Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, June 18, 2021

షిరిడీ సాయిబాబా – గురునానక్ – 5 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 8:20 AM

 




18.06.2021  శుక్రవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి  బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయిలీల ద్వైమాసపత్రిక నవంబరుడిసెంబరు, 2008 .సంవత్సరంలో ప్రచురింపబడిన సాయిలీల

షిరిడీ సాయిబాబాగురునానక్ – 5 .భాగమ్

తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

కలిపురుషుని ప్రభావం మన మీద పడకుండా గురునానక్ గారు మనకి రక్షణ కల్పించారు.  ఆయన మహాపవిత్ర స్థానంలోకి ప్రవేశించి ఎటువంటి కోరికలు లేని జీవితాన్ని సుఖంగా ప్రశాంతంగా గడపాలా వద్దా అన్నది ఇపుడు మనం నిర్ణయించుకోవాలి.

నానక్  ప్రసిధ్ధమయిన పదాలను ఉఛ్చరించారు.

Tuesday, June 15, 2021

షిరిడీ సాయిబాబా – గురునానక్ – 4 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 7:48 AM

 


15.06.2021  మంగళవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి  బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయిలీల ద్వైమాసపత్రిక నవంబరుడిసెంబరు, 2008 .సంవత్సరంలో ప్రచురింపబడిన సాయిలీల

షిరిడీ సాయిబాబాగురునానక్ – 4 .భాగమ్

ఆంగ్ల మూలమ్ - డా.సుబోధ్ అగర్వాల్

తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

సాయిబంధువులకు ఒక గమనిక....

సాయిభక్తురాలు ఒకామె భరద్వాజగారి పుస్తకాలు ఈ క్రింద ఇస్తున్న లింక్ ద్వారా చదవచ్చని చెప్పారు.  ఆ లింకి ఇక్కడ ఇస్తున్నాను.  కొంత సమయం కేటాయించుకుని వారి పుస్తకాలను ఆన్ లైన్ లో చదవవచ్చు...

http://www.saibharadwaja.org/pages/books.aspx


ఒకవేళ నాకు ముత్యాలతోను, ఆభరణాలతోను, కస్తూరి, కుంకుమపువ్వు, చందనపు సువాసనలతోను లభించే గృహం అవన్నీ నా కళ్ళముందు కనబడుతూ ఉంటే  చాలా ఆనందంగానే ఉంటుంది.  అవన్నీ చూసిన తరువాత నేను దారి తప్పవచ్చు.  నేను వాహేగురుని మర్చిపోవచ్చు.  నీపేరు కూడా నా ఆలోచనలోకే ప్రవేశించదు.  భగవంతుడు లేని నా ఆత్మ కాలి బూడిదయినట్లే. నేను నా గురువుని సంప్రదించాను.  అక్కడ వేరే స్థలమేదీ  లేదని గమనించాను. 

Sunday, June 13, 2021

షిరిడీ సాయిబాబా – గురునానక్ – 3 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 8:33 AM

 



13.06.2021  ఆదివారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి  బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయిలీల ద్వైమాసపత్రిక నవంబరుడిసెంబరు, 2008 .సంవత్సరంలో ప్రచురింపబడిన సాయిలీల

షిరిడీ సాయిబాబాగురునానక్ – 3 .భాగమ్

తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

గురునానక్ మర్దానాతోఇలా వచ్చి చూడుఇప్పుడు జరగబోయే నాటకాన్ని చూడుఅన్నారు.  కలిపురుషుడు గురునానక్ కు తలవంచి వినయంతో వేడుకొన్నాడు.  మహరాజ్, దయచేసి నాతప్పులను క్షమించండి.  నాకు మీపేరుప్రఖ్యాతులు, గొప్పతనం తెలియవు.  ఈ యుగానికి నేనే పరిపాలకుడిని.  మానవులను ఏకోరికలయితే నడిపిస్తున్నాయో అటువంటి భౌతికశరీరంతో మీముందుకు వచ్చాను నేను.  మానవులు అన్ని ధర్మాలను విస్మరిస్తారు.  వారి జీవితాలన్నీ నాలుక రుచులకి, *** కోరికల చేత నడిపింపబడుతూ ఉంటాయి. 

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List