

12.06.2011 ఆదివారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంథువులకు బాబా వారి శుభాశీస్సులు
బాబా -- పిచ్చుక - 2 -- బాబాని పూజించే విథానం
ఈ రోజు మనము శ్రీ సాయి అంకిత భక్తులలో ఒకరైన శ్రీ బీ.వీ. నరసిం హ స్వామి (శ్రీ భవాని నరసిం హస్వామి) గారిని గురించి కొంత తెలుసుకుందాము.
శ్రీ నరసిం హస్వామి వారి 1874 సంవత్సరములో కోయంబత్తూరు జిల్లాలో భవాని అనే గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. 1895 లో ఈయన సేలం పట్టణంలో ప్లీడరు గా పనిచేశారు.
1926 లో వానప్రస్థాశ్రమముని స్వీకరించి దేశంలో ఉన్న అన్ని తీర్థక్షేత్రాలని, సాథు సత్పురుషులని దర్శించారు.
సద్గురువుకోసం అన్వేషిస్తూ 1936 లో కుర్దీవాడి లోని నారాయణ మహరాజ్ అనే యోగిని సందర్శించారు. ఆయనని దర్శించేముందు తన మనస్సులో" నేను ఒక రత్న వర్తకుణ్ణి, సరీఇన జాతి రత్నం యెక్కడ లభిస్తుందొ తెలియచేయవలసినది" అని అనుకున్నారు. భక్తుల హృదయాలని గుర్తించే శక్తిగల నారాయణ మహరాజ్ గారు " నీవు షిరిడీకి వెళ్ళు. నువ్వు కోరుకునే మహారత్నం అక్కడ లభిస్తుంది" అని చెప్పారు. నరసిమ్హస్వామి గారు షిరిడీకి బయలుదేరి మథ్యలో సాకోరి వెళ్ళి అక్కడ శ్రీ సాయిబాబాని సేవించిన శ్రీ కాశీనాథ్ గోవింద ఉపాసనీ మహరాజ్ ని దర్శించి అక్కడ కొంతకాలం ఉన్నారు.
తరువాత శ్రీ నరసిమ్హ అయ్యరు గారు సాకోరికి 3 మైళ్ళ దూరంలో ఉన్న షిరిడీ కి చేరారు. శ్రీ సాయిబాబా సమాథిని దర్శించారు. సమాథి మందిరంలో, ద్వారకామాయి మసీదులో, థుని ముందు, బాబా భౌతింకంగా ఉన్నప్పుడు కూర్చున్న ప్రదేశంలో తాను కూర్చుని బాబాని థ్యానించారు. అక్కడ ఒకరోజున సమాథి మందిరంలో బాబా సమాథి దగ్గర థ్యానంలో కూర్చుని "బాబా నీ అనుగ్రహానికి పాత్రుడనైతే, శ్రీ సాయి భక్తిని వ్యాపింపచేసే భాగ్యం నాకు కలుగే యెడల ఒక పిచ్చుక నా తలపై చేరి కూర్చుండేటట్లు అనుగ్రహించు" అని ప్రార్థించారు. అలా శ్రీ నరసిం హ స్వామిగారు థ్యానంలో ఉండగా ఒక పిచ్చుక వచ్చి వారి తలపై నిలిచింది. బాబా గారి అనుగ్రహం ఈ విథంగా లభించింది ఆయనకి. ద్వారకా మాయి మసీదునందు, సమాథి మందిరమునందు, బాబా చిత్రపటముల ముందు థ్యాననిష్టయందు వారికి సచ్చిదానంద స్థితి లభించింది.
శ్రీ నరసిమ్హస్వామి గారు సాయి ప్రచారాన్ని నిరాడంబరంగా చేసేవారు. ఆయన దగ్గిర యెప్పుడూ ఒక సాయిబాబా పటం ఉండేది. యెక్కడకు వెళ్ళినా సత్సంగంలో ఆ పటాన్ని ఉంచేవారు. బాబా ఫోటోలు, లాకేట్లు భక్తులకి పంచిపెడుతూ ఉండేవారు. శ్రీ సాయిబాబా అనుగ్రహాన్ని పొందటానికి యేమిచేయాలో శ్రీ నరసిమ్హస్వామిగారు భక్తులకు యిలా చెప్పేవారు.
"నీ పూజా మందిరంలో బాబా చిత్రపటాన్ని యెత్తైన ఆసనం మీద ఉంచు. దానిని పుష్పాలతో అలంకరించు. మువ్వత్తుల దీపముని వెలిగించాలి. అగరత్తులను వెలిగించాలి. అక్కడ పాలు, కొబ్బరికాయ, అరటిపళ్ళు, తాంబూలము ఉంచాలి. బాబా కి సాష్టాంగ నమస్కారం చేసి ఆసనముపై అమర్చిన బాబా పటానికి యెదురుగా కూర్చోవాలి. నీ చూపుని బాబా నేత్రముల మీద కేంద్రీకరించాలి. అష్టొత్తర శతనామములతో బాబాని అర్చిస్తూ పువ్వులతో పూజించు. నీకు చేతనైన విథంగా బాబాని సేవించు. బాబాని కీర్తనల ద్వారా ప్రార్థించు. నువ్వు సమకూర్చుకున్న పదార్థాలని సాయికి నివేదించు. తరువాత కర్పూరహారతి ఇచ్చి బాబాకు నమస్కరించు. గురు, శుక్ర, శనివారములలో నీ కుటుంబములోని వారితో గాని, అక్కడ చేరిన భక్తులతో గాని భజనలు చేయి. ఈ విథంగా తన శక్తి కొలది బాబాని సేవించేవాడు శీఘ్రకాలంలో శ్రీ సాయిబాబాని దర్శించగలడు. బాబా కరుణకి పాత్రుడౌతాడు. ఆది వ్యాథులని పోగొట్టడానికి బాబాని ప్రార్థించి ఊదీని ఉపయోగించు.
బాబా కరుణతో కొందరు కొన్ని శక్తులు పొందవచ్చు. అలా పొందినవారు తానే సాయి అని భావించుకొని యితరుల వ్యాథినివారణలు చేయడం తన శక్తి అని భావించేవారు తమ జీవిత లక్ష్యాన్ని పొందలేరు. అలా వచ్చిన శక్తి, వ్యాథులు తగ్గుట అంతా శ్రీ సాయిబాబా కరుణయే అని గుర్తుంచుకోవాలి.
చదివారుగా శ్రీ బీ.వీ. నరసిమ్హస్వామివారి గురించి క్లుప్తంగాను, యింకా సాయిని సేవించే విథానం గురుంచి ఆయన చెప్పిన విషయాలు. ఇవన్ని కూడా మనం ఆచరణలో పెట్టి మన సాయికి అంకిత భక్తులుగా ఉందాము. మనలో యేశక్తి వచ్చినా అంతా సాయి ద్వారానే జరుగుతోందని మాత్రం భావించాలి. అందు చేత అంతా నేనే చేస్తున్నాను అనే అహంకారం ఉండకూడదు. ఆయన అనుగ్రహమే లేకపోతే మనలో యేవిథమైన శక్తి ఉండదు. మనం ఉట్టి అనామకులం మాత్రమే.
సర్వం శ్రీ సాయినాథారపణమస్తు.
