23.06.2013 ఆదివారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 73వ.శ్లోకం, తాత్పర్యం
శ్లోకం: స్తవ్య స్స్తవ ప్రియస్తోత్రం స్తుతిస్స్తోత్రారణప్రియః |
పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తి ర్నామయః ||
పరమాత్మను పొగడదగినవానిగా, ప్రార్ధింపబడువాడు, ప్రార్ధించుట, ప్రార్ధన అను మూడు తానేయైనవాడుగా ధ్యానము చేయుము మరియు పూర్ణత్వముగా, పూర్ణత్వము కలిగించువానిగా, పుణ్యమే తన రూపముగా, పుణ్యమును కీర్తివంతము చేయువానిగా, అన్ని అవయవ లోపములూ, బాధలూ తన నామస్మరణచే నిర్మూలించువానిగా, ధ్యానము చేయుము.
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 41వ.అధ్యాయము
13.02.1992
ప్రియమైన చక్రపాణి,
ఈ అధ్యాయములో ముఖ్యముగా శ్రీసాయి పటముయొక్క ప్రాముఖ్యము, మధ్యవర్తులు లేకుండ శ్రీ సాయి సేవ చేసుకొనే విధానము, నిత్య పారాయణకు ఉపయోగపడు గ్రంధాలను గురించి శ్రీ హేమాద్రిపంతు చక్కగా వివరించినారు.
