05.11.2016 శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి పాదరేణువు మూర్తిగారి అనుభవాలు - 2
My
story – Part-2 – సాయి లీల-3 (continues)
నా
మొండి ధైర్యం ఎంతవరకు తీసుకువెళ్ళిందంటే నా బంగారం లాంటి (గెజిటెడ్ ఆఫీసర్ హోదా) కేంద్ర
ప్రభుత్వ ఉద్యోగాన్ని ఒదులుకోనేలా చేసింది. ఇండియా లోని నా ప్రభుత్వ ఉద్యోగానికి వాలంటరీ
రిటైర్మెంట్ (నవంబర్ 2000) తీసేసుకున్నాను 30 సంవత్సరాల సర్విసుతో (ఇంకా 6 సంవత్సరాల
సర్వీస్ ఉండగా). తీసుకున్న వెంటనే అక్కడ విదేశంలో మార్చ్ కల్లా నా ఉద్యోగం కూడా పోయింది. ఇదంతా సాయి చేస్తున్న లీల - నన్ను వెనక్కి రప్పించడానికి.
నాలో ఆయన మీద విశ్వాసం పెంపొందించుకోడానికి నాకు అవకాశం ఇవ్వడానికి.
కాని నేను ఒక మొండివాడిని, అహంకారిని. నా ఆత్మ విశ్వాసమే నా అహంకారం. ఈ అహంకారాన్నే అణచాలని బాబా సంకల్పం. అక్కడ ఉద్యోగం పోయేసరికల్లా నాలో భయం పట్టుకుంది. కొద్ది కొద్దిగా బాబా మాటలని విశ్వసించడం మొదలైంది. కాని అంత తొందరగా నా వోటమిని ఒప్పుకుంటానా? లేదు లేదు. అలాగే 3 నెలలు కష్టపడి ఎదురుచూసాను. అయినా నా వెనుకనున్నదెవరు - సాయిబాబా. ఆయన ముందరా నా కుప్పిగంతులు? ఒక మూడు నెలలు దుర్భరంగా గడిపి ఇంక ఉండలేక స్వదేశం తిరిగి వచ్చాను.
కాని నేను ఒక మొండివాడిని, అహంకారిని. నా ఆత్మ విశ్వాసమే నా అహంకారం. ఈ అహంకారాన్నే అణచాలని బాబా సంకల్పం. అక్కడ ఉద్యోగం పోయేసరికల్లా నాలో భయం పట్టుకుంది. కొద్ది కొద్దిగా బాబా మాటలని విశ్వసించడం మొదలైంది. కాని అంత తొందరగా నా వోటమిని ఒప్పుకుంటానా? లేదు లేదు. అలాగే 3 నెలలు కష్టపడి ఎదురుచూసాను. అయినా నా వెనుకనున్నదెవరు - సాయిబాబా. ఆయన ముందరా నా కుప్పిగంతులు? ఒక మూడు నెలలు దుర్భరంగా గడిపి ఇంక ఉండలేక స్వదేశం తిరిగి వచ్చాను.
My
story – Part-3 – సాయి లీల (మహిమ) -4
ఇండియాకి
వచ్చిన తర్వాత కూడా ఊరికినే ఉండలేక (ఎక్కువుగా సంపాదించాలనే ఆశ నన్ను దొలిచేస్తుంది
- ఎందుకంటే నా ఇంటి అవసరాలు అట్లా ఉన్నాయి కాబట్టి) నాకున్న అనుభవంతో ఒక సాఫ్ట్ వేర్ కంపెనీని మొదలుపెడదామని
అనుకుని బాబాని అడిగాను. ఒప్పుకోలేదు. మళ్లీ
వేధించాను. ఆయన విగ్రహం ముందు చీటీలు వేసేను. వ్యాపారం చెయ్యొద్దు అని వచ్చింది. రెండవసారి వేసాను,
ఈసారి కూడా వద్దు ఏదేని ఉద్యోగం చేసుకో అని వచ్చింది. అయినా వినలేదు. కంపెనీ మొదలుపెడితే బాబానే సహాయం చేస్తాడు కదా అని,
నా భార్య సమ్మతించక పోయినా ఒక కంపెనీని స్టార్ట్ చేశాను. (ఇక్కడ మీరు సరిగానే అర్ధం చేసుకుని ఉండాలి నా మొండి
పట్టుదల గురించి. నేను పక్కా బ్రాహ్మణుడను. సాధారణంగా బ్రాహ్మణులకు వ్యాపారం అచ్చిరాదు. ఒక పక్క బాబా ఒప్పుకోలేదు. మరో పక్క నా భార్యకి
కూడా ఇష్టం లేదు నేను బిజినెస్ చేయడం. ఇటువంటి తీవ్ర వ్యతిరేక వాతావరణంలో నా పట్టుదల
నా ధైర్యం అవాంఛనీయం. కాని నా ప్రారభ్ధం నన్ను వీటిని పెడచెవిని పెట్టేలా చేసింది.)
నా
పట్టుదల బాబాకి తెలుసు. అందుకే బాబాకి ఇష్టం
లేకపోయినా నన్ను నిరుత్సాహపరచడం ఇష్టం లేక ఊరుకున్నారు. నా ప్రారబ్ధం అదే అని బాబాకి తెలుసు. వారించినా వినడం లేదు వీడు. సరే అవసరం వచ్ఛినపుడు కాపాడదాం లే అని నన్ను, నా చర్యలని కనిపెడుతూ ఉన్నారు.
సరే నేను కంపెనీ పెట్టడానికి నా భార్య అనుమతి లేకుండానే నాకు వాలంటరీ రిటైర్మెంట్ ద్వారా మరియు నా విదేశీ ఉద్యోగం ద్వారా మిగిలిన డబ్బు అంతా మదుపు పెట్టాను. దానికి తగ్గట్లు గానే ఒక పెద్ద ప్రాజెక్ట్ కూడా వచ్చింది. ఇంక అప్పట్నుంచి మొదలయ్యాయి నా పాట్లు. నా ఇన్వెస్ట్ మెన్ట్ ఆ ప్రాజెక్ట్ ఖర్చు లో 5 శాతం కన్నా తక్కువే. మిగిలిన ఫండ్స్ తీసుకురావడానికి నేను పడిన పాట్లు బహుశా ఎవరూ పడరేమో. సాంకేతికంగా నాకు సహాయం చేయడానికి అందరూ ఉన్నా ఆర్ధిక పరిస్థితిని చక్క దిద్దడానికి మాత్రం ఎవరూ లేరు. నేనొక్కడినే ఆ ఫండ్స్ అన్నీ సాధించి పెట్టాలి. అందుకు నాకు తగిన వనరులు లేవు. బాబా సహాయం లేదు. [నాకు డైరెక్ట్ గా ఎటువంటి సహాయం చెయ్యకపోయినా సమస్యలు వచ్చినప్పుడు గట్టేక్కిస్తూ నాకు వార్నింగ్స్ ఇస్తూనే ఉన్నాడు.] కష్టపడి
2 ½ సంవత్సరాలు ఆ ప్రాజెక్ట్ తో కుస్తీ పట్టి పట్టి ఎన్నో లక్షల అప్పులతో (నేను జీవితాంతం పని చేసినా తీర్చలేనంత అప్పులు) ఆ కంపెనీని నడపలేక మూసేయాల్సి వచ్చింది. ఆ విధంగా నా బిజినెస్ ప్రయత్నం నన్ను తీవ్రమైన అప్పుల ఊబిలో ముంచింది. వాటిని తీర్చే తాహతులేక ఆ అప్పులు తీరే మార్గం కనపడక తీవ్ర మనోవ్యధకు లోనయ్యాను.
నా ఆరోగ్యం బాగా దెబ్బ తింది. అప్పులిచ్చిన వాళ్ళు ఊరుకోరుగా. ఒకొక్కరు పీడించడం మొదలెట్టారు. నా మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, జైల్లో పెట్టించడం, కిడ్నాప్ చెయ్యడం, నా (భార్య) ఆస్థిని మా విలువైన వస్తువులను దోచుకోవడం మొదలైన అన్ని దారులను ఉపయోగించారు. ఈ పరిస్థితులన్నిటిలొ కూడా బాబా అదృశ్య హస్తం నన్ను అనుక్షణం కాపాడుతూనే ఉంది.
నా ఆస్థిని నా భార్య పేరుమీద పెట్టించారు. నా పేరు మీద ఉంటే అవి అన్నీ కూడా ఎప్పుడో అమ్మివేసి ఉండేవాడిని. బాబా అలా చేయకుండా నన్ను, నా వాళ్ళను రోడ్డు మీద పడకుండా కాపాడారు. నా పేరు మీద ఒక్కటీ లేక పోవడం నాకొక వరంగా చేసారు. ఈ పరిస్థితులను ఈవిధంగా కల్పించి నాకు బుద్ధి వచ్చేటట్లు చేసారు. నా తప్పేంటో నాకు తెలిసి వచ్చేటట్టు చేసారు. సాయి తను చెప్పినమాట వినకపోవడం ఎంత అనర్ధానికి దారి తీసిందో స్పష్టంగా అనుభవింపచేసారు. ఆ కంపెనీ మూసివేసిన దగ్గరనుంచి (2003 చివరలో) నన్ను తన దాసుడుగా చేసుకున్నారు.
బాబాని ప్రేమిస్తూ వస్తున్నాను, ఆరాధిస్తున్నాను. అప్పట్నుంచి నేను బాబా మీదే ఆధారపడుతూ వస్తున్నాను. బాబాను వదిలే ప్రసక్తే లేదు. అను నిత్యం బాబా నామ జపం చేస్తూ, పూజలు - అభిషేకాలు చేసుకుంటూ రోజులు గడుపుకుంటూ వస్తున్నాను. బాబాకి నేను, నాకు బాబా అత్యంత ప్రియమైన వారం అయిపోయాము. ఇంక అప్పట్నుంచీ నాతో ఇంచుమించు ప్రతిరోజూ (ధ్యానంలో) మాట్లాడుతూ నాకు తగిన సలహాల నిస్తున్నాడు. అప్పుడప్పుడు (ధ్యానంలోనే) నాకు దివ్య దర్శనాలు ఇస్తూ నన్ను ఆనంద దోలికలలో ముంచుతూ నా కష్టాల ప్రభావం ఎక్కువగా తెలియనీయకుండా చేస్తున్నారు.
అప్పులవాళ్ళు 2004 నుంచి 2006 వరకు మా వెంట పడుతూనే ఉన్నారు, మమ్మల్ని బాధ పెడుతూనే ఉన్నారు. వారి బారి నుంచి తప్పించడానికి, మాకు మనశ్శాంతి కలిగించడానికి మమ్మల్ని వేరే చోటుకి (ఎక్కడైతే వాళ్ళు మమ్మల్నికనుక్కోలేరో) అక్కడికి ఇల్లు (తనే సెలెక్ట్ చేసి మరీ) మారేటట్టు చేసారు. ఆవిధంగా మమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. అప్పులవాళ్ళు కూడా అలిసిపోయి అడగటం మానేసేటట్టు చేసారు. (ఈ పరిణామానికి కారణం ఏంటో బాబా చెప్పాడు - క్రితం జన్మలలో వాళ్ళు నాకు రుణపడి ఉండటమే కారణం. వాళ్ళు నాకు బాకీ పడిన రుణాన్ని ఈ జన్మలో వాళ్ళు నాకు రుణాలనిచ్చి ఈవిధంగా తీర్చుకున్నారు. కాకపోతే వాళ్ళకి ఆ జ్ఞానం ఉండదుకదా. అందుకే నన్ను బాధిస్తున్నారు). ఎంత విచిత్రమో చూసారా! ఈ కాలంలో ఎవరైనా పదివేలు అప్పైనా సరే విడిచిపెట్టరే, అటువంటిది ఎన్నో లక్షల అప్పులను వాళ్ళు వదిలేసుకునేటట్టు చేయడం అంటే బాబా చేసిన లీల/ మహిమ కాకపోతే మరేంటి? అందుకే నేను ఆ మహా దైవానికి ఆ మహా సిద్ధ గురువుకు ఏమిచ్చి ఆ ఋణం తీర్చుకోగలను? అనుక్షణం ఆయనను ప్రేమిస్తూ ఉండడం తప్ప. ఆయనను ప్రేమిస్తూ ఆయన సేవలే చేసుకుంటూ ఉంటాను. ఇంతకన్నా ఏం చేయగలను నేను?
(ఇంకా
ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment