

06.06.2011 సోమవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంథువులందరికి బాబావారి శుభాశీస్సులు
బాబా కథలు దీప స్థంభములు
ఈ రోజు బాబా గురించి, కథల గురించి కొంత తెలుసుకుందాము.
సముద్రము మథ్యలో దీపస్థంభములు ఉంటాయి. ఆ వెలుతురులో రాళ్ళ రప్పలవల్ల కలిగే హానులని తప్పించుకుని సురక్షితముగా ప్రయాణిస్తూ ఉంటారు. అంటే యేమిటన్నమాట? సముద్రంలో ఓడల్లో ప్రయాణీంచేవారికి అవి దారితప్పకుండా ప్రయాణానికి సహాయపడతాయి. ప్రపంచమనే మహా సముద్రములో బాబా కథలు దీపములుగా దారి చూపుతాయి. అవి అమృతముకంటే తియ్యగా ఉండి ప్రపంచయాత్ర సేవారికి మార్గము సులభంగాను, సుగమముగాను చేస్తాయి. మనము ఈ సంసారమనె మహా సముద్రంలో ప్రయాణించాలంటే బాబా కథలు, బోథలు మనకి కర దీపికలుగా ఉంటాయి. బాబా మన సద్గురువు, మార్గ దర్శకులు.
యోగీశ్వరుల చరిత్రలు, కథలు ప్రవిత్రములు. అవి మన చెవుల ద్వారా హృదయమందు ప్రవేశించునప్పుడు శరీర స్పృహ, అహంకారము, ద్వంద్వ భావాలు నిష్క్రమిస్తాయి. మన హృదయమందు నిలవ ఉన్న సందేహములు పటాపంచలయిపోతాయి. శరీర గర్వము మాయమయిపో యి కావలసినంత జ్ణానము నిల్వ చేయబడుతుంది. శ్రీ సాయి బాబా కీర్తి, వర్ణనలు ప్రేమతో పాడిన గాని, వినిన గాని భక్తుని పాపములు పటాపంచలవుతాయి. కాబట్టి యివే మోక్షానికి సులభ సాథనాలు. కృతయుగములో శమ దమములు (అనగా నిశ్చల మనస్సు, శరీరము) త్రేతాయుగములో యాగము, ద్వాపరయుగములో పూజ, కలియుగములో భగన్నామ మహిమలను, నామములను పాడుట, మోక్షమార్గములు. నాలుగు వర్ణముల వారును ఈ సాథనములను అవలంబించవచ్చు. తక్కిన సాథనములు అనగా, యోగము, యాగము, థ్యానము, థారణము అవలంబించుట కష్టతరము. కాని భగవంతుని కీర్తిని, మహిమను పాడుట అతి సులభము. మన మనస్సును మాత్రము అటువైపు తిప్పాలి. భగవత్కథలను వినడంవల్ల, పాడటం వల్ల మనకు దేహాభిమానము తొలగిపోతుంది. అది భక్తులను నిర్మోహులుగ చేసి చివరికి ఆత్మ సాక్షాత్కారము పొందునట్లు చేస్తుంది. ఈ కారణము చేతనే సాయిబాబా హేమాడ్ పంత్ చేత సాయి సచ్చరిత్రని సహాయపడి వ్రాయించారు.
సచ్చరిత్ర మొదటి అథ్యాయములో గోథుమలు విసిరి ఆ పిండిని ఊరిబయట చల్లి కలరా జాడ్యముని తరిమి వేసిన బాబా వింత చర్యను వర్ణించారు. యిదేగాక శ్రీ సాయి యొక్క యితర చర్యలు మహిమలు విని సంతోషించారు. ఆ సంతోషమే ఈ గ్రంథమును వ్రాయుటకు పురి కొల్పింది. బాబా గారి వింత లీలలు, చర్యలు మనసుకు ఆనందము కలుగ చేస్తుంది. అవి భక్తులకు బోథనలుగా ఉపకరిస్తాయి. చివరకు పాపములను పోగొట్టును కదాయని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును, వారి బోథనలును వ్రాయ మొదలెట్టారు.
శ్రీ హేమాడ్ పంత్ శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథ రచనకి తాను తగిన సమర్థుడను కానని భయపడ్డారు. యోగీశ్వరుని చరిత్ర వ్రాయుట బహు కష్టమని భావించారు. కాని శ్రీ సాయిబాబా ఆయన చేత యింతటి మాహా అద్భుతమైన గ్రంథాన్ని వ్రాయించి మనకు అందించారు. బాబా తలుచుకుంటే పామరుణ్ణి కూడా పండితుణ్ణి చేయగలరు. మనలో గర్వం అహంకారము లేశ మాత్రమైనా ఉండకోడదు. అంతా బాబాయే చేయుస్తున్నారు నేను నిమిత్తమాత్రుణ్ణి అనుకుంటే ఆయన మనమీద చూపించే అనుగ్రహం అపారం.
ప్రతీ భక్తుడు కూడా అలనాటి షిరిడీ యెలా ఉండేదో అని ఒక్కసారయినా అనుకోకుండా ఉండి ఉండరు. ఇక్కడ ఆనాటి షిరిడీ ఫోటొలని కొన్ని జత చేసున్నాను చూడండి. ఆ కాలంలోకి వెళ్ళి బాబాతో ఉన్నట్లుగా ఊహించుకోండి.
1. 1905 సంవత్సరములో ద్వారకామాయి ఈ విథంగా ఉంది.


