

25.07.2011 సోమవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంథువులకు బాబావారి శుభాశీస్సులు
నా జీవితంలో జరిగిన అద్భుతం
ఈ రోజు యూ .కే. నుంచి అజ్ఞాత భక్తురాలి బాబా అనుభూతిని తెలుసుకుందాము. నెల్లూరు నించి సుకన్య గారు సేకరించి పంపించారు.
నేను ఇప్పుడు నా అనుభవాన్ని చెపుతున్నాను. నా సోదరుడు సాయి సచ్చరిత్ర ను కొని యింటికి తీసుకువచ్చినప్పుడు 2006 సంవత్సరం నించి నేను సాయి భక్తురాలిగా ఉన్నాను. తను యెప్పుడూ దానిని చదువుతూ ఉండేవాడు. ఒక రోజు నేను నా సోదరుడిని అడిగాను, నువ్వు ఏం చదువుతున్నావు అని అప్పటినుంచి సాయి నన్ను తన భక్తురాలిగా చేసుకున్నారు. గతంలో నాకు చాలా అనుభవాలు జరిగాయి నేను మీకు వివరించవచ్చు అవన్నీ కూడా క్లిష్ట పరిస్థితులనుండి సాయి నాకు సహాయ పడి యెలా బయట పడవేశారన్నవే.
ఒకానొక సమయంలో నా తల్లితండ్రులు నా వల్ల బాథ పడ్డారు కాని సాయిమా ఉన్నారు కాబట్టి ఆ పరిస్థితినుండి బయటపడి అంతా సుఖాంతమైంది.
క్రితం సంవత్సరం నాకు వివాహహమ యిన తరువాత .యూ.కే. వెళ్ళాను. అప్పటినించి, నేను నా భర్త, నేను పోస్ట్ గ్రాడ్యు ఏట్ ని కాబట్టి నా చదువుకు తగిన మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ నేనింకా చెప్పదలచుకునేదేమిటంటే ఇక్కడ ఈ కొత్త ప్రదేశంలో నేను అలవాటు పడటానికి నా భర్త నైతికంగా మంచి ప్రోత్సాహం ఇచ్చి పరిస్థితులన్నీ అడ్డదారిలో వెడుతున్నప్పుడు ఓర్పుతోను, నమ్మకంతోను జీవితంలో యెలా ఉండాలో చెప్పారు. (బాబా మంత్రం). ఇలా ఉండగా ప్రపంచంలో ఉన్న మంచి విశ్వవిద్యాలయంలో పీ.హెచ్.డీ చేయాలన్న నా కల. నా ఉన్నత విద్య అయినప్పటినించీ నేను దానికోసం ప్రయత్నిస్తున్నాను. కాని యే స్కాలర్షిప్ ప్రోగ్రాం కి గాని నేను యెన్నిక కాబడలేదు. అందుచేత నేను నా చదువుకు తగ్గట్టు ఉద్యోగం చేస్తున్నాను, కాని నా కల అలాగే ఉండిపోయింది. నా భర్త నా కలను సార్థకంచేయడానికి తనశాయశక్తులా భారాన్ని తనమీద వేసుకున్నారు. అందుచేత యూ.కే. , యూరప్ లలో పూర్తి స్కాలర్ షిప్ తో పీ.హెచ్.డీ. కోసం చేసే ప్రయత్నాలు రెట్టింపు అయ్యాయి. కాని యెక్కడినించీ కూడా అనుకూలంగా రాలేదు, తిరస్కారాలే తప్ప. యిటువంటి సంఘర్షణలో, నేను సాయినాథుడికి దూరమయ్యానని నా అంతట నేను తెలుసుకుని, ఆయనని గుర్తు చేసుకోనందుకు పశ్చాత్తాప పడ్డాను. ఒకరోజు, మా యింటికి దగ్గరగా ఉన్న సాయి మందిరానికి వెళ్ళి బిగ్గరగా యేడిచాను. యిలా యెందుకు జరుగుతోంది అని ఆయనని అడిగాను, నా జీవితాన్ని స్థిరత్వాన్నించి అస్థిరంగా యెందుకు చేస్తున్నారని అడిగాను. ఆ సమయంలో గుడి పూజారి వచ్చి యేమిటి నాసమస్య అని అడిగారు. నాకు సరియైన ఉద్యోగం లేదని యిక్కడ ఆర్థికంగా స్థిరంగా ఉండాలంటే ఉద్యోగం తప్పనిసరి అని అందుచేత యిక్కడ యే ఉద్యోగం చేయడానికైనా సిథ్థమేనని చెప్పాను. యిలా ఉండగా నా భర్త నాకు యెప్పుడూ ప్రోత్సాహం ఇస్తూ ఉండేవారు, ఉద్యోగానికి అప్ప్లికేషన్స్, పీ.హెచ్.డీ. స్కాలర్షిప్ కి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. గుడి పూజారిగారు నన్ను రోజు సచ్చరిత్రలోని ఒక పేజీ చదవమని చెప్పారు. నేను మాయింటిలో వేరే వాళ్ళతో కలసి ఉంటున్నామని అందుచేత చదవడానికి వాతావరణం అనుకూలంగా లేదని చెప్పాను. యిం టిలో ప్రశాంతమైన ప్రదేశం కూడా లేదని అందుచేత సాథ్యం కాదని చెప్పాను. అయితే గుడికి వచ్చి చదువుకోమని చెప్పారు. నేను అలాగే చేసాను,
