శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి
సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావు
12.05.2019 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 4 వ.భాగమ్
సాయిబానిస గారి ద్వారా సాయి భక్తులకు బాబా వారు అందిస్తున్న
అమూల్యమయిన సాయి సందేశాలు
ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్
చదివిన తరువాత మీ అభిప్రాయాలను తెలపండి.
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
24.04.2019 - ద్వారకామాయిలో భోజనాలు
1. నా
వృధ్దాప్యములో నా భక్తులు నాకోసం మరియు తోటి భక్తులకోసం భోజన పదార్ధాలను ద్వారకామాయికి
తెచ్చేవారు. ముందుగా
భగవంతునికి నైవేద్యము సమర్పించి, ఆ తరవాత అందరితో నేను మధ్యాహ్న
భోజనము చేసేవాడిని. నా
ప్రక్కన కూర్చుని భోజనము చేసేవారిలో బడేబాబా ముఖ్యుడు.
