01.04.2022 శుక్రవారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
శ్రీ మాత్రే నమః
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభా కాంక్షలు
సాయి భక్తులందరికీ బాబా వారి దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు
శ్రీ
సాయి దయా సాగరమ్ 4 వ, భాగమ్
మరాఠీ
మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి
ఆంగ్లానువాదమ్
--- శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి
తెలుగు
అనువాదమ్ --- ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట,
హైదరాబాద్
అంతర్గత
కోరిక (
ఓమ్
శ్రీ సాయి
ప్రియమయిన
పాఠకులారా!
సాయిబాబా వారికి సంబంధించిన అనుభవాలను ఆయన భక్తులనుండి సేకరించి ఒక పుస్తకంగా ప్రచురిద్దామనే ప్రగాఢమయిన సంకల్పం నాకెంతో కాలం నుంచి ఉంది. నా తల్లిదండ్రుల నివాసం బుల్దానా జిల్లాలోని డ్యూల్గవ్ రాజా. నేను నివస్తిస్తున్న పట్టణం బాలాజీ దేవాలయానికి ప్రసిధ్ధి. అది తిరుపతి బాలాజీ దేవాలయానికి ఉపాలయంగా కూడా ప్రసిధ్ధి చెందింది. ఎవరయినా తిరుపతి బాలాజీకి మ్రొక్కుకొని అక్కడికి వెళ్ళి తీర్చలేకపోయినట్లయితే డ్యూల్ గావ్ రాజాలోని బాలాజీ ఆలయంలో ఆయన దర్శనం చేసుకుని మొక్కు తీర్చుకోవచ్చు.
(డ్యూల్ గావ్ రాజా బాలాజి ఆలయం)
నా డిగ్రీ పూర్తయిన తరువాత నాకు ఔరంగాబాదు జిల్లాలోని
గెవ్ రాయ్ గ్రామంలోని పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా మొట్టమొదటగా ఉద్యోగం వచ్చింది. అక్కడ నేను దేవదాస్ మహరాజ్ మఠంలో నివాసం ఉన్నాను. మా అమ్మగారు పైఠాన్ పటణంలోని సంత్ అమృతరాజ్ కుటుంబంలో
జన్మించారు. నేను ఎంతో భక్తిప్రపత్తులు, ఉన్నతమయిన
ఆధ్యాత్మిక భావాలు కలిగిన వాతావరణంలో పెరిగాను.
విలేపార్లే
ముంబాయిలోని బాలకృష్ణ బోర్కర్ తో నా వివాహం జరిగింది. బోర్కర్ కుటుంబీకులందరూ సాయి భక్తులు. మా అత్తగారి అత్తగారు శ్రీమతి చంద్రాబాయి బోర్కర్
గారు షిరిడీ వెడుతూ ఉండేవారు. సాయిబాబా ఆవిడని
తన చిన్న చెల్లెలు అంటూ ఉండేవారు.
చంద్రాబాయి
గారి తదనంతరం మా అత్తగారయిన మంగళతాయి బోర్కర్ గారు (మాయి బోర్కర్) సాయి పూజను కొనసాగిస్తూ
సాయి మందిరంలో ఎన్నో సామాజిక కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. నేను కూడా ఆవిడతో కలిసి సామాజిక సేవా కార్యక్రమాలలో
పనిచేయడం మొదలు పెట్టాను. ఆవిధంగా కార్యక్రమాలలో
పాల్గొన్న సమయాలలో నాకు బాబా ఎన్నో అనుభవాలను చమత్కారాలను కలిగించారు.
మా
అత్తగారు మంగళ తాయి తదనంతరం గృహ మరియు సాయి మందిర బాధ్యతలు అన్నీ నా భుజస్కంధాలపై పడ్డాయి. నా భర్త బాలకృష్ణ బోర్కర్ గారు నాకు
మార్గదర్శిగా ఉండి సహాయపడుతూ ఉండేవారు. ఎందరో
భక్తులు సాయిని దర్శించుకోవడానికి వచ్చినపుడు వారు సాయి గురించి తమకు కలిగిన అనుభవాలను
చెబుతూ ఉండేవారు. ఆ భక్తులందరూ తమ అనుభవాలతో
ఒక పుస్తకాన్ని వ్రాయమని కోరినపుడు సంవత్సరాల తరువాత ఇప్పటికి కార్యరుపం దాల్చింది.
శ్రీమతి ఉజ్వలా తాయి బోర్కర్
అధ్యాయమ్
– 1
కీ.శే.
శ్రీమతి చంద్రాబాయి బోర్కర్ గారు చెప్పిన వివరాలు…
నేను
చంద్రాబాయిని చూడలేదు. కాని నేను మా అత్తగారి
సాహచర్యంలో ఉన్నాను. ఈ పుస్తకంలో నేను కీ.శే.
చంద్రాబాయి, కీ.శే. మంగళతాయి అనుభవాలు, నాస్వంత అనుభవాలను వ్రాసాను. వీటితోపాటు ఎందరో భక్తులు నాతో పంచుకున్న అనుభవాలను
కూడా పొందుపరచడం జరిగింది.
కీ.శే.
చంద్రాబాయికి సాయి ప్రసాదించిన అనుభవాలు – 17.09.1936
“మీరెక్కడికి
వెళ్ళినా నేను మీవెంటే ఉంటాను”
గత
40 సంవత్సరాలనుండి నేఉ శ్రీసాయి బాబాను పూజిస్తూ
ఉన్నాను. మొట్టమొదటిసారిగా నేను 1898 లో సాయిని
దర్శించుకోవడానికి షిరిడీ వెళ్ళాను. నేను షిరిడీకి
ఎప్పుడు వెళ్ళినా బాబా నాకు ఊదీనిస్తూ ఉండేవారు.
ఆ ఊదీ యొక్క శక్తి నాకు బాగా తెలుసును గనక దానిని నా వద్ద భద్రపరచుకుంటూ ఉండేదానిని. నా హృదయాంతరాళలోనుండి నేను సాయిని ప్రార్ధించుకునేదానిని. సాయిబాబా కూడా మనఃస్ఫూర్తిగా నన్ను దీవిస్తూ ఉండేవారు. అప్పట్లో మసీదు కొంతవరకు శిధిలమయి ఉంది. సాఠేవాడా కూడా లేదు. అందువల్ల బాబా ఒక చెట్టుక్రింద కూర్చుంటూ ఉండేవారు.
మసీదు
దగ్గర ఒక చెక్కబల్ల మీద బాబా నిద్రిస్తూ ఉండటం
చూసాను. ఆ సమయంలో ఏప్రభుత్వ అధికారి గాని,
ప్రముఖవ్యక్తులు గాని బాబా దర్శనానికి వచ్చేవారు కాదు. నేను షిరిడీ వచ్చినపుడెల్లా శారదాబాయి చంద్రోర్కర్ మెస్ లో
బస చేసేదానిని.
1906 వ.సంవత్సరంలో రామచంద్ర బోర్కర్ (నా భర్త) పండరీపూర్ వెళ్ళారు. అక్కడ ఒక వంతెన నిర్మాణం జరుగుతున్నందువల్ల మేమక్కడ కొంత కాలం ఉన్నాము. ఆరోజు నాకు బాగా గుర్తు. అప్పుడు నేను షిరిడీలో ఉన్నాను. అకస్మాత్తుగా బాబా నన్ను వెంటనే పండరీపూర్ వెళ్ళి అక్కడ ఏమి జరుగుతూ ఉందో చూడమన్నారు. వెంటనే నేను పండరీపూర్ చేరుకున్నాను. నా భర్త తను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి పండరీపూర్ నుండి వెళ్ళిపోయినట్లు తెలిసింది. ఏమి చేయాలో నాకేమీ అర్ధం కాలేదు. చాలా ఆందోళనతో ఏమీ తోచని స్థితిలో ఉండిపోయాను. నా భర్త ఎక్కడికి వెళ్ళారో ఎక్కడ ఉన్నారో ఎటువంటి సమాచారం లేదు. అపుడు ఒక ఫకీరు వచ్చి నా భర్త ఒక సమస్యలో చిక్కుకున్నాడనీ నాకోసం దౌండ్ స్టేషన్ లో నాకోసం నిరీక్షిస్తూ ఉన్నాడని చెప్పాడు.
ముందుగా నేను దౌండ్ కి వెళ్లడానికి
అభ్యంతరం వ్యక్తం చేసాను. కారణం దౌండ్ లో మా
బంధువులు ఎవరూ లేదు. కాని ఆ ఫకీరు నన్ను దౌండ్
కి వెళ్లమని పట్టుపట్టాడు. వెళ్ళడానికి నాదగ్గర
డబ్బు లేదు. చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నాను. నేనా ఫకీరుకు నా పరిస్థితిని వివరించాను. ఫకీరు 3 టికెట్లు తెచ్చి నా చేతిలో పెట్టాడు. నేను దౌండ్ కి బయలుదేరాను. నేను వెళ్ళేటప్పటికి నా భర్త నాకోసం ప్లాట్ ఫారం
మీద ఎదురు చూస్తూ ఉన్నారు. తన వద్దకు ఒక ఫకీరు
వచ్చి, “నీ భార్య నువ్వు ఎక్కడ ఉన్నావో తెలియక చాలా ఆందోళనలో ఉంది. త్వరలోనే ఆమె ఇక్కడికి వస్తుందని చెప్పాడు” అని
నాభర్త చెప్పారు. ఆయన తన జీవితంలో ఎప్పుడూ
సాయిబాబాను చూడలేదు. నేను నావద్ద ఉన్న బాబా
ఫోటోను చూపించగానే “ఈ ఫకీరే నాకు నువ్వు వస్తున్న విషయం చెప్పినది” అన్నారు.
తన భక్తులను సరియైన మార్గంలోకి తీసుకురావడానికి బాబా ఎప్పుడూ సిధ్ధంగా ఉంటారనే విషయం నాకపుడు అర్ధమయింది.
(ఇంకా
ఉంది)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment