Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, March 7, 2021

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 49 వ.భాగమ్

Posted by tyagaraju on 7:23 AM

 


07.03.2021 ఆదివారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయిబాబాపరిశోధనా వ్యాస గ్రంధము – 49 .భాగమ్

(పరిశోధనావ్యాస రచయితశ్రీ ఆంటోనియో రిగోపౌలస్ఇటలీ)

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

ఫొన్ : 9440375411 & 8143626744

మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

షిరిడీమంగళవారంఅక్టోబరు, 22, 1985

మహాసమాధి ఉత్సవాలు

నాడైరీలో వ్రాసుకున్న ముఖ్యాంశాలు

ఉదయం 8 గం.  రోజు ఉదయం గం. 5.30 కు నిద్రలేచాను.  ఉదయాన్నే ఇక్కడ చాలా చల్లగా ఉంది. ఎంతో పవిత్రంగాను, భక్తిపూర్వకంగాను సాగిన ఊరేగింపులోను, సమాధి మందిరంలో సాయిబాబావారి విగ్రహానికి జరిగిన అభిషేకాలలోను, పాల్గొన్నాను.  నేను చాలా ఫోటోలు తీసాను.  చాలా విపరీతమయిన రద్దీ, బారులు తీరిన భక్తుల వరుసలు ఉన్నాగాని ఇటువంటి ప్రత్యేకమయిన సందర్భాలలో ప్రజలలో ఉన్న ప్రగాఢమయిన భక్తిని గమనించాను. 


విశేషమేమిటంటే నాకు చుట్టుప్రక్కల ఒక్క విదేశీయుడు కనిపించలేదు.  అందువల్ల నేనొక్కడినే ఇక్కడ విదేశీయునిలా కనిపించడంతో అందరికీ చాలా వింతగాను, అసాధారణంగాను అనిపించింది.  చాలామంది భారతీయులు నావైపు ఎంతో ఉత్సుకతతోను, ఆశ్చర్యంతోను చూడసాగారు.

ఆతరువాత నేను బాలదేవ్ గ్రిమేతో కొద్దిసేపు మాట్లాడాను.  షిరిడీలో అబ్దుల్ బాబా సమాధి సంరక్షకునినుంచి అబ్దుల్ బాబా గురించిన సమాచారాన్ని నాకు తెలియచేసాడు.  చిన్న సమాచారం కూడా ఎంతో విలువయినది.  సాయిబాబా వారి గురువు ఉన్న ప్రదేశం, గురుస్థానం వేపచెట్టు వద్ద నేను అగరువత్తులను వెలిగించాను.  షిరిడీనుంచి వెళ్ళేటప్పుడు మరలా వచ్చే గురువారం గాని శుక్రవారం గాని, సాయంత్రం తప్పకుండా రావాలి.  గురు, శుక్రవారాలలో ఇక్కడ గురుస్థానంలో అగరువత్తులు, సాంబ్రాణి ధూపం వేసినట్లయితే చెడు అంతా తొలగిపోతుందనిఅనారోగ్యాలు నయమవుతాయని అంటారు.  సాయిభక్తులందరికీ నిస్సందేహంగా పవిత్రమయిన రోజు.

ధ్యాహ్నం గం. 1.00  ---   రోజు ఉదయం 10 గంటల సమయంలో నాకు గొప్ప ఆశీర్వాదం లభించింది.  సమాధిమందిరంలో బాబాను దర్శించుకున్న నాకు సమాధి పైదాకా వెళ్ళే భాగ్యం కలిగింది.  సమాధి పైదాకా ఎక్కేందుకు నాకు అనుమతినిచ్చారంటే అదినాకు లభించిన నమ్మశక్యం గాని గౌరవం.  సమాధిపై పూలదండను సమర్పించి నా స్వహస్తాలతో స్పృశించుకుని నమస్కరించుకున్నాను.  అది ఎంతో అరుదుగా లభించే బాబా దయ.   భాగ్యాన్ని నాకు లిగించిన శ్రీ అప్పా సాహెబ్ బొరావకే గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను.  ఆయన నన్ను ప్రతిరోజు తనతోపాటు కూడా తీసుకునివెళ్ళి అందమయిన తాజా గులాబీ పూలను కూడా సమర్పించే అవకాశాన్నిచ్చారు.  బాలదేవ్ గ్రిమే కూడా మాతోనే ఉన్నాడు.  తరువాత నేను అప్పసాహెబ్ బొరావకే గారి ఫోటోలను మెహర్ బాబా ఫొటోగ్రాఫరయిన శ్రీ దేశ్ పాండే సాహెబ్ గారి ఫొటోలను తీసుకున్నాను. 

(మరికొన్ని విషయాలు అనవసరమనిపించి వాటిని ఇక్కడ ప్రచురించడం లేదు…. త్యాగరాజు)

తప్పకుండా మళ్ళీ సంస్థానానికి వెళ్ళి సాయిలీల పత్రికలు పాతసంచికలను కొనుక్కోవాలి.   రోజు సాయంత్రం 5 గంటలకు బాలాజీ పిలాజీ గురవ్ దగ్గరకు వెళ్ళి మరొకసారి మాట్లాడాలి.  రేపు సాయంత్రం 6 గంటలకు అప్పాసాహెబ్ బొరావకే కుమారుడిని అతని ఇంటికి వెళ్ళి కలుసుకోవాలి.

సాయిబాబా గురించి ఉద్దవ్ మాధవరావు దేశ్ పాండే చెప్పిన కొన్ని వృత్తాంతాలను బలదేవ్ గ్రిమే వివరించారు.  ఉదాహరణకి సాయిబాబా మసీదులో వంట చేస్తున్నపుడు, ఉడుకుతున్న పాత్రలలో ఆయన తరచుగా తన చేతిని పెట్టి అందులోని పదార్ధాలను కలుపుతూ ఉండేవారనీ, ఎప్పుడూ గరిటెను ఉపయోగించేవారు కాదని చెప్పారు.  ఆయన చేతిని పెట్టి పాత్రలలో కలియత్రిప్పినా చేయి కాలడం గలేదని, ఆయనకు ఎటువంటి బాధ కలిగేది కాదనీ చెప్పారు. 

నాహోటల్ కు చాలా దగ్గరలోనే ఉన్న లక్ష్మీ మందిరానికి రోజు ఉదయం వెళ్ళాను.  మందిరంలోనే నల్లకుక్కకు పెరుగన్నం పెట్టమని బాలా గణపతికి  చెప్పి అతని మలేరియా వ్యాధిని సాయిబాబా నయం చేసారు.

మధ్యాహ్నం భోజనం చాలా బాగుంది.  నా శరీరం మీద దోమకాట్లు చాలా ఉన్నాయి.  ముఖ్యంగా నా చేతులమీద.  రాత్రివేళల్లో దోమలు చాలా వస్తున్నాయి.  మిగతా సమయాలలో రవాలేదు.   ఇపుడు స్నానం చేసి మధ్యాహ్నం చేయబోయే కార్యక్రమాలకు తయారవాలి.

గం. 6.10     సాయంత్రం.   రెండవసారి బాలాజీ పిలాజీ గురవ్ తో మాట్లాడాలి. 

మేమిద్దరం చాలా చక్కటి విషయాలు మాట్లాడుకున్నాము.  ఎక్కువసేపు మాట్లాడుకోలేదు గాని, రోజుకి అది సరిపోతుంది.  రోజు రాత్రి 9 గంటలకి ళ్ళీ పల్లకీ ఉత్సవాలలో పాల్గొనాలి. 

రేపు ఉదయం జరగబోయే అన్ని రకాల ఉత్సవాలకి గం. 5.15 కి ప్రారంభమయే కాకడ ఆరతికి వెళ్లలంటె పెందరాడె లేవాలి.  మారుతీ దేవాలయ సంరక్షకుడు స్వామితో రేపు ఉదయం మట్లాడాలి.  ఆయన ఇక్కడ గత 15 సంవత్సరాలుగా ఉంటున్నారు.  ఆతరువాత మధ్యాహ్నం ళ్ళీ హోమీ బాబాను కలుసుకోవాలి.  సాయంత్రం 6 గంటలకు బాలదేవ్ గ్రిమే తన కారులో నన్ను  అప్పాసాహెబ్ బొరావకే కొడుకు ఇంటికి తీసుకువెళ్లడానికి వస్తాడు.

మొత్తానికి నేను అన్నిసంభాషణలను పూర్తిగా రికార్డు చేసానన్న సంతోషం కలిగింది.  షిరిడీలో ముఖ్యమయిన వ్యక్తులందరినీ కలుసుకున్నాను.  ఏమయినా గాని ఇంకా కొన్ని ఇంటర్వ్యూలు చేయగలనేమో ప్రయత్నించి చూడాలి.  ఇంతవరకు నేను 8 , 9 గంటలపాటు జరిపిన సంభాషణలని రికార్డ్ చేసాను.  అవి చాలా ఎక్కువే.  ఫలితాలు నాకు చాలా సంతృప్తినిచ్చాయి.

(రేపటి సంచికలో శ్రీ బాలదేవ్ గ్రిమే తో జరిపిన సంభాషణ.   అబ్దుల్ బాబా గురించి వివరాలు)

(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List