10.08.2020 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణి ముత్యాలు 11 వ.భాగమ్
- సాయిదర్బార్, హైదరాబాద్
- సాయిబానిస
- సంకలనం మరియు కూర్పు శ్రీమతి రావాడ మధుగోపాల్
- సమర్పణ ఆత్రేయపురపు త్యాగరాజు
25. జీవితములో మానావమానములు
08.03.2020 - ఆదివారము
నేను షిరిడీలో జీవించినంత కాలములో షిరిడీ ప్రజల చేత అవమానములు ఎక్కువగా అనుభవించాను. నా జీవిత ఆఖరిదశలో నన్ను రాజాధిరాజ, యోగిరాజ అన్నారు. అంతకుముందు అందరు నన్ను ఓ పిచ్చి ఫకీరుగా భావించారు. నీ ఉద్యోగ జీవితములో నీవు చేయని తప్పులకు నీ పై అధికారులు నీపై అసూయతో నిన్ను చాలా బాధపెట్టినారు. నీవు వారిని మరిచిపోలేకపోతున్నావు. నీవు, నీ గతాన్ని మరిచిపోకపోతే, ఆ చికాకులు మరుజన్మకు చేరవేయబడతాయి. అందుచేత గతములో నీకు అన్యాయము జరిగిన భగవంతుడు నీకు అన్యాయము చేసినవారిని తప్పక శిక్షించును.
నేను శరీరములో ఉన్న రోజులలో షిరిడీ గ్రామముసబు మరియు నానావలి అనే వ్యక్తి నన్ను చాలా బాధలు పెట్టినారు. అయినా నేను వారిని క్షమించాను. వారిలో పరివర్తన వచ్చిన తరువాత వారు నాకు అంకిత భక్తులుగా మారినారు. నీకు తిరిగి ఉత్తమ జన్మ కావాలి అంటే ఈ జన్మలోని కక్షలు, కార్పణ్యాలు ఇక్కడే వదిలివేసి ప్రశాంతముగా నీ గమ్యము చేరుకో.
26. హోలిపండుగ - కానుక
09.03.2020 - సోమవారము
ఈ రోజు హోలీ పండుగ. నేను 50 సంవత్సరాల క్రితము హోలి పండుగనాడు నీ పెళ్ళిరోజున అజ్ఞాత వ్యక్తి రూపములో వచ్చి పెళ్ళి భోజనం చేసినాను. నీకు ఆనాడు నాతో పరిచయం లేదు. అందుచేత నీవు నాకు గురుదక్షిణ ఇవ్వలేదు. ఈ రోజు హోలి పండుగ. నీవు నా ప్రేరణతో ఇంగ్లీషు భాషలో వ్రాసిన పుస్తకాలు :
1 1) SAI BEACON FOR HUMANITY
2) SPIRITUAL GARDENIAS
3) FACE TO FACE WITH SRI SHIRDI SAI
నాకు అంకితము చేయి. ఆ పుస్తకాలను విదేశాలలో ఉన్న నా భక్తులకు పంచిపెడతాను.
27. ఏమీ నీతో రావు
10.03.2020 - మంగళవారము
నీవు, నీ తల్లి గర్భమునుండి ఈ ప్రపంచములోకి అడుగుపెట్టినపుడు నీవు నీ వెనుకటి జన్మనుండి ఏమీ తేలేదు కదా? అది నీవు మరణించినపుడు ఈ లోకం విడిచి తిరిగి నూతన స్త్రీ గర్భంలో ప్రవేశించినపుడు నీవు ఏమీ తీసుకొనివెళ్లలేవు. ఇక నీ పూర్వ జన్మలనుండి ఆ జన్మ వాసనలను ఈ జన్మకు తీసుకొని వస్తావు. తిరిగి ఈ జన్మలో చేసుకొన్న పాపపుణ్యాలను తిరిగి నీనూతన జన్మకు తీసుకొని వెళతావు. అందుచేత భగవంతుని సదా స్మరించుతూ పాపపుణ్యాలను గుర్తించి జీవించుతు తిరిగి ఉత్తమ జన్మ ఎత్తడానికి ప్రయత్నించు.
నీవు ప్రాపంచిక రంగము అనే నదికి ఒక చెంబు పట్టుకొని నీరు తీసుకొంటే నీకు చెంబుడు నీరు మాత్రమే లబిస్తుంది. అదే నీవు ఆధ్యాత్మిక రంగము అనే నది దగ్గరకు ఒక చెంబు పట్టుకొని వెళితే, నీకు భగవంతుడు రెండు చెంబులతో 1) పుణ్యము, 2) పురుషార్ధములను ప్రసాదించి ఆశీర్వదించుతాడు.
విశ్లేషణ :
పుణ్యము మరియు పురుషార్ధం అనగా ఏమిటి అని చాలా మందికి సందేహము కలుగుతుంది. పుణ్యము అంటే నీవు చేసిన మంచి కర్మల ఫలము. పురుషార్ధము అంటే భగవంతుడు నీ ఆధ్యాత్మిక శక్తికి మెచ్చి ప్రసాదించిన
ధర్మ, అర్ధ కామ మోక్షాలు.
ధర్మ, అర్ధ కామ మోక్షాలు.
(మరలా వచ్చే గురువారమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment