Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Wednesday, July 27, 2011

బాబావారితో తార్ఖడ్ కుటుంబమువారి స్వీయానుభూతులు

Posted by tyagaraju on 9:50 PM


28.07.2011 గురువారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంథువులకు బాబా వారి శుభాశీస్సులు

బాబావారితో తార్ఖడ్ కుటుంబమువారి స్వీయానుభూతులు


ఈ రోజున ఒక అద్భుతమైన సాయి లీలలతో 17 అథ్యాయాలు మీకు అందించడానికి బాబా వారు అనుగ్రహించినందుకు బాబా వారికి థన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనం బాబా లీలలను చదవడం యెంతో ఆనందాన్నిస్తుంది. కాని బాబాతో ఉండి ఆయన లీలలను స్వయంగా అనుభవించినవారు తమ అనుభూతులను చెప్పినప్పుడు మనకి యింకా ఆనందం కలుగుతుంది. అటువంటి అనుభూతులను తార్ఖడ్ కుటుంబమువారు అనుభవించిన అనుభూతులను తమ తండ్రిగారు చెప్పగా శ్రీ వీరేంద్ర తార్ఖడ్ గారు మన సాయి భక్తులందరికీ అందించారు. వాటి యొక్క అనువాదాన్ని ఈ రోజునుంచీ మీకు అందిస్తున్నాను.

ఈ లీలల ఆంగ్ల పీ.డీ.ఎఫ్. పైల్ ని శ్రీమతి సుప్రజ, అమెరికానించి పంపించారు. నాకీ అవకాశం బాబావారు ఆమె ద్వారా నాకందించినందుకు వారికి నా థన్యవాదాలు.


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.

ముందు మాట

ముంబాయి సాంతాక్రజ్ శ్రీ జ్యోతీంద్ర రామ చంద్ర తార్ఖడ్, షిరిడీ సాయి బాబా వారి యొక్క తమ ప్రత్యక్ష అనుభవాలని చక్కగా చెప్పారు. నిజానికి సాయిబాబా చెప్పిన బొథనలని తమ వివరణ ద్వారా యెంతో విశిష్టంగా మన ముందుకు తెస్తున్నారు. (మనముందుంచుతున్నారు)

రచయిత, పబ్లిషర్ (ప్రచురణకర్త) అయిన శ్రీ వీరెంద్ర జ్యోతీంద్ర తార్ఖడ్ శాంతాక్రజ్ ముంబాయిలో నివసిస్తున్న విశ్రాంత యింజనీర్ గారు. సాయి భక్తులందరికీ వీరి గురించి తెలుసు. రచయిత వ్రాసిన 17 అథ్యాయాలలో 16 అథ్యాయాలు వారి తండ్రిగారి స్వీయానుభవాలు. తనకు బాగా గుర్తున్నంతవరకు రాసిన ఈ విషయాలని పాఠకులు, స్వర్గీయ శ్రీ అన్నా సాహెబ్ ధాబోల్కర్ గారు వ్రాసిన సచ్చరిత్రతో పోల్చి సరి చూసుకోవచ్చు.
శ్రీ వీరేంద్ర తార్ఖడ్ గారు తమ తండ్రిగారి స్వీయానుభవాలని సాయి భక్త పాఠకులందరికీ అందించారు, నేను వారిని వాటియొక్క రుచిని, సారాన్ని, ఆస్వాదించమని కోరుతున్నాను.

లార్డ్ బాబా వారి సాహచర్యంతో జ్యోతీంద్రగారు, అనుభవించిన సంఘటనలు, రచయిత తనకు గుర్తున్నంత వరకు ప్రచురించినవి. నిజాలకు చాలా దగ్గరగా ఉండి బాబా వారియొక్క శౌర్యాన్ని చాలా చక్కాగా చెప్పబడ్డాయి. రచయిత ఒక అద్వితీయమైన రీతిలో లార్డ్ సాయితో తన తండ్రిగారి చాలా దగ్గరి అనుబంథాన్ని వర్ణించి చెపుతున్నారు. నేను ఖచ్చితంగా చేప్పేదేమిటంటే యిది చాలా ప్రశంసించదగ్గది. నేననుకునేదేమిటంటే వివరణలన్నీ యేమి చెపుతున్నాయంటే, భక్తులు షిరిడీని దర్శించినప్పుదు, సమాథిమందిరాన్ని,ఖండోబా మందిరాన్ని తప్పక దర్శించాలి. బాబా చెప్పిన సూత్రాలు శ్రథ్థ, సబూరీ (నమ్మకము, ఓర్పు) వారి జీవితం సాఫీగా సాగాలంటే వీటిని ఆచరించాలి.

నేను చెప్పదలచుకున్నదేమంటే, సాయిబాబాకు అత్యంత భక్తులలఓ ఒకరైన మా తాతగరైనటువంటి శ్రీ మహల్సాపతి చిమనాజీ నగారే (భగత) ప్రత్యక్షంగా చూసిన దాని ప్రకారం, శ్రీ బాబా సాహెబ్ తార్ఖడ్ గారు తమ జీవితాన్ని చాలా సౌకర్యవంతంగా గడపగలిగారు. ఈ పుస్తకం చదివితే, సాయి భక్తులైన పాఠకులకి కొంత మార్గదర్శకం, మరియు ఆత్మ తృప్తి యిస్తుందని నాకు నిశ్చయంగా తెలుసు. ఈ ముందు మాట రాస్తున్నపుడు నేననుభవించినది, ఈ పుస్తకం మరొకసారి మనలని సాయి బాబాకుదగ్గరగా తీసుకుని వెడుతుంది. మహల్సాపతి మనవడినైన నేను, ఈ ముందు మాట రాసినందుకు నా గౌరవంగా భావిస్తున్నాను. నిజానికి, యిది మా కుటుంబానికి నిజమైన గౌరవమని నేను అనుకుంటున్నాను.

రామచంద్ర అత్మారాం తార్ఖడ్ అనవడే బాబా సాహెబ్ తార్ఖడ్, షిరిడీ శ్రీ సాయిబాబా సంస్థాన్ యేర్పడడానికి శ్రీ దాసగణూ మహరాజ్ తో కలిసి గొప్ప సాయం చేశారు. సంస్థానానికి మొట్టమొదటి కోశాథికారి. ఆయన యింకా సాయిలీల పత్రిక ప్రచురణకు పూనుకొని , మొట్టమొదటి సంచికకు ముందుమాట వ్రాసి, ఆ విథంగా చరిత్రను సృష్టించారు.

నేను సాయి భక్తులందరికి చెప్పదలచుకున్నది, స్వర్గీయ శ్రీ అన్న సాహెబ్ ధబోల్కర్ గారు వ్రాసిన సాయి సచ్చరిత్ర 9 వ అథ్యాయంలో లార్డ్ సాయి మీద తార్ఖడ్ కుటుంబానికి ఉన్నటువంటి స్వచ్చమైన భక్తిని తెలియ చేస్తుంది.

ఆఖరుగా ముందు మాటని యిలా చెపుతూ ముగించదలచుకున్నాను. "అనంత కోటి బ్రహ్మాండ నాయక రాజాథిరాజ యోగిరాజ ప్రబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై"

రాబోయే కాలాల్లో శ్రీ సాయిబాబా వారి ఈ వృత్తాంత్తాంతాలన్నీ కూడా అసంఖ్యాకమైన సాయి భక్తులందరూ బాగా గుర్థుంచుకోవాలని సవినమ్యంగా నేను కోరుకుంటున్నాను.

ఖండోబా మందిరం ముందు "సాయీ రండి" అని శ్రీ సాయిబాబాని ఆహ్వానించిన మా తాతగారయిన శ్రీ మహల్సాపతి గారి జ్ఞాపకార్థం ఈ ముందు మాటని అందితమిస్తున్నాను.

యిప్పుడు నేను ఈ ముందు మాటనిశ్రీ వీరేంద్రజోతీంద్ర తార్ఖడ్ గారికి ప్రచురణ నిమిత్తం అందిస్తున్నాను.

