Wednesday, March 18, 2026

శ్రీ సాయిమహరాజ్ ప్రసాదించిన అధ్భుత అనుభవాలు… 9 వ.భాగమ్



19.03.2026 గురువారమ్

ఓం సాయి శ్రీ సాయి జయయయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

తెలుగు నూతన సంవత్సర శుభా కాంక్షలు

శ్రీ సాయిలీల ద్వైమాస పత్రిక జనవరి, ఫిబ్రవరి, 2026 సంచికలో ప్రచురింపబడిన బాబా లీలలు. (నవంబరు, డిసెంబరు, 2025 సంచికలో ప్రచురింపబడినవాటికి కొనసాగింపు)

శ్రీ సాయి మహరాజ్ ప్రసాదించిన అధ్బుత అనుభవాలు

శ్రీ సాయిబాబా వారి పవిత్రమయిన ఊదీ యదార్ధ సంఘటనల ఆధారంగా జరిగిన ఆధ్యాత్మిక గాధ.

శ్రీ సాయిమహరాజ్ ప్రసాదించిన అధ్భుత అనుభవాలు 9 .భాగమ్

మరాఠీ నుండి ఆంగ్లానువాదం..  షంషాద్ మీర్జా

తెలుగు అనువాదం .. ఆత్రేయపురపు త్యాగరాజు,

నిజాంపేట, హైదరాబాద్,

ఫోన్ --  9440375411 & 81436267

ఈ మెయిల్.. tyagaraju.a@gmail.com

శ్రీ సాయిబాబా వారి పవిత్రమయిన ఊదీ – మాహాత్మ్యమ్

     దాదాపు 15 సంవత్సరాలయినా, సాయిభక్తులు, నమ్మకానికి ఉన్న శక్తికి, సద్గురు సాయియొక్క అదృశ్య రక్షణకు సంబంధించిన ఒక సంఘటనను గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు.

     బాబా ఒకనాడు మసీదులో మాటలాడిన మాటలను బాపూసాహెబ్ జోగ్ కు గుర్తుకు వచ్చింది.

                            (బాపూ సాహెబ్ జోగ్)

     “కాకా (కీ.శే. భావూసాహెబ్ దీక్షిత్) బాగా జ్వరంతో బాధపడుతున్నాడు.  నేను లేకుండా అతను మందులు వేసుకోడు.  నేను పార్లెకి వెళ్ళాలి.  కాని నువ్వు అతన్ని ఇక్కడకు పిలుచుకు రా”.

     అప్పటికి భావూసాహెబ్ గత 15 రోజులుగా జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు.  బాబా మీద అతనికి ఉన్న అచంచలమయిన భక్తి విశ్వాసాల కారణంగా ఎటువంటి మందు తీసుకోకుండా కేవలం బాబాగారి పవిత్రమయిన ఊదీ, తీర్ధ జలంతోనే తన జ్వరం తగ్గుతుందనే నిశ్చితాభిప్రాయంతో ఉన్నాడు.

     బాపూసాహెబ్ ద్వారా సాయి పంపిన సందేశాన్ని అందుకున్న భావూ సాహెబ్ మరుసటిరోజు సాయంత్రమే షిరిడీకి బయలుదేరి వెళ్ళడానికి స్థిరనిర్ణయం తీసుకున్నాడు.  తన భార్యకు ఎటువంటి ఆందోళన కలగగుండా ఉండటానికి తనని పార్లెనుంచి షిరిడీకి తీసుకువెళ్ళమని నాకు సందేశం పంపించాడు.

     ఇక బయలుదేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో బావూసాహెబ్ పరిస్థితి కొత్తగా మరింత ఆందోళన కలిగించింది.  అతని బంగళాకు వెళ్ళినపుడు అతని పరిస్థితి మరింత దిగజారింది.   మేము ఒక   మంచి నిర్ణయం తీసుకునేలా బాబా మాలో ఒక ప్రేరణ కలిగించారు.

భావూసాహెబ్, అతని భార్య, వారింటిలోని వంటమనిషి ముగ్గురూ షిరిడికి బయలుదేరడానికి నిర్ణయమయింది.

     ఈవిధంగా వారి ప్రయాణం అలా ఎందుకని చేయవలసివచ్చిందో అది వారి అదృష్టమనే విషయం వారికి తెలిసివచ్చింది.  మన్మాడ్ రైల్వే స్టేషన్ లో భయం గొలిపే సంఘటన జరిగింది.  వీరు కూర్చున్న బోగీలోకి కొంతమంది విదేశీ సైనికులు స్త్రీల బోగీలోకి దూసుకురావడానికి ప్రయత్నించారు.  అది మహిళల బోగీ.  ఆ బోగీలొ వీరిద్దరే స్త్రీలు ఉండటంతో ఆ సైనికులు ఇక ఆ బోగీలోకి ఎక్కే ప్రయత్నం చేయలేదు.

     ఒకవేళా భావూసాహెబ్ ఒక్కడె, అనారోగ్యంతో బాధపడుతూ ఆ రైలు బోగీలో ప్రయాణం చేస్తూ ఉన్నట్లయితే ఆ క్షణంలో పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించుకోండి.  ఆ బోగీలో ఇద్దరు స్త్రీలు (అనగా అతని బార్య, వారింటి వంటమనిషి) ఉండటం వల్లనే ఆ సైనికులు బోగీలోకి ప్రవేశించడానికి సాహసించలేదు.

     ఇంకొక ముఖ్యమయిన విషయం ఏమిటంటె పార్లెలో రోజుల తరబడి భావూసాహెబ్ ను బాధపెట్టిన జ్వరం షిరిడీలో అడుగు పెట్టిన వెంటనే అధ్బుతం జరిగి అతని జ్వరం తగ్గిపోయింది.  ఇక మరెన్నడు అతను జ్వరంతో బాధపడలేదు.

(ఇంకా ఉంది)

(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)

No comments:

Post a Comment