14.04.2013 ఆదివారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంచువులకు బాబావారి శుభాశీస్సులు
పుణ్య భూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి 30 వ.అధ్యాయము కాస్త పెద్దదిగా ఉండటం వల్ల గత మూడురోజులుగా ఇవ్వలేకపోయాను. ఉగాదినాడు కూడా కుదరలేదు...అందుచేత కొంత ఆలస్యమయినా సాయిబంధువులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ సంవత్సరం లాగే ప్రతీ సంవత్సరం అందరూ సుఖ సంతోషాలతో హాయిగా జీవితం గడిపేలా వరమివ్వమని, బాబావారి అనుగ్రహం మనందరి మీదా ఎల్లవేళలా ప్రసరింప చేయమని ప్రార్ధిస్తున్నాను.
ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 63వ.శ్లోక, తాత్పర్యం
శ్లోకం: శుభాంగ శ్శాంతిద స్స్రష్టా కుముదః కువలేశయః |
గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః ||
తాత్పర్యం: ఆయన శుభమయిన శరీరము లేక విగ్రహము కలవాడు. ఆయన సృష్టించునవి భూగోళమందంతట అయన సాన్నిధ్యముచే శాంతిని ఆనందమును జీవులకు కలిగించును. అయన గోవులు, వృషభముల హితము కోరుచు, వాటిని గుప్తముగా నుంచి సం రక్షించును. ఆయన వృషభ నేత్రముతో నుండి వృషభమును యిష్టపడును.
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి -
30వ.అధ్యాయము
02.02.1992
ప్రియమైన చక్రపాణి,
నాజీవితములో నేను గాయత్రి మంత్రమును రోజు జపించలేదు. వేద శాస్త్రాలు పారాయణ చేయలేదు. కాని, శ్రీసాయి సత్ చరిత్ర ప్రతిరోజు పారాయణ చేయటము వలన గాయత్రి మంత్ర జపము, వేద శాస్త్రాల పారాయణ ఫలము నిత్యము నేను అనుభవించుచున్నాను. ఈ నానమ్మకాన్ని కొందరు హేళన చేయవచ్చును.
