Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, August 8, 2020

అమ్మాయే జన్మించాలి....???

Posted by tyagaraju on 8:31 AM

   Get Sai Baba's Blessings to Get Child - Childless Couple
       Pink Roses HD Wallpapers | Beautiful pink flowers, Rose wallpaper ...
08.08.2020  శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు మరొక అధ్భుతమయిన బాబా చూపించిన అనుగ్రహాన్ని మీకు అందిస్తున్నాను.

అమ్మాయే జన్మించాలి....???

అధ్భుతమయిన బాబా లీల సాయిలీల ద్వైమాసపత్రిక జనవరిఫిబ్రవరి 2015 .సంవత్సరంలో ప్రచురింపబడింది.
మరాఠీనుండి ఆంగ్లానువాదంకుమారి మినాల్ వినాయక్ దాల్వి
తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ :  9440375411 &  8143626744
 మైల్. .డి. tyagaraju.a@gmail.com

ప్రతిమానవుడికి కోరికలనేవి ఉంటాయి.  కోరికలను తీర్చమని భగవంతుడిని ప్రతివారు ప్రార్ధించుకుంటూ ఉంటారు.  నేను కూడ అటువంటి దానికి అతీతుడిని కాను.  మాకు అమ్మాయి కావాలనే కోరికతో సాయిబాబాని ప్రార్ధిస్తూ వస్తున్నాను.  దానికి కారణమేమిటంటే గత రెండు తరాలుగా మా ఇంట్లో ఆడసంతానమే లేదు.  నాకు మేనత్తలు గాని, అక్క చెల్లెళ్ళు గాని ఎవరూ లేరు. నా సోదరుడికి కూడా ఒక్కడే అబ్బాయి.  అందువల్ల కనీసం ఒక్క ఆడపిల్లయినా మా ఇంట్లో తిరుగుతూ ఉండాలని నా కోరిక.  


ఆడసంతానమే కావాలనే కోరికమాత్రమే కాదు అసలు మాకు రెండవసంతాన భాగ్యం ఉందా లేదా అన్నదే మాకు ఉన్న పెద్ద సమస్య.  నాభార్య మొట్టమొదట గర్భం దాల్చినపుడు పాపం చాలా కష్టపడింది.  ఆమెకు గర్భం జారిపోవడం వల్ల చాలా కష్టాన్ని ఎదుర్కొంది. (She had a fall and so we were really very scared.  ఇక్కడ ఈ ఆంగ్ల వాక్యానికి అనగా She Had a Fall అన్నదానికి గర్భం జారిపోవడం అని భావించాను. ఇది సరయినదో కాదో నాకు తెలియదు. దాని గురించి వైద్యపరిభాషలో నా కు ప్రావీణ్యంలేదు. ఒకవేళ సరియైన అర్ధం తెలిస్తే నాకు తెలియచేయండి...  త్యాగరాజు)  బాగా పురిటినొప్పులు అనుభవించిన తరువాత మగపిల్లవాడు జన్మించాడుఆకారణం వల్లనే రెండవసారి ప్రసవం చాలా కష్టమనే భావించాముమా అబ్బాయికి 8సంవత్సరాల వయసు వచ్చిందిఅయినా అప్పటికీ నాభార్యకు రెండవసారి గర్భం దాల్చే సూచనలు ఏమీ కనిపించలేదునాకు అమ్మాయి కావాలనే కోరికతో, మనం ఒక అమ్మాయిని దత్తత తీసుకుందామని నాభార్య వైశాలితో అన్నానునాభార్య అందుకు ఒప్పుకోలేదునేనన్నమాటలకు ను చాలా బాధపడిందిఒక్క అమ్మాయినన్నా మాకు సంతానం ప్రసాదించు స్వామీ అని సాయిబాబాకు మనఃస్ఫూర్తిగా ప్రార్ధించుకున్నాను.  2001.సంవత్సరంలో నా భార్యకు కాస్త నొప్పులు మొదలయినట్లుగా అనిపించిందిడాక్టర్ ని కలిసి పరీక్ష చేయిస్తే  గర్భవతి అని తెలిసిందినెలలు నిండుతున్న కొద్దీ సోనోగ్రఫీ పరీక్ష ద్వారా తెలిసినదేమిటంటె కవలపిల్లలు జన్మిస్తారని. కవలలు జన్మిస్తారని చెప్పగానే  నాకు కాస్త భయం పట్టుకుందిఒకవేళ కవలలిద్దరూ మగపిల్లలయితే ఎలాగ అనిఏమి జరుగుతుందోననే విపరీతమయిన సందిగ్ధంలో పడ్డానుకవలిలద్దరిలో ఒకరు అమ్మాయి ఉండేలా చూడు బాబా అని ప్రార్ధించుకున్నానుప్రసవానికి తేదీ డిసెంబరు నెలలో అని చెప్పారుపూనాలో ఉన్న ప్రముఖ వైద్యుడి దగ్గరకు వెళ్ళాముఅక్కడ  ఆస్పత్రిలో గోడ మీద బాబా ఫొటో కనిపించింది.
           Sai, Protect your children - Teach your child to tell you whom ...
బాబా ఫోటో చూడగానే తిరిగి ధైర్యం తెచ్చుకొని డాక్టర్ తో నాభార్య కేసు శ్రధ్ధగా చూడమని చెప్పానుఆయన చిరునవ్వు నవ్వాడుప్రసవ తేదీ దగ్గర పడుతూ ఉండటంతో నేను మనసులోనే సాయిబాబాను ప్రార్ధించుకుంటూ ఉన్నానుడిసెంబరు 23 నాభార్యకు పురిటి నొప్పులు మొదలయ్యాయికాని ప్రసవం జరగలేదుడిసెంబరు 24 మావివాహ వార్షికోత్సవంఆరోజునయినా ప్రసవం అవుతుందనుకొన్నాముకాని నాలుగు రోజులు గడిచాయిడిసెంబరు 29 ఆరోజు దత్తజయంతిఆరోజు నాభార్యకు ప్రసవం జరిగి కవలలు జన్మించారుఒక్కరు కాదు ఇద్దరు అమ్మాయిలు.  
          Twin Boy And Girl Names: 50 Unique Boy Girl Twin Names
నా సంతోషానికి మాటలు చాలవుబాబా చూపిన కరుణకు ధన్యవాదాలు తెలుపుకొన్నానుఆయన దీవెనలు మామీద ఎల్లప్పుడు ఉంటాయిక్రిందటి సంవత్సరం డిసెంబరు నెలలో మా అమ్మాయిల పుట్టినరోజు సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు చూడటానికి వెళ్ళాముఅక్కడ ఎన్నో స్టాల్స్ ఏర్పాటు చేసారుఒక స్టాల్ లో జాతకాలు చెప్పబడును అని ఉందినాభార్య అక్కడికి వెడదామని పట్టుబట్టిందిఅయిష్టంగానే ఆమెతోపాటు వెళ్ళానుఅక్కడ కూర్చున్నవారు భవిష్యత్తు చెబుతామని మా అమ్మాయిల జీవితంలో అశుభాలు సంఘటనలు జరుగుతాయని చెప్పారునేను మామూలుగా ఏమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయానుమరొక చోట జాతకాలు కూడా చెప్పబడుననే స్టాల్ కనిపించిందిఅక్కడ చూపిస్తే వాళ్ళు కూడా కొన్ని చెడు సంఘటనలు జరుగుతాయని చెప్పారువాళ్ళు చెప్పినదాన్ని బట్టి సహజంగానే నాకు బాధ, నిరాశ కలిగాయిఅకస్మాత్తుగా నా మొబైల్ లో ఒక సందేశం వచ్చినట్టుగా బ్దం వచ్చిందిఅందులో సాయిబాబా ద్వారకామాయి గ్రూపు నుండి వచ్చిన సందేశం ఉందిసరిగ్గా నేను బాధపడుతున్న మయంలోనే ఆసందేశం రావడం నిజంగా సాయిబాబాయే పంపించారని ప్రగాఢంగా నమ్మాను.  సరైన సమయంలో బాబా నాకు మంచి సందేశమిచ్చారు.
సందేశం వివరాలు
ఎటువంటి జోశ్యాలని నమ్మకుజన్మపత్రికను బట్టి భవిష్యత్తు ఎలా ఉంటుందోనని చూడకు.  అపరిచితులతో స్నేహం వద్దు/జాతకాలు చూపించవద్దు”
సందేశం చదవగానే సాయిమీద భక్తితో నా కళ్లంబట కన్నీరు కారింది.  బాబా సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, అత్యంత దయాసముద్రుడు.
                           అరుణ్ హరిభావు వీర్
                    సెక్టర్, 629, సాయిచరణ్ సొసైటీ,
                           ఫ్లాట్, 5-6 బిబ్వే వాడి
                             పూనె – 411047
                        మొబైల్ : 9850504190


ఈ సందర్భంగా సాయిభక్తులకు ఒక ముఖ్య విషయం చెప్పదలచుకున్నాను.  శ్రీ సాయి సత్ చరిత్ర అ.29  ఒకసారి గమనించండి. రఘునాధరావు టెండూల్కర్ పుత్రుడు బాబు, వైద్యవిద్యనభ్యసిస్తున్నాడు.  జ్యోతిష్యుడు అతని జాతకం చూసి ఆ సంవత్సరం ఉత్తీర్ణుడవడని, వచ్చే ఏడు, తప్పక ఉత్తీర్ణుడౌతాడని చెప్పడం వల్ల అతను ఆ సంవత్సరం పరీక్షకు వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాడు.  అతని తల్లి బాబాకు ఈ విషయం విన్నవించుకున్నపుడు బాబా ఆమెతో “జ్యోతిష్యుని మాట, సాముద్రికాన్ని విశ్వసించవద్దు, నిరాశ చెందవద్దు.  ఎవరి మాటా వినకుండా పరీక్షకు వెళ్ళమని అబ్బాయితో చెప్పు, నాయందు విశ్వాసముంచుమని చెప్పు” అన్నారు.  బాబా మాటమీద నమ్మకంతో ధైర్యాన్ని తెచ్చుకుని పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యాడు.  దీనర్ధం ఏమిటంటే జాతకంలో ఉంది కదా అని కష్టపడటం మానేసి ఊరికే కూర్చుంటే ఏవిధమయిన ఫలితం ఉండదు.  శ్రమించాలి, కష్టపడాలి.  అప్పుడే భగవంతుడి అనుగ్రహంతో జాతకంలోని అడ్డంకులు కూడా తొలగుతాయి.
ఈ సంఘటనను ఆధారం చేసుకొని కొంతమంది సాయిభక్తులు బాబా జాతకాలను నమ్మవద్దన్నారు అనె అపోహలో ఉంటారు.

అ.26 లో బాబా, అంబాడెకర్ ను జ్యోతిష్యము చదివి అందులో ప్రావీణ్యము సంపాదించమని ఆశీర్వదించారు.
అ. 47 గౌరి, వీరభద్రప్ప ఇద్దరికి నక్షత్రం, గోత్రం, వంశం అన్ని చూసి మంచి ముహూర్తంలో కళ్యాణం జరిపించమని చెప్పారు.

ఉదాహరణకి ఎవరయినా జ్యోతిష్కుడు పిల్లవాడి జాతకం చూసి, మంచి విద్యావంతుడవుతాడని చెప్పాడనుకోండి.  ఆయనమాటమీద జాతకాన్ని నమ్మి అసలు చదవడం మానివేస్తే విద్యావంతుడవుతాడా?  మనం కష్టపడితేనే జాతక ప్రభావం మనమీద ఉంటుంది.
బయట చిన్న చిన్న గుడారాలు, స్టాల్స్ పెట్టుకుని జాతకాలను చెపుతామనేవారు వారి వ్యాపారం కోసం ఏమేమో చెబుతారు.  వాటిని మనం నమ్మి అనవసరమయిన భయాలను పెట్టుకుంటాము.  బాబా మీదనే మనం విశ్వాసముంచినట్లయితే మన భవిష్యత్తు అంతా ఆయనే చూసుకుంటారు.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List