

26.07.2011 మంగళవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
ఈ రోజు సాయి లీల పత్రికలో ప్రచురింపబడిన ఒక బాబా లీలని తెలుసుకుందాము. ఇంది ఒక భక్తుని పిలుపుకు వెంటనె స్పందించిన బాబా అద్భుతమైన లీల. ఇందులో భర్తకి తన భార్యకు మరణమే శరణ్యం అని బాబాని వేడుకున్న పరిస్థితిలో బాబా స్పందించి పక్షవాతాన్ని వెనువెంటనే తగ్గించిన లీల అద్వితీయం, అపూర్వం.
భక్తుని పిలుపు విన్న బాబా
కొన్ని సంవత్సరాల క్రితం నా భార్య నా పెద్ద కుమారుని తో కొద్ది రోజులు వుండటానికి జనక్ పురి వెళ్ళింది. ఒక రోజు పొద్దున్నే వాడినుంచి అమ్మకి చాలా సీరియస్ గా ఉందని, డా.సుథీర్ వర్మతో వెంటనే రమ్మని ఫోన్ కాల్ వచ్చింది.
నేను, మా చిన్న అబ్బాయి, డా.సుథీర్ వర్మతో కలిసి జనక్ పురి వెళ్ళాము. డా.వర్మ పరీక్షించి నాభార్యకు పక్షవాతం వచ్చిందని, ఆమె కుడివైపు భాగమంతా చచ్చు పడిపోయిందని ఆమెకు మాట కూడా పడిపోతుందని చెప్పారు.
ఆమె ఇక జీవితాంతము అంగ వైకల్యంతో మంచినీళ్ళకి కూడా ఒకరి దయాదాక్షిణ్యాల మీద ఆథారపడుతూ ఉండాలిసిందేనని తలచుకునేటప్పటికి నేను షాక్ కి గురయ్యాను. ఇక నిరాశతో, అటువంటి పరిస్థితిలో ఆమె చనిపోవడమే మంచిదని, నేను బాబాని ప్రార్థించి మనవి చేసుకున్నాను. తను యెంతో అంకితభావంతోను, ప్రేమతోను, కుటుంబానికెంతో సేవ చేసిన తనని ఆ స్థితిలో నేను చూడలేననిపించింది.
తరువాత రాజా గార్డెన్ దగ్గిరున్న నర్సింగ్ హోం లో చేర్పించడానికి నేను అన్ని యేర్పాట్లు చేసి, ఆమెని తీసుకుని రావడానికి వెళ్ళినప్పుడు, మా అబ్బాయి నవ్వుతూ నన్ను పైకి రమ్మన్నాడు. వాడి నవ్వు చూసి నాకు ఆశ్చర్యం వేసింది. కాని నేను నా భార్య బెడ్ వద్దకి వెళ్ళాక, ఇంకా ఆశ్చర్యం వేసింది. నా భార్య అసలు యేమీ జరగనట్టుగా చక్కగా ఆరోగ్యంగా లక్షణంగా ఉంది.
మేము టాక్సీ మాట్లాడుకుని నర్సింగ్ హోం దగ్గిరకి వెళ్ళేటప్పటికి డా.వర్మ గేట్ వద్ద చక్రాల కుర్చీతోను, ఆస్పత్రి స్టాఫ్ తోను నా భార్యని లోపలికి తీసుకునివెళ్ళడానికి సిథ్థంగా ఉన్నారు. యెటువంటి ఆథారం లేకుండా ఆవిడ టాక్సీ దిగేటప్పటికి " డా.వర్మ గారు "మిస్టర్.కపూర్, యేమిటి నేను చూస్తున్నది? అన్నారు. "డాక్టర్, మీకే బాగా తెలుసు, మెడికల్ సైన్స్ " నేను సమాథానమిచ్చాను.
డాక్టర్ : "కాదు, అది మెడికల్ సైన్స్ కాదు, మీ పిలుపు మీ గురు సాయికి చేరింది, ఆయన నయం చేశారు. అనుమానం లేదు సాయి మిమ్మలని అనుగ్రహించారు."
ఎస్.కే.కపూర్,
అంబికా విహార్, న్యూ ఢిల్లీ
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
0 comments:
Post a Comment