2. ఈ అపురూపమైన చిత్రం బాబా చేతిలో పుస్తకము ఉన్నటువంటిది. ఒక గురుపూర్ణిమనాడు చాలా మంది భక్తులు వచ్చి బాబా ఆశీర్వదించి మరల తిరిగి ఇస్తారని, ఆయనముందు ఒక పుస్తకాన్ని ఉంచారు. అది చదివాక తమకు యెంతో ఫలితం ఉంటుందని భావించారు. యేమైనప్పటికి బాబా ఒక భక్తునినుంచి పుస్తకం తీసుకుని అది యింకొక భక్తునికిచ్చారు. ఈ ఫోటో మరాఠీ సచ్చరిత్ర మొట్టమొదటి ముద్రణలోనిది. ఆయన చేతిలో ఉన్న పుస్తక తుకారాం గాథ.

3. అదృశ్యంగా బాబా:

ఈ ఫోటో బాబా భక్తులతో లెండీబాగ్ కు వెడుతున్నప్పటిది. ఒక భక్తుడు ఫోటో తీసుకుంటానని బాబా ని అనుమతి అడిగాడట. కాని బాబా ఒప్పుకొనక నా పాదాలను మాత్రమే ఫోటో తీసుకోమన్నారట. కాని ఆ భక్తుడు మొత్తం ఊరేగింపునంతా ఫోటో తీశాడట. ఆ ఫోటో లో , గొడుగు, భాగోజీ షిండే, ఇంకా భక్తులను మాత్రమే చూడగలం కాని బాబా ఉన్నచోట ఆయన పాదాలు మాత్రమే కనిపిస్తాయి.
4. లెండిబాగ్ ఉత్సవం

బాబా, బూటీ, నూల్కర్, బాగోజీతో లెండీబాగ్ కి వెళ్ళుట.
5. లెండీ బాగ్ లో భక్తులు :
లెండీ బాగ్ లో నిలుచున్న భక్తులు: యెడమనుండి 1. రావ్ బహద్దూర్ ఎం. డ్బ్ల్యూ. ప్రథాన్ . 2. ఎస్.డీ. నవాల్కర్ రావ్ సాహెబ్ 3. టీ. గల్వాంకర్ 4. ఎస్.ఎన్. ఖార్కర్ (సెక్రటరి) లెండీ బాగ్.

6. సమాథి 1954 లో:


7. సాఠేవాడా 1908 లో నిర్మించబడింది. భక్తులకోసం 1924 నించి ఉపయోగంలోనికి వచ్చింది. (ప్రస్తుత గురుస్థాన్ ప్రాంతం) శ్రీ నవాల్కర్ దీనిని కొన్నాక ఆయన తరువాతి వారు దీనిని 1939 లో షిరిడీ సంస్థానానికి ఇచ్చివేయడం జరిగింది.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

0 comments:
Post a Comment