Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, November 5, 2016

సాయి పాదరేణువు మూర్తిగారి అనుభవాలు - 2

0 comments Posted by tyagaraju on 6:35 AM


      Image result for images of shirdi sainath


        Image result for images of yellow rose hd

05.11.2016 శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయి పాదరేణువు మూర్తిగారి అనుభవాలు - 2


My story – Part-2 – సాయి లీల-3 (continues)
నా మొండి ధైర్యం ఎంతవరకు తీసుకువెళ్ళిందంటే నా బంగారం లాంటి (గెజిటెడ్ ఆఫీసర్ హోదా) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని ఒదులుకోనేలా చేసింది. ఇండియా లోని నా ప్రభుత్వ ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ (నవంబర్ 2000) తీసేసుకున్నాను 30 సంవత్సరాల సర్విసుతో (ఇంకా 6 సంవత్సరాల సర్వీస్ ఉండగా). తీసుకున్న వెంటనే అక్కడ విదేశంలో మార్చ్ కల్లా నా ఉద్యోగం కూడా పోయింది.  ఇదంతా సాయి చేస్తున్న లీల - నన్ను వెనక్కి రప్పించడానికి. నాలో ఆయన మీద విశ్వాసం పెంపొందించుకోడానికి నాకు అవకాశం ఇవ్వడానికి.  

Friday, November 4, 2016

సాయి పాదరేణువు (మూర్తి) గారి అనుభవాలు: 1

0 comments Posted by tyagaraju on 8:41 AM
      Image result for images of shirdi saibaba
            Image result for images of rose hd

04.11.2016 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి పాదరేణువు (మూర్తి) గారి అనుభవాలను సాయి బంధు సాయి సురేష్ గారు జూలై నెల 25వ.తారీకున నాకు మైల్ ద్వారా పంపించారు.  శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము పూర్తయిన తరువాతె ప్రచురిద్దమని ఆపడమ్ జరిగింది.  ఈ రోజునుండి వారి అనుభవాలను ప్రచురిస్తున్నాను. చదవండి.  ఆయన పంపించిన అనుభవాలను యధాతధంగా ప్రచురిస్తున్నాను.  అక్కడక్కడ అక్షర దోషాలను మాత్రమే సరి చేసాను.

సాయి పాదరేణువు (మూర్తి) గారి అనుభవాలు: 1

మీకు వాగ్దానం చేసినట్టుగా మీకు నా కథను, నా లైఫ్ లో బాబా చేసిన లీలలు, మహిమలు అన్నీ మీకు తెలియ పరచబోతున్నాను..
[నేను కవిని కాను, రచయితను కాను. అందుకని రచనలో ఎన్నో అక్షర దోషాలుండ వచ్చు. భావాన్ని మాత్రమే చూడండి, విషయం గ్రహిస్తే చాలు. బాబా లీలలు, అందుకు నా జీవితంలో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయో, నన్నుబాబా విధంగా చూసుకున్నాడో అర్ధం చేసుకోండి]

Thursday, November 3, 2016

శ్రీసాయిబాబావారి బోదనలు మరియు తత్వము - 20. విభిన్న మతాలు – 2వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 8:18 AM
   Image result for images of shirdi sai as fakir
        Image result for images of rose hd

03.11.2016  గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిబాబావారి బోదనలు మరియు తత్వము
ఆంగ్లమూలం : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి. నింబాల్కర్







తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు
20. విభిన్న మతాలు – 2వ.భాగమ్
ఒకసారి ఒక మామలతదారు దక్షిణాఫ్రికానుండి వచ్చిన బ్రాహ్మణుడయిన ఒక వైద్యునితో షిరిడీకి వచ్చాడు.  షిరిడీకి రమ్మని పిలిచినప్పుడు ఆవైద్యుడు తన ఇష్టదైవం శ్రీరాముడని, తాను ఒక మహమ్మదీయునికి నమస్కరించనని అందుచేత షిరిడీకి రావడం ఇష్టం లేదని చెప్పాడు.  అపుడా మామలతదారు అక్కడ షిరిడీలో బాబాకు నమస్కరించమని ఎవరూ బలవంత పెట్టరని, బాబాకూడా తనకు నమస్కరించమని కూడా అనరనీ అందుచేత సంతోషంగా షిరిడీకి రావచ్చని చెప్పాడు.  

Wednesday, November 2, 2016

శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము - 20. విభిన్న మతాలు – 1వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 8:18 AM
      Image result for images of shirdisai
    Image result for images of rose hd

02.11.2016 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
గత పదిహేను రోజులుగా కొన్ని వ్యక్తిగత వ్యవహారాల వల్ల ఆంగ్లం నుండి అనువాదం చేసి ప్రచురణ చేయలేకపోయాను.  ఈ రోజునుండి యధావిధిగా బాబావారి తత్వం ప్రచురిస్తున్నాను.  చదవండి.

శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము
ఆంగ్ల మూలం : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి. నింబాల్కర్
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
20. విభిన్న మతాలు – 1వ.భాగమ్
సాయిబాబావారి వేషధారణ ఒక ముస్లిమ్ ఫకీరులాగ ఉండేది.  ఆయన తన జీవితకాలమంతా పాడుబడిన మసీదులోనే గడిపారు.  ఆయన నిరంతరం ‘అల్లామాలిక్’ (భగవంతుడే యజమాని) అని స్మరిస్తూ ఉండేవారు.  ఆయన, మునుపటి నిజాం రాష్ట్రంలో వాడుక భాషయిన ఉర్దూని పొడి పొడి పదాలతో మరాఠీతో కలిపి మాట్లాడేవారు.  ఆయన ఎప్పుడూ సాధారణంగా ‘అల్లా భలాకరేగా (భగవంతుడు నీకు మేలు చేస్తాడు) అనేవారు.
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List