02.11.2016
బుధవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
గత పదిహేను రోజులుగా కొన్ని వ్యక్తిగత వ్యవహారాల వల్ల ఆంగ్లం నుండి అనువాదం చేసి ప్రచురణ చేయలేకపోయాను. ఈ రోజునుండి యధావిధిగా బాబావారి తత్వం ప్రచురిస్తున్నాను. చదవండి.
శ్రీసాయిబాబావారి
బోధనలు మరియు తత్వము
ఆంగ్ల
మూలం : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి. నింబాల్కర్
తెలుగు
అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
20.
విభిన్న మతాలు – 1వ.భాగమ్
సాయిబాబావారి
వేషధారణ ఒక ముస్లిమ్ ఫకీరులాగ ఉండేది. ఆయన
తన జీవితకాలమంతా పాడుబడిన మసీదులోనే గడిపారు.
ఆయన నిరంతరం ‘అల్లామాలిక్’ (భగవంతుడే యజమాని) అని స్మరిస్తూ ఉండేవారు. ఆయన, మునుపటి నిజాం రాష్ట్రంలో వాడుక భాషయిన ఉర్దూని
పొడి పొడి పదాలతో మరాఠీతో కలిపి మాట్లాడేవారు.
ఆయన ఎప్పుడూ సాధారణంగా ‘అల్లా భలాకరేగా (భగవంతుడు నీకు మేలు చేస్తాడు) అనేవారు.
అంతె
కాకుండా సాయిబాబా హిందూ భక్తులు తన నుదిటిమీద చందనం అద్ది పూజించుకున్నా పట్టించుకునేవారు
కాదు. అభ్యంతరం చెప్పేవారు కాదు. మసీదులో వాయిద్యాలను మ్రోగిస్తూ గట్టిగా చప్పట్లుకొడుతూ
పెద్దగా పాటలు పాడుతూ ఉన్నా ఆయన అభ్యంతరం చెప్పేవారు కాదు. ఆయనే స్వయంగా మసీదులో ధుని వెలిగించారు.
ఆధునే నేటికీ నిరంతరం ప్రజ్వరిల్లుతూనే ఉంది. గోధుమల బస్తాను ఉంచి గోధుమలను తిరగలిలో విసురుతూ
ఉండేవారు. రామనవమి రోజున మసీదు ముందర ఆరుబయట
ఉయ్యాలను ఏర్పాటు చేసి రామనవమి ఉత్సవాలను జరపడానికి అనుమతిని ప్రసాదించారు. ఆయన అనుమతితో భక్తులందరూ శ్రీరామనవమినాడు జయజయధ్వానాలు
చేస్తూ ఎంతో ఉత్సాహంతో ఒకరిపై ఒకరు గులాల్ (ఎఱ్ఱటి రంగుపొడి) జల్లుకునేవారు. శ్రీరాముని
కీర్తనలు పాడుతూ భజనలు చేసేవారు. మొహర్రం పండుగనాడు
మసీదు ముందర తాబూత్ ను ఉంచి మహమ్మదీయులను కూడా చందనోత్సవం జరుపుకోవడానికి అనుమతించేవారు. వారిని నమాజు కూడా చేసుకోనిచ్చేవారు.
ఒక్కమాటలో
చెప్పాలంటే సాయిబాబా హిందువులని, ముస్లిమ్ లని అందరినీ సమభావంతోనే ఆదరించారు. ఆరోజుల్లో ఈ రెండు వర్గాలవారు తమలో తాము కోట్లాడుకుంటూ
ఒకరినొకరు ఎగతాళి చేసుకుంటూ ఉండేవారు. రెండు
వర్గాలవారు ఎదుటివారి మతాచారాలను , పూజావిధానాలను కించపరుచుకుంటూ అవహేళన చేసుకుంటూ
ఉండేవారు. సాయిబాబా ఒక వర్గంవారి చర్యలను అభ్యంతరం
పెట్టకుండా సహనం చూపితే మరొక వర్గం వారికి ఇష్టం ఉండేదికాదు. బాబాపై తమ అయిష్టతను ప్రదర్శించేవారు. కాని బాబా సమయానుకూలంగా వారిని సమాధానపరిచి శాంతింపచేసేవారు.
ఉదాహరణకి
రోహిల్లా కధనే తీసుకుందాము. అతను ఒక ముస్లిమ్. భారీ కాయంతో మంచి శరీర సౌష్టవంతో, కఫనీ ధరించి తిరుగుతూ
ఉండేవాడు. అతను మసీదు ముందర పగలూ రాత్రీ పెద్ద
గొంతుతో బిగ్గరగా ఖురాన్ లోని కల్మా చదువుతూ ఉండేవాడు. అల్లాహో అక్బర్ అంటూ బిగ్గరగా అరుస్తూ ఉండేవాడు. షిరిడీ గ్రామస్థులు పగలంతా పొలంలో శ్రమించి రాత్రికి
ఇంటికి చేరుకుని ప్రశాంతంగా నిద్రపోదామనుకునేసరికి రోహిల్ల అరుపులు నిద్రాభంగం కలిగించేవి. అందువల్ల వారు (వారిలో ఎక్కువమంది హిందువులు) బాబా
వద్దకు వెళ్ళి రోహిల్లా అరుపుల బారినుంచి తమను రక్షించమని వేడుకొన్నారు. కాని బాబా, వారు చేసిన ఫిర్యాదును పట్టించుకోలేదు. పైగా బాబా వారికి హాస్యపూర్వకంగా ఈవిధంగా చెప్పారు
“రోహిల్లాకు ఒక గయ్యాళి భార్య ఉంది. ఆమె అతని
వద్ద ఉండటానికిష్టపడక తప్పించుకుని నాదగ్గరకు రావాలని ప్రయత్నిస్తూ ఉంది. దానికి సిగ్గుబిడియాలు లేవు. బయటకు గెంటేస్తే బలవంతంగా లోపలికి ప్రవేశిస్తుంది. అతడు అరవటం ఆపితే సందు చూసుకుని ఆదుర్భుధ్ధి నాదగ్గరకు
వస్తుంది. అతని కేకలకు అది పారిపోతే నాకు సుఖంగా
ఉంటుంది.” కాని నిజానికి రోహిల్లాకు భార్యే
లేదు. అటువంటిది ఆజన్మ బ్రహ్మచారి అయిన బాబావద్దకు
ఆమె రావడమేమిటి? గ్రామస్థులు చేసిన ఫిర్యాదును
పట్టించుకోకుండా బాబా ఈరకమయిన కధను చెప్పి వారిని దారిలో పెట్టారు.
ఒకసారి
అబ్దుల్ రంగాలీ అనే ముస్లిమ్ భక్తుడు బాబాతో “బాబా మీరు నుదుటిమీద చందనం అద్దుకున్నారెందుకని?
ఇది మన సాంప్రదాయం కాదు కదా?” అని ప్రశ్నించాడు.
అపుడు బాబా ‘దేశానికి తగ్గట్టే వేషభాషలు’ (రోమ్ లో ఉన్నపుడు రోమన్ లా ఉండు When in Rome, do as the Romans do) అని సమాధానమిచ్చారు. హిందువులు నన్ను తమ దేముడిగా పూజిస్తున్నారు. నేను వారినెందుకు వారించాలి? వారు నన్ను పూజించడానికి
అనుమతించాను. నేనే భగవంతునికి భక్తుడిని.”
సాయిబాబా
తన పరమత సహనానికి ప్రతీకగా ఒక్కొక్కసారి తన ప్రత్యర్ధులమీద యోగశక్తులను, దైవాంశ శక్తులను
ప్రదర్శించేవారు. మంచి ధృఢకాయుడు పొడగరి అయిన
రోహిల్లా బాబా మసీదు ముందర కల్మా చదువుతూ ఉండేవాడు. అలాంటివాడె బాబా విషయంలో ఎంతో సంభ్రమానికి గురయ్యాడు. బాబాయొక్క అపరిమితమయిన జ్ఞానాన్ని, శక్తిని గమనించిన అతనికి బాబా ‘పర్వర్ధిగార్’ (ఈ భూమి మీద
అవతరించిన భగవంతుడు) అనే భావన కలిగింది. కాని
బాబా తనను మసీదులోనే మేళతాళాలతోను, మంత్రాలతోను పూజించుకోనిచ్చారు. అంతేకాదు, విఠలునికి, దత్తునికి, ఇంకా ఇతర హిందూ
దేవుళ్లకి నైవేద్యాలను సమర్పించుకోవడానికి కూడా అనుమతినిచ్చారు. ఈవిషయంలో బాబా ముస్లిమ్ సాంప్రదాయాలకు విరుధ్ధంగా
ప్రవర్తిస్తున్నారని భావించాడు. విఠలుడు, దత్తుడు కూడా అల్లాయే అని బాబా చెప్పడం, రోహిల్లా
మన్సుకి తీవ్రమయిన విఘాతం కలిగించింది. ముస్లిమ్
మతాచారం ప్రకారం మతాన్ని భ్రష్టుపట్టించేవాడిని నాశనం చేయాల్సిందే అని ఆలోచించాడు.
బాబా
చర్యలు కూడా మతాన్ని భ్రష్టుపట్టిస్తున్నాయనే దృష్టితో బాబాను చంపడానికి నిర్ణయించుకున్నాడు ఆనిర్ణయంతో ఒక రోజు పెద్ద దుడ్డుకఱ్ఱను తీసుకుని,
బాబానీ ఆయన మతవైపరీత్యాన్ని ఒక్క దెబ్బతో అంతమొందించాలని ఆయన వెనకాలే నిలబడ్డాడు. బాబా అందరి హృదయాలను పాలించేవాడు కాబట్టి రోహిల్లా
మనసులోని ఆలోచనలు, శక్తి అన్నీ గ్రహించారు. వెనువెంటనే
బాబా వెనుకకు తిరిగి రోహిల్లా కళ్లలోకి దృష్టి సారించారు. అతని ఎడమ చేతి మణికట్టును పట్టుకున్నారు. (రోహిల్లా కుడి చేతిలో పొడవయిన దుడ్డు కఱ్ఱ ఉంది).
బాబా చేతి స్పర్శ అతనిలో వెంటనే తన ప్రభావాన్ని చూపించింది. అతనిలోని శక్తి అంతా అదృశ్యమయి చేతిలోని దుడ్డుకఱ్ఱ
క్రిందపడిపోయింది. అతను నేలమీద కుప్పలా కూలిపోయాడు. బాబా అతనిని అక్కడె వదిలేసి వెళ్ళిపోయారు. చాలాసేపటి వరకు రోహిల్లా అలాగే పడి ఉండిపోయాడు. ఆతరువాత
అతనిని చూసినవారు పైకి లేవమని చెప్పినా తాను లేవలేననీ తన శక్తినంతా బాబా హరించివేశారని
తనని పైకి లేవదీయమని వారితో అన్నాడు.
(ఇంకా
ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment