Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, February 18, 2021

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 46 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 7:01 AM

 




18.02.2021 గురువారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయిబాబాపరిశోధనా వ్యాస గ్రంధము – 46 .భాగమ్

(పరిశోధనావ్యాస రచయితశ్రీ ఆంటోనియో రిగోపౌలస్ఇటలీ)

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

ఫొన్ : 9440375411 & 8143626744

మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

షిరిడీకోపర్ గావ్షిరిడీ

సోమవారమ్అక్టోబరు, 21, 1985

షిరిడీలో హోమీబాబా ఆశ్రమం వద్ద సాయంత్రం గం.5.30 

పార్శీ మహాత్ముడయిన హోమీబాబాను దర్శించుకున్న తరువాత నాకు కలిగిన అభిప్రాయాలు -  ఆయనను దర్శించుకున్న వెంటనే వ్యాఖ్యలను వ్రాసుకున్నాను.

ఎంతోమంది భక్తులు తన  చుట్టూ గుమిగూడి ఉన్న సమయంలో హోమీబాబా సాయిబాబా పటం ముందు మంత్రం గాని ప్రార్ధన గాని చేస్తుండటం చూసాను.  ఆయన చుట్టూ ఉన్న భక్తులలో చాలామంది పార్శీవారే. 

హోమీబాబా మెహర్ బాబా శిష్యుడయి ఉండవచ్చని లేక ఆయన గతంలో ఆయనను కలుసుకుని ఉండవచ్చని నా దుబాసీ స్వామి శేఖరరావు చెప్పాడు.  తరువాత విషయాన్ని హోమీబాబా ఖండించారు.

సాయిబాబాలాగే వేషధారణ చేసుకుని ఇప్పటికీ గత పదకొండు సంవత్సరాలుగా హోమీబాబా షిరిడిలోనె ఉంటున్నారు.  

Tuesday, February 16, 2021

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 45 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 6:33 AM

 



16.02.2021 మంగళవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయిబాబాపరిశోధనా వ్యాస గ్రంధము – 45 .భాగమ్

(పరిశోధనావ్యాస రచయితశ్రీ ఆంటోనియో రిగోపౌలస్ఇటలీ)

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

ఫొన్ : 9440375411 & 8143626744

మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

షిరిడీకోపర్ గావ్షిరిడీ

సోమవారమ్అక్టోబరు, 21, 1985

ఉదయం గం.7.30 ని.  రోజు దయాన్నే గురుస్థాన్ నుండి మసీదు వరకు జరిగిన ఊరేగింపులో పాల్గొన్నాను.  ఇది నాకంతగా ప్రత్యేకమయిన ఆకర్షణీయంగా అనిపించలేదు.  చావడి దగ్గర ప్రవేశద్వారంవద్ద కూర్చున్నాను.  అక్కడ కొంతమంది యువతులు ఎంతో నైపుణ్యంగా రంగవల్లులను తీర్చిదిద్దుతున్నారు.  అంతలో ఒక వీధి కుక్క నాదృష్టిని ఆకర్షించింది.  ఆకుక్క శరీరమంతా తామర, గజ్జి తో నిండివుంది.   దానిమీద ఈగలు ముసురుతూ ఉన్నాయి.  చూడటానికి చాలా అసహ్యకరంగా ఉంది.  ఒక్కసారిగా నామనసులో మెరుపులాంటి ఆలోచన మెదిలింది.  

Sunday, February 14, 2021

మనఃస్ఫూర్తిగా పిలిస్తే రాకుండా ఉంటానా? రాలేదనుకున్నావా?

0 comments Posted by tyagaraju on 7:51 AM

 



14.02.2021  ఆదివారమ్.

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

బాబా భక్తురాలి ఆహ్వానానికి స్పందించి ఏవిధంగా వచ్చారో తెలిపే అధ్భుతమయిన లీలను ప్రచురిస్తున్నాను.

చెన్నై నుండీ శ్రీమతి కృష్ణవేణిగారు తమ అనుభవాన్ని నిన్ననే నాకు పంపించారు.  ఈ లీలను చదివిన తరువాత మనకు కలిగిన అనుభూతిని మరలా మరలా మననం చేసుకుంటే తప్ప బాబా లీల మనకు అర్ధం కాదు.  బాబా మనకు ఎదురుగా వచ్చినా గ్రహించుకోలేము.  ఆమె పంపించిన ఈ అనుభవాన్ని  ఆమె మాటలలోనే చదవండి.

మనఃస్ఫూర్తిగా పిలిస్తే రాకుండా ఉంటానా?  రాలేదనుకున్నావా?

మా పెద్ద పాప చి. ప్రసన్నలక్ష్మి భరత నాట్యం నేర్చుకుంటోంది.  ఈ నెల 7వ.తారీకున మా పాప, ఇంకా నాట్యం నేర్చుకుంటున్న మరొక ఎనిమిది మంది పిల్లలతో కవితాలయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డాన్స్ & మ్యూజిక్ వారు నాట్య ప్రదర్శనను ఏర్పాటు చేసారు. 

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List