Tuesday, April 16, 2024

సాయి అనుగ్రహం అపారమ్ – 2 వ.భాగమ్

 




16.04.2024 మంగళవారం

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బందువులకు బాబావారి శుభాశీస్సులు

 శ్రీ సాయిలీల ద్వైమాస పత్రిక నవంబరు, డిసెంబరు 2023 సంచికనుండి గ్రహింపబడినది.

ఆంగ్ల మూలం :  డా.క్షితిజ రాణే

తెలుగు అనువాదం ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్

ఫోన్. 9440375411,  8143626744

సాయి అనుగ్రహం అపారమ్ – 2 వ.భాగమ్

బాబా ఇచ్చిన మాట ప్రకారం ఎటువంటి కష్టం లేకుండా సీతాబాయికి సుఖపసవం అయింది. కాని ఆసమయంలో ఒక అధ్భుతమయిన సంఘటన జరిగింది. ప్రసవం అయిన తరువాత పిల్లవాడు ఆపకుండా ఏడుస్తూ ఉండటం హేమాడ్ పంత్ కు వినిపించింది.  విషయమేమిటో తెలుసుకుందామని  గదిలోకి వెళ్ళారు.  గదిలో కనిపించిన దృశ్యం ఆయన కంట పడేటప్పటికి నోటమాట రాలేదు.  పిల్లవాడి శిరస్సు చుట్టూ అధ్బుతమయిన వెలుగు (ఆరా) ప్రకాశవంతంగా గోచరిస్తూ ఉంది.  అది చూసి సీతాబాయికి చాలా భయం వేసి స్థాణువులా అయియింది.  ఆభయంతో ఆమె గదిలో ఒక మూలకు వెళ్ళి కూర్చుంది.  పిల్లవాడు (అనంతప్రభు) ఆకలితో ఆపకుండా ఏడుస్తూనే ఉన్నాడు.    శిశువు శిరస్సు చుట్టూ కనిపిస్తున్న వెలుగు వల్ల భయపడిపోయిన సీతాబాయికి పిల్లవానికి పాలు పట్టడానికి సిధ్ధంగా లేదు.  దైర్యం చేయలేకపోయింది.


పిల్లవానికి పాలు పట్తమని హేమాడ్ పంత్ గారు సీతాబాయిని ఎంతగానో ప్రాదేయపడ్డారు.  తరువాత రెండు మూడు రోజుల వరకు శిశువు కి (అనంత ప్రభు) ఆవుపాలు మాత్రమే పట్టారు.  నిస్సహాయ స్థితిలో హేమాద్ పంత్ గారు పిల్లవాడిని షిరిడీ తీసుకువెళ్ళి బాబా పాదాలవద పడుకోబెట్టారు.  జరిగిన అధ్భుతమయిన సంఘటన గురించి, దాని పర్యవసానాల గురించి బాబాకు అంతా వివరించి చెప్పారు.  బాబా ఆ పిల్లవాడిని వన ఒడిలోకి తీసుకుని ప్రేమతో లాలించడం మొదలుపెట్టారు.  బాబా తన బొటన వ్రేలిని పిల్లవాడి నోటిలో పెట్టారు  అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ బాబా బొటన వ్రేలునుండి పాలు రావడం మొదలయింది.  పిల్లవాడు ఆనందంగా బాబా బొటనవ్రేలును చీకుతూ పాలు తాగాడు.  పాలు త్రాగిన తరువాత కడుపు పూర్తిగా నిండి కేరింతలు కొడుతూ ఆడుకోసాగాడు.  బాబా పిల్లవాడి కళ్ళలో అంజనం వేశారు.  ఈ విధంగా బాబా అనుగ్రహాన్ని పొందిన ఆ పిల్లవాడు ఎంతో అదృష్టవంతుడు.


బాబా పిల్లవాడిని దీవించి హేమాద్ పంత్ కి ఇచ్చారు.  హృదయభారం తీరిపోయి సంతోషంతో హేమాద్ పంత్ ఇంటికి తిరిగి వచ్చారు.  ఆ తరువాత రోజులలో బాబా అనంతప్రభు మహరాజ్ కు చెక్కతో చేసిన బొమ్మ తుపాకీ, భిక్షాపాత్ర ఆట వస్తువులు ఇచ్చారు.  వీటిని అంబర్ నాధ్ లో ఉన్న వలవాల్కర్ గారి గృహం ‘మాతృచాయ’ లో దర్శనానికి ఉంచారు.

(ఇంకా ఉంది)

(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)



No comments:

Post a Comment