09.12.2020 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస
గ్రంధము – 11వ.భాగమ్
(రచయిత… శ్రీ ఆంటోనియో
రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ :
ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
షిరిడీ – సాకోరీ – షిరిడి - గురువారము, అక్టోబరు, 17, 1985
అప్పా చెప్పిన మరికొన్ని వివరాలు…
ఉపాసనీ బాబా గురించి మరికొంత వివరిస్తాను. ఉపాసనీ బాబా, సాయిబాబా వారితో కలిసి
ఇక్కడే నాలుగు సంవత్సరాలు ఉన్నారు.
మా మేనత్త ఉపాసనీ బాబాతో చాలా సన్నిహితంగా ఉండేది. ఆమె ఆయనతో కలిసి గోధుమలు,
జొన్నలు తిరగలిలో విసిరేది.
ప్రశ్న --- ఆమె ఇక్కడ ఖండోబా మందిరంలోనే విసిరేవారా?
జవాబు --- కాదు, మామేనత్తగారు తన ఇంటిలోనే విసిరేవారు.
ప్రశ్న --- వ్యక్తిగతంగా మీరు ఉపాసనీ మహరాజ్ గారి గురించి తెలుసా?
జవాబు --- ఆయన ఒకసారి ఇక్కడికి పండ్ల చెట్లను నాటడానికి వచ్చారు. అప్పుడే నాకు ఆయనతో పరిచయం కలిగింది.
తుకారామ్ --- అప్పా గురించి నేను సంక్షిప్తంగా చెబుతాను. అప్పాగారు కోపర్ గావ్ లోను, షిరిడీలోను ఉన్న పెద్ద భూస్వాములలో
ఆయనకూడా ఒకరు. ఆయనకు
ఒక లక్ష నిమ్మచెట్ల తోట, సుమారు 800 ఎకరాలు
ఉమ్మడి ఆస్తి ఉన్నాయి. అప్పాకే వ్యవసాయంమీద అధికారం ఉండాలని ఉపాసనీ బాబా భావించారు. ఆయన షిరిడీలో ఉన్న భూములను ఈశ్వనంద్ర
బొరావకే గారికి కౌలుకు ఇప్పిద్దామనుకొన్నారు. ఈశ్వనంద్రబొరావకే గారినించి కౌలు
ద్వారా వచ్చే సొమ్మును ఉపాసనీ బాబా సంస్థానానికి ఇప్పించే విషయాలను గురించి చర్చించడానికి
ఆయన అప్పాగారిని పిలిపించారు. కౌలుకు రూ.1200/- ఇమ్మనమని అప్పాగారు ఆయనతో చెప్పారు. ఉపాసనీ బాబాతో అప్పాగారికి కలిగిన
పరిచయం ఇది ఒక్కటే.
ప్రశ్న --- అంటె మీ ఉద్దేశ్యం ప్రకారం కౌలుకు సంబంధించి సొమ్ము ఎంత నిర్ణయించాలన్న విషయాల
గురించి చర్చించడానికి అప్పాగారు మంచి వ్యవహార దక్షత ఉన్నవారు అనే భావంతోనే ఉపాసనీ మహరాజ్ గారికి
అప్పాగారితో పరిచయం కలిగిందనేనా?
జవాబు --- అవును.
ప్రశ్న --- సాయిబాబావారు తరచుగా కోపగిస్తూ ఉండేవారని పుస్తకాలలో ఉంది. దాని గురించి మీరేమంటారు?
తుకారామ్ --- దీని గురించి అప్పా ఏమీ చెప్పలేరు. అపుడు అప్పాగారు చాలా చిన్నవాడు.
ప్రశ్న --- అప్పాగారూ ఇపుడు మీ వయస్సు ఎంత?
జవాబు ---
82 సంవత్సరాలు
ప్రశ్న --- చాలా మంది ముస్లిమ్స్ సాయిబాబాను పూజిస్తూ ఉండేవారా? వారు ఆకాలంలో ఎక్కువగా ఉండేవారా లేక
ఇపుడు ఉన్నారా? ముస్లిమ్స్,
హిందువుల మధ్య వ్యత్యాసం ఎంత ఉండేది?
జవాబు --- ఈరోజుల్లో ఎక్కువమంది హిందువులే పూజిస్తున్నారు.
ప్రశ్న --- పూర్వపు రోజుల్లో సంగతి ఏమిటి?
జవాబు --- శ్రీ సాయిబాబా జీవించి ఉన్న రోజులలో ముస్లిమ్స్ తక్కువగా ఉండేవారు.
అప్పా గుర్తుకు తెచ్చుకొని చెప్పిన విషయాలు.
సమాధిమీద సాయిబాబాకు ఒక వైపు బ్రాహ్మణ
పూజారి, అదే సమయంలో మరొక వైపు ముస్లిమ్ భక్తుడయిన అబ్దుల్ బాబా,
ఇద్దరూ ఒకేసారి పూజిస్తూ ఉండే సందర్భాలు కూడా ఉన్నాయి. అబ్దుల్ బాబాతో నాకు చాలా అనుభవాలు
కలిగాయి.
ప్రశ్న --- అబ్దుల్ బాబాతో మీకు కలిగిన అనుభవాలను గురించి వివరిస్తారా?
జవాబు --- రంగనాధస్వామి అనే మద్రాసీ ఆయన ఒకరుండేవారు. ఆయన భారత రాజకీయాలలో చాలా చురుకుగా
వ్యవహరించేవారు. ఆయనకు
మహాత్మా గాందీ, పండిత్ జవహర్ లాల్ నెహ్రూలతో సంబంధాలు ఉన్నాయి. ఒకానొక సమయంలో ఆయనకు రాజకీయాలంటే
విసుగు పుట్టింది. ఆయన
గాందీజీతొ విభేదించి హిమాలయాలకి వెళ్ళిపోయారు. అక్కడ ఆయన ఒక స్వామిని, (సద్గురువు అంటే బాగుంటుంది) కలుసుకొన్నారు. ఆస్వామి షిరిడీ వెళ్ళి అబ్దుల్ బాబాను
కలుసుకోమని చెప్పారు.
ప్రశ్న --- సాయిబాబాను కాదా?
జవాబు --- సాయిబాబాను కాదు, అబ్దుల్ బాబాను. అపుడాయన షిరిడికి వచ్చి అబ్దుల్ బాబాకు
శిష్యుడయ్యారు.
ప్రశ్న --- సాయిబాబాతో అబ్దుల్ బాబాకు కూడా పూర్తి గుర్తింపు ఉందని మీ అభిప్రాయమా?
జవాబు --- అవును, అబ్దుల్
బాబా గురించి ఎన్నో వృత్తాంతాలున్నాయి.
మహాత్మాగాంధీ ఎపుడు మరణిస్తారో కూడా ఆయన ముందుగానే చెప్పారు. ఒకసారి రంగనాధ్ గారు మహాత్మా గాందీగారిని
కలుసుకోవాలనుకొన్నారు. అబ్దుల్ బాబాకు మహాత్మా గాంధీగారు ఎపుడు మరణిస్తారొ ముందే తెలిసినందువల్ల రంగనాధ్
గారిని ఇక ఆలశ్యం చేయకుండా వెంటనే వెళ్లి మహాత్మాగాంధీగారిని కలుసుకోమని చెప్పారు. కాని దురదృష్టవశాత్తు రంగనాధ్ గారు
గాంధీగారిని కలుసుకోవడానికి వెళ్లలేకపోయారు. అయిదురోజుల తరువాత గాంధీగారు మరణించారనే
సందేశం వచ్చింది. గాంధీగారు
చనిపోయారన్న విషయం తెలియగానే రంగనాధస్వామి ఆపకుండా రెండు గంటలపాటు రోదించారు. అబ్దుల్ బాబాకు సంబంధించిన సంఘటనలలో
ఇది ఒకటి.
ప్రశ్న --- అబ్దుల్ బాబా ఇప్పటికీ జీవించే ఉన్నారా?
జవాబు --- లేదు, ఇక్కడ షిరిడీలో ఆయన సమాధి ఉంది. ఆయన సమాధిని నేనే కట్టించాను. అంటే ఆయన సమాధి నిర్మాణానికి సంస్థానానికి
నేను 20 – 25 వేలరూపాయలు ఇచ్చాను..
ప్రశ్న --- సాయిబా గారి కాలంలో దక్షిణ గురించి మీరు ఏమని అనుకుంటున్నారు?
జవాబు --- సాయిబాబా అందరివద్దనుంచి దక్షిణ స్వీకరిస్తు ఉండేవారు. ఆవిధంగా వచ్చిన డబ్బును కొంతమందికి
పంచిపెట్టేస్తూ ఉండేవారు. ఒకరికి 25 రూపాయలు, మరొకరికి
50 రూపాయలు, ఇంకొకరికి 55 రూపాయలు, ఈవిధంగా ఇచ్చేవారు. డబ్బు ఉన్న వారివద్దనుండి దక్షిణ అడిగిపుచ్చుకొని
లేనివారికి పంచిపెట్టేసేవారు.
తుకారామ్ --- దీనిని బట్టి బాబా అవసరమయినవారికి, బీదవారికి తాను స్వీకరించిన
దక్షిణను ఇచ్చేసేవారని మనం గ్రహించవచ్చు.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment