Sunday, February 1, 2026

శ్రీ సాయిమహరాజ్ ప్రసాదించిన అధ్భుత అనుభవాలు… 3 వ.భాగమ్

 

02.02.2026 సోమవారమ్

ఓం సాయి శ్రీ సాయి జయయయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయిలీల ద్వైమాస పత్రిక నవంబరు, డిసెంబరు, 2025 సంచికలో ప్రచురింపబడిన బాబా లీలలు. (సెప్టెంబరు, అక్టోబరు, 2025 సంచికలో ప్రచురింపబడినవాటికి కొనసాగింపు)

శ్రీ సాయి మహరాజ్ ప్రసాదించిన అధ్బుత అనుభవాలు

శ్రీ సాయిబాబా వారి పవిత్రమయిన ఊదీ యదార్ధ సంఘటనల ఆధారంగా జరిగిన ఆధ్యాత్మిక గాధ.

శ్రీ సాయిమహరాజ్ ప్రసాదించిన అధ్భుత అనుభవాలు3 .భాగమ్

మరాఠీ నుండి ఆంగ్లానువాదం..  షంషాద్ మీర్జా

తెలుగు అనువాదం .. ఆత్రేయపురపు త్యాగరాజు,

నిజాంపేట, హైదరాబాద్,

ఫోన్ --  9440375411 & 81436267

ఈ మెయిల్.. tyagaraju.a@gmail.com

జీవితానికి ఆఖరి క్షణాలు - విశ్వనాధ్ కోలుకొనుట

కాని ఈ అధ్భుతాలు ఇంతటితో ఆగలేదు.  మా అబ్బాయికి (అంటే నేను, ఎల్.ఎం.ప్రధాన్) వయస్సు తొమ్మిది సంవత్సరాలు.

ఒకరోజున మా అబ్బాయి ఒకే ఒక్క అడుగు ఉన్న చిన్న గోడపైనుంచి కిందపడ్డాడు.  పడ్డవెంటనే నాకు బాగా చలిగా ఉందిఅన్నాడు.

బహుశా అది మలేరియా కావచ్చని నేను నా భార్య మా అబ్బాయిని మంచం మీద పడుకోబెట్టి దుప్పటి కప్పాము.  వాడి నిద్రకు భంగం కలగకుండా కనిపెట్టుకుని చూస్తున్నాము.  కాని రాత్రి ఏడు గంటలవేళ వాడిని లేపడానికి ప్రయత్నించాము.  కాని వాడు స్పృహలో లేడు.


బాగా భయాందోళనకు గురయ్యి వెంటనే వైద్యుడిని పిలిపించాము.  వైద్యుడు వచ్చి బాగా పరీక్షించి, “పిల్లవాడికి వాతం వచ్చింది.  పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందిఅన్నాడు.

చాలా మంది వైద్యులను కలిసి అన్ని రకాల వైద్యాలు చేయించాము.  కొంతమంది ఆస్పత్రికి తీసుకువెళ్ళమని సలహా ఇచ్చారు.  కాని ఎవరూ ఆశాజనకంగా చెప్పలేదు.

నాకా సమయంలో బాబా గుర్తుకు వచ్చారు. మహా శక్తిమంతుడయిన అసలయిన వైద్యుడు బాబా ఉండగా ఆయన శక్తితో సరిపోల్చదగిన మానవమాత్రుడయిన వైద్యుడు ఎవరూ ఉండరు.”

పిల్లవాడికి ఏమవుతుందోననే భయాందోళనలతో వాతావరణం భారంగా గడుస్తొంది.  ఇక పిల్లవాడు ఆఖరిక్షణాలలో ఉన్నాడని భావించి అంత్యక్రియలకి ఏర్పాట్లు మొదలుపెట్టారు.  అన్నిటికి సిధ్ధపడి దగ్గరి బంధువులు చుట్టుప్రక్కలవారు అందరూ సమావేశమయ్యారు.

అదేక్షణంలో ఒక గంభీరమయిన స్వరం వినిపించింది.  ఆస్వరంలో ఒక స్థిరమయిన నమ్మకం  ప్రస్ఫుటంగా ధ్వనించింది.

ఆందోళనపడకండి….పిల్లవాడు సజీవంగానే ఉన్నాడు.”