(సం.) మనోహర్ మార్తాండ నగారే.



పరిచయం

ప్రియ పాఠకులారా, నేను ఈ ప్రత్యక్ష అనుభవాలని రాసేముందు ఇవి నా స్వంత అనుభవాలు కావన్నఒకే ఒక్క కారణంతో మిమ్ములని క్షమాపణ వేడుకుంటున్నాను. కాని అవన్నీ కూడా మా తండ్రిగారయిన శ్రీ జ్యోతీంద్ర రామచంద్రతార్ఖడ్ గారు తాము జీవించిఉన్నపుడు మాటి మాటికి చెప్పినవె.

నా చిన్నతనంలో ఆయన చెబుతూండగా నేను వింటున్నప్పుడు నా కవి అద్భుతమైన కథలలాగా అనిపించేవి. నేను పెద్దవాడినవుతూండగా శ్రీషిరిడీ సాయి బాబా గానిమానవాతీత శక్తుల గురించి అర్థం కాసాగింది. మా నాన్నగారు, సామాన్య మానవుడు పొందడానికి కష్టసాథ్యమైనటువంటి అమూల్యమైన అనుభవాలని , ఒక విథమైన ఆథ్యాత్మిక అనుభూతిని సాయిబాబా వారి సాన్నిహిత్యంలో తన 10 సంవత్సరాల జీవిత కాలంలో అనుభవించారు.

నేనెప్పుడు అనుకునేదేమిటంటే ఈ బహూకరింపబడిన అనుభవాలని మీకు తెలియ చెప్పాలని, కాని మన రోజువారి కార్య క్రమాలలో అటువంటి ఆథ్యాత్మిక రచనల మీద దృష్టి పెట్టడం మనకి కష్ట సాథ్యం.

యిప్పటికి నేను చాలా సార్లు సాయి బాబా వారి కర్మ భూమి యైన షిరిడీని చాలా సార్లు దర్శించాను. ఈ దర్శనాల్లో నేను చాలా మంది సాయిభక్తులని కలుసుకున్నాను. ఈ కలుసుకోవడాలలో, సామాన్యంగా ఒక ప్రశ్న వచ్చేది, నేను కూడా సాయి భక్తుడినేనా అని.

నేనలా చెప్ప్పుకోవడానికి నాకు కొంచెం చిన్నతనంగా అనిపించేది, యెందుకంటే మా నాన్నగారు చేసే సాయి పూజ పథ్థతి వల్ల. నేను అటువంటి ఆథ్యాత్మిక విథికి దగ్గరగా లేను. యింకా సాయి భక్తులకి శ్రీ సాయిబాబాతో నాకు అద్వితీయమైన అనుబంథం ఉండేదని చెపుతూ ఉండేవాడిని. యెందుకంటే మా నాన్నగారు జీవించి ఉన్నపుడు ఆయనతో సాన్నిహిత్యం. షిరిడీలో చాలా చురుకుగా ఉండేవారు. ఆ ముఖ్యమైన కారణం వల్లే నేను షిరిడీ దర్శించాను. మా తర్ఖడ్ కుటుంబంలో అటువంటి సాన్నిహిత్యానికి ప్రథాన కారణమైన ముఖ్యమైన వ్యక్తులు ముగ్గురు ఉన్నారు.

మా అమ్మమ్మగారు ( మా నాన్నగారి తల్లి), మా తాతగారు, శ్రీ రామచంద్ర ఆత్మారాం తార్ఖర్, మరియు మా నాన్నగారు శ్రి జ్యోతీంద్ర రామచంద్ర తార్ఖడ్. ఈ ముగ్గురికీ కూడా శ్రీ సాయిబాబాతో 1908 నుంచి 1918 వరకూ అంటే ఆయన మహాసమాథి చెందే వరకు అనుబంధం ఉంది. ఈ అనుబందం ఫలితంగా, ఆ తరువాత మాకుటుంబంలోని వారందరికీ సాయి బాబా భగవంతుడయారు. సాయి భక్తుడు, మా నాన్నగారు అనుభవించిన దివ్యానుభూతిని వర్ణించి చెప్పమని నన్ను కోరేవాడు. అప్పుడు నేను (బలవంతాన) అందుకు బథ్థుడనై నా మదిలోకి అప్పటికప్పుడు యేది వస్తే అది చెప్పేవాడిని. యిది షిరిడీలోని లెండీ బాగ్ లో జరుగుతూ ఉండేది. ముఖ్యంగా ఆ అనుభవాన్ని విన్న తరువాత ఆ భక్తుడు నా ముందుకు వంగి నా పాదాలని స్పృశించేవాడు. నా కప్పుడు నేను యేమీ చాతకాని వాడిని అని అనిపిస్తూ ఉండేది. ఒకసారి పూనాలోని సాయి బృదం వచ్చినన్ను పూనా వచ్చి సాయి అనుయాయీలందరికి ఆ అనుభవాలన్నిటినీ వివరించి చెప్పమని నన్ను కోరడం జరిగింది. నేనందుకు ఒప్పుకుని నేను నా భార్యా పిల్లలతో పూనా వెళ్ళాను. ఆ కార్యక్రమం రెండు గంటల పాటు జరిగింది. నేను చెప్పడం పుర్తి అయ్యాక నాకు నమస్కారం చేయడానికి నా ముందు పెద్ద లైను ఉంది. నేను గృహస్తుడిని కాబట్టి ఆ అనుభవాలన్నీ మా నాన్నగారివనే సామాన్య కారణంతో నేనిటువంటి వాటికి దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నాను. యింకా నేను చెప్పేటప్పుడు కొన్ని తప్పులు చేసి ఉండవచ్చు. యిదే సమయంలో నేను ఉద్యోగ విరమణ చేసిన తరువాత, మా తార్ఖడ్ కుటుంబసభ్యుల అనుభవాలను వ్రాయడానికి చాలా సమయం ఉంటుందని, దానిని ఉపయోగించుకోవాలని నిశ్చయించుకున్నాను.

షిరిడీ సాయిబాబా మీద నాకున్న ప్రేమను, భక్తిని, తెలియచేయడానికనుకోండి. 2003, జూన్ 18 న నాకు 60 సంవత్సరములు నిండాయి. మరియు ఈ రోజు ఆగష్టు 15, 2003 అనగా మనప్రియమైన భారత దేశ 57 స్వాతంత్ర్య దినమునాడు నేను ఈ పుస్తకం రాయడానికి ఉపక్రమించాను.
ప్రియమైన సాయి భక్త పాఠకుడా నేను, శాశ్వతమైన సాయి సచ్చరిత్ర వ్రాసిన కీర్తిశేషులు అన్నా సాహెబ్ థబోల్కర్ గారి లాగ గౌరవనీయులైన హేమాడ్ పంత్ నూ కాదని చెప్పదలచుకున్నాను.

షిరిడీ సాయిబాబా గారి జీవితమంతా తెలియచెప్పేటటువంటి 54 అథ్యాయాలు కల ఈ పవిత్రమైన పుస్తకాన్ని నేను క్రమం తప్పకుండా చదువుతూ ఉంటాను. ఈ పవిత్రమయిన గ్రంథంలో షిరిడీ లో మా నాన్నగారు ఉన్నప్పటి సంఘటనలు కూడా ఉన్నాయి. మా నాన్నగారు చూచి, నాకు చెప్పినవాటిని మీకు నేను సవినయంగా వివరిస్తున్నాను.

ప్రియ పాఠకులారా దయ చేసి నన్ను మన్నించండి. యెందుకనగా ఆ సంఘటనలు జరిగిన ఖచ్చితమైన తేదీలు గాని, సమయం గాని తెలియచేప్పే స్థితిలో లేను కాని, 1908 నుంచి 1918 వరకూ మా నాన్నగారు షిరిడి 17 సార్లు దర్శించారు. ఒకసారి షిరిడీ వెడితే అక్కడ 8 రోజులనుంచి ఒక నెల వరకు ఉండేవారు. ఈ 17 సార్లు వెళ్ళే క్రమంలో, నన్ను నమ్మండి మా నాన్నగారికి మొట్టమొదటి శ్రీ షిరిడీ బాబా వారి యొక్క దివ్యమైన అనుభూతి కలిగింది. నిజం చెప్పాలంటే అవి అతీంద్రియము. నిజానికి, ఆయన సెంట్ గ్జేవీయర్ స్కూల్ లో విద్యార్థి గా ఉన్నప్పుడే రాసి ఉండవలసినది అనుకున్నాను. నేను ఈ రాస్తున్నదానికి కారణం, శ్రీ సాయిబాబా మీద మనకున్న గాఢమైన, మనహ్ పూర్వకమైన శ్రథ్థ (నమ్మకం). స్వచ్చంగా తెలియచేప్పటానికి అది నాకు అపరిమితమైన మనశ్శాంతినిస్తుంది.

ప్రియమైన సాయి భక్త పాఠకుడా, ఈ పుస్తకం చదివిన తరువాత నాకు కూడా కొన్ని దివ్య్యానుభూతులు కలిగి ఉండచ్చని మీరు అనుకోవచ్చు, కాని నేను సవినయంగా మనవి చేసేదేమిటంటే ఖచ్చితంగా మానాన్నగారు అనుభవించినలాంటివి మాత్రం కాదు. నేను గట్టిగా నమ్మేదేమిటంటే, ఆయన పూర్వ జన్మ సుకృతం వల్ల శ్రీ సాయిబాబా గారితో అనుబంధం యేర్పడింది. యింకా ఆయన అనుభవాలన్ని కూడా ఆయన వివాహనికి ముందువి అనగా ఆయన వయసు 14 నుంచి 25 సంవత్సరాల కాలంలో జరిగినవి. చాలా సార్లు నేను ఆశ్చర్య పోతూ ఉంటాను, అటువంటి దివ్యమైన అనుభూతులను పొందుతూ మా నాన్నగారు సంసార జీవితాన్ని యెందుకు కోరుకున్నట్లు. సరే, అప్పుడు నేను ఉండేవాడిని కాదు, ఈ పుస్తకం కూడా, వెలుగు చూసి ఉండేది కాదు.

యిపుడు క్లుప్తంగా తార్ఖడ్ కుటుంబం గురించి పరిచయం.

మా నివాస ప్రాంతం వాసీ ఫోర్ట్ (ఫోర్ట్ ఆఫ్ బాసీన్) దగ్గరున్న తార్ఖడ్ గ్రామం. అంధుచేత మా యింటి పేరు తార్ఖడ్ కర్. చరిత్ర ప్రకారం మా పూర్వీకులు, గొప్ప మరాఠీ యోథుడైన చిమాజీ అప్పాగారితో బాసిన్ కోట యుథ్థంలో పోర్చుగీస్ వారికి వ్యతిరేకంగా పోరాడారు. పోర్చుగీస్ వారు ఓడిపోయారు.

వారి ధైర్యానికి గుర్తుగా చిమాజీ అప్పాగారు తార్ఖడ్ గ్రామాన్ని జాగీరుగా యిచ్చారు. తరువాత బ్రిటీష్ వారు మరాఠాలనుంచి కోటని వశం చేసుకున్నారు. మా ముత్తాత గారయిన పాండురంగ తార్ఖడ్ గారు ముంబాయికి మకాం మార్చారు. ఆయన విల్సన్ కాలేజ్ దగ్గిర చర్నీ రోడ్ చౌపతీలో బంగళా కట్టుకున్నారు. పాండురంగ గారికి యిద్దరు కొడుకులు, దబోబా, మరియు ఆత్మారాం. వీరిలో దబోబా గారు ప్రముఖ వ్యాకరణకారుడు. మరాఠీ మాట్లాడేవారికి వ్యాకరణ పుస్తకాలు చక్కగా తప్పులు లేకుండా ఆంగ్ల భాషని రాయడం, మాట్లాడే, మరాఠీ వారికి వ్యాకరణ పుస్తకాలు రాసేవారు. రెండవ కొడుకయిన ఆత్మారాం వృత్తిరీత్యా వైద్యుడు. యింతకుముందు పని చేసిన ముంబాయి వైస్రాయి గారికి కుటుంబ వైద్యుడు.

మా తాతగారయిన రామ చంద్ర ఆత్మారాం గారు కాటన్ టెక్స్ టైల్ లో స్పెషలిస్ట్, యింకా ఖటావూ గ్రూప్ ఆఫ్ మిల్ల్స్ కి సెక్రటరీ. ఆయన బాంద్రాలో తన నివాసాన్ని యేర్పాటు చేసుకున్నారు. తరువాత ఆయనకి శ్రీ షిరిడీ సాయి బాబాతో పరిచయం యేర్పడింది. షిరిడీ సాయి సంస్థాన్ యేర్పాటు చేసిన వారిలో ఆయన ఒకరు. దానికి మొట్టమొదటి కోశాథికారి కూడా. ముంబాయి, మహారాష్ట్ర ప్రజలకి బాబా సందేశాలనందిస్తున్న దాసగణు మహారాజ్ కి తనకు సాథ్యమయినంతలో సహాయం చేస్తూ ఉండేవారు.
మీరు షిరిడీని దర్శించినప్పుడు సమాథి మందిరంలో, ఆ కాలంలో ఉన్నటువంటి భక్తుల ఫోటోలను చూడవచ్చు.

స్వర్గీయ అన్నా సాహెబ్ ధాబోల్కర్ గారు వ్రాసిన సాయి సచ్చరిత్రలో ఆయన కాలంలో షిరిడీలో బాబా గారి సమగ్ర సమాచారం లభిస్తుంది.

సాయి సచ్చరిత్రలోని 9 వ అథ్యాయం సాయిబాబాతో తార్ఖడ్ కుటుంబానికి సంబంధించిన అనుభవాలని తెలియ చేస్తుంది. అందులో చెప్పిన తార్ఖడ్ స్త్రీ మా అమ్మమ్మగారు, ఆమె కుమారుడు మా నాన్నాగారయిన శ్రీ జ్యోతీంద్ర రామచంద్ర తార్ఖడ్ గారు. ఈ పుస్తకంలో యిపుడు నేను చెప్పబోయే స్వీయానుభవాలు యెక్కువగా మా నాన్నగారు జ్యోతీంద్ర గారివి. ఆయ్న 15 జూన్ 1895 లో జన్మించారు, 16 ఆగష్టు, 1965 లో మరణించారు. ఈ సందర్భంలో క్లుప్తంగా రచయిత గురించి పరిచయం యివ్వతగినది.

నా పేరు వీరేంద్ర జ్యోతిరాజా తార్ఖడ్. జ్యోతీంద్ర గారి రెండవ కుమారుడిని. (మొదటి కొడుకు రవీంద్ర మరణించాడు). వృత్తిరీత్యా నేను యింజనీరుని. నేను రెండు కంపెనీలలో, క్రాంప్టన్గ్రీవ్స్ కం పెనీ లి. లోనూ, సీమెన్స్ యిండియా లి.లోనూ మానేజర్ హోదాలో పనిచేసి ప్రస్తుతం పదవీ విరమణ చేసి శాంతా క్రజ్ లో ఉంటున్నాను.

ప్రియమైన సాయి భక్తులారా, ఈ పుస్తకం చదివిన తరువాత నాతో మాట్లాడాలంటే మాట్లాడాలంటే మాట్లాడవచ్చు కాని మనం ఒకరికొకరం లార్డ్ సాయి మీద మనకున్న భక్తిని తెలుపుకోవడానికి మాట్లాడుకోవాలి.


(సం.) వీ.జే. తార్ఖడ్.


(రేపు శ్రీ సాయితో మొదటి పరిచయం)


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు







Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List