Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, December 11, 2020

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 12 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 8:07 AM

 





11.12.2020  శుక్రవారమ్                                                                          

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయిబాబాపరిశోధనా వ్యాస గ్రంధము – 12 .భాగమ్

(రచయితశ్రీ ఆంటోనియో రిగోపౌలస్ఇటలీ)

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

ఫొన్ : 9440375411 & 8143626744

మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

షిరిడీసాకోరీషిరిడి -  గురువారము, అక్టోబరు, 17, 1985

అప్పా చెబుతున్న మరికొన్ని వివరాలు  ---

సాయంత్రం గం.7.30 ని. అయేటప్పటికి ఆరోజులో దక్షిణగా వచ్చిన సొమ్ము ఎంత వస్తే అంతా సాయిబాబా పంచిపెట్టేస్తూ ఉండేవారు.  తను స్వంతంగా ధనం కూడబెట్టుకోవడానికి బాబా దక్షిణ అడిగేవారు కాదు.  తన జేబులో చేయిపెట్టి డబ్బుతీసి ఇవ్వగలిగే గొప్ప శక్తులు సాయిబాబాకు ఉన్నాయి.

తారక్   ---   తనకు అధ్బుతాలను చేయగలిగే శక్తి ఉందని అందరి ఎదుట ప్రదర్శించడం ఆయనకు ఇష్టముండేది కాదు.  అందువల్లనే ఆయన ప్రజలవద్దనుంచి దక్షిణ స్వీకరిస్తూ ఉండేవారు.

Wednesday, December 9, 2020

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 11వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 6:19 AM

 



09.12.2020  బుధవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయిబాబాపరిశోధనా వ్యాస గ్రంధము – 11.భాగమ్

(రచయితశ్రీ ఆంటోనియో రిగోపౌలస్ఇటలీ)

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

ఫొన్ : 9440375411 & 8143626744

మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

షిరిడీసాకోరీషిరిడి -  గురువారము, అక్టోబరు, 17, 1985

అప్పా చెప్పిన మరికొన్ని వివరాలు

ఉపాసనీ బాబా గురించి మరికొంత వివరిస్తాను.  ఉపాసనీ బాబా, సాయిబాబా వారితో కలిసి ఇక్కడే నాలుగు సంవత్సరాలు ఉన్నారు.  మా మేనత్త ఉపాసనీ బాబాతో చాలా సన్నిహితంగా ఉండేది.  ఆమె ఆయనతో కలిసి గోధుమలు, జొన్నలు తిరగలిలో విసిరేది.

Monday, December 7, 2020

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 10 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 7:58 AM

 



07.12.2020  సోమవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయిబాబాపరిశోధనా వ్యాస గ్రంధము – 10 .భాగమ్

(రచయితశ్రీ ఆంటోనియో రిగోపౌలస్ఇటలీ)

తెలుగు అనువాదమ్ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

ఫొన్ : 9440375411 & 8143626744

మైల్ ఐ.డిtyagaraju.a@gmail.com

షిరిడీ సాకోరీషిరిడిగురువారము, అక్టోబరు, 17, 1985


                        (ఎడమవైపు చిత్రం అప్పాసాహెబ్ బొరావకె)

షిరిడీ  తుకారామ్ రఘుజీవ్ బొరవాకే గారి గృహంలో సాయంత్రం గం. 6.45 నిమిషాలకు

శ్రీ తుకారామ్ రఘుజీవ్ (అప్పాసాహెబ్ బోరవకే ఈ పేరుతో ఆయన అందరికీ బాగా పరిచితులు).  82 సంవత్సరాల వయసు.  షిరిడీసాయి సంస్థానం ట్రస్టీ సభ్యులలో ఆయన కూడా ఒక సభ్యుడు.  1917.సంవత్సరంలో సాయిబాబాను మొట్టమొదటిసారి కలుసుకొన్నపుడు ఆయన వయస్సు 14 సంవత్సరాలు.

Sunday, December 6, 2020

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 9 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 8:06 AM

 


06.12.2020  ఆదివారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయిబాబాపరిశోధనా వ్యాస గ్రంధము – 9 .భాగమ్

(రచయితశ్రీ ఆంటోనియో రిగోపౌలస్ఇటలీ)

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

ఫొన్ : 9440375411 & 8143626744

మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

షిరిడీసాకోరీషిరిడి -  గురువారము, అక్టోబరు, 17, 1985

ప్రశ్న   ---   సతీ గోదావరి మాత ఉపాసనీ బాబాగారి ఆదర్శ కార్యక్రమ లక్ష్యాన్ని నెరవేర్చారా?

జవాబు   ---   ఉపాసనీ గారు జీవించి ఉన్నపుడే సతీ గోదావరిమాత సాకోరికి వచ్చారు.  ఆమె మొట్టమొదటగా ఇక్కడికి వచ్చినపుడు ఆమె వయస్సు పదకొండు సంవత్సరాలు.  షేన్ గావ్ ఆమె జన్మస్థలం.  ఆమె అక్కడ జన్మించి, అక్కడినుండి ఉపాసనీ మహరాజు గారిని కలుసుకోవడానికి తన ఇద్దరు సోదరీమణులు, తల్లిదండ్రులతో కలిసి ఇక్కడికి వచ్చింది.  ఉపాసనీగారు అమ్మాయిలను కన్యలుగానే సాకోరిలో ఉండిపొమ్మని చెప్పారు.  వారి తల్లి, తండ్రి ఇద్దరూకూడా అలాగేనని మాట ఇచ్చారు.  ఆవిధంగా సతీ గోదావరి మాత, ఆమె కుటుంబంతో సహా ఇక్కడ సాకోరీలోనే ఉండిపోయారు.  అపుడు సతీ గోదావరి మాత వయస్సు పది లేక పదకొండు సంవత్సరాలు ఉంటుంది.  ఆమె కుటుంబం కూడా ఆమెతోనే ఉండిపోయింది.  ఆమె ఇద్దరు సోదరీమణులు కూడా ఇప్పటికీ ఇక్కడే ఉన్నారు.

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List