ఆ స్వరం మా వదినగారయిన గంగా రూపాబాయిది.  ఆమె ధృఢమయిన ఆత్మ విశ్వాసంతో ఒక చెమ్చాతో పిల్లవాడి నోరు తెరచి నోటిలో ఊదీని వేసింది.

ఆ ఊదీ కడుపులోకి వెళ్ళిందా లేదా అన్న విషయం ఇదమిధ్ధంగా తెలియదు, కాని అది జరిగింది.  ఒక విధమయిన అధ్బుతం జరిగింది.  మూడు రోజులుగా ఉన్నటువంటి అచేతన స్థితికి ముగింపు జరిగింది.

పిల్లవాడి కళ్ళు నెమ్మదిగా తెరుచుకున్నాయి.  మొట్టమొదటగా గోడమీద ఉన్న బాబా చిత్రపటాన్ని చూశాడు.  వణుకుతున్న చేతులను నెమ్మదిగా పైకెత్తి భక్తిభావంతో బాబాకు నమస్కారం చేసుకున్నాడు.

మొట్టమొదటగా బాబాకు నమస్కారం చేసుకున్న తరువాత గంగా రూపాబాయికి, అక్కడ తన చుట్టూ ఉన్నవారందరికీ నమస్కారం చేసుకున్నాడు. ఖచ్చితంగా మరణించాడనే అనుకుంటున్న దశలో మా అబ్బాయిని బాబాగారే తిరిగి తీసుకువచ్చారనటంలో ఎటువంటి సందేహం లేదు.

బాబాకు ఏవిధంగా మాకృతజ్ఞతలను తెలుపుకోగలం.…అది మాటలకందనిది.

బాబా గారి ఊదీతో కలిగిన అధ్భుతాలను నేనెన్నో సార్లు అనుభవంచాను.  కాని, ఈ సారి చేసిన అత్యత్భుతం నాహృదయంలో గాఢమయిన ముద్రవేసింది.  కాని, ఇంకా ఇటువంటి అద్భుతాలను అందరితో పంచుకోవాలనుకోవడానికి కాస్త సందేహించాను.  ప్రజలు ఏమనుకుంటారో అనే భయం. “లోకాపవాదంఅని అంటాను.  లోకులలో అపనమ్మకాలతో కూడిన వ్యర్ధ ప్రేలాపనలు, ఎగతాళి మాటలు.

ఒక విషయం మట్టుకు మీకు వివరించాలి.  శ్రీ సాయిలీల క్రిందటి సంచికలు (సం.6, సంచికలు 11-12) చదువుతున్నపుడు నాలో ఒక విధమయిన మార్పు వచ్చింది.  అకస్మాత్తుగా నాలో బాబాయే నా హృదయంలో చిన్నగా మాటలాడినట్లుగా ఒక ప్రేరణ.

నీ అనుభవాలను గురించిన వాస్తవాలను లోకానికి తెలియజేయి

ఆ ప్రేరణతోనే నేను ఊదీతో నాకు కలిగిన, నేను అనుభవించిన లీలలను వ్రాస్తున్నాను. “ఇది ఊదీ యొక్క అధ్బుత శక్తి”. బాబావారి లీలలు అగాధం అసలుసిసలయిన సాయి భక్తులు మాత్రమే వాటి గొప్పదనాన్ని అర్ధం చేసుకోగలరు.

ఎంతో వినమ్రతతో నేను ఇస్తున్న చివరి వివరణ….

ఒక వాగ్దానంతో నేనీ ఉత్తరాన్ని ముగిస్తున్నాను.  ఒకసారి నాకు వచ్చిన ఒక స్వప్నం నాలో ఎంతగానో కలత చెందేలా చేసింది.  దానియొక్క అర్ధాన్ని పరమ భక్తుడయిన కీ.శే. ధబోల్కర్ గారు దానిని ఎలా అర్ధంచేసుకోవాలో నాకు తెలియచేసి సహాయం చేసారు.  ఆ విషయాన్ని బాబా అనుమతించినట్లయితే దాని గురించి మరింతగా మీకు వివరిస్తాను.

మీ విధేయుడు

ఎల్.ఎం.ప్రధాన్,

తలతి, షహపూర్ జిల్లా, ధానే

29.12.1930

శ్రీ సాయిలీ, సం.8, సంచిక 3

(ఊదీ వల్ల కలిగిన అధ్భుతాలు ఇంకా ఉన్నాయి)

(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)

No comments:

Post a Comment