార్తెకు నాలుగు సంవత్సరాల వయస్సు.  ఆమె ఎప్పటినుంచో అనారోగ్యంతో బాధపడుతూ ఉంది.  ఎన్నో రకాల వైద్యాలు చేయించినా ఆమె పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు.  భాద్రపదశుధ్ధ అయిదవరోజు గణేష్ నిమజ్జనం -  ఆరోజున ఆమెకు జ్వరం చాలా హెచ్చుగా ఉండి స్ప్రుహ హ కోల్పోయింది.

పిలిచిన వెంటనే వైద్యుడు వచ్చాడు.  పరీక్షించి ఒక భయంకరమయిన విషయాన్ని చెప్పాడు.  “ఆమె ఒక గంటన్నర కన్నా బ్రతుకదు”’

కుటుంబ సభ్యులందరి హృదయాలలో ఆవార్త భయోత్పాతాన్ని కలిగించింది.  అయినప్పటికి నిరాశ ఆవహించిన సమయంలో ఇక ఎటువంటి దారి లేనపుడు ప్రతి సాయి భక్తుడు చేసేదే మేము కూడా బాబా పాదాలకు శరణాగతి వేడుకున్నాము.

మేము కన్నీటితో మంగళమూర్తి  అయిన విఘ్నేశ్వరుడికి, సాయిబాబాకు ప్రార్ధించుకున్నాము.


అప్పుడు అమ్మాయికి ఒక చిటికెడు ఊదీని ఇచ్చాము.  ఇచ్చిన మరుక్షణమే ఆమెలో 

కాస్త మార్పు కనిపించింది.

జరగబోయే విపరీతానికి సిధ్ధపడి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నప్పటికీ, అమ్మాయి 

పరిస్థితి నిలకడగా ఉంది.  మూడురోజుల తరువాత అమ్మాయి ఆరోగ్యం క్రమక్రమంగా మెరుగవసాగింది.

అదృశ్యంగా బాబా గారే వచ్చి అమ్మాయికి వైద్యం చేసి కాపాడారనడంలో ఎటువంటిసందేహం లేదు.

  (ఊదీ లీలలు ఇంకా ఉన్నాయి)

(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)

 

 

 


No comments:

Post a Comment