15.10.2016 శనివారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సుల
శ్రీసాయిబాబావారి
బోధనలు మరియు తత్వమ్
ఆంగ్ల మూలం : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి. నింబాల్కర్
తెలుగు
అనువాదమ్ :ఆత్రేయపురపు త్యాగరాజు
19. జ్యోతిష్య శాస్త్రం – 2వ.భాగమ్
నాసిక్
నివాసి మూలేశాస్త్రి పూర్వాచార పరాయణుడయిన సద్రాహ్మణుడు. షట్ శాస్త్రాలు అభ్యయసించాడు. జ్యోతిష్య, సాముద్రిక శాస్త్రాలలో మంచి దిట్ట. ఒకసారి అతను బాపూ సాహెబ్ బుట్టీని కలుసుకోవడానికి
షిరిడీ వచ్చాడు.
బాబాను దర్శించుకోగానే అత్యంత పరమానందాన్ని పొందాడు. హస్తసాముద్రికంలో మంచి నైపుణ్యం ఉండటం వల్ల బాబా అరచేతిలోని రేఖలను పరీక్షిద్దామన్న ఉత్సాహం కలిగింది. శాస్త్రిబువా మూలేకు , బాబా పాదాలు చూసి అత్యంతాశ్చర్యం కలిగింది. బాబా చేతిలోని ధ్వజ, వజ్రాంకుశ చిహ్నాలతో ఉన్న రేఖలను పరీక్షించాలని కోరిక కలిగింది. ఆ ఉత్సాహంతో మూలే కాస్త ముందుకు జరిగి “బాబా మీ హస్తాన్నివ్వండి. నాకు సాముద్రికం వచ్చు” అన్నాడు. కాని బాబా అతని మాటలను పట్టించుకోకుండా తన హస్తాన్నివ్వలేదు. మూలేశాస్త్రి చేతిలో నాలుగు అరటిపళ్ళు ఉంచారు.

ఆవిధంగా
బాబా జోశ్యాలు తప్పని, భవిష్యత్తును తెలుసుకోవడానికి జ్యోతిష్యాన్ని, సాముద్రికాన్ని
నమ్ముకోవద్దని తన భక్తులకు తరచూ చెబుతూ ఉండేవారు.
జీవితంలో విజయాన్ని సాధించాలంటే కష్టపడి శ్రమించమని చెప్పారు. విధివ్రాతను తప్పించలేనపుడు వగచి ప్రయోజనం లేదని
తన భక్తులను ఓదారుస్తూండేవారు. కాకాసాహెబ్
దీక్షిత్ కూతురు చనిపోవడంతో అతను చాలా ఖిన్నుడయి ఉన్నాడు. ఆసమయంలో బాబా, భావార్ధ రామాయణం పుస్తకం తెరచి అందులో,
వాలి చనిపోవడంతో వాలి భార్య తారను ఓదారుస్తూ శ్రీరామచంద్రమూర్తి అన్న మాటలను చూపించారు. జి.పి. బెంద్రె పెద్దకొడుకు నాలుగు రోజులలో చనిపోతాడని
చెప్పారు బాబా. బెంద్రె ను “ప్రశాంతంగా ఉండు. అధైర్యపడకు” అని ముందుగానే ఓదార్చారు.
నా
ఉద్దేశ్యం ప్రకారం సాయిభక్తులకి నేను చెప్పేదేమిటంటే గ్రహాలను శాంతి పరచడానికి సాయిబాబాను
పూజిస్తే చాలు. ముఖ్యమయిన పని ఏది ప్రారంభించాలన్నా
గురువారమే మంచి శుభదినం. ఒకవేళ ఏకారణం చేతనయినా
ఆరోజు ప్రారంభించలేకపోయినట్లయితే ఇంకొక రోజు ఎప్పుడయినా సరే పని ప్రారంభించేముందు ఊదీని
నొసట ధరించి, బాబాను స్మరించుకుని, ప్రార్ధన చేసి ప్రారంభిస్తే ఆపని దిగ్విజయంగా
పూర్తవుతుంది. ఒకవేళ మనం అనుకున్న ఫలితాలు
రాకపోయినా, లేక విచారకరమయిన సంఘటనలు జరిగినా నిరాశ పడకుండా ప్రశాంతమయిన మనసుతో ఉండాలి. బాబా మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు. అంతా బాబా నిర్ణయంమీదనే ఆధారపడి ఉందని, ఆయననే స్మరిస్తూ
ఉండాలి. మనకేది ఎప్పుడు ఇవ్వాలో మనకేది శ్రేయస్కరమో
అంతా బాబాకే తెలుసుననే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
“సాయికి
చేసిన సేవ ఎన్నటికి వృధాకాదు. మన కోరికలు అవి
ఐహికమయినవయినా, ఆధ్యాత్మికమయినవయినా సాయి నెరవేరుస్తారు. చివరికి మనలని కృతార్ధులను చేస్తారు.”
(ఓ.వి. 15 అధ్యాయం – 45)
(రేపటి సంచికలో వేరు వేరు మతాలు)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment