Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, July 28, 2011

శ్రీ సాయితో మొదటి కలయిక

Posted by tyagaraju on 8:27 PM29.07.2011 శుక్రవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

ఈ రోజు తార్ఖడ్ కుటుంబమువారి బాబా స్వీయానుభూతులలో మొదటిసాయి బాబా తో పరిచయం గురించి తెలుసుకుందాము.శ్రీ సాయితో మొదటి కలయిక (పరిచయం)

ఓం శ్రీ సాయి నాథాయనమహ

ఈ సంఘటన ఒక వేసవికాలపు రోజున జరిగింది. జ్యోతీంద్ర అప్పుడే మెట్రో సినిమా దగ్గరున్న యిరానీ రెస్టారెంట్ లో ఫలహారం చేసి, తను చదివే సెంట్.గ్జేవియర్ స్కూలుకి వెడుతున్నాడు. స్కూలు విరామ సమయం లో యిరానీ రెస్టారెంట్ కి వెళ్ళి ఫలహారం చేయడం అతనికి ప్రతీరొజూ జరిగే కార్యకరమం. ఆ రోజు అతను రోడ్డు దాటుతున్నప్పుడు తెల్లని దుస్తులలో ఉన్న ఒక ఫకీరు అతన్ని పిలిచి ధర్మం అడిగాడు. జ్యోతిరాజా ఒక పైసనాణెం (రాగి నాణెం మథ్యలో కన్నం ఉండేది, దీనినే చిల్లు కాణీ అనేవారు) జేబులోంచి తీసి దానిని ఆ ఫకీరుకిచ్చి స్కూలుకు వెడుతున్నాడు. కాని ఆ ఫకీరు అతన్ని ఆపి, అది ఒక పైసానాణెం 1894 సంవత్సరంలోనిది అని జ్యోతీంద్రతో అన్నాడు.

ఆ రోజులలో ప్రజలు ఒక పైసాను థర్మంగా యిస్తూ ఉండేవారు. ఆ విథంగా ఒక పైసా ఒక విద్యార్థినుంచి ధర్మంగా ఇవ్వబడటం చాలా పెద్ద మొత్తం. జ్యోతీంద్ర, ఫకీరుతో, తనకి ప్రతీరోజూ మథ్యాన్న పలహారం నిమిత్తం నాలుగు అణాలు ఇవ్వబడతాయని, అందుచేత ఒక పైసా థర్మంగా ఇవ్వగలనని చెప్పాడు. అంతే కాకుండా ఈ ఒక పైసా ఇంకా చలామణిలోనే ఉంది కాబట్టి ఫకీరుకు దాని గురించి బెంగ అక్కరలేదని చెప్పాడు. అప్పుడా ఫకీరు "అల్లా భలా కరేగా" అన్నాడు. అప్పుడు జ్యోతీంద్ర స్కూలికి వెళ్ళిపోయాడు. యిక ఈ విషయం గురించి మరచిపోయాడు.


జ్యోతీంద్ర గారికి యిద్దరు అన్నయ్యలు. సత్యేంద్ర, రవీంద్ర. వీరు మెడికల్ కళాశాలలో చదువుతూ ఉండేవారు. సత్యేంద్ర గారు యింకా జీ.జీ.ఎం.సీ. (గ్రాడుయేట్ మెడికల్ కాలేజ్ - యిదే తరువాత ఎం.బీ.బీ.ఎస్. గా రూపాంతరం చెందింది) డిగ్రీ సాథించారు. ఆయన రచయితకు మామయ్య, ఈయన మాతుంగాలోని కొంకన్ నగర్ లో ఉండేవారు. (యిప్పుడాయన లేరు. ఆయన కొడుకు, కూతురు అక్కడ ఉంటున్నారు.) జ్యోతీంద్ర గారి సోదరుడు డాక్టరు, ఆయన మామయ్య డాక్టరు ఆయన తాతగారు ప్రముఖ మెడికల్ ప్రాక్టీషనరే కాకుండా బొంబాయి వైస్రాయిగారికి కుటుంబ వైద్యుడు కూడా. క్లుప్తంగా చెప్పాలంటే జ్యోతీంద్రగారికి అది వైద్యుల కుటుంబం.)


కాని జ్యోతీంద్రగారి కుటుంబంలో యింతమంది వైద్యులు ఉన్నాగాని, జ్యోతీంద్ర గారి తల్లి అంటే రచయితగారి అమ్మమ్మగారికి మైగ్రైన్ తో విపరీతమయిన తలనొప్పితో బాథపడుతూ ఉండేది. అన్ని రకాల మందులను వాడి చూశారు, కాని అది యింక నివారణ కాదని తేలిపోయింది,


వారింటిలో వారితో కలిసి పని చేస్తూ ఒక పనిమనిషి ఉండేది. ఆమె, బాంద్రా మసీదు దగ్గిరున్న పీర్ అని పిలవబడే మౌలానా బాబా వద్దకు వెళ్ళమని సలహా యిచ్చింది. ఆయన కొన్ని ఆయుర్వేద మందులిస్తారని, నయమవని జబ్బులు కూడా తగ్గుతాయని చెప్పింది.


యిపుడు, ఆ రోజులలో ఒక హైందవ స్త్రీ మసీదుకు వెళ్ళి ఒక పీర్ను కలుసుకోవడమంటే చాలా కష్ట సాథ్యమయిన విషయం. మా అమ్మమ్మగారు తన కుమారుడు జ్యోతీంద్ర గారికి సలహా ఇచ్చింది. స్వభావ సిథ్థంగా చాలా థైర్యవంతుడయిన ఆయన ఒక బురఖా యేర్పాటు చేసి తన తల్లిని కారులో పీర్ మౌలానా బాబా వద్దకు తీసుకుని వెళ్ళాడు. కాని ఒక మానవ మాత్రుడు తీరని వ్యాథితో బాథ పడుతున్నప్పుడు మత కట్టుబాట్లను చేదించడం కష్టం కాదు. కాని మౌలానా బాబాని కలుసుకున్న తరువాత వారి కష్టాలు నెమ్మదించడానికి బదులు యెక్కువయాయి. మౌలానా బాబా మా అమ్మమ్మతో ఆమె బాథ పడుతున్న వ్యాథిని నయం చేయడానికి తన వద్ద మందు లేదని చెప్పాడు. కాని ఆమెతో "షిరిడీలో నా సోదరుడు సాయిబాబా అనే ఆయన ఉన్నాడు. మీరు ఆయన వద్దకు వెళ్ళండి. ఆయన మీకు నయం చేసి మీ బాథలన్నిటినీ పోగొడతాడు" అని చెప్పాడు.


యిప్పుడు వారిద్దరూ పెద్ద కష్టంలో పడ్డారు. మొదటగా మా తాతగారు ప్రార్థనా సమాజ్ వాది. యెక్కువ అహంకారి. ఆయన అటువంటి బాబాలని కలుసుకోవడానికి అనుమతివ్వరని వారికి తెలుసు. యిక రెండవది, షిరిడీ యెక్కడ ఉంది, అక్కడకు యెలా వెళ్ళాలన్నదే పెద్ద ప్రశ్న.


యేమయినప్పటికీ జ్యోతీంద్ర వెనుకాడలేదు. ప్రియ పాఠకులారా ! యిక్కడ నేను నమ్మేదేమిటంటే వారు శ్రీ సాయిబాబాను కలుసుకోవాలని ముందే వారి భవితవ్యం వ్రాసి ఉండబడి ఉంటుంది. అందుచేత యెవరూ కూడా వారిని ఆపలేరు.


ఆయన మెట్రొ థియేటర్ వద్ద నున్న యిరానీ రెస్టారెంట్ యజమానినించి సమాచారాన్నంతా సేకరించారు.

షిరిడీ గ్రామం అహ్మద్ నగర్ జిల్లాలో ఉందని, అక్కడికి వెళ్ళాలంటే యెవరైనా రైలులో మన్మాడ్ మీదుగా కోపర్గావ్ వెళ్ళాలని తెలుసుకున్నారు. కోపర్గావ్ నుంచి, 9 కి.మీ. దూరంలో ఉన్న షిరిడీకి గుఱ్ఱపు బండిలో వెళ్ళాలి. దీనర్థం యేమిటంటే యింటినుంచి బయలుదేరితే కనీసం 3 రోజులు యింటికి దూరంగా ఉండాలి. యేమయినప్పటికీ జ్యోతీంద్ర వాళ్ళ నాన్నగారి అనుమతి సంపాదించి ప్రయాణానికి అన్ని యేర్పాట్లు చేశారు. ఒక శుక్రవారం సాయంత్రం తల్లి, కొడుకులిద్దరూ షిరిడీకి బయలుదేరారు. శనివారం ఉదయానికి వారు షిరిడీలో ఉన్నారు. వారు అంతా విచారించి, తరువాత స్నానాదికాలు అన్నీ కానిచ్చి శ్రీ సాయిని కలుసుకోవడానికి ద్వారకామాయికి చేరుకున్నారు. వారు, సాయిబాబా పవిత్రమైన థుని ముందు కూర్చుని ఉండటం చూశారు. (బాబా వెలిగించిన అగ్ని). మా అమ్మమ్మగారు బాబా ముందు వంగి ఆయన పాదాలను స్పుశించారు..


వారిద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. వారిద్దరిమథ్య యేమి జరిగిందన్నది ఈ క్రింది విథంగా ఉంది.


బాబా మా అమ్మమ్మగారితో "అమ్మా ! నువ్వు వచ్చావు. బాంద్రా నించి నా సోదరుడు నిన్ను నావద్దకు పంపించాడు. దయచేసి కూర్చో. అమ్మా, నీకు చాలా విపరీతమయిన తలనొప్పి ఉంది అవునా?" అప్పుడు సాయిబాబా తన అయిదు వేళ్ళను ఊదీ ఉన్న పళ్ళెంలో ముంచారు. (పవైత్రమైన భస్మం) ఊదీతో నిండి ఉన్న ఆ చేతితో మా అమ్మమ్మగారి నుదిటిమీద కొట్టారు. ఆయన, నుదిటిని అయిదు వేళ్ళతో గట్టిగా పట్టుకుని అన్నారు "అమ్మా, యిప్పటినుంచి నీవు చనిపోయేవరకు నీ తలకు యిక యెటువంటి నొప్పిరాదు. ఈ తలనొప్పి పూర్తిగా నివారణయింది"

ప్రియ పాఠకులారా, సాయి చేసిన ఈ చర్యకి మా అమ్మమ్మగారు ఆశ్చర్య చకితులయారు. ఆమె తన బాథ గురించి ఒక్క మాటకూడా మాట్లాడలేదు. బాబాగారికి తమ రాక గురించి, ఆమె బాథ గురించి యెలా తెలుసు? నేననుకునేదేమిటంటే బాబాగారు చేసిన ఈ రెండు చర్యలవల్ల మా అమ్మమ్మగారిని గురించిన విషయం తెలిసింది. ఒకటి వారిద్దరిమథ్య జరిగిన చూపులు, అనగా దృష్టి కలయిక, మరియు ఊదీ నిండిన చేతితో నుదిటిమీద కొట్టడం. మా అమ్మమ్మగారికి యెప్పుడు అటువంటి శక్తివంతమైన మోతాదులో మందు యివ్వబడలేదు. యేమి జరిగిందన్నది , ఆమెకు అనుభవమైనదల్లా తనకు బాగయినట్టు. తలనొప్పి వల్ల వచ్చిన ఆమె వదనంలోని విచారం మటుమాయమయిపోయింది. ఆమె యిపుడు కొత్తగా కనపడుతోంది. ఆమె మా నాన్నగారు జ్యోతీంద్ర గారితో బాబాకు నమస్కరించమని చెప్పింది. యిదంతా చూసి మా నాన్నగారు ఆశ్చర్యపోయారు. ఆయన తల్లి యింతకు ముందు యెపుడు అలా ఆజ్ఞాపించలేదు. అపుడు మానాన్నగారు బాబా ముందుకు వంది ఆయన పాదాలను సృశించారు. వెంటనే బాబా ఆయనతో "ప్రియమైన భావూ (సోదరా), నువ్వు నన్ను గుర్తించలేదా?" మా నాన్నగారు లేదన్నట్లుగా జవాబిచ్చారు. అపుడు బాబా ఆయనతో "నా వైపు చూడు, బాగా గుర్తుకు తెచ్చుకో, మరలా జ్ఞప్తికి తెచ్చుకోవటానికి ప్రయత్నించు" అన్నారు. మా నాన్నగారికి యేమీ గుర్తుకు రాలేదు. అపుడు బాబా తన కఫ్నీ జేబులో చేయి పెట్టి ఒక పైసా రాగి నాణెం తీశారు. ఆయన దానినే మా నాన్నగారికి చూపించారు. "ఏయ్ భావూ ! 1894 సం. సంబంథించిన ఈ రాగినాణెం గుర్తుందా? నువ్వు స్కూలికి వెళ్ళేటపుడు ఒక ఫకీరుకు థర్మంగా ఇచ్చావు."


యిపుడు మా నాన్నగారు ఈ అథ్యాయం మొదటలో వివరించిన సంఘటనని తిరిగి గుర్తుకు తెచ్చుకోవడం మొదలు పెట్టారు. ఆయన నేత్రాలు కన్నిళ్ళతో నిండిపోయాయి. ఆయన వెంటనె తన చేతులతో బాబాగారి కాళ్ళు పట్టుకున్నారు. బాబా ఆయనని లేవనెత్తి అన్నారు, "ఏయ్ భావూ, ఆ రోజు మథ్యాన్నం నువ్వు కలుసుకున్న ఫకీరు నేను తప్ప మరెవరూ కాదు, నివ్విచ్చిన ఈ పైసాని నీకు తిరిగి యిస్తున్నాను. దీన్ని తీసుకుని జాగ్రత్తగా భద్రపచుకో. అది నీకు యెన్నో పైసలని పెడుతుంది."


చదువుతున్న ప్రియమైన భక్తులారా, మా అమ్మమ్మగారికి, నాన్నగారికి ఆనందదాయకమైన సాయి దర్శనం జరిగిందని యిపుడు మీరు నాతో తప్పకుండా ఒప్పుకుంటారు. వారిద్దరికీ అది మరపురానిది. అప్పటినుంచీ వారు తమకు తెలియకుండానే యెప్పటికీ సాయివైపు ఆకర్షితులయ్యారు.సాయితో ఈ మొట్టమొదటి పరిచయం తరువాత తార్ఖడ్ కుటుంబం సాయిబాబాని తమ గురువుగా యెంచుకున్నారు. వారు పూర్తిగా సాయి భక్తికి అంకితమయి పోయారు. మా అమ్మమ్మగారి తలనొప్పి శాశ్వతంగా నివారింపబడింది. భగవంతుని యందు ఆమె భక్తి రెట్టింపయింది. మా యింటిలో ఆ పైసా నాణెం పూజకోసం ఉంచబడింది.


సాయిబాబాని కలుసుకున్న తరువాత యేంజరిగిందని మేము మా నాన్నగారిని అడుగుతూ ఉండేవారం. బాబాగారి కళ్ళల్లో కరుణారసమైన చూపులు యెంతో ఆకర్షింపబడేటట్లుగా ఉండి, ఆయన వైపుకు లాగుతూంటాయని ఆయన శక్తివంతమైన చేతుల స్పర్శ యెటువంటి గాయాన్నయినా మాన్ పగలదని మా నాన్నగారు చెబుతూ ఉండేవారు. సాయి బాబా యెప్పుడు తాను భగవంతుడినని చెప్పుకోలేదని మీకు తెలుసు. ఆయన తానెప్పుడు దేవుడి దూతనని చెబుతూ ఉండేవారు. యేమయినప్పటికీ మా నాన్నగారు ఖండోబా ఆలయ పూజారి (తరువాత గొప్ప సాయి భక్తుడిగా మారారు) మహల్సాపతి భగత్ మొట్టమొదటిసారిగా చూసినప్పుడే "రండి సాయీ రండి" అని సరిగా నామకరణం చేశారని చెబుతూ ఉండేవారు.మన భారతదేశం యెంతోమంది ఆథ్యాత్మిక బాబాలకు నిలయం. వారి భక్తులు వారికి తగినట్లుగా పిలుస్తూ ఉంటారు. సాయి అన్న పేరు అన్నిటినీ తెలుపుతుందని సూచిస్తుందని మా నాన్నగారు చెబుతూ ఉండేవారు. ఆయన వివరించినదాని ప్రకారం మరాఠీలో సాయి అనేమాటకి అర్థం "సాక్షాత్" (సత్యమైన) అనగా ఈశ్వర్ (భగవంతుడు). అలా ఆయన దృష్టిలో సాయిబాబా అంటే సాక్షాత్ ఈశ్వర్ బాబా. నేనిక్కడ తప్పక చెప్పవలసినదేమిటంటే మా నాన్నగారు షిరిడీ దర్శించినప్పుడు అనుభవించినది చాలా అద్భుతం. ఒక సామాన్యమైన మానవుడు అటువంటి దివ్యానుభూతిని పొందినప్పుడు సాయిబాబాకి దేవతా సంబంథమయిన దైవిక శక్తులు ఉన్నాయనే ఒక నిర్ణయానికి వస్తాడు. అటువంటి అనుగ్రహాన్ని పొందిన కుటుంబంలో జన్మించినందుకు నేను చాలా అదృష్టవంతుడినని నాకు నేను భావించుకుంటున్నాను. సాయిగారి అనుగ్రహం మనందరి మీద యెల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను.

ఓం శ్రీ సాయినాథాయనమహ.సర్వం శ్రీ సాయినాథార్పణమస్తుKindly Bookmark and Share it:

0 comments:

Post a Comment