Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, October 12, 2017

నాగసాయి - 2 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 7:13 AM
      Image result for images of saibaba as nagasai
        Image result for images of rose hd

12.10.2017 గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
నాగసాయి రెండవభాగం నిన్న పనుల వత్తిడిలో  ప్రచురించలేకపోయాను.  ఈ రోజు ప్రచురిస్తున్న రెండవభాగంలో అధ్భుతమైన సంఘటనలను చదవండి.  సాయిలీల 1980 సంచిక, సాయిలీల.ఆర్గ్ నుండి గ్రహింపబడినది.
తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు
                            నిజాంపేట,  హైదరాబాద్

నాగసాయి - 2 వ.భాగమ్
సాయిబాబా - దేవత సుబారావు

నన్ను పక్కన పెట్టి నా జూనియర్ కి ప్రమోషన్ ఇవ్వడంతో బాబా మీద కూడా నాకు కోపం వచ్చింది.  నా ప్రమోషన్ కి అడ్డుపడి నాకింతగా దెబ్బ తగలడం నేను తట్టుకోలేకపోయాను.  డిప్యూటీ ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలీస్ గా పనిచేస్తున్న నాస్నేహితుడు నన్ను ఓదార్చడానికి మాయింటికి వచ్చాడు.  నాకెవరయిన్నా ప్రముఖ వ్యక్తి తెలుసుంటే కనక ఆయన చేత చెప్పించి చూడమని సలహా యిచ్చాడు.  నాకు ఉద్యోగంలో మంచి రికార్డ్ ఉండటం, నాలో అహంకారం, అహంభావం ఉండటం వల్ల  ఎవరిదయినా సహాయం తీసుకోవాలనే ఆలోచన అప్పటివరకు నాకు రాలేదు. 

Tuesday, October 10, 2017

నాగసాయి

0 comments Posted by tyagaraju on 9:02 AM
      Image result for images of nagasai
    Image result for images of nagamalli flower
    (నాగ మల్లె పూవు)

10.10.2017 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు సాయిలీల మాసపత్రిక డిసెంబరు, 1980 వ.సంవత్సరంలో ప్రచురింపబడిన మరొక అధ్భుతమైన సాయిలీలను ప్రచురిస్తున్నాను.  నిన్నటి సంచికలో ఈ రోజు ప్రచురిస్తానని చెప్పడం వల్ల అనువాదమ్ పూర్తిగా చేయలేకపోయినా, మొదటి భాగం ప్రచురిస్తున్నాను.  దీనిలో కోయంబత్తూర్ లో ఉన్న నాగసాయి మందిరం గురించిన ప్రస్తావన వస్తుంది.  దాని గురించి మరికొంత సమాచారాన్ని నాగసాయి మందిరం ట్రస్ట్ వారి సైట్ నుంచి ఇద్దామనుకున్నాను.  కాని దానికి కాపీ రైట్ ఉండటం వల్ల వారిని ఫోన్ ద్వారా సంప్రదించాను.  వారు కూడా తమ అనుమతిని ఫోన్ లోనే తెలియచేసారు.  కాని మైల్ ద్వారా వారి అనుమతిని పంపించమని చెప్పాను.  వారు ఈ రోజు సాయంత్ర్రం మైల్ చేస్తామన్నారు.  కాని ఇంకా రాలేదు.  అది రాగానే అందులోని విషయం కూడా మీకు ఫొటోలతో సహా అందిస్తాను. 

Monday, October 9, 2017

సాయి దత్తావతారమ్

0 comments Posted by tyagaraju on 8:18 AM
      Image result for images of saibaba and dattatreya
    Image result for images of rose hd

09.10.2017  సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయిసుధ డిసెంబరు 1943 సంచికలో ప్రచురింపబడిన ఒక సాయిలీల ప్రచురిస్తున్నాను.

సాయి దత్తావతారమ్

సాయిబాబా తనను సందర్శించడానికి వచ్చే భక్తులనుండి దక్షిణ స్వీకరిస్తూ ఉండేవారు.  ఆవిధంగా స్వీకరించిన దక్షిణని మరలా పేదలకు, అవసరంలో ఉన్నవారికి పంచిపెట్టేస్తూ ఉండేవారు.  ఈ విధంగా బాబా తన భక్తుల చెడుకర్మలను అంతం చేస్తున్నానని తను దక్షిణ స్వీకరించడంలోని ఆంతర్యాన్ని తెలియచేసారు.
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List