మరుసటి వారం మొదటి లీల జరిగింది, నా భర్త వేరే ప్రత్యేకంగా ఉందామని అప్పుడు మనం ప్రశాంతంగా ఉండవచ్చని నిర్ణయించారు. ఖర్చులు పెరిగినా కూడా అది ఆయన కృత నిశ్చయం. మేము వేరే వెళ్ళిపోయి ఉండటం మొదలుపెట్టాము. సాయి నాకు చదువుకోవడానికి ప్రశాంతమైన ప్రదేశాని యేర్పాటు చేశారు. ఆఖరికి నేను పారాయణ మొదలుపెట్టాను. యిటువంటప్పుడు నాకు ఇండియన్ బ్రిటిష్ కౌన్సిల్ నించి అతి ముఖ్యమైన స్కాలర్షిప్ కి ఫొన్ ఇంటర్వ్యూ వచ్చింది. నాకు సహాయం చేయమని బాబా ని అర్థించాను. మూడవ రోజున పారాయణ చేస్తున్నప్పుడు, నాకు టెలిఫోనిక్ యింటర్వ్యూ అయింది, ఆరవరోజున ఫలితాలు వచ్చాయి కాని స్కాలర్షిప్ పొందిన విద్యార్థులలో నా పేరు లేదు. నాకు మళ్ళీ నిరాశ వచ్చింది. ఇప్పుడే నాలో ఉన్న అంతర్ శతృవులు నాచేత ఆరవరోజున పారాయణను మానిపించాయి. నేనింకా పారాయణ కొనసాగిద్దామనుకున్నప్పటికి, యేది నన్ను ఆపుచేయించిందో తెలీదు. దాని తరువాత నాకు అపరాథం చేశాననే భావం కలిగింది. విడవకుండా నేను బాబాని నన్ను బాథిస్తున్న నాలో ఉన్న అంతర్ శతృవులని నాశనం చేయమని అడుగుతూ ఉండేదాన్ని. తరువాతి గురువారమునాడు మరలా పారాయణ చేయమని యేదో నన్ను ప్రేరేపించింది, కాని ఈసారి మాత్రం కేవలం సాయిమాకి క్షమాపణ తెలిపేందుకే. గురువారం సాయంత్రం నేను నా భర్తకి వివరించి చెప్పాను, వెంటనే ఆయన క్రితంసారికే పూర్తి చేయనందుకు మొదట మందలించారు, ఈ గురువారం సాయంత్రమే ప్రారంభించమని చెప్పారు. మరలా మొదలుపెట్టి సాయినాథ్ ని ప్రార్థిస్తూ ఉన్నాను. సాయినాథ్ కి క్షమాపణ చెప్పుకుంటూ నా లోపలి శతృవులని అదృశ్యం చేయమని అడిగాను.
సాయిబాబా ప్రశ్నలు జవాబులు వెబ్ సైట్ ని కూడా ఉపయోగిస్తూ అనుకూలమైన జవాబులను కూడా పొందుతున్నాను, ఆయనని గుర్తు చేసుకుంటూ ఉన్నాను. ఆయన నన్ను యేది చేయమంటే అది నాకు చేతనయినంతగా చేస్తూ ఉన్నాను. సాయి నన్ను అన్నదానం చేయమన్నారు. కాని యిటువంటి దేశంలో నిజమైన అన్నార్తులు యెవరో తెలియదు. అంచేత, భారత దేశంలో ఉన్న మా అమ్మగారితో మాట్లాడి, నా తరఫున అక్కడ బీదలకి అన్నదానం చేయమని చెప్పాను. అప్పటినుంచీ ప్రతీ గురువారం అక్కడ అన్నదానం చేస్తున్నారు. ఆతరువాత పారాయణ అయిదవ రోజున జర్మనీ నించి పీ.హెచ్.డీ స్కాలర్షిప్ కి రెండు ఆహ్వాన పిలుపులు వచ్చాయి, రెండూ కూడా నాకు వస్తాయనే పూర్తి ఆశతో ఉన్నాను.
కాని విచిత్రం యేమిటంటే లార్డ్ సాయి నాకు పీ.హెచ్.డీ. మేము ఉంటున్న లండన్లోనే ఇప్పించారు. విశ్వవిద్యాలయం నాకు పూర్తి స్కాలర్షిప్ ఇచ్చింది, ప్రపంచంలో ఇలా పొందిన 15 మంది అభ్యర్థులలో నేను ఒకదాన్ని. ఈ వార్త నాకు పారాయణ ఆఖరి రోజున వచ్చింది. నేను వెంటనే నా భర్తకి ఫోన్ చేసి చెప్పాను, ఆయన సాయి మనకు ప్రతీదీ ఇచ్చారని అన్నారు. ఈ లీలకి నేను బాబా ఫోటొముందు యెంతో యేడిచాను.
నిజంగా బాబా నాకు సహాయం చేసి నామీద దయ చూపించారు. ఈ లీల ద్వారా నేను మిగతా సాయి భక్తులందరికీ చెప్పేదేమిటంటే నమ్మకం, ఓర్పుతో సదా ఆయనని యెల్లప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటే సాయినాథ్ ఖచ్చితంగా ఆయన దయని చూపిస్తారు.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
0 comments:
Post a Comment