Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, April 2, 2022

శ్రీ సాయి దయా సాగరమ్ 5 వ, భాగమ్

0 comments Posted by tyagaraju on 4:27 AM

 


02.04.2022  శనివారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి



శ్రీ మాత్రే నమః

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు

శ్రీ సాయి దయా సాగరమ్ 5 వ, భాగమ్

మరాఠీ మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి

ఆంగ్లానువాదమ్ ---  శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి

తెలుగు అనువాదమ్ ---  ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్

1898 వ.సంవత్సరంలో నా వయసు 28 సంవత్సరాలప్పుడు మొట్టమొదటిసారిగా బాబాను దర్శించుకునే అవకాశం లబించింది.  దాదాపుగా 15 సంవత్సరాలపాటు సాయిబాబా సేవలో ఉన్న తరువాత 1913 వ.సం.లో గురుపూర్ణిమనాడు బాబా నాకొక క్రొత్త బాధ్యతను అప్పచెప్పారు.   నన్ను ఖండోబా మందిరానికి వెళ్ళి కాశీనాధ్ శాస్త్రిని సేవించుకోమని చెప్పారు.  ఇది చాలా కష్టమయిన పని.  చాలా శ్రమించాలి.  కాని నేను నా కర్తవ్యాన్ని సరిగా నిర్వర్తించాను.  

Friday, April 1, 2022

శ్రీ సాయి దయా సాగరమ్ 4 వ, భాగమ్

0 comments Posted by tyagaraju on 4:32 AM

 



01.04.2022  శుక్రవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

శ్రీ మాత్రే నమః 


సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభా కాంక్షలు

సాయి భక్తులందరికీ బాబా వారి దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు

శ్రీ సాయి దయా సాగరమ్ 4 వ, భాగమ్

మరాఠీ మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి

ఆంగ్లానువాదమ్ ---  శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి

తెలుగు అనువాదమ్ ---  ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్

అంతర్గత కోరిక (   శ్రీమతి ఉజ్వలా తాయి బోర్కర్)

ఓమ్ శ్రీ సాయి

ప్రియమయిన పాఠకులారా!

సాయిబాబా వారికి సంబంధించిన అనుభవాలను ఆయన భక్తులనుండి సేకరించి ఒక పుస్తకంగా ప్రచురిద్దామనే ప్రగాఢమయిన సంకల్పం నాకెంతో కాలం నుంచి ఉంది.  నా తల్లిదండ్రుల నివాసం బుల్దానా జిల్లాలోని డ్యూల్గవ్ రాజా.  నేను నివస్తిస్తున్న పట్టణం బాలాజీ దేవాలయానికి ప్రసిధ్ధి.  అది తిరుపతి బాలాజీ దేవాలయానికి ఉపాలయంగా కూడా ప్రసిధ్ధి చెందింది.  ఎవరయినా తిరుపతి బాలాజీకి మ్రొక్కుకొని అక్కడికి వెళ్ళి తీర్చలేకపోయినట్లయితే డ్యూల్ గావ్ రాజాలోని బాలాజీ ఆలయంలో ఆయన దర్శనం చేసుకుని మొక్కు తీర్చుకోవచ్చు.  

Thursday, March 31, 2022

శ్రీ సాయి దయా సాగరమ్ ౩ వ, భాగమ్

0 comments Posted by tyagaraju on 7:20 AM

 



31.03.2022  గురువారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

శ్రీ మాత్రే నమః  

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయి దయా సాగరమ్ ౩ వ, భాగమ్

మరాఠీ మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి

ఆంగ్లానువాదమ్ ---  శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి

తెలుగు అనువాదమ్ ---  ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్

(నిన్నటి పరిచయమ్ తరువాయి భాగమ్)

శ్రీ స్వామి వివేకానంద మూఢ నమ్మకాలకి, గారడీ పనులకి వ్యతిరేకి.  ధ్యానం, మరియు మన మెదడులో నిద్రాణస్థితిలో ఉన్న కణాలను ఉత్తేజపరచి వాటిని ఉపయోగించినట్లయితేనే మనము జీవితంలో ఘనమయిన పనులను సాధించగలమని నమ్మేవారు.  ఏ పుస్తకాన్నయినా ఒక్కసారి చదివితే చాలు పుస్తకం మొత్తాన్ని గుర్తుంచుకోగలిగే శక్తి స్వామీజీ లో ఉంది.  స్వామీజీ అది తాను చేసే అధ్బుతమని అనేవారు కాదు.  మన మెదడును ఆవిధంగా తర్ఫీదునిచ్చినపుడు అది సాధ్యమేనని అన్నారు.

Wednesday, March 30, 2022

శ్రీ సాయి దయా సాగరమ్ 2 వ, భాగమ్

0 comments Posted by tyagaraju on 8:40 AM

 



30.03.2022  బుధవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

శ్రీ మాత్రే నమః

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయి దయా సాగరమ్ 2 వ, భాగమ్

మరాఠీ మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి

ఆంగ్లానువాదమ్ ---  శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి

తెలుగు అనువాదమ్ ---  ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్

పరిచయమ్

ప్రాచీన కాలంనుండి భారతదేశం మహామహిమాన్వితులయిన యోగులు, గురువులకు, అధ్బుతాలకు నిలయంగా ప్రఖ్యాతి చెందింది.  అటువంటి గొప్ప యోగులలో ఒకరయిన శ్రీ సాయినాధ్ మహరాజ్ వారికి సంబంధించిన అనుభూతులు, తీపిగురుతులతో పొందుపరచబడినదే ఈ పుస్తకం.  శ్రీ సాయి భక్తులకోసం అటువంటి అనుభూతులతో ప్రచురింపబడటానికి కారకులయిన శ్రీమతి ఉజ్వల తాయి బోర్కర్ గారికి శుభాభినందనలు తెలుపుతున్నాను.  శ్రీమతి ఉజ్వల తాయి బోర్కర్ గారికి తన పుట్టింటి వారినుంచి అలాగే అత్తింటివారినుండి ఆధ్యాత్మిక వారసత్వం లభించడం ఆమె చేసుకున్న అదృష్టం. 

Tuesday, March 29, 2022

శ్రీ సాయి దయాసాగరమ్ - 1 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 7:28 AM

 



29.03.2022  మంగళవారం

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయి దయాసాగరమ్  - 

ముందుగా నామాట

రెండు నెలల తరువాత మరలా బ్లాగులో ప్రచురించే అవకాశం లభించింది.  కొన్ని నెలల ముందు బాబా భక్తుల అనుభవాలతో ఉన్న రెండు ఆంగ్ల పుస్తకాలను అనువాదం చేసి ప్రచురిద్దామన్నా కూడా రచయితలు అనుమతి నివ్వకపోవడం వల్ల సాధ్యపడలేదు.  బాబా తత్త్వ ప్రచారానికి అడ్డంకి కాపీ రైట్.  బ్లాగులో ప్రచురించడానికి మాత్రమె అనువాదం చేసుకుంటాననీ, వ్యాపార దృష్టితో కాదని చెప్పినా కూడా అనుమతినివ్వలేదు.  ఒక రచయితయితే చాలా నిబంధనలు పెట్టారు. 

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List