30.12.2025 మంగళవారమ్
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు
శ్రీ సాయిలీల ద్వైమాసపత్రిక సెప్టెంబరు – అక్టోబర్, 2025 సంచికలో ప్రచురింపబడిన బాబా లీలలకు తెలుగు అనువాదం ఆరవ భాగమ్ ఈ రోజు మీకు అందిస్తున్నాను.
ఆంగ్ల రచయిత ; శ్రీ ధనేష్ జుకార్
తెలుగు అనువాదం ; ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్,
ఫోన్. 9440375411, 8143626744
శ్రీ సాయిబాబా వారి ప్రేరణతో --- ఆయన లీలల రచన - 6 వ.భాగమ్
ఇపుడు నేను మరొక స్నేహితురాలి గురించి వివరిస్తాను. ఆమె ఇంటిలో నేను శ్రీ సాయి సత్ చరిత్ర గ్రంధం ఉండటం గమనించాను. ఆమె తన ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశానికి వెడుతూ తన కూడా శ్రీ సాయి సత్ చరిత్రను తీసుకు వెళ్ళింది. ఆ గ్రంధాన్ని తన చెక్కబల్ల సొరుగులో భద్రంగా ఉంచుకుంది. ఒక రోజు రాత్రి ఆమె ఉంటున్న భవనానికి అగ్నిప్రమాదం జరిగింది. రెండు అంతస్తులను అగ్నికీలలు చుట్టుముట్టాయి.








