Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, January 16, 2011

సాయి అనగానేమి?

Posted by tyagaraju on 8:56 PM
ఓం సాయిశ్రీసాయి జయజయ సాయి 17.01.2011 సోమవారం

సాయి అనగానేమి?


సంక్రాంతి పండుగ సందర్భగముగా రెండు రోజులుగా సాయి బంధువులకు లీలలను యేమీ ఇవ్వలేకపోయాను.

ఈ రోజు మనము సాయి గురించి కొద్దిగా తెలుసుకుందాము.మనం అప్పుడప్పుడు సాయి గురినిచి విషయ పరిజ్ణానాన్ని కూడా తెలుసుకుంటే సాయి తత్వం మనమనసుకు పట్టి ఉంటుంది.


1) భారతీయ భాషలన్నిటిలో "సాయి" అనగా రక్షించువాడు, భర్త, ఆథ్యాత్మిక గురువు, తండ్రి. ఆయనని ఒక తండ్రిగాకీర్తించు. ఆయన ప్రేమ అనేకవిథాలుగా ప్రకటితమవు తుంది.

2) బాబా సద్గురువా లేక అవతార పురుషుడా?

ఈ ప్రశ్న అడిగేముందు ప్రతి ఒక్కరూ అవతారానికి, సద్గురువు మథ్య భేదాన్ని తెలుసుకోవాలి. సద్గురువు అజ్ణామనే చీకటినితొలగించి మనలో జ్ణాన జ్యొతిని వెలిగించేవాడు. సద్గురువు భగవంతుని . తెలియచెప్పి ఆయనవైపుకుదారిచుపిస్తాడు. అవతారపురుషుడు భగవంతుడే. మానవులని ఉథ్థరించడానికి భువిపైన అవతరించినవాడు. అంటే భగవంతుడు షోడశకళాప్రపూర్ణుడుగా అవతరించవచ్చు లేక వీటిలో
కొన్నిటితో అవతరించవచ్చు. సాయి భువిమీదకి వచ్చిన భగవంతుడు. ఆయనను అవతార పురుషుడు అనడానికి కారణాలు.


1. సర్వశక్తిమంతుడు, 2) సర్వాంతర్యామి, 3) సర్వజ్ణత, 4) పంచభూతాలయందు ఆథిపత్యము. ఇవిమనకు సచ్చరిత్రలో తెలుసుకున్న విషయాలు.


బాబా గారు జీవించి ఉన్నప్పుడు ఆయన తన భక్తులకు యే విథమయిన వస్తువులను సృష్టించి ఇవ్వలేదు. కాని, ఇప్పుడు బాబాగారు తన భక్తులకు కోరినది అందిస్తు తమ లీలలను ప్రకటిస్తూ ఉన్నారు.

బాబా చరిత్ర వ్రాసిన హెమాడ్పంత్ చదువరులకు చెప్పేదేమనగా బథ్థకము, నిద్ర, చంచల మనస్సు, శరీరమందభిమానము, మొదలగువానిని విడిచి వారు తమ యావత్తు దృష్టిని సాయిబాబా కథలవైపు త్రిప్పవలెను. వారి ప్రేమ సహజముగా నుండవలెను. వారు , భక్తి యొక్క రహస్యమును తెలిసికొందురుగాక. అమాయకులు, భావికులు, చిన్న, పెద్దా, భక్తులంతా ఒక్క క్షణంపాటు జీవనాన్ని, నిర్వీర్యం చేసే ప్రాపంచిక కష్టాలనీ,చింతలనీ, పక్కన పెట్టి విశిష్టమయిన సాయిబాబా చరిత్రను వినండి లేక చదవండి. సాయి చరిత్ర పరమ పావనమయినది. దీన్ని పఠించేవారి నోరు పవిత్రమౌతుంది. విన్నవారి చెవులు పావనమవుతాయి. అపారకృపామృత థారలను అలవోకగా వర్షించే సాయి ప్రసన్నులైతే సంపూర్ణ శుథ్థ జ్ణానం ప్రకటితమౌతుంది.

1. లయం: కథ వింటుండగా నిద్రమత్తు రావడం.

2. విక్షేపం: కథలో మనసు లీనం కాకపోవదం

3. కషాయం: కథ వింటున్నప్పుడు మూడు గుణాలు క్షోభించి కలిసిపోయి కళ్ళముందు ఈశ్వరుడి సగుణ లేదా నిణర్గు రూపం కనిపించకుందా నల్లటి పచ్చటి రంగులు కనెపించటం.

4. రసాస్వాదం: కథలోని స్త్రీల హావభావాలు, నేత్రకతాక్షాలు,శృంగార వర్ణన లువిన టం మీదే (శ్రథ్థ ఉండటం) ఇవికథాశ్రవణానినికి నష్టం కలిగిస్తాయి. ఈ అవాంతరాలను దూరం చేసుకోవాలి. అప్పుడు శ్రవణం సుఖదాయకమౌతుంది. ఉద్యాపనలతో కూడిన వ్యర్థమైన వ్రత వైకల్యాలు మనకక్కర లేదు. శ్రీరాన్ని శుషింప చేసే ఉపవాస తపవాసాలు అవసరం లేదు. తీర్థయాత్రలు, తిరుగుళ్ళు ఈ తిప్పలు వద్దు. కేవలం ఈ చరిత్రను చెవులారా వింటే చాలు గుండెలనిండా నిజమైన ప్రేమ ఉండాలి. భక్తిలోని మర్మాన్ని తెలుసుకోవాలి. అవిద్య అజాపజా లేకుండా పోతుంది. లోభి ఎ పనిలో ఉన్నా అతని చిత్తానికి తను దాచి పెట్టిన ధనమే రాత్రింబవళ్ళు కనిపించినట్లు మన మనసుల్లో సాయి సాక్షాత్కరించాలి. సాయి, సాయి అనే నామస్మరణ కలియుగానుసారం ఉత్పన్నమయే దుష్టవాసనలన్నిటినీ దగ్థం చేస్తుంది. ఒక్కసారి చేసే సాష్టాంగ నమస్కారంతో మాట్లాడటం వల్ల , లేదా వినికిడి వల్లా కలిగిన పాపాలు నశించి పోతాయి. సాయి నామాన్ని ఉచ్చరిస్తే కోర్కెలన్నీ నెరవేరుతాయి . గురుకృప యెంత ఆశ్జ్హ్ర్యకరమైందంటే అది రవ్వంత తడి లేనిచోటకూడా యెండి మ్రోడైన వృక్షాలకు సైతం పూలను ప్రసాదిస్తుంది. యె మాత్రం ప్రయత్నం లేకుండా వాటిని ఫలాలతో నింపేస్తుంది . పుణ్యాత్ములు మాత్రమే ఈ కథలను వినగల్గుతారు. ఈ కథలను వినడానికి ఒక్క అవథానం తప్ప మరే విథమయిన కష్టమూ పడనక్కరలేదు. ఈ కథలను నితంతరం మనసారా అభ్యాసం చేయాలి. సాయినాథులు కృపతో కేవలం పేరుకు మాత్రం హేమాడ్ పంత్ ను ముందు పెట్టి స్వయంగా ఈ గ్రంథ రచన అనేపనిని తామే చేశారు. భగవంతుడు తన భక్తులను కొన్ని కొన్ని పనులకు నియమిస్తాడు. కొందరు మఠాలను కట్టిస్తారు, కొందరు దేవాలయాలు లేదా స్నాన ఘట్టాలు కట్టిస్తారు. హేమాడ్పంత్ గారు అంటున్నారు, నేనసలు యె యోగ్యతా లేనివాణ్ణి. నాదగ్గిర పూర్తిగా చింకి గుడ్డలే ఉన్నాయి. సరైన వస్త్రం ఒక్కటి కూడా లేదు. (నా దగ్గిర అనేక విషయాల పరిజ్ణానముంది కాని, అందులో ఒక్కదాని గురించైనా పరిపూర్ణ జ్ణానం లేదు) అని భావం


మరోసారి మనం మరల సాయి గురించి మరికొంచెం వివరంగా తెలుసుకుందాము.

సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment