Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, April 16, 2021

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 69 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 4:30 AM

 



16.04.2021  శుక్రవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 69 .భాగమ్

(రచయిత… శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ – ఇటలీ)

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేటహైదరాబాద్

ఫొన్ : 9440375411 & 8143626744

మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

షిరిడీబొంబాయి

బొంబాయి ---



ఆదివారమ్, అక్టోబరు, 27, 1985

స్వామి రామ్ బాబా గారి అపార్ట్ మెంట్ లో ఇంకా మరికొందరు ఉన్నారు.  వారంతా స్వామి రామ్ బాబా గారి భక్తులని నేను భావించాను.  ఆయన గదిలో గోడమీద  షిరిడీసాయి ఇంకా అలాగే జీసస్ మరికొందరు యోగుల    అనేక చిత్రపటాలు  ఉన్నాయి.

ఆయన మాట్లాడే మాటలలో విశ్వవ్యాప్తమయిన దృష్టికోణం కనిపించింది.  తత్త్వం అన్నది నిత్య సత్యం.  దానికి మనం వివిధరకాలయిన, వేర్వేరు పేర్లు, విభిన్నమయిన వివరణలు ఇస్తాము.  వాస్తవానికి ఇది ఒక్కటే.

Tuesday, April 13, 2021

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 68 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 5:54 AM





13.04.2021  మంగళవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ప్లవనామ సంవత్సర శుభాకాంక్షలు

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 68 .భాగమ్

(రచయిత… శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ – ఇటలీ)

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేటహైదరాబాద్

ఫొన్ : 9440375411 & 8143626744

మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com



షిరిడీబొంబాయి

బొంబాయి ---

ఆదివారమ్, అక్టోబరు, 27, 1985

నా డైరీలోని ముఖ్యాంశాలు

ఉదయం గం. 11.30 ---  నిన్న రాత్రి బొంబాయి చేరుకునేటప్పటికి గం.9.45 అయింది.  బస్సుప్రయాణం షిరిడీనుంచి బొంబాయికి చాలా దూరం.  రోడ్డు కూడా గతుకులుగా ఉండటం వల్ల చాలా అలసట కలిగింది.  దారిలో మేము సాకూరీలోను, నాసిక్ లోను ఆగాము.  కాస్తంత ఆధునికంగా ఉన్న ఆలయం ఒకటి కనిపించింది.  బొంబాయి చేరుకున్న తరువాత టాక్సీలో మెరైన్ డైవ్ లో ఉన్న అగర్వాల్ గారి ఇంటికి పది గంటలకు చేరుకొన్నాను.  ఆయన చేసే గౌరవమర్యాదలు ఎప్పుడూ అధ్భుతంగానే ఉంటాయి.  